additional commissioner of police
-
డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశాం: అడిషనల్ సీపీ చౌహాన్
-
రెండు రాష్ట్రాల్లో 12 చోట్ల సోదాలు
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి నివాసంలో తెలంగాణ రాష్ర్ట అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నివాసంతో పాటు ఏపీ, తెలంగాణలోని ఆయన బంధువుల నివాసాల్లో ఏకకాలంలో 12 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సోదాలు ఈ రోజు సాయంత్రం వరకు జరగనున్నట్లు తెలిసింది. గతంలో ఉప్పల్ సీఐగా, చిక్కడపల్లి, మల్కాజిగిరి ఏసీపీగా నరసింహారెడ్డి పని చేశారు. ఆ సమయంలో ఆయన అనేక భూతగాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. (చదవండి: దేవికారాణి ‘రియల్’ దందా!) హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, మహేంద్రహిల్స్, డీడీ కాలనీ, అంబర్‌పేట, ఉప్పల్, వరంగల్‌లో 3 చోట్ల, కరీంనగర్లో 2 చోట్, నల్లగొండలో 2 చోట్ల, అనంతపూర్‌లో సోదాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ నివాసంలో భారీగా బంగారు, వెండి ఆభరణాలను అధికారులు గుర్తించారు. వాటితో పాటు భారీగా ఆస్తులు, ప్లాట్స్, వ్యవసాయ భూములు గుర్తించారు. ఈ ఆరోపణలు నిజమైతే అరెస్ట్ చేసి అవకాశం ఉందంటున్నారు అధికారులు. అంతేకాక నరసింహారెడ్డి నగర శివారు ప్రాంతాలైన మియాపూర్, ఉప్పల్, మల్కాజిగిరి, భూ వివాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాజీ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి అల్లుడు అయిన ఏసీపీ నరసింహారెడ్డి రూ.50 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. -
13గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అడిషనల్ సీపీ అనిల్ కుమార్ తెలిపారు. బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 20 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని తెలిపారు. 11వ రోజున బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు 18కిలోమీటర్ల మేర శోభయాత్ర కొనసాగుతుందని తెలిపారు. 17 ప్రధాన రహదారుల మీదుగా శోభయాత్ర కొనసాగనుందని.. 10వేల లారీలు దీనిలో పాల్గొంటాయన్నారు. అలిబాద్, నాగులచింత, చార్మినార్, మదీన, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా శోభయాత్ర కొనసాగుతుందని దీనికి అనుగుణంగా ట్రాఫిక్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. నిమజ్జనం చూడ్డానికి విదేశాల నుంచి కూడా జనాలు వస్తున్నారని తెలిపారు. శోభయాత్రలో ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదన్నారు. ప్రతి ఒక్కరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఉపయోగించుకోవాలని కోరారు. ఖైరతాబాద్ జంక్షన్, ఆనంద్ నగ్ కాలనీ, గోసేవ సధన్, కట్టమైసమ్మ టెంపుల్, నిజాం కాలేజ్, ఎంఎంటీఎస్ ఖైరతాబాద్ స్టేషన్, బుద్ధ భవన్ వెనుక, లోయర్ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ స్టేడియం, పబ్లిక్ గార్డెన్ వంటి పది చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 6గంటల నుంచే ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదని తెలిపారు. మొత్తం 13 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వెళ్లేవారు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న రోడ్లపై కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఎమర్జెన్సీ వాహనాలు, 108లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామన్నారు. -
24 గంటలు... 14 చైన్ స్నాచింగ్‌లు
బెంగుళూరు: భారత్ సిలికాన్ నగరం బెంగుళూరులో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు... ఎక్కడ పడితే అక్కడ... ఒంటిరిగా వెళ్తున్న మహిళలపై చైన్ స్నాచర్లు తమ ప్రతాపం చూపిస్తున్నారు. దాంతో గురువారం ఒక్క రోజు బెంగుళూరు నగరంలో 14 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. నగర పశ్చిమ శివారు ప్రాంతంలోని మల్లేశ్వరం, రాజాజీ నగర్లో 10 కేసులు నమోదు కాగా, మరో రెండు చైన్ స్నాచింగ్ కేసులు దక్షిణ శివారు ప్రాంతంలో చోటు చేసుకున్నాయని నగర అదనపు సీటి పోలీసు కమిషనర్ ఎం. సలీం శుక్రవారం బెంగళూరులో వెల్లడించారు. బాధితులంతా వయస్సు 40 ఏళ్ల పైబడిన మహిళలేనని ఆయన వివరించారు. ఉదయం నడక లేదా సాయంత్రం వ్యాహాళీకి వచ్చే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ చైన్ స్నాచింగ్‌లు జరిగాయని సలీం తెలిపారు. హిందీ, మరాఠీ, తెలుగులో మాట్లాడుతూ... మహిళ దృష్టి మరల్చేందుకు చిరునామా అడుగుతున్నట్లు నటిస్తూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారని చెప్పారు. స్థానికంగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవారు తక్కువగా ఉన్నారని... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఈ తరహా నేరాలకు పాల్పడే వారు అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కేసుల్లో ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని... సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. చైన్ స్నాచింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసు గస్తీ ముమ్మరం చేస్తే... మరో ప్రాంతంలో ఇలాంటి కేసులు అధికంగా జరుగుతున్నాయని సలీం తెలిపారు.