జియోకి ఎయిర్టెల్ అదనపు ఇంటర్‌కనెక్ట్ పాయింట్స్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియోకి అదనపు ఇంటర్‌కనెక్ట్ పాయింట్ల ఏర్పాటు చేసేందుకు భారతి ఎయిర్టెల్ అంగీకరించింది. తాము ఏర్పాటుచేసే పోర్ట్‌లు జియో 1.5 కోట్ల మంది కస్టమర్ల కాల్స్‌ని సపోర్ట్ చేస్తాయని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.. జియో యూజర్లు ఎయిర్టెల్ యూజర్లకు ఫోన్ చేసుకోవచ్చు. తాజా చర్యతో ప్రస్తుత పోర్టుల సంఖ్య 3 రెట్లు పెరుగుతుందని ఎయిర్టెల్ పేర్కొంది.
ఐడియా, ఎయిర్టెల్ వంటి టెలికం కంపెనీలు తమకు ఇంటర్‌కనెక్ట్ పోర్ట్‌లను సక్రమంగా ఇవ్వడం లేదంటూ ఇటీవల ముకేశ్ అంబానీ ఆరోపించిన విషయం తెలిసిందే. దీని కారణంగా అప్పుడు జియో 5 కోట్ల కాల్స్ ఫెయిల్ అయ్యాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ట్రాయ్ రంగంలోకి దిగింది. దీంతో ఐడియా సోమవారం జియోకి అదనపు ఇంటర్‌కనెక్ట్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.