ADR Survey
-
నిరుద్యోగం, ఉగ్రవాదమే అసలు సవాళ్లు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముంగిట దేశ ప్రజలు నిరుద్యోగం, ఉగ్రవాదంపైనే ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. దేశం ముందుకు సాగుతున్న తీరుపై చాలా మంది ఆశావహ దృక్పథంతోనే ఉన్నట్లు తేలింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ అధ్యయనం చేపట్టింది. ఉగ్రవాదం, పాక్ నుంచి ముప్పుపై ఎక్కువ శాతం మంది భయాందోళనలు వ్యక్తం చేశారు. 20 ఏళ్లతో పోలిస్తే ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగ్గా ఉందని సుమారు 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. దేశం ఎదుర్కొంటున్న అత్యంత కఠిన సవాలు నిరుద్యోగమే అని 76 శాతం మంది పేర్కొన్నారు. సర్వే ముఖ్యాంశాలు ► పాక్‌తో భారత్‌కు ముప్పు ఉందని 76 శాతం మంది అభిప్రాయపడ్డారు. కశ్మీర్లో తాజా పరిస్థితి తీవ్రమైన సమస్య అని పేర్కొన్న వారు 55 శాతం మంది. ► కశ్మీర్లో పరిస్థితి దిగజారిందని అభిప్రాయపడిన 53 శాతం మంది. ► కొన్నేళ్లుగా ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నా ధరలు పెరగడం సమస్యగా మారిందని 73 శాతం మంది చెప్పారు. ► అవినీతి అధికారులు(66 శాతం), ఉగ్రవాదం (63 శాతం), నేరాలు(64 శాతం) దేశానికి పెద్ద సమస్యలుగా మారాయని పేర్కొన్నారు. ► భారత్‌లో అభద్రతా భావంతో జీవిస్తున్నామని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► 2014 నుంచి మత విద్వేష ఘటనలు పెరిగినా, కేవలం 34 శాతం మందే ఇది పెద్ద సమస్య అని పేర్కొన్నారు. ► ఎన్డీయే హయాంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయని 21 శాతం మంది పేర్కొనగా, పరిస్థితి దిగజారిందని 67 శాతం మంది చెప్పారు. ► ధరలు భారీగా పెరిగాయని 65 శాతం మంది, అవినీతి పెచ్చరిల్లుతోందని 65 శాతం మంది, ఉగ్రవాద ఘటనలు పెరిగాయని 59 శాతం మంది అన్నారు. ► ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అవినీతిపరులని 69 శాతం పేర్కొనగా, ఎవరు గెలిచినా ఈ పరిస్థితిలో మార్పు రాదని 58 శాతం మంది పౌరులు అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలు, ఆరోగ్యానికే ప్రాధాన్యం తర్వాతి స్థానాల్లో తాగునీరు, రోడ్లు ప్రాధాన్యతాంశాలపై ఏడీఆర్ సర్వే న్యూఢిల్లీ: మెరుగైన ఉద్యోగావకాశాలు, ఆరోగ్య సంరక్షణ, సురక్షిత తాగునీరుకే ప్రజలు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సర్వేలో తేలింది. ఓటరు ప్రాధాన్యతా అంశాల్లో ప్రభుత్వ పనితీరు సగటు కన్నా దిగువనే ఉందని తెలిసింది. ఓటరు ప్రవర్తనను ప్రభావితం చేసే కారకాలు, ఓటరు ప్రాధాన్యతా అంశాలు(10), ప్రభుత్వ పనితీరుకు ప్రజలిచ్చిన రేటింగ్ ప్రాతిపదికగా ఈ సర్వే నిర్వహించారు. మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఉండాలని 46.80 శాతం మంది, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు కల్పించాలని 34.60 శాతం మంది, సురక్షిత తాగునీరు కావాలని 28.34 శాతం మంది అభిప్రాయపడ్డారు. తరువాతి స్థానాల్లో మెరుగైన రోడ్లు(28.34 శాతం), లోపరహిత ప్రజా రవాణా వ్యవస్థ(27.35 శాతం) ఉన్నాయి. ఓటర్ల టాప్ 10 ప్రాధాన్యతా అంశాల్లో వ్యవసాయ సంబంధ విషయాలు కూడా ఉన్నాయి. సాగునీరు(26.40 శాతం) ఆరో స్థానంలో, రుణ పరపతి(25.62 శాతం) ఏడో స్థానంలో, పంట ఉత్పత్తులకు మద్దతు ధర(25.41 శాతం) 8వ స్థానంలో, సబ్సిడీలు(25.06 శాతం) 9వ స్థానంలో ఉన్నాయి. మెరుగైన శాంతి భద్రతలకు 10వ స్థానం దక్కింది. -
ఏపీలో ప్రభుత్వ పనితీరు అధ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ఓటర్లు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న అంశంగా మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ సంస్థ తేల్చింది. ఓటర్లు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న అంశాల్లో ఏపీ ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందని, ఆయా అంశాల్లో ఓటర్లు ఇచ్చిన స్కోరును బట్టి తేలింది. ఐఐఎం–బెంగళూరు ప్రొఫెసర్ త్రిలోచన్ శాస్త్రి ఈ ఫౌండర్ చైర్మన్‌గా ఉన్న ఏడీఆర్ సంస్థ దేశవ్యాప్తంగా 2018 అక్టోబరు నుంచి 2018 డిసెంబరు మధ్య కాలంలో 534 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 2,73,487 మంది ఓటర్లను సర్వే చేసింది. ఫలితాలను సోమవారం ఇక్కడ విడుదల చేసింది. పాలనాంశాలకు సంబంధించి ఓటర్ల ప్రాధాన్యతలు, ఆయా అంశాల్లో ప్రభుత్వ పనితీరుపై ఓటర్ల రేటింగ్, ఓటింగ్ ప్రవర్తనపై ప్రభావం చూపే కారకాలు అన్న మూడు అంశాలు తేల్చే లక్ష్యంగా ఈ సర్వే నిర్వహించింది. పాలనకు సంబంధించి మొత్తం 31 ప్రాధాన్యతాంశాలను ఓటర్ల ముందుంచి అందులో మొదటి ఐదు ప్రాధాన్యత అంశాలను గుర్తించాలని ఓటర్లను కోరింది. అలాగే ఆయా అంశాలపై ప్రభుత్వ పనితీరును గుడ్, యావరేజీ, బ్యాడ్ అనే మూడుస్థాయిల స్కేల్‌పై గుర్తించాలని కోరింది. ఐదు మార్కుల్లో ఐదు మార్కులు ఇస్తే గుడ్ అని, మూడు మార్కులు ఇస్తే యావరేజీ అని, 1 మార్కు వస్తే బ్యాడ్ అని పరామితిని నిర్ధేశించింది. దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాధాన్యత లభించిన 10 అంశాల్లో మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ప్రాథమిక అవసరాలు అందించే వైద్యం, తాగునీరు, రోడ్లు, ప్రజారవాణా.. ఈ ఐదు టాప్–5లో నిలిచాయి. అయితే ఆయా అంశాల్లో ఆయా ప్రభుత్వాల పనితీరుపై ఓటర్లు సంతృప్తిగా లేకపోవడం గమనార్హం. ప్రతి అంశంలోనూ యావరేజీ కంటే తక్కువ మార్కులు సాధించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు అద్వానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓటర్లు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన మూడు అంశాల్లో మెరుగైన ఉపాధి/ఉద్యోగ అవకాశాలు, తాగునీరు, మెరుగైన ఆస్పత్రులు/ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఈ మూడు అంశాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అద్వానంగా ఉంది. బిలో యావరేజీ స్కోరు(ఐదింట మూడు మార్కుల కంటే తక్కువ) మాత్రమే దక్కించుకోవడం గమనార్హం. మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అనే అంశాన్ని 46.14 శాతం ఓటర్లు ప్రాధాన్యత కలిగిన అంశంగా ఎంచుకోగా, వారు ప్రభుత్వ పనితీరుకు కేవలం 2.10 మార్కులే ఇచ్చారు. తాగునీటి అంశాన్ని 45.25 శాతం మంది ఓటర్లు ప్రాధాన్యతాంశంగా ఎంచుకోగా.. ఆ అంశంలో ప్రభుత్వ పనితీరుపై కేవలం 2.04 మార్కులు మాత్రమే ఇచ్చారు. మెరుగైన ఆస్పత్రులు/ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంశాన్ని 31.40 శాతం మంది ప్రాధాన్యత అంశంగా ఎంచుకోగా.. ఈ అంశంలో ప్రభుత్వ పనితీరుపై కేవలం 2.72 స్కోరు మాత్రమే దక్కించుకుంది. ఏ ఒక్క అంశంలోనూ ప్రభుత్వం యావరేజీ స్కోరును కూడా అందుకోలేదు. ఏపీ గ్రామీణం ఇలా.. పట్టణ ప్రాంతాలు అలా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ఓటర్లు అత్యంత ప్రాధాన్య అంశాలుగా మూడింటిని ఎంచుకున్నారు. 48 శాతం మంది సాగునీటి లభ్యత, 46 శాతం మంది వ్యవసాయ సబ్సిడీలు(విత్తనాలు, ఎరువులకు), 44 శాతం మంది వ్యవసాయానికి విద్యుత్తు అనే అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే వీరు ఆయా అంశాల్లో ప్రభుత్వానికి ఇచ్చిన మార్కులు యావరేజీ కంటే తక్కువ. మొదటి అంశానికి 2.13 మార్కులు, రెండో అంశానికి 1.99 మార్కులు, మూడో అంశానికి 2.19 మార్కులు ఇచ్చారు. ఇక పట్టణ ప్రాంతంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన మూడు అంశాల్లో మెరుగైన ఉపాధి/ఉద్యోగ అవకాశాలు, తాగునీరు, నీరు, కాలుష్యం. 58 శాతం మంది ఓటర్లు ప్రాధాన్యతగా ఎంచుకున్న మెరుగైన ఉపాధి అవకాశాలు అనే అంశంలో ప్రభుత్వ పనితీరుకు 2.13 మార్కులు ఇచ్చారు. 55 శాతం మంది ఓటర్లు ప్రాధాన్యత అంశంగా ఎంచుకున్న తాగునీటి అంశంలో ప్రభుత్వ పనితీరుకు వారు ఐదు మార్కులకు గానూ 1.91 మాత్రమే ఇచ్చారు. అలాగే నీరు, కాలుష్యం అనే అంశాన్ని 53 శాతం పట్టణ ఓటర్లు ప్రాధాన్యత అంశంగా ఎంచుకోగా.. వారు ఈ అంశంలో ప్రభుత్వ పనితీరుకు 2.19 మార్కులు ఇచ్చారు. ఏ అంశంలోనూ ప్రభుత్వం యావరేజీ స్కోరు కూడా సాధించలేకపోయింది. ఇక ఈ సర్వేలో ఏపీలోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల వారీగా టాప్–3 ప్రాధాన్యత గల అంశాలను ఏడీఆర్ సంస్థ ప్రచురించింది. -
కొత్త ఎంపీల్లో కోటీశ్వరులు వీరే!
న్యూఢిల్లీ: రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల్లో 96 శాతం మంది కోటీశ్వరులున్నారు. ఇటీవల 57 మంది రాజ్యసభకు ఎన్నికైయ్యారు. వీరిలో ఎన్పీపీకి చెందిన ప్రపుల్ పటేల్ అత్యధిక ఆస్తులు కలిగిన వారిగా గుర్తించినట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) సర్వే నివేదిక వెల్లడించింది. ఆయనకు రూ. 252 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ (212 కోట్లు), సతీశ్ చంద్ర మిశ్రా(193 కోట్లు) తర్వాత స్థానాల్లో ఉన్నారు. అత్యధిక ఆస్తులు కలిగిన రాజ్యసభ ఎంపీల్లో మీడియా మొఘల్ సుభాష్ చంద్ర టాప్-10 జాబితాలో లేకపోవడం గమనార్హం. ఆయన ఆస్తిపాస్తులు రూ. 49 కోట్లుగా చూపించారు. అతి తక్కువ ఆస్తులు కలిగిన ఎంపీల జాబితాలో బీజేపీకి అనిల్ దవే(60 లక్షలు), రామకుమార్(86 లక్షలు), కాంగ్రెస్ కు చెందిన(1.8కోట్లు) ఉన్నారు. 57 మంది ఎంపీల్లో 13 మంది(23 శాతం)పై క్రిమినల్ కేసులు, ఏడుగురు(12 శాతం)పై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి.