adult education
-
ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏకు బంపర్ ఆఫర్
సాక్షి, పుట్టపర్తి(శ్రీసత్యసాయి జిల్లా): సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏ బాలాజీకి వయోజన విద్యాశాఖ ఉన్నతాధికారులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. విధులకు గైర్హాజరయినా ప్రతి నెలా ఠంచనుగా వేతనం ఖాతాలో వేశారు. పేకాటలో దొరికి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినా... చర్యలు తీసుకోకుండా అండగా నిలుస్తున్నారు. సగటు ఉద్యోగి ఏ చిన్న తప్పుచేసినా క్రమశిక్షణ చర్యలు తీసుకుని సస్పెండ్ చేసే ఉన్నతాధికారులు... బాలాజీకి అండగా నిలవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: మళ్లీ బాలకృష్ణ పీఏగా మారిన బాలాజీ.. గృహప్రవేశమని చెప్పి ఆఫీస్‌కు డుమ్మా కొట్టి హాజరుతో సంబంధం లేకుండా జీతం.. వయోజన విద్య పెనుకొండ డివిజన్ సూపర్వైజర్గా పనిచేసే బాలాజీ డిప్యుటేషన్‌పై ఆరేళ్ల క్రితం బాలకృష్ణ పీఏగా నియమితులయ్యారు. అయినప్పటికీ అతను ప్రతి నెలా బాలకృష్ణ వద్ద విధులు నిర్వహిస్తున్నట్లు హాజరుపట్టిక, టూర్గైడ్ను విధిగా వయోజన విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపాలి. కానీ రెండేళ్లుగా టూర్‌గైడ్, హాజరు పట్టిక పంపకపోయినా వయోజన విద్యాశాఖ అధికారులు ప్రతి నెలా బాలాజీకి జీతం మంజూరు చేశారు. పేకాట ఆడినా చర్యలు శూన్యం.. ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ బాలాజీ టీడీపీ నాయకుడిలా వ్యవహరించేవారు. టీడీపీ కార్యక్రమాలు, ఆ పార్టీ సమాచారాన్ని నేరుగా వాట్సాప్ గ్రూపుల్లో అందరికీ పంపేవాడు. అయినప్పటికీ అతనిపై అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ ఏడాది మార్చి 20న గౌరీబిదనూరులో పేకాట ఆడుతూ పట్టుబడగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయడంతో పాటు రిమాండ్‌కు పంపగా.. అతను బెయిల్ తెచ్చుకున్నాడు. దీంతో అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ... బాలాజీని సస్పెండ్ చేయాలని సిఫార్సు చేస్తూ వయోజన విద్యాశాఖకు ఉత్తర్వులు ఇచ్చారు. బాలకృష్ణ పీఏగా రిలీవ్ చేసి వయోజన విద్యాశాఖకు సరెండర్ చేశారు. కానీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు బాలాజీని సస్పెండ్ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. భోజనం చేస్తుంటే కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారని... పేకాట ఆడలేదని తప్పుడు నివేదికను వయోజన విద్యాశాఖ డైరెక్టర్‌కు పంపి.. కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినా... అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ, మభ్యపెట్టి చర్యలు తీసుకోకుండా కాపాడే ప్రయత్నం జరుగుతున్నట్లు వయోజన విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. -
అందనంత దూరం అక్షర జ్ఞానం
సాక్షి, ఒంగోలు టౌన్: ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్‌గా 1973 నుంచి 1982 వరకు పనిచేసిన గోపాల్ రెడ్డి.. 1982–2006 వరకు వయోజన విద్యాశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2003లో సత్యమత్ర మెమోరియల్ లిటరసీ అవార్డును అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ రామకృష్ణతో కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి గోపాల్‌రెడ్డి అందుకున్నారు. విద్యా రంగంలో విశేష అనుభవం కలిగిన ఆయన చంద్రబాబు ప్రభుత్వ హయంలో ప్రభుత్వ విద్య ఏవిధంగా నిర్వీర్యమైంది, జగన్ ప్రకటించిన నవరత్నాల్లోని అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా డ్రాపవుట్స్ సంఖ్య ఎలా నిర్మూలన అవుతుందో ‘సాక్షి’కి వివరించారు. క్వాలిటీ విద్యకు కేరాఫ్ ‘గతంలో క్వాలిటీ విద్యకు ప్రభుత్వ పాఠశాలలు కేరాఫ్‌గా నిలిచేవి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో పరిశోధన చక్కగా నిర్వహించేవారు. విద్యార్థులకు సబ్జెక్టు పరంగా మంచి పట్టు వచ్చేది. టీచింగ్ నోట్స్ రాసుకుని విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధించేవారని’ గోపాల్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ‘ప్రస్తుతం అలాంటి పరిస్థితులు చూద్దామన్నా కనిపించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ అజమాయిషీ తగ్గిపోయింది. దాంతో అనేక మంది ఉపాధ్యాయులు విద్యేతర అంశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోతున్నాయి. చివరకు ప్రాథమిక పాఠశాలలు మూతపడే స్థితికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చింద’ని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్‌కు పెద్దపీట! ‘సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ప్రైవేట్ విద్యకు చంద్రబాబు పునాదిరాయి వేశారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వ విద్యను చిన్నచూపు చూస్తూ వచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ విద్యను పరుగెత్తించారు. ఒక విద్యా సంస్థల అధినేతను తన క్యాబినెట్లో మంత్రిగా చేర్చుకున్నారంటే ప్రైవేట్ విద్యపట్ల చంద్రబాబుకు ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చని’ తాటిపర్తి వ్యాఖ్యానించారు. రాష్ట్ర మునిసిపల్ శాఖామంత్రిగా నారాయణ, ఆయన బంధువైన గంటా శ్రీనివాసరావు మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రిగా వ్యవహరించిన సమయంలో ప్రభుత్వ విద్యను కనుమరుగు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రాథమిక పాఠశాలల్లో విద్యపై ప్రభుత్వ పర్యవేక్షణ లోపించింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు అవసాన దశకు చేరుకున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే ఉన్నత పాఠశాలలకు కూడా ఈ దుస్థితి పట్టే ప్రమాదం ఉంద’ని అన్నారు. వయోజన విద్యకు గండి ‘జిల్లాలో అక్షరాస్యత శాతం ఏటా పెరుగుతోందని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటోంది. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వయోజనుల్లో అక్షరాస్యత శాతం క్రమేణా పడిపోతోంది. రాష్ట్రంలో అక్షరాస్యత శాతం 74 శాతం చూపించగా, ప్రకాశం జిల్లాలో 63 శాతంగా ప్రకటించారు. వయోజన విద్యను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం దానిని కూకటివేళ్లతో పెకలించేసింది. రాష్ట్రంలో వయోజన విద్యకు సంబం«ధించి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నియమితులైన 23 వేల మందిని చంద్రబాబు ప్రభుత్వం తొలగిండడం దారుణమైన చర్య. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దిన తరువాత వారు నేర్చుకున్న చదువు మర్చిపోకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన సాక్షర భారత్ కేంద్రాలు కనుమరుగైపోయాయి. ‘అమ్మ ఒడి’ కొండంత అండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన అమ్మ ఒడి పేదలకు అండగా ఉంటోంది. అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా పేద విద్యార్థుల చదువుకు భరోసా కలగనుంది. అమ్మ ఒడి ద్వారా తల్లిదండ్రులకు కూడా ప్రోత్సాహాలు ఇవ్వడం మంచి పరిణామమ’ని గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అమలుచేసే కార్యక్రమాల్లో అమ్మ ఒడిని ఇతర రాష్ట్రాలు కూడా ఆచరణలోకి తీసుకువచ్చేందుకు ముందుకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
అమ్మానాన్నకు చదువు
తల్లిదండ్రులకు అక్షరజ్ఞానం నేర్పేది వారే.. వయోజన విద్యలో వినూత్న కార్యక్రమం వచ్చే నెల 1 నుంచి మార్చి 31 వరకు నిర్వహణ 8, 9 తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేకం గీసుకొండ : నిరక్షరాస్యులైన వారికి అక్షర జ్ఞానం నేర్పే బాధ్యత వారి పిల్లలకు అప్పగించడం ద్వారా ఫలితం ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వయోజన విద్యలో భాగంగా ‘అమ్మానాన్నకు చదువు’ పేరిట వచ్చే నెల 1వ తేదీ నుంచి నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో చదివే 8, 9వ తరగతుల విద్యార్థులు నిరక్షరాస్యులైన వారి తల్లిదండ్రుకు ఇక సాయంత్రం వేళల్లో అక్షరాలు నేర్పించాల్సి ఉంటుంది. విద్యార్థులే ఎందుకు..? పొలం పనులకు వెళ్లిన కూలీలు సాయంత్రం వేళ అలసిపోయి ఇంటికి తిరిగొస్తారు. అలా వచ్చిన వారు గ్రామాల్లో వయోజన విద్యా కేంద్రాలు అందుబాటులో ఉన్నా అక్కడకు వెళ్లి అక్షరాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక మరికొందరు వయస్సు మీద పడుతుండగా ఇప్పుడు చదువు ఎందుకంటూ ఊరుకుంటున్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తాజాగా ‘అమ్మానాన్నకు చదువు’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. గ్రామీణులకు బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపించని విషయాన్ని గుర్తించి.. పిల్లలతోనే తల్లిదండ్రులకు చదువు చెప్పించాలన్న భావనతో కార్యక్రమానికి రూపకల్పన చేశారు. సాధారణంగా ఎవరు చెప్పినా వినిపించుకోని వారు తమ పిల్లలు చెబితే వింటారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులకు అక్షర జ్ఞానం నేర్పే తెలివితేటలు ఉన్న విద్యార్థులను, నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న తల్లిదండ్రులను ఈ కార్యక్రమం కింద ఎంపిక చేస్తున్నారు. ముందుగా విద్యార్థులకు శిక్షణ.. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో 8,9వ తర గతి చదువుతున్న విద్యార్థులు వివరాలను సేకరిస్తున్నారు. ఈ మేరకు పాఠశాలల హెచ్ఎంలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఎందరు నిరక్షరాస్యులో తెలుసుకుంటున్నారు. ప్రతీ పాఠశాల నుంచి నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి ఉపాధ్యాయులు రెండు మూడు గంటల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈక్రమంలో వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున పదో తరగతి విద్యార్థులకు మాత్రం మినహాయింపునిచ్చారు. ఇదే క్రమంలో 8, 9వ తరగతుల విద్యార్థులైతే రెండేళ్ల పాటు తల్లిదండ్రులకు చదువు నేర్పించే వెసలుబాటు ఉంటుందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతీ పాఠశాలలో 8, 9వ తరగతి చదివే విద్యార్థుల తల్లిదండ్రుల్లో సుమారు 15 నుంచి 20 మంది వరకు నిరక్షరాస్యులు ఉంటారని.. వీరిని అక్షరాస్యులను చేయడానికే ఈ కార్యక్రమాన్ని రూపొందించారని అధికారులు చెబుతున్నారు. పుస్తకాలు రెడీ.. ‘అమ్మానాన్నకు చదువు’ కార్యక్రమానికి అవసరమైన పుస్తకాలను వయోజన విద్య శాఖ అధికారులు ఇప్పటికే రూపొందించి జిల్లాలోని అన్ని మండలాలకు పంపిణీ చేశారు. తెలంగాణ యాసలో సులువుగా బోధించడం, అక్షరాలను నేర్చుకునేలా పాఠ్యాంశాలు రూపొందిస్తూ రెండు భాగాలుగా పుస్తకాలు తీసుకొచ్చారు. అయితే, ఈ కార్యక్రమం విజయవంతం కోసం సాక్షర భారత్ మండల, గ్రామ కోఆర్డినేటర్లు కృషి చేయాల్సి ఉంటుంది. -
అక్షరం నేర్పితే ఒట్టు !
నిర్లక్ష్యంలో సాక్షరభారత్ నంబర్ వన్ దశాబ్దాల తరబడీ నెరవేరని లక్ష్యం ఇంకా 5.38 లక్షల మంది నిరక్షరాస్యులే పట్టించుకోని అధికారులు ఏటా కోట్లాది రూపాయల వృథా వయోజనులకు అక్షరాలు నేర్పేందుకు వయోజన విద్య, సాక్షరభారత్ పేర్లతో దశాబ్దాల తరబడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అక్షరాస్యత శాతం ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగా ఉంది. క్షేత్రస్థాయిలో అధికారులు ఈ కార్యక్రమాన్ని పట్టించుకోకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో లక్ష్యం నెరవేరడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తున్న కోట్లాది రూపాయల నిధులు నిరుపయోగమవుతున్నాయి. అసలు అక్షరాస్యత కార్యక్రమం కొనసాగుతున్న విషయం గ్రామీణులకు తెలియడం లేదు. నోటు పుస్తకాలు, పేపర్లు, పెన్నులు, పెన్సిళ్ల పేరుతో మరో కోటి రూపాయలకు పైగా వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి రూ.8 కోట్ల వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యయం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 75 శాతం నిధులు ఇస్తుండగా, మిగిలిన 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. అక్షరాలు నేర్పని వీసీఓలు నెలకు రూ.2వేలు గౌరవవేతనం తీసుకుంటున్న 95 శాతానికి పైగా వీసీఓలు వయోజనులకు అక్షరాలు నేర్పడం లేదన్న ఆరోపణలున్నాయి. అసలు వారు గ్రామాలకే వెళ్లడం లేదని తెలుస్తోంది. వీరిని పర్యవేక్షించాల్సిన ఎంసీఓలదీ అదే పరిస్థితి. ఇరువురు వేలాది రూపాయలు గౌరవవేతనం తీసుకుంటూ నిరక్షరాస్యులకు అక్షరం ముక్క నేర్పడం లేదు. ఏ గ్రామంలో విచారించినా ఇదే విషయం చెబుతున్నారు. అసలు అక్షరాస్యత కార్యక్రమం కొనసాగుతున్న విషయం కూడా ఆయా గ్రామాల్లోని నిరక్షరాస్యులకు తెలియడం లేదు. పట్టించుకోని ఉన్నతాధికారులు అక్షరాస్యత కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన డీడీ, ఏపీఓ, సీపీఓ తదితర ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. వారు గ్రామాలకు వెళ్లి పర్యవేక్షించే పరిస్థితి లేదు. కొంతమంది అధికారులు వీసీఓలు, ఎంసీఓలతో కలిసి నిధులు బొక్కుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఉత్తపుణ్యానికొచ్చే జీతాలే కదా అనుకుంటూ క్షేత్రస్థాయి సిబ్బంది కొందరు ఉన్నతాధికారులకు వాటాలు సమర్పిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని నిరక్షరాస్యులు కోరుతున్నారు. -
వయోజన విద్య.. మిథ్య
జోగిపేట: వయోజన విద్య..జిల్లాలో మిథ్యగా మారింది. ప్రభుత్వ తీరు అధికారుల నిర్లక్ష్యంతో నిరక్షరాస్యులైన వయోజనులకు అక్షర జ్ఞానం అందని ద్రాక్షలా తయారైంది. ఫలితంగా వయోజనులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘సాక్షర భారత్’ అమలు జిల్లాలో అటకెక్కింది. వయోజనులకు చదువు చెబుతున్న వారికి ఇవ్వాల్సిన గౌరవ వేతనం కూడా 9 నెలలుగా సర్కార్ ఇవ్వకపోవడంతో వారంతా చదువు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. మరోవైపు చాలా గ్రామాల్లో వయోజన విద్యా కేంద్రాలు పంచాయతీ కార్యాలయాల్లో నడుస్తుండడం, స్థానిక పంచాయతీ సెక్రటరీలు సరిగా సహకరించకపోవడంతో కేంద్రాలన్నీ మూతపడుతున్నాయి. దీంతో జిల్లాలోని నాలుగు లక్షల మంది నిరక్షరాస్యులు చదువుకునే అవకాశం లేకుండా పోయింది. లక్ష్యం చేరుకోని పథకం నిరక్షరాస్యులైన వయోజనులకు అక్షర జ్ఞానం నేర్పించేందుకు ఎన్నో ఏళ్ల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వయోజన విద్యాశాఖను ఏర్పాటు చేసింది. గతంలో అనియత విద్య, అక్షర సంక్రాంతి, చదువు వెలుగు కార్యక్రమాలతో వయోజన విద్య అమలైంది. ప్రణాళిక రూపకల్పన, ఆచరణలో వైఫల్యం కారణంగా ఆశించిన ప్రగతి సాధించలేకపోయింది. దీంతో ఏటా చాలా మంది చదువుకు దూరం అవుతున్నారు. కనీసం చదవడం..రాయడం రాని వారి సంఖ్య ఏటా పెరుగుతుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 2009 సంవత్సరంలో సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో అక్టోబర్ 2, 2010వ సంవత్సరంలో ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 1,029 గ్రామ పంచాయతీలుండగా అధికారులు 2,058 మందిని సాక్షర భారత్ కేంద్రాలకు విలేజ్ కోఆర్డినేటర్లను నియమించారు. ఒక్కో కేంద్రానికి పురుష, మహిళా గ్రామ కోఆర్డినేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో గ్రామ కో-ఆర్డినేటర్‌కు ప్రతి నెల రూ.2 వేలు, మండల కో-ఆర్డినేటర్‌కు రూ.6 వేలు చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. తెరుచుకోని కేంద్రాలు జిల్లాలో చాలా చోట్ల సాక్షర భారత్ కేంద్రాలు తెరుచుకోవడం లేదు. 9 మాసాలుగా గౌరవ వేతనం అందకపోవడంతో కేంద్రాల్లో చదువు చెప్పేందుకు గ్రామ, మండల కోఆర్డినేటర్లకు ఆసక్తి చూపడంలేదు. కేంద్రాలకు సొంత భవనం లేకపోవడం, గ్రామ పంచాయతీ భవనాల్లోనే ఎక్కువ కేంద్రాలు కొనసాగడంతో పంచాయతీ కార్యదర్శులు సహకారం కూడా తప్పనిసరిగా మారింది. కొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో వయోజన విద్యా కేంద్రాలు మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో పనిచేసే కూలీల్లో సింహ భాగం నిరక్షరాస్యులే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చదువుకునేందుకు వారు ముందుకు రావడంలేదు. ఇందుకోసం పథక నిర్వాహణ బాధ్యత నిర్వర్తిస్తున్న డ్వామానూ భాగస్వామ్యం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఫీల్డ్ అసిస్టెంట్లు మేట్ల సహకారంతో కూలీలు పనిచేసేచోటే చదువుకునేందుకు వారికి కొంత సమయం కేటాయిస్తేనే వారు నాలుగు అక్షరాలు నేర్చుకునే అవకాశం ఉంది. 4 లక్షల మంది చదువుకు దూరం మూడేళ్ల క్రితం అధికారులు జిల్లాలో నిర్వహించిన సర్వేలో 8,70,18 మంది నిరక్షరాస్యులు (చదవడం, రాయడం రానివారు ) ఉన్నట్లు నిర్దారణ కాగా, సాక్షర భారత్ ద్వారా ఇప్పటి వరకు 4,05,688 మంది చదవడం రాయడం నేర్పినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన జిల్లాలో ఇంకా 4 లక్షలకుపైగా మంది నిరక్షరాస్యులున్నారు. విలేజ్ కోఆర్డినేటర్లకు గౌరవ వేతనం రాకపోవడం, కేంద్రాలన్నీ మూతపడడం..తదితర కారణాలతో ఈ 4 లక్షల మంది నిరక్షరాస్యులు చదువుకు దూరమవుతున్నారు. -
వయోజన విద్యకు మంగళం..!
పక్క చిత్రంలో.. కన్పిస్తున్నది నెన్నెలలోని సాక్షర భారత్ కేంద్రం. గ్రామ పంచాయతీ భవనంలో కొనసాగుతోంది. వీసీవో(గ్రామ కో-ఆర్డినేటర్) వచ్చినా పంచాయతీ కార్యాలయ తాళం తెరిచి ఉంటేనే కేంద్రం కొనసాగుతుంది. కానీ పంచాయతీ కార్యదర్శి తన పని ఉంటేనే వస్తాడు. లేకపోతే లేదు. దీంతో ఆరు నెలల నుంచి సాక్షర భారత్ కేంద్రం నిర్వహణ జరగడం లేదు. ఆ వైపు వయోజనులెవరూ వెళ్లడం లేదు. వయోజన విద్య.. జిల్లాలో మిథ్యగా మారింది. ప్రభుత్వ తీరు.. అధికారుల వైఫల్యంతో నిరక్షరాస్య వయోజనులకు అక్షరజ్ఞానం అందని ద్రాక్షలా తయారైంది. వయోజనులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘సాక్షర భారత్’ అమలు జిల్లాలో అటకెక్కింది. మూడేళ్ల క్రితం.. సాక్షర భారత్ అమలు సమయంలో అధికారులు నిర్వహించిన సర్వేలో 8,44,556 మంది నిరక్షరాస్యులు(చదవడం, రాయడం) ఉన్నట్లు నిర్ధారణ కాగా.. ఇప్పటి వరకు 2,41,744 మంది చదవడం, రాయడం నేర్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా.. 6లక్షలకు పైగా మంది నిరక్షరాస్యులున్నారు. జిల్లా సంపూర్ణ అక్షరాస్యత సాధించాలంటే.. ఇంకా ఎన్నేళ్లు పడుతుందో తెలియని పరిస్థితి. సాక్షి, మంచిర్యాల : నిరక్షరాస్య వయోజనులకు అక్షరజ్ఞానం నేర్పించేందుకు ఎన్నో ఏళ్ల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వ యోజన విద్యాశాఖ ఏర్పాటు చేసింది. గతంలో అనియత విద్య.. అక్షర సంక్రాంతి.. చదువు వెలుగు.. కార్యక్రమాలతో వయోజన విద్య అమలైంది. కానీ ప్రణాళిక రూపకల్పన.. ఆచరణలో వైఫల్యం కారణంగా ఆశించిన ప్రగతి సాధించలేకపోయింది. ఏటా.. మహిళలతోపాటు పురుషులూ చదువుకు దూరమవుతూనే ఉన్నారు. కనీసం చదవడం.. రాయడం రాని వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 2009లో సాక్షరభారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో 2011లో ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా 866 సాక్షర భారత్ కేంద్రాలుండగా... ఒక్కో కేంద్రానికి పురుష, మహిళా గ్రామ కో-ఆర్డినేటర్లు మొత్తం 1732 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కో గ్రామ కో-ఆర్డినేటర్‌కు ప్రతి నెల రూ.2వేలు, మండల కో-ఆర్డినేటర్‌కు రూ.6వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. తెరుచుకోని కేంద్రాలు.. జిల్లాలో సాక్షర భారత్ కేంద్రాలు తెరుచుకోవడం లేదు. ఏడాది నుంచి గౌరవ వేతనం అందకపోవడంతో కేంద్రాల్లో చదువు చెప్పేందుకు గ్రామ, మండల కో-ఆర్డినేటర్లు ఆసక్తి చూపడం లేదు. గ్రామ కో-ఆర్డినేటర్లకు రూ.4.15 కోట్లకు పైగా వేతనాలు, మండల కో-ఆర్డినేటర్లకు రూ.37.44లక్షలు గౌరవ వేతనం రావాల్సి ఉంది. మరోపక్క.. కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడం.. గ్రామ పంచాయతీ భవనాల్లోనే ఎక్కువ కేంద్రాలు కొనసాగడంతో పంచాయతీ కార్యదర్శులు సహకరించిప్పుడే అవి తెరుచుకుంటున్నాయి. లేకపోతే తెరుచుకోని పరిస్థితి నెలకొంది. జిల్లాలో సాక్షర భారత్ కేంద్రాలు తెరుచుకోవడం లేదనే ఫిర్యాదులు ఇంత వరకు అందలేదని, గౌరవ వేతనాలు లేకపోయినా కో-ఆర్డినేటర్లు విధులు నిర్వర్తిస్తున్నారని పథకం జిల్లా కో-ఆర్డినేటర్ సాగర్ వివరణ ఇచ్చారు. ఇలా చేస్తే బాగు.. సంపూర్ణ అక్షరాస్యత సాధించాలంటే.. వయోజన విద్యతోపాటు సర్వశిక్షా అభియాన్, డీఆర్డీఏ, డ్వామా శాఖలనూ భాగస్వామ్యుల్ని చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కో శాఖకు కొన్ని మండలాలు కేటాయించి.. ఆయా మండలా పరిధిలో ఉన్న నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి. లక్ష్యానికి తగ్గట్టు.. ప్రణాళిక రూపొందించి కార్యక్రమ నిర్వహణపై జిల్లా ఉన్నతాధికారులు నివేదికలు స్వీకరిస్తూ ఉండాలి. జిల్లాలో డీఆర్డీఏ, ఐకేపీలోని మహిళా గ్రూపుల ద్వారా వయోజనులకు విద్య అందించాలి. జిల్లా, మండల, గ్రామైక్య సంఘ సభ్యులనూ ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేసి.. చదవడం, రాయడం రాని వారికి అక్షరజ్ఞానం నేర్పించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకంలో పని చేసే కూలీల్లో సింహభాగం నిరక్షరాస్యులే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చదువుకునేందుకు వారు ముందుకురావడం లేదు. ఇందుకోసం.. పథక నిర్వహణ బాద్యత నిర్వర్తిస్తున్న డ్వామానూ భాగస్వామ్యం చే యాలి. ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్ల సహకారంతో కూలీలు పని చేసే చోటే.. వారికి కొంత సమయం కేటాయించి అక్షరాలు దిద్దించే ఏర్పాటు చేయాలి. సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్న సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కేజీబీవీలు, ఇతర విభాగాల్లో పని చేస్తున్న సిబ్బందికి క్షేత్రస్థాయిలో పరిచయాలుండడంతో వారికీ వయోజన విద్య బాధ్యత అప్పగిస్తే బాగుంటుంది. బోథ్ మండలంలో మొత్తం 38 సాక్షర భారత్ కేంద్రాలుండగా.. రెండేళ్ల నుంచి ఒక్క కేంద్రం కూడా తెరుచుకోవడం లేదు. బె జ్జూరు మండలంలో 42 కేంద్రాలున్నాయి. నెల రోజుల నుంచి ఒక్క కేంద్రం కూడా తెరుచుకోవడం లేదు. కోటపల్లి మండలంలో ఉన్న 42 సాక్షర భారత్ కేంద్రాల్లో 20కిపైగా తెరుచుకోవడం లేదు. నెన్నెల మండలంలో మొత్తం 13 కేంద్రాలుండగా ప్రస్తుతం అవన్నీ మూతబడ్డాయి. కడెం మండలంలో మొత్తం 24 వయోజన విద్యా కేంద్రాలున్నాయి. అందులో నాలుగైదు కేంద్రాలకు మించి తెరుచుకోవడం లేదు. కౌటాల మండలంలో 21 సాక్షరభారత్ కేంద్రాలున్నాయి. ఆరు నెలల నుంచి మెటీరియల్ రాకపోవడంతో కేంద్రాలు నామ మాత్రంగా తెరిచి.. మూసేస్తున్నారు. ఒక్కకి కూడా అక్షరజ్ఞానం అందడం లేదు. -
వయోజన విద్యపై నిర్లక్ష్య నీడ
గిద్దలూరు, న్యూస్‌లైన్: వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన సాక్షర భారత్ కార్యక్రమం ప్రభుత్వ నిర్లక్ష్యంతో కునారిల్లుతోంది. జిల్లాలోని 2082 మంది గ్రామ కోఆర్డినేటర్లు, 56 మంది మండల కోఆర్డినేటర్లు నెలల తరబడి వేతనాలందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలపై అధికారులను ఎన్నిసార్లు ప్రశ్నించినా ఇదిగో..ఈవారం వస్తున్నాయని చెబుతున్నారు తప్ప కార్యరూపం దాల్చడం లేదని కోఆర్డినేటర్లు వాపోతున్నారు. జిల్లాలోని వివిధ స్థాయిల్లో ఉన్న కోఆర్డినేటర్లు ఎవరికీ వేతనాలు అందకపోవడంతో వీటి ప్రభావం వయోజన విద్యా కేంద్రాలపై పడుతోంది. వివిధ స్థాయిల్లో... వయోజనులకు అక్షరజ్ఞానం నేర్పించేందుకు 2009 లో సాక్షరభారత్ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ పథకాన్ని వయోజన విద్యాశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా స్థాయిలో వయోజన విద్యాశాఖ డిప్యూటీ డెరైక్టర్ సాక్షర భారత్ పథకాన్ని పర్యవేక్షిస్తున్నారు. డివిజన్ కోఆర్డినేటర్లు, మండల కోఆర్డినేటర్లు, గ్రామ కోఆర్డినేటర్లు వారి పరిధిలో నిర్వహణ బాధ్యతలు చేపట్టి పథకాన్ని నడిపిస్తున్నారు. గ్రామ స్థాయిలో ఇద్దరు గ్రామ కోర్డినేటర్లను నియమించారు. వీరు వయోజన విద్యాకేంద్రాలను ఏర్పాటు చేసి వయోజనులను అక్షరాస్యులుగా చేయాల్సి ఉంది. గ్రామ కోఆర్డినేటరుకు నెలకు రూ.2 వేలు, మండల కోఆర్డినేటరుకు రూ.6 వేలుగా వేతనాన్ని నిర్ణయించారు. అక్షరాలు నేర్పడమే లక్ష్యంగా... 4 సాక్షర భారత్ కోఆర్డినేటర్లు స్థానికంగా అందుబాటులో ఉన్న గ్రంథాలయాలు, పాఠశాలలు వంటి ప్రదేశాల్లో 15 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వారిని ఎంపిక చేసి కనీసం 30 మందికి తగ్గకుండా సమీకరించి వారికి అక్షరాలు నేర్పించాలి. 4 పుస్తకాలు, పత్రికలు చదివేలా వారిని తీర్చిదిద్దాలి. నేషనల్ ఓపెన్ స్కూల్ వారు దశలవారీగా వీరికి పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో పరిస్థితి ఇదీ... ప్రస్తుతం జిల్లాలో మొత్తం 2,082 వయోజన విద్యా కేంద్రాలున్నాయి. వీటిలో 62,460 మంది వయోజనులు అక్షరాలు నేర్చుకుంటున్నారు. ఇలా జిల్లాలో నాలుగు సంవత్సరాలుగా వయోజనులు అక్షరాస్యులుగా మారుతున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో 94 పంచాయతీల్లో 188 మంది కోఆర్డినేటర్లు పనిచేస్తుండగా, వీరికి వేతనాలందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15 నెలలుగా అందని వేతనాలు: సాక్షర భారత్ కోఆర్డినేటర్లకు ఇచ్చే కొద్దిపాటి వేతనాలు కూడా సకాలంలో అందించడం లేదు. 2012 సెప్టెంబర్ వరకు సజావుగా వేతనాలందాయి. ఆ తరువాత ఆ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వేతనాలు విడుదల చేసినా..వాటిని కోఆర్డినేటర్లకు ఇవ్వలేదు. ఆ మూడు నెలల వేతనాలకు తోడు 2013 ఏడాది మొత్తం జీతాన్ని కూడా విడుదల చేయలేదు. మొత్తం మీద 15 నెలలుగా వేతనాలందక కోఆర్డినేటర్లు అవస్థపడుతున్నారు. జీతం లేకపోవడంతో వారు కూడా చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. కొన్ని కేంద్రాలు ఇప్పటికే మూతపడగా..మరికొన్ని నామమాత్రంగా నడుస్తున్నాయి. ఫలితంగా పథకం లక్ష్యం నీరుగారుతోంది. వేతనాల చెల్లింపులపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. వేతనాల్లో జాప్యం వాస్తవమే.. సి.వీరభద్రరావు, డిప్యూటీ డెరైక్టర్ కోఆర్డినేటర్లకు వేతనాలు జాప్యమైన మాట వాస్తవమే. 2012 డిసెంబరు నెల వరకు నిధులు విడుదలయ్యాయి. 2013 సంవత్సరానికి రావాల్సిన వేతనాల నిధులు మరో 10 రోజుల్లో అన్ని మండలాలకు విడుదల చేస్తాం. గతంలో మూడు నెలలకు విడుదలైన వేతనాలు ఆయా మండలాల అధికారులు ఇవ్వాల్సి ఉంది. వాటిని త్వరలో ఇస్తారు.