నాగార్జునసాగర్ లో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్
నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. పులిచింతల ముంపు గ్రామాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఉత్పత్తిని అధికారులు ఆపేశారు. నాగార్జునసాగర్ లో ప్రస్తుత నీటిమట్టం 585 అడుగులుగా ఉంది, ఇన్ ఫ్లో 15వేల క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 31,535 క్యూసెక్కులుగా ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జలాశయాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరుతోంది.
పులిచింతల ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరుగుతుండడంతో 7 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఇక్కడ ఇన్ ఫ్లో 66 వేల క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 71 వేల క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల ప్రాజెక్ట్‌కు నీటిమట్టం పెరుగుతుండడంతో ముంపు గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో బిక్కు బిక్కుమంటున్నారు.