aiims to andhrapradesh
-
మీ పాప లేదా బాబు బొద్దుగా ముద్దొస్తున్నారండీ.. అంటే మురిసిపోకండి!
‘మీ పాప లేదా బాబు బొద్దుగా ముద్దొస్తున్నారండీ’ అని ఎవరైనా అంటే వారి తల్లిదండ్రులు తెగ మురిసిపోతున్నారు. బాల్యంలోనే బొద్దుగా తయారవడం వల్ల వచ్చే దుష్ప్రభావాలను అసలు గుర్తించలేకపోతున్నారు. పిల్లలు ఏం తింటున్నారు, వారు తినే ఆహారంలో పోషకాలు ఏ మాత్రం ఉంటున్నాయనే విషయంపై ఆలోచించే వారైతే చాలా అరుదే. పంజాబ్‌లోని బటిండా, ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మార్కెట్లో లభించే ప్యాక్ చేసిన ఆహార పదార్థాలనే పిల్లలకు పెట్టేందుకు తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తేలింది. పిల్లలకు పెట్టే ఆహారంలో ఉండాల్సిన పోషక విలువలపై తక్కువ అవగాహన ఉంటోందని గుర్తించారు. – సాక్షి, అమరావతి 53.9 శాతం అధికంగా కొలెస్ట్రాల్ పాఠశాలల్లో చదివే 14–18 సంవత్సరాల మధ్య వయసు పిల్లలు 722 మంది, వారి తల్లిదండ్రులను ఎయిమ్స్ బృందం అధ్యయనానికి ఎంచుకుంది. ఆ పిల్లల్లో జంక్ ఫుడ్, ప్యాక్ చేసిన ఆహారం కారణంగా చిన్న వయసులోనే ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్ వ్యాధుల బారినపడేలా చేస్తున్నాయని గుర్తించారు. పిల్లలు తినే ఆహారాల (ప్యాకేజీ ఫుడ్) తయారీలో 53.9 శాతం అధికంగా కొలెస్ట్రాల్ పదార్థాలు ఉంటున్నాయని తేల్చారు. ఇది విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావంచూపుతోందని తేల్చారు. ప్రకటనలతో ప్రభావితం టీవీలు, డిజిటల్ మీడియాలలో వచ్చే ప్యాక్ చేసిన ఆహార పదార్థాల వైపు పిల్లలు ఆకర్షితులు అవుతున్నారని 273 మంది తల్లిదండ్రులు (37.8 శాతం) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 184 (25.5 శాతం) మంది ప్రచారం చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో పోషకాల నాణ్యతకు సంబంధించిన సమాచార కచ్చితత్వంపై సందేహాలు వ్యక్తం చేశారు. దాదాపు 45 శాతం మంది తల్లిదండ్రులు ప్రసిద్ధ వ్యక్తులు జంక్ ఫుడ్స్‌ను ప్రమోట్ చేస్తుండటాన్ని వ్యతిరేకించారు. జంక్ ఫుడ్‌పై కంపెనీలు ఆఫర్లు ఇస్తుండటాన్ని 34 శాతం మంది తప్పుపట్టగా.. ప్రైమ్ టైమ్‌లో జంక్ ఫుడ్ ప్రకటనలు వేయకూడదని 40 శాతం మంది కోరారు. గడువు తేదీని చూడని వారే అధికం అధ్యయనంలో పాల్గొన్న విద్యార్థుల్లో 352 మంది (48.8 శాతం) విద్యార్థులు తినే ఆహార ప్యాకెట్లపై కనీసం గడువు తీరే తేదీని (ఎక్స్పైరీ డేట్)పరిశీలించడం లేదు. 526 మంది (72.9 శాతం) కేవలం ధరలను పరిశీలిస్తుండగా.. 518 మంది (71.7 శాతం) విద్యార్థులు కొనుగోలు చేసే ముందు ఆ ఆహారం వెజ్, నాన్–వెజ్ అనేది మాత్రమే చూస్తున్నారు. మార్కెట్లో లభించే ఆహార ప్యాకెట్లపై తయారీకి వినియోగించిన పదార్థాలు, వాటిలో ఉండే పోషకాలకు సంబంధించిన లేబుల్స్‌పై సమాచారాన్ని కేవలం 50 మంది విద్యార్థులు (6.9 శాతం) మాత్రమే అర్థం చేసుకుంటున్నారు. 356 మంది విద్యార్థులు (49.30 శాతం) లేబుల్ చూసి తాము ఆహార పదార్థాల వైపు ప్రభావితం అవలేదని, 424 మంది (58.7 శాతం) లేబుల్స్ కారణంగా తమ కొనుగోలు ప్రవర్తనను ఎప్పుడూ మార్చుకోలేదని నివేదించారు. ఇంట్లోనే చేసి పెట్టాలి పిల్లలకు ఇంటి ఆహారం అలవాటు చేయాలి. పూర్వం తల్లిదండ్రులు పిల్లల కోసం ఇంట్లోనే చక్రాలు, కజ్జికాయలు, అరిసెలు వంటి ఆహార పదార్థాలు చేసేవారు. ఆ తరహా పద్ధతులను ఇప్పుడు కూడా పాటించాలి. వీలైనంత వరకూ కూరగాయలు, పళ్లు తినడాన్ని చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయాలి. జంక్ ఫుడ్, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. చైల్డ్ ఒబెసిటీ వస్తుంది. దీనివల్ల ఆస్తమా, ఫ్యాటీ లివర్, టైప్–2 డయాబెటిస్ వంటి సమస్యల బారినపడతారు. ఈ ఆహారంలో కలిపే పదార్థాల కారణంగా త్వరగా పిల్లల్లో కౌమార దశ మొదలవుతుంది. – డాక్టర్ నాగచక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్, విజయవాడ జీజీహెచ్ -
ఎయిమ్స్‌కు రాష్ట్ర ప్రభుత్వ సహకారం భేష్
సాక్షి, అమరావతి: మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి రాష్ట్ర ప్రభుత్వ సహకారం భేషుగ్గా ఉందని ఆ సంస్థ డైరెక్టర్, సీఈవో డాక్టర్ ముఖేశ్ త్రిపాఠి చెప్పారు. ఎయిమ్స్‌లో వైద్యసేవలు ప్రారంభించి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి ప్రభుత్వం వైపు నుంచి కావాల్సిన సహకారాన్ని వివరించినట్టు తెలిపారు. సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. ఎయిమ్స్‌కు శాశ్వత నీటిసరఫరా పనులను ఈ ఏడాది జూలైలోగా పూర్తిచేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించినట్టు తెలిపారు. రహదారి సౌకర్యానికి సంబంధించి కేంద్ర అటవీశాఖ నుంచి అనుమతులు లభించాయని, ఆర్అండ్బీ శాఖ రోడ్డు వేయడానికి చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఎయిమ్స్‌లో వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్టుతో ఎంవోయూ చేసుకున్నట్టు చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద గత నవంబర్ నుంచి ఇప్పటివరకు 710 మంది రోగులు ఉచితంగా వైద్యసేవలు అందుకున్నారన్నారు. 2019 మార్చి 12వ తేదీన రోగుల సంరక్షణ సేవలు ప్రారంభించామని, ఈ నాలుగేళ్లలో 9,67,192 మంది ఓపీ, 7,477 మంది ఐపీ సేవలు అందుకున్నారని వివరించారు. ఇప్పటివరకు 2,590 మేజర్, 29,486 మైనర్ సర్జరీలు నిర్వహించామన్నారు. 37 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. త్వరలోనే కార్డియాలజీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని, ఇందుకోసం వైద్యుల నియామకం చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం రోజకు సగటున 2,500 మంది రోగులు ఓపీ సేవలు పొందుతున్నట్టు చెప్పారు. ఇన్‌పెషంట్స్ కోసం 555 బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం, పరీక్షలకు రూ.వంద ఖర్చవుతుంటే.. తమవద్ద రూ.30 నుంచి రూ.40 వరకు మాత్రమే ఖర్చవుతాయని చెప్పారు. ఆస్పత్రిలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలవుతోందని ఈ క్రమంలో ప్రజలు ఆన్లైన్లో ఓపీడీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఎంబీబీఎస్, నర్సింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, త్వరలో పారామెడికల్ కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. రూ.1,680 కోట్లతో చేపట్టిన ఎయిమ్స్ ఏర్పాటు పనులు పూర్తికావచ్చాయని ఆయన తెలిపారు. చికిత్స పొందిన పలువురు రోగులు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. తమకు వైద్యసేవల్లో ఎయిమ్స్ చూపుతున్న చొరవను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగులు ప్రశంసించారు. సంఘం తరఫున డైరెక్టర్, డీన్లకు జ్ఞాపికలు ఇచ్చారు. అనంతరం నాలుగేళ్ల ఎయిమ్స్ ప్రస్థానంపై రూపొందించిన బ్రోచర్‌ను డైరెక్టర్, డీన్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీన్లు డాక్టర్ జాయ్ ఎ ఘోషల్, డాక్టర్ శ్రీమంతకుమార్ దాస్, డాక్టర్ దీప్తి వేపకొమ్మ, డాక్టర్ వినీత్ థామస్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకరన్, మీడియా సెల్ ప్రతినిధి వంశీకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ఎయిమ్స్‌లోనూ ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, అమరావతి/మంగళగిరి: మంగళగిరిలోని ప్రతిష్టాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిట్టు తెలిపారు. ఎయిమ్స్‌ను సోమవారం మంత్రి సందర్శించి వైద్య విభాగాలు, మౌలిక వసతులను పరిశీలించారు. వైద్య సేవలపై రోగులతో ముచ్చటించారు. ఎయిమ్స్ అధికారులతో కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేకంగా భేటీ అయి పలు విషయాలపై చర్చించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మెంటల్ హెల్త్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంశాల్లో ఎయిమ్స్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు చేసుకుంటుందని, తద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని విద్యార్థులకు ఆయా అంశాల్లో ఎయిమ్స్ నుంచి అత్యుత్తమ శిక్షణ లభిస్తుందని తెలిపారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ పాలియేటివ్ కేర్‌గా ఎయిమ్స్‌ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన తోడ్పాటు, సాయాన్ని అందించనున్నట్టు చెప్పారు. రూ.55 కోట్లతో మౌలిక వసతుల కల్పన ముఖ్యమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఎయిమ్స్‌కు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆత్మకూరు రిజర్వాయర్ నుంచి రూ.7.74 కోట్లతో పైపు లైన్ పనులు సోమవారం నుంచే ప్రారంభించినట్టు మంత్రి రజిని తెలిపారు. తాత్కాలికంగా మంగళగిరి–తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ నుంచి రోజుకు 3.5 లక్షల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నామని, మరో లక్ష లీటర్ల నీటిని అత్యవసర సమయాల్లో వాడుకునేందుకు వీలుగా నిత్యం అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. సంస్థ విస్తరణలో భాగంగా రోజుకు అదనంగా మరో 3 లక్షల లీటర్ల నీరు అందించాలన్న ఎయిమ్స్ అభ్యర్థన మేరకు.. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నుంచి సరఫరా చేస్తున్నామన్నారు. ఎయిమ్స్‌కు మౌలిక వసతుల కల్పనలో సీఎం జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. రూ.35 కోట్లతో 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, రూ.10 కోట్లతో రోడ్లు, డ్రెయినేజీ పనులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతుల వరకు తమ ప్రభుత్వమే చేపట్టిందని చెప్పారు. ఇప్పటి వరకు రూ.55 కోట్లను ఎయిమ్స్ అభివృద్ధికి ఖర్చు చేశామని, మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఎయిమ్స్ డైరెక్టర్ త్రిపాఠి వెల్లడించారు. -
‘చంద్రబాబు మాటలన్నీ బూటకాలే’
గుంటూరు మెడికల్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాటలన్నీ బూటకాలేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని విమర్శించారు. వైద్య కళాశాలల విషయంలో చంద్రబాబుతోపాటు ఆ పార్టీ నేతలు అసత్యాలు వల్లిస్తున్నారని మండిపడ్డారు. గురువారం సాయంత్రం గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. విభజన చట్ట ప్రకారమే ఎయిమ్స్.. టీడీపీ నేతలు గోబెల్స్ ప్రచారంలో ముందుంటారు. మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిని తామే తెచ్చినట్లు చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తన నిధులతో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వానికి, ఎయిమ్స్‌కు ఎలాంటి సంబంధం లేదు. టీడీపీ నేతల పోరాటాల వల్లే వచ్చిందని చెప్పడం హాస్యాస్పదం. ► అసెంబ్లీలో ప్రకటించినట్లుగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలు 11 మాత్రమే. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిమ్స్‌ను, టీటీడీ ఆధ్వర్యంలో నడిచే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పద్మావతి మెడికల్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలలంటూ టీడీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది. వైఎస్సార్ ఆలోచనే తిరుపతి కళాశాల తిరుపతిలో పద్మావతి మహిళా వైద్య కళాశాలను మహిళల కోసం ప్రత్యేకంగా నిర్మించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తలచారు. నెల్లూరులో కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటైందంటే వైఎస్సార్ చొరవే కారణం. తిరుపతి, నెల్లూరులో వైద్య కళాశాలల నిర్మాణాల కోసం 2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అంచనాలు రూపొందించి ఆ తరువాత బడ్జెట్ కేటాయింపులు చేశారు. 2013 చివరి నాటికి ఆ కళాశాలలకు అనుమతులు, భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. 2014 ఆగస్టులో వాటిలో అడ్మిషన్లు చేపట్టారు. రెండు మెడికల్ కళాశాలలు డాక్టర్ రాజశేఖరరెడ్డి చలువ వల్లే రాష్ట్రానికి వచ్చాయి. అనంతరం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2014 ఆగస్టులో వాటిని ప్రారంభించారు. వాటిని తానే తెచి్చనట్లు చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు. పద్మావతి మెడికల్ కళాశాలలో ఎన్నారై కోటా కింద 23 సీట్లు అమ్ముకోవచ్చంటూ చంద్రబాబు సర్కారు దుర్మార్గంగా జీవో ఇచ్చింది. అందుకే భగవంతుడు టీడీపీకి గుర్తుండేలా ఆ పార్టీని 23 సీట్లకు పరిమితం చేసి గత ఎన్నికల్లో శిక్ష విధించారు. రాష్ట్రంలో 18 ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉంటే 13 కాలేజీలకు అనుమతులు ఇచ్చింది చంద్రబాబే. టీడీపీ హయాంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ► పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ రంగంలో 17 వైద్య కళాశాలల నిర్మాణానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ► ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సులు, 104 వాహనాలు, వైద్య కళాశాలల ఏర్పాటుతో మనసున్న డాక్టర్‌గా వైఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రలో గొప్ప నాయకుడిగా నిలిచారు. -
ఐఎన్ఐ సెట్ వాయిదా వేయండి, సుప్రీంకోర్టు ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్ఐ సెట్) 2021ను జూన్ 16న నిర్వహించాలనడం ఏకపక్షంగా అనిపిస్తోందని, వాయిదా వేయాల ని ఢిల్లీ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 16న నిర్వహించాల్సి ఉన్న ఈ పరీక్షను నెల రోజులు వాయిదా వేయాలని స్పష్టంచేసింది. ‘‘పరీక్షకు హాజరు కావాలనుకొనే చాలా మంది అభ్యర్థు లు కోవిడ్ విధుల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉండడాన్ని పరిగణనలోకి తీసుకొని పరీక్షను నెల రోజులు వాయిదా వేయాలని నిర్ణయిం చాం. నెల రోజుల తర్వాత ఎప్పుడైనా పరీక్ష నిర్వహించొచ్చు’’అని జస్టిస్ ఇందిరా బెనర్జీ , జస్టిస్ ఎంఆర్‌షాల ధర్మాసనం పేర్కొంది. ఢిల్లీ ఎయిమ్స్ నిర్వహిస్తున్న ఐఎన్ఐ సెట్లో 815 సీట్లకుగాను సుమారు 80 వేల మంది అభ్యర్థు లు పోటీపడుతున్నారు. చదవండి : 'అద్దాల మేడల్లో నివసించేవాళ్లు ఎదుటివాళ్లపై రాళ్లు విసరకూడదు' -
మంగళగిరి ఎయిమ్స్ సభ్యుడిగా విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని తొమ్మిది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)ల సభ్యులుగా తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు గురువారం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మంగళగిరి(గుంటూరు) ఎయిమ్స్ సభ్యునిగా ఎంపికయ్యారు. ఆయన ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. -
ఏపీలో ఎయిమ్స్ కు కేంద్రం ఓకే
ఆంధ్రప్రదేశ్ లో ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంగళగిరిలో అందుబాటులోఉన్న 193 ఎకరాల్లో ఎయిమ్స్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి నడ్డా మీడియాతో మాట్లాడారు. 500 పడకలతో ఏర్పాటయ్యే మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిపారు.