air asia flight service
-
విమానం అత్యవసర ల్యాండింగ్
శంషాబాద్ : జైపూర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విమానానికి పైలట్ చాకచక్యంతో పెద్ద ప్రమాదం తప్పింది. జైపూర్ నుంచి బయల్దేరిన ఎయిర్ ఏషియా ఐ5–1543 విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మంగళవారం మధ్యాహ్నం 1.40 గంటలకు దిగాల్సి ఉంది. అయితే, మరికొద్దిసేపట్లో విమానం ల్యాండ్ కానున్న సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్ ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్‌కు (ఏటీసీ) సమాచారం అందించారు. ఏటీసీ అనుమతితో ఒకే ఇంజిన్‌తో పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందులో ప్రయాణిస్తున్న 70 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానంలోని సాంకేతికలోపంపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. -
'మలేషియాలో చిక్కుకున్న వారిని రప్పిస్తాం'
ఢిల్లీ : మలేషియాలో చిక్కుకున్న తెలుగు ప్రయాణికులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విజ్ఞప్తిపై కేంద్ర విదేశాంగశాఖ సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. మలేషియాలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. అందుకు కౌలలంపూర్ నుంచి విశాఖ, ఢిల్లీకి ఎయిర్ ఏషియా విమానాలు ఏర్పాటు చేస్తామన్నారు. మలేషియాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని జైశంకర్ తెలిపారు. (‘నెల్లూరు కరోనా బాధితుడు కోలుకుంటున్నాడు’) అంతకుముందు మలేషియాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. మలేషియాలో చిక్కుకున్నవారిని వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎంఓ అధికారులకు జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఢిల్లీ ఏపీ ప్రత్యేక ప్రతినిధి విజయసాయిరెడ్డి, ఢిల్లీ ఏపీ భవన్ అధికారులు, విదేశాంగశాఖతో సీఎంఓ అధికారులతో సమన్వయమయ్యారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలపాలని ఢిల్లీ ఏపీ భవన్ అధికారులను కోరారు. -
విశాఖ-బెంగళూరుల మధ్య మరో విమాన సర్వీసు
గోపాలపట్నం: విశాఖపట్నం నుంచి బెంగళూరు నగరానికి మరో విమాన సర్వీసు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఎయిర్ ఏషియా సంస్థ ఇప్పటికే ప్రతీ రోజూ సాయంత్రం బెంగళూరుకు ఓ సర్వీసు నడుపుతుండగా... ఆగస్ట్ 14 నుంచి రోజూ ఉదయం మరో సర్వీసు నడపాలని నిర్ణయించింది. ఈ విమానం ఉదయం 6.15 గంటలకు బెంగళూరులో బయల్దేరి 7.50గంటలకు విశాఖకు చేరుకుంటుంది. తిరిగి 8.05 గంటలకు బయల్దేరి 9.30 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.