
విశాఖ-బెంగళూరుల మధ్య మరో విమాన సర్వీసు
గోపాలపట్నం: విశాఖపట్నం నుంచి బెంగళూరు నగరానికి మరో విమాన సర్వీసు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఎయిర్ ఏషియా సంస్థ ఇప్పటికే ప్రతీ రోజూ సాయంత్రం బెంగళూరుకు ఓ సర్వీసు నడుపుతుండగా... ఆగస్ట్ 14 నుంచి రోజూ ఉదయం మరో సర్వీసు నడపాలని నిర్ణయించింది.
ఈ విమానం ఉదయం 6.15 గంటలకు బెంగళూరులో బయల్దేరి 7.50గంటలకు విశాఖకు చేరుకుంటుంది. తిరిగి 8.05 గంటలకు బయల్దేరి 9.30 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.