Aisha Meera
-
ఆయేషా మీరా హత్య కేసు విజయవాడ కోర్టు సిబ్బందిపై కేసు నమోదు
-
ఆయేషా హత్య కేసులో కీలక మలుపు..
సాక్షి, హైదరాబాద్: బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించే విషయాన్ని పరిశీలిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఈ వ్యాజ్యంలో సీబీఐని ప్రతివాదిగా చేరుస్తూ నోటీసులు జారీచేసింది. ఆయేషా హత్యతో ముడిపడి ఉన్న వస్తువులను (మెటీరియల్ ఆబ్జెక్ట్స్) కేసు తేలక ముందే కింది కోర్టు నాశనం చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించి.. విచారణకు ఆదేశించింది. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ సత్యంబాబు దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టు తీర్పు నివ్వడానికి ముందే వస్తువులను ఎవరి ఆదేశాల మేరకు నాశనం చేశారు.. ఏ ఏ వస్తువులు నాశనమయ్యాయి.. ఇందుకు బాధ్యులెవరు.. ఇందులో న్యాయవ్యవస్థకు సంబంధించిన అధికారుల పాత్ర ఉందా.. ఉంటే వారు ఏ స్థాయి అధికారులు.. తదితర అంశాలపై విచారణ జరపాలని రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ)ను ఆదేశించింది. ఈ విచారణలో ఏ స్థాయి అధికారినైనా కూడా విచారించవచ్చని ఆర్జీకి హైకోర్టు స్పష్టం చేసింది. 4 వారాల్లో నివేదికను తమ ముందుంచాలని, దాన్ని బట్టి ఈ కేసులో దర్యాప్తును సిట్‌చే కొనసాగించడమా? లేక సీబీఐకి అప్పగించడమా? అన్న అంశాన్ని పరిశీలిస్తామంది. అనంతరం ఈ కేసును 4 వారాల పాటు వాయిదా వేసింది. ఈ కేసులో సత్యం బాబును నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పులో హైకోర్టు ధర్మాసనం నిర్ణయాత్మక అభిప్రాయాలను వ్యక్తం చేసిందని, దీని ప్రకారం ఈ కేసులో పునర్ దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉందంటూ ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ రమా మేల్కొటే, పాత్రికేయురాలు కె.సజయ, సామాజిక కార్యకర్త సంధ్యారాణి సంయుక్తంగా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తమ కుమార్తె హత్య కేసుపై సిట్ చేసే పునర్ దర్యాప్తును హైకోర్టే పర్యవేక్షించాలని, లేకుంటే సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆయేషా తల్లిదండ్రులు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. -
ఆయేషా మీరా హత్య కేసులో తాజా దర్యాప్తు
-
ఆయేషా మీరా హత్య కేసులో తాజా దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో తాజా దర్యాప్తునకు ఆదేశించాలని, దర్యాప్తు తీరును స్వయంగా పర్యవేక్షించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఆయేషా మీరా హత్య కేసులో తాజాగా దర్యాప్తు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఆదేశించింది. దర్యాప్తును తాము స్వయంగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని పేర్కొంది. ‘సిట్’ సభ్యులను తమ అనుమతి లేకుండా మార్చడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. దర్యాప్తు నిమిత్తం సిట్‌కు అన్ని సౌకర్యాలు సమకూర్చాలని వెల్లడించింది. కేసు దర్యాప్తు సందర్భంగా బయటి నుంచి ఏవైనా ఒత్తిళ్లు వస్తే తమ దృష్టికి తీసుకురావాలని సిట్‌కు సూచించింది. దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని, ఎప్పటికప్పుడు తమకు నివేదికలు అందజేయాలని సిట్‌ను ఆదేశించింది. అందులో భాగంగా ఏప్రిల్ 20 నాటికి ఓ నివేదికను సమర్పించాలని తెలిపింది. గతంలో ఈ కేసులో అసలైన నేరస్తులను చట్టం ముందు నిలబెట్టడంలో పోలీసులు విఫలమయ్యారని, ఇందుకు బాధ్యులైన అధికారులపై అపెక్స్ కమిటీ ద్వారా చట్ట ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. -
సత్యంబాబు విడుదలపై వీడని ఉత్కంఠ
-
సత్యంబాబు విడుదలపై వీడని ఉత్కంఠ
- రాత్రి వరకు హైకోర్టు ఉత్తర్వుల కోసం ఎదురుచూపులు - నేడు విడుదలయ్యే అవకాశం - నిర్దోషిని శిక్షించారంటూ ప్రజాసంఘాల ఆగ్రహం రాజమహేంద్రవరం క్రైం: ఆయేషా మీరా హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న పిడతల సత్యంబాబు విడుదల్లో జాప్యం జరుగుతోంది. సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు ఇచ్చినా ఉత్తర్వులు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు అధికారులకు శనివారం కూడా అందలేదు. ఈ ఉత్తర్వులు ఆదివారం అందితే సత్యంబాబు విడుదలయ్యే అవకాశం ఉంది. సెంట్రల్ జైలు వద్ద శనివారం ఉదయం నుంచి హైడ్రామా నడిచింది. శుక్రవారమే హైకోర్టు తీర్పు ఇవ్వడంతో శనివారం సత్యంబాబు విడుదలవుతాడని అంతా ఎదురు చూశారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు, ప్రజాసంఘాల నాయకులు జైలు వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అక్కడికి వచ్చిన సత్యంబాబు తల్లి మరియమ్మ, లాయర్ శ్రీనివాసరావు.. అడ్వకేట్ కౌన్సిల్ ఇచ్చిన కాపీలను జైలు అధికారులకు చూపించారు. ఉత్తర్వులు హైకోర్టు నుంచి నేరుగా వస్తేగానీ జైలు నుంచి విడుదల చేసేందుకు నిబంధనలు అంగీకరించవని అధికారులు చెప్పారు. సత్యంబాబు విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు హైదరాబాద్ నుంచి ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్.ఎం.ఎస్. ద్వారా వస్తాయని ఎదురుచూసినా రాలేదు. పోలీస్ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలి నిర్దోషిపై కేసు పెట్టిన పోలీస్ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పౌరహక్కుల సంఘాలు, దళితసంఘాలు డిమాండ్ చేశాయి. సెంట్రల్ జైలు వద్ద ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు, సత్యంబాబు న్యాయవాది పి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక నిరపరాధిని ఎనిమిదిన్నర సంవత్సరాలు జైలులో మగ్గేలా చేశారని ఆరోపించారు. కుటుంబానికి ఆసరాగా ఉండే యువకుడి జీవితాన్ని నాశనం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారుల వైఫల్యంతో నష్టపోయిన రెండు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.