ఆజాద్ అడుగుజాడల్లో పయనిద్దాం
ఉడిత్యాల (బాలానగర్) : చంద్రశేఖర్ ఆజాద్ అడుగుజాడల్లో పయనించేందుకు యువత కషిచేయాలని వీహెచ్‌పీ నాయకుడు హెద్దె నాగేశ్వర్రావు అన్నారు. శనివారం బాలానగర్ మండలంలోని ఉడిత్యాలలో ఏర్పాటుచేసిన చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోహత్య ఎంతో పాపమని భరతమాతను పూజించాలన్నారు. బీజే పీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కొన్ని ఉగ్రవాద శక్తులు జిహాద్ పేరుతో దేశంలో అల్లకల్లోలు సష్టిస్తున్నాయని ఆరోపించారు. మతఛాందసవాదులను తిప్పికొట్టాలన్నారు. అనంతరం యువకులు ఎస్వీస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన, ఉచిత వైద్యశిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిర్మలాలక్ష్మీనారాయణ, వీహెచ్‌పీ నాయకులు దుష్యంత్‌రెడ్డి, శరణయ్య, నర్సింలు, బండారి రమేష్, జ్ఞానందగిరిస్వామి తదితరులు పాల్గొన్నారు.