Ajanta Express
-
లింగంపల్లి నుంచి ‘దేవగిరి’కాచిగూడ నుంచి ‘అజంతా’
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి ముంబైకి రాకపోకలు సాగించే దేవగిరి ఎక్స్‌ప్రెస్ 17058/17057 ఇక నుంచి సికింద్రాబాద్‌కు బదులు లింగంపల్లి నుంచి దేవగిరికి రాకపోకలు సాగించనుందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ నుంచి అజంతాకు వెళ్లే అజంతా ఎక్స్‌ప్రెస్(17064/17063) ఇక నుంచి మల్కాజిగిరి స్టేషన్లో అదనపు హాల్ట్‌తో కాచిగూడ స్టేషన్ నుంచి అజంతాకు రాకపోకలు సాగించనుంది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్లో రైళ్ల ఒత్తిడిని తగ్గించేందుకు ఈ రెండు రైళ్ల టర్మినళ్లను మార్చినట్లు సీపీఆర్వో తెలిపారు. నగరంలోని పశి్చమ ప్రాంతంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి, ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల విస్తరణ, ప్రముఖ వ్యాపారసంస్థల ఏర్పాటు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని లింగంపల్లి నుంచి దేవగిరి ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగించేవిధంగా మార్పు చేసినట్లు పేర్కొన్నారు. లింగంపల్లి స్టేషన్‌కు పొడిగించడం వల్ల ముంబైకి మాత్రమే కాకుండా నిజామాబాద్, బాసర్, నాందేడ్, మన్మాడ్, నాసిక్ వంటి ముఖ్యమైన పట్టణాలకు వెళ్లే ప్రయాణికులకు సదుపాయంగా ఉంటుంది. అజంతా ఎక్స్‌ప్రెస్‌ను కాచిగూడ స్టేషన్‌కు మార్చడం వల్ల కాచిగూడ నుంచి షిర్డీ(నాగర్సోల్ స్టేషన్) మధ్య రోజువారీ ఎక్స్‌ప్రెస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ రైలుకు అదనంగా ఒక 2 టైర్ ఏసీని జతచేయనున్నారు. -
భారీ వర్షంతో ఆగిన రైళ్లు
-
భారీ వర్షంతో ఆగిన రైళ్లు
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు గుంటూరు జిల్లాలో రైల్వే ట్రాక్ దెబ్బతింది. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల-రెడ్డిగూడెం మధ్యం రైల్వే ట్రాక్ భారీ వర్షానికి కొట్టుకుపోయింది. మరోవైపు రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో రైల్వే ట్రాక్ మీదకు భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో గురువారం పలు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గుంటూరు మీదుగా నడవాల్సిన రైళ్లను దారి మళ్లించారు. మరి కొన్ని ఆలశ్యంగా నడుస్తున్నాయి. రైళ్ల వివరాలు.. మాచర్ల ఎక్స్‌ప్రెస్‌ను పిడిగురాళ్లలో నిలిపివేశారు. అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను నడికుడిలో నిలిపివేశారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను మిర్యాలగూడలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ను బెల్లంకొండలో నిలిపివేశారు. పల్నాడు ఎక్స్‌ప్రెస్ రెడ్డిగూడెంలోను, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ బెల్లంకొండలోను ఆగిపోయాయి. హైదరాబాద్ వెళ్లే అజంతా ఎక్స్‌ప్రెస్‌ను నడికుడు మీదుగా నడుపుతున్నారు. -
అజంతా ఎక్స్‌ప్రెస్‌లో చోరీ
హైదరాబాద్ : షిర్డీ నుంచి సికింద్రాబాద్ వస్తున్న అజంతా ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం చోరీ జరిగింది. ఏ2 బోగీలోని ప్రయాణికులను బెదిరించి దుండగులు నగదు, నగలు, సెల్ఫోన్లు దోచుకు వెళ్లారు. బాధితులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బాంబు కలకలం
చేగుంట/వెల్దుర్తి, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ నుంచి మన్మాడ్ బయలుదేరిన అజంతా ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు పెట్టినట్టు ఆదివారం సాయంత్రం వచ్చిన ఫోన్‌కాల్ కలకలం రేపింది. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు వెల్దుర్తి మండలం స్టేషన్ మాసాయిపేలో రైలును నిలిపివేశారు. సుమారు నాలుగు గంటలపాటు తనిఖీలు చేపట్టగా ఎలాంటి బాంబు ఆచూకీ లభించకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు ఇలా... అజంతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉన్నట్టు ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ రైల్వే కంట్రోల్ బోర్డుకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు స్టేషన్ మాసాయిపేటలోని స్టేషన్లో రైలును ఆపేశారు. ఈ రైలులో 24 బోగీలుండగా 4,800 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, రామాయంపేట సీఐ గంగాధర్, చేగుంట ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డిలు రైల్వే స్టేషన్‌కు చేరుకుని ప్రయాణికులను కిందికి దించేశారు. ఆందోళనకు గురైన ప్రయాణికులు ఆతృతగా రైలు దిగి పరుగులు పెట్టారు. కొందరు ప్రయాణికులు సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారికి చేరుకుని బస్సుల్లో వెళ్లిపోయారు. సికింద్రాబాద్ నుంచి బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు సుమారు నాలుగు గంటలపాటు సోదాలు చేయగా బాంబు ఆచూకీ లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఆకతాయిల పనేనని అధికారులు భావిస్తున్నారు. కంట్రోల్ బోర్డుకు వచ్చిన ఫోన్‌కాల్ నంబరు వివరాలు తెలుసుకోగా హైదరాబాద్‌కు చెందిన వీరమణి పేరుతో సిమ్‌కార్డు ఉన్నట్టుగా గుర్తించినట్టు ఓ అధికారి తెలి పారు. నాలుగు గంటలపాటు రైలు నిలిచిపోవడంతో సుదూరం వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో రైలు ముందుకు కదిలింది.