భారీ వర్షంతో ఆగిన రైళ్లు
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు గుంటూరు జిల్లాలో రైల్వే ట్రాక్ దెబ్బతింది. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల-రెడ్డిగూడెం మధ్యం రైల్వే ట్రాక్ భారీ వర్షానికి కొట్టుకుపోయింది. మరోవైపు రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో రైల్వే ట్రాక్ మీదకు భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో గురువారం పలు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గుంటూరు మీదుగా నడవాల్సిన రైళ్లను దారి మళ్లించారు. మరి కొన్ని ఆలశ్యంగా నడుస్తున్నాయి.
రైళ్ల వివరాలు..
మాచర్ల ఎక్స్‌ప్రెస్‌ను పిడిగురాళ్లలో నిలిపివేశారు. అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను నడికుడిలో నిలిపివేశారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను మిర్యాలగూడలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ను బెల్లంకొండలో నిలిపివేశారు. పల్నాడు ఎక్స్‌ప్రెస్ రెడ్డిగూడెంలోను, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ బెల్లంకొండలోను ఆగిపోయాయి. హైదరాబాద్ వెళ్లే అజంతా ఎక్స్‌ప్రెస్‌ను నడికుడు మీదుగా నడుపుతున్నారు.