akhand bharat
-
దేశ విభజనను పాక్ ప్రజలూ తప్పుబడుతున్నారు
భోపాల్: పాకిస్తాన్ ప్రజలు సంతోషంగా లేరని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేశ విభజన తప్పని పాకిస్తాన్ ప్రజలంతా అంటున్నారన్నారు. అఖండ భారత్ వాస్తవం కాగా విభజిత భారత్ ఒక పీడకల అని అభివర్ణించారు. భారతదేశ విభజన తప్పనే విషయాన్ని, స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల అనంతరం ఇప్పుడు వారు నమ్ముతున్నారని భగవత్ వ్యాఖ్యానించారు. ‘స్వాతంత్య్రానికి ముందు భారత్ నుంచి తెగదెంపులు చేసుకుని అహంకారపూరితంగా వెళ్లిన వారింకా సంతోషంగా ఉన్నారా? లేదు, బాధలు పడుతున్నారు’ అంటూ పాకిస్తానీయులనుద్దేశించి ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలపై ఆయన.. ‘పాకిస్తాన్‌పై భారత్ దాడి చేయాలన్నది నా ఉద్దేశం ఎంతమాత్రం కాదు. ఇతరులపై దాడులు చేయాలంటూ పిలుపునిచ్చే సంస్కృతి భారత్‌లో లేదు. ఆత్మరక్షణ కోసం దాడులకు తగిన బుద్ధి చెప్పాలనేదే భారత్ సంస్కృతి. దీనినే ఆచరిస్తాం. ఇదే కొనసాగుతుంది’అని పేర్కొన్నారు. స్వాతంత్య్ర యోధుడు హేము కలానీ జయంతిని పురస్కరించుకుని సింధీలు భోపాల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భగవత్ మాట్లాడారు. -
‘చేతనైతే మళ్లీ అఖండ భారతావనిని సృష్టించు’
గౌహతి: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో పర్యటిస్తున్న వేళ.. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను విమర్శించే క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో సంచలన వ్యాఖ్యలే చేశారాయన. ‘‘భారత దేశం ఏకతాటిపైనే ఉంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా.. సిల్చార్ నుంచి సౌరాష్ట్ర దాకా ప్రజలంతా ఒక్కటిగానే ఉన్నాం. అలాంటప్పుడు కాంగ్రెస్ యాత్రతో ప్రయోజనం ఏముంటుంది?. కాబట్టి, రాహుల్ ఇలాంటి యాత్రను పాకిస్తాన్లో నిర్వహించుకుంటే మంచిదని హిమంత ఎద్దేశా చేశారు. వాస్తవానికి దేశాన్ని విభజించింది కాంగ్రెస్సే. ఒకవేళ తన ముత్తాత(నెహ్రూను ఉద్దేశించి) చేసిన పనికి(విజభనను ఉద్దేశించి..) రాహుల్ గాంధీ గనుక పశ్చాత్తపం చెంది ఉంటే గనుక.. భారత్‌జోడో యాత్ర చేయాల్సిన అవసరమే లేదు. కావాలనుకుంటే పాక్, బంగ్లాదేశ్‌లను తిరిగి ఐక్యం చేసి అఖండ భారతాన్ని సృష్టించొచ్చు అని అస్సాం సీఎం వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. అస్సాం సీఎం విలీనం వ్యాఖ్యలపై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేకించి.. బంగ్లా ప్రధాని షేక్ హసీనా భారత్‌లో నాలుగు రోజుల పర్యటనలో ఉండగానే.. ఆయన బంగ్లాదేశ్ విలీనం వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక పర్యటనలో ఉన్న ఆమె ఇప్పటికే ప్రధాని మోదీతో భేటీ అయ్యారు కూడా. అంతేకాదు ఇరు దేశాల మధ్య ఏడు ఎంవోయూలపై సంతకాలు కూడా జరిగాయి. అఖండ భారతావని అనేది ఆరెస్సెస్ వాదన. పాక్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, అఫ్గనిస్తాన్, టిబెట్, మయన్మార్లు సంఘటితంగా ఉంటేనే.. అది అఖండ భారతం అని చెప్తుంటుంది.గతంలో కాంగ్రెస్‌లో ఉన్న హిమంత.. 2015లో బీజేపీలో చేరారు. ఇదిలా ఉంటే.. ఇవాళ సాయంత్రం భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. #WATCH | "India is intact. We're one nation. Congress disintegrated India in 1947. If Rahul Gandhi has any regret that his grandfather made a mistake, there's no use of Bharat Jodo Yatra in India. Try to integrate Pakistan, Bangladesh & work for Akhand Bharat..," says Assam CM. pic.twitter.com/W1ZbWV4rOG — ANI (@ANI) September 7, 2022 ఇదీ చదవండి: తొలిసారి తండ్రి స్మారకం వద్ద రాహుల్ -
‘2025 తర్వాత పాక్ కనిపించదు’
ముంబై: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) సీనియర్ నాయకుడు ఇంద్రేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025 తర్వాత పాకిస్తాన్... భారత్‌లో భాగం కాబోతుందని వ్యాఖ్యానించారు. కశ్మీర్ సమస్యపై ముంబైలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్ మాదిరి అఖండ భారత్ రూపొందడానికి దారులు తెరుచుకుని ఉన్నాయని అన్నారు. రానున్న ఐదు నుంచి ఏడేళ్లలో కరాచీ, లాహోర్, రావల్పిండిలలో ఇళ్లు కొనుక్కోవాలనే, బిజినెస్ చేయాలనే కల నెరవేరబోతుందనే విషయాన్ని రాసిపెట్టుకోండని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘1947కు మందు పాకిస్తాన్ అనేది లేదు.. 1945కు ముందు ప్రజలు దానిని హిందూస్తాన్లో భాగంగానే పరిగణించేవారు. అలాంటి పాకిస్తాన్ మళ్లీ 2025 తర్వాత తిరిగి హిందూస్తాన్లో భాగం కానుంది. అఖండ భారత్ కల కూడా సాకరమవుతుందనే నమ్మకం కలుగుతోంది. తొలిసారిగా భారత ప్రభుత్వం కశ్మీర్ సమస్యపై కఠిన వైఖరి తీసుకుంది.. తద్వారా సైన్యానికి ఆత్మవిశ్వాసం పెరిగింది. తాజాగా కశ్మీర్లో పరిస్థితులు మారాయి. ఇకపై లాహోర్‌లో జీవించడానికి.. చైనా అనుమతి తీసుకోకుండా మానసరోవరం వెళ్లడానికి కలలు కనవచ్చ’ని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ భారత్‌లో ఏ విధంగా భాగం కాబోతుందనే విషయాన్ని మాత్రం ఇంద్రేశ్ కుమార్ వ్యక్తపరచలేదు. -
తప్పుడు మ్యాపులకు మోహన్ భగవత్‌ను జైల్లో పెడతారా?
న్యూఢిల్లీ: భారత దేశ నైసర్గిక సరిహద్దులను మ్యాపుల్లో ఆన్‌లైన్‌లోగానీ, ముద్రణాపరంగాగానీ తప్పుగా చూపించినట్లయితే గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల నుంచి వంద కోట్ల రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించేందుకు వీలుగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్త ముసాయిదా బిల్లును రూపొందించిన విషయం తెల్సిందే. మరి అఖండ్ భారత్ లేదా అవిభాజ్య భారత్ చిత్ర పటాన్ని ఆది నుంచి ప్రదర్శిస్తూ వస్తున్న ఆరెస్సెస్‌ను ఈ కొత్త బిల్లు కింద శిక్షిస్తారా? ఆరెస్సెస్ నాయకుడు మోహన్ భగవత్‌ను అరెస్ట్‌చేసి జైల్లో పెడతారా? అఖండ్ భారత్ బ్యాక్‌డ్రాప్‌గా భారత మాతా చిత్రపటాన్ని ఆరెస్సెస్ తన అధికార మ్యాప్‌గా పరిగణిస్తున్న విషయం తెల్సిందే. ఆరెస్సెస్ మ్యాపుల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను కలిపి భారత్ మ్యాప్‌ను చూపిస్తోంది. కొన్ని చిత్రాల్లో అఫ్ఘానిస్తాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక దేశాలను కూడా చూపిస్తోంది. కొత్త బిల్లు చట్టంగా మారితే అధికార బీజేపీకి అండగా నిలుస్తున్న ఆరెస్సెస్ కూడా నేరానికి పాల్పడినట్లు కాదా? జమ్మూ కశ్మీర్‌ను పాకిస్తాన్లో, అరుణాచల్ ప్రదేశ్‌ను చైనాలో కలిపి భారత్ మ్యాప్‌లను ఆన్లైన్లో చూపిన కారణంగా ఈ బిల్లును తీసుకరావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ప్రభుత్వం చెబుతోంది. పశ్చిమ జమ్మూ కశ్మీర్‌లోని సగ భాగం వాస్తవానికి పాకిస్తాన్ ఆధీనంలో ఉంది. ఆ ప్రాంతం మన ఆధీనంలో ఉన్నట్లు మన మ్యాపుల్లో చూపించుకుంటున్నాం. అలాగే, ఈశాన్యంలోని అక్సాయి చిన్ ప్రాంతం చైనా ఆధీనంలో ఉన్నది. అది కూడా మన ఆధీనంలో ఉన్నట్లుగా మ్యాపుల్లో చూపించుకుంటున్నాం. మన ఆధీనంలో లేని ప్రాంతాలను మన మ్యాపుల నుంచి తొలగిస్తే కొత్త చట్టం కింద శిక్షిస్తారా? ఆరెస్సెస్‌ను శిక్షిస్తారో, లేదోగానీ వాస్తవ మ్యాపులను రూపొందిస్తే మాత్రం కచ్చితంగా శిక్షిస్తారని ప్రభుత్వ ధోరణి చూస్తే అర్థం అవుతుంది. -
భారత్, పాక్, బంగ్లా.. మళ్లీ ఒకటవుతాయి!
భారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఈ మూడు దేశాలూ మళ్లీ కలిసి ఒకటైపోతాయని, అఖండ భారతావని ఏర్పడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. కేవలం 60 ఏళ్ల క్రితం మాత్రమే చారిత్రక కారణాలతో విడిపోయిన ఈ మూడు దేశాలు తప్పనిసరిగా కలుస్తాయని, అఖండ భారతం ఏర్పడుతుందని తెలిపారు. ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా తనకు ఆ విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. అలాగని తామేదో ఇతర దేశాల మీదకు యుద్ధానికి వెళ్తామనో.. లేదా బలవంతంగా కలిపేసుకుంటామనో అనుకోనక్కర్లేదని, విస్తృత ప్రజాభిప్రాయంతోనే ఇది అవుతుందని అన్నారు. ఇంతకుముందు భారతదేశాన్ని 'హిందూ దేశం'గా అభివర్ణించిన అంశంపై స్పందిస్తూ.. అది ఒక సంస్కృతి మాత్రమేనని, భారతదేశానికంతటికీ ఒకే సంస్కృతి ఉందని ఆయన స్పష్టంచేశారు. అయితే అఖండ భారతావని వ్యాఖ్యలను కాంగ్రెస్ కొట్టిపారేసింది. ఇదంతా కేవలం ప్రచారమేనని, తమ వైఫల్యాల నుంచి తప్పించుకోడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇలా చెబుతున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజోయ్ కుమార్ విమర్శించారు. వాళ్లు ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.