Akhil Movie
-
హీరో నితిన్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: హీరో నితిన్, ఆయన సోదరి నిఖితారెడ్డిలకు హైకోర్టులో ఊరట లభించింది. ‘అఖిల్’ సినిమాకు సంబంధించి వారిపై సైబరాబాద్ 20వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి తీర్పు వెలువరించారు. ‘అఖిల్’ సినిమా హక్కుల విషయంలో తనవద్ద రూ.50 లక్షలు తీసుకుని, హక్కులు ఇవ్వకుండా తనను మోసం చేశారంటూ సికింద్రాబాద్ సైనిక్‌పురికి చెందిన గంగాధర సత్యనారాయణ అనే వ్యక్తి మల్కాజ్గిరి, సైబరాబాద్ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ 20వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో గతేడాది సెప్టెంబర్ 23న ఫిర్యాదు చేశారు. నితిన్, నిఖితను మూడో, నాల్గో నిందితులుగా పేర్కొన్నారు. నితిన్ తండ్రి, నిర్మాత సుధాకర్‌రెడ్డిని రెండో నిందితునిగా, శ్రేష్ట్ మూవీస్‌ను మొదటి నిందితునిగా చేర్చారు. వారందరికీ కోర్టు సమన్లు జారీ చేసింది. దీనిపై నితిన్, నిఖితారెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రేష్ట మూవీస్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సత్యనారాయణ తన ఫిర్యాదులో నితిన్, నిఖితారెడ్డిలను శ్రేష్ట మూవీస్ సంస్థలో భాగస్వాములంటూ తప్పుగా పేర్కొని వారిపైనా కేసు పెట్టారని, అందులో వారు భాగస్వాములు కాదని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనను హైకోర్టు ఆమోదించి కేసును కొట్టివేసింది. -
ఏదైనా డైరెక్ట్‌గానే.. యువ నటి
ఏదైనా ఫేస్ టు ఫేస్ బెటర్ అంటోంది బాలీవుడ్ యువ నటి సయేషాసైగల్. బాలీవుడ్ బిగ్ సినీ వారసత్వం నుంచి వచ్చిన ఈ బ్యూటీ తెరంగేట్రం మాత్రం టాలీవుడ్లో చేయడం విశేషం అని చెప్పాలి. నటుడు నాగార్జున వారసుడు అఖిల్ కథానాయకుడిగా పరిచయం అయిన ‘అఖిల్’ చిత్రంతో నాయకిగా పరిచయం అయిన సయేషా ఆ చిత్రంపై పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. ఆ తరువాత మాతృభాషలో అజయ్‌దేవ్‌గన్‌తో నటించిన శివాయ్ చిత్రం మంచి పేరునే తెచ్చిపెట్టింది. దీంతో అమ్మడికి కోలీవుడ్ నుంచి కాలింగ్ వచ్చింది. తాజాగా జయంరవితో వనమగన్‌తో తమిళ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో ఒక పాటలో డ్యాన్స్ అదరగొట్టి ఆ పాటకు నృత్య దర్శకత్వం వహించిన ప్రభుదేవానే విస్మయ పరచిందట. ఇక చిత్ర దర్శకుడిని విపరీతంగా ఆకట్టుకున్న సైగల్‌కు అవకాశాలు వరుస కడుతున్నాయట. వనమగన్ చిత్ర విడుదలకు ముందే కరుప్పురాజా వెళైరాజా వంటి మల్టీస్టారర్ చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసిన సయేషా మరి కొన్ని చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయట. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అసలు కథ ఇప్పటి నుంచే మొదలైంది. సయేషా కాల్షీట్స్ ఇప్పిస్తానని, ఆమె మేనేజర్ తానేనంటూ కొందరు బురిడీ బాబులు పుట్టుకొచ్చారట. ఈ విషయం నటి సయేషా దృష్టికి రావడంతో వెంటనే రియాక్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ తమిళం, తెలుగు చిత్రాల విషయం గాని, ఇతర కార్యక్రమ విషయాలు ఏవైనాగాని తనతో, తన తల్లితోగాని డైరెక్ట్‌గా చర్చించాలి. అంతే గాని తనకంటూ మేనేజర్ ఎవరూ లేరని తన ట్విట్టర్లో పేర్కొంది. -
‘అఖిల్’ విషయంలో తప్పు జరిగింది
ఏలూరు (సెంట్రల్) : ‘అఖిల్’ సినిమా విషయంలో అభిమానులు, సినిమా కుటుంబ సభ్యులు క్షమించాలని, మరోసారి అటువంటి తప్పు జరగకుండా చూసుకుంటానని ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. శనివారం సాయంత్రం ఏలూరులో ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కథ కొత్తగా ఉందని అఖిల్‌తో ఆ సినిమా తీసినట్టు చెప్పారు. హీరోగా అఖిల్ ఎంతో ప్రతిభ చూపినప్పటికీ సినిమా ఆశించిన ఫలితం రాలేదన్నారు. సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి తప్ప అందరూ ఏదో ఒక తప్పు చేస్తుంటారని మొదటిసారిగా తాను తప్పు చేసినట్టు అనిపించిదన్నారు.త్వరలో మంచి హిట్‌తో అభిమానుల ముందుకు వస్తానని వినాయక్ తెలిపారు. సినీ ప్రతినిధుల రుణం తీర్చుకుంటా సినిమా విడుదల తరువాత సినీ ప్రతినిధుల వల్ల చిత్రం టాక్ తెలుస్తుందని, సినిమా కుటుంబంలో వారి సేవలు ఎంతో గొప్పవని ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. స్థానిక విజయవిహార్ సెంటర్లోని ఓ హోటల్లో శనివారం సాయంత్రం సినీ రిప్రజెంట్స్కు వినాయక్ ఎల్ఐసీ బాండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ జీతంతో విధులు నిర్వహిస్తున్న రిప్రజెంట్స్కు చివరికి ఎటువంటి ఆధారం లేకుండా పోతుందన్నారు. సన్నిహితుడు సీతారామ్ అనే వ్యక్తి రిప్రజెంట్లకు ఉచితంగా ఎల్ఐసీ పాలసీ చేయించాలని చెప్పడంతో కొందరు సహాయంతో చేయించినట్టు చెప్పారు. 53 మంది రిప్రజెంట్లకు బాండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఉషా బాలకృష్ణ, అంబికా కృష్ణ, ఎల్వీఆర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆఫ్రికా అడవుల్లో అఖిల్ సాహసాలు
అక్కినేని నట వారసుడు అఖిల్ ఆఫ్రికా అడవుల్లో సాహసాలు చేస్తున్నాడు. తన తొలి సినిమా విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో సినిమాను ప్రమోట్ చేయడానికి తాజాగా మరో ట్రైలర్ విడుదల చేశాడు. ఇందులో హీరోయిన్ సాయేషాతో కలిసి ఉన్న సీన్లు, రెండు పాటలతో పాటు.. ఆఫ్రికా అడవుల్లో అఖిల్ చేసే సాహసాలు కూడా కనిపిస్తున్నాయి. వెన్నెల కిషోర్, అఖిల్ ఇద్దరినీ బ్రహ్మానందం ఆఫ్రికన్లకు పరిచయం చేయడం, ఆ తర్వాత అక్కడ అఖిల్ సాహసాలు చేయడం లాంటి సీన్లన్నీ ఈ రెండు నిమిషాల ట్రైలర్లో చూపించారు. అఖిల్ అక్కినేని, సాయేషా సెహగల్ జంటగా వి.వి. వినాయక్ దర్శకత్వంలో తీసిన ఈ సినిమా దీపావళి రోజు సోలోగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. తొలుత దసరాకు విడుదల చేయాలనుకున్నా, విఎఫ్ఎక్స్ పనులు కొంత ఆలస్యం కావడంతో దీపావళికి విడుదల చేస్తున్నారు. -
ఆఫ్రికా అడవుల్లో అఖిల్ సాహసాలు
-
నా ఇంట్రో సాంగ్ మేకింగ్ ఇలా..
ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్న అఖిల్ సినిమా విడుదల విషయం అయితే తెలియలేదు గానీ, ఏదో ఒకలా ఆ సినిమాను అభిమానుల నోళ్లలో నానేలా చేస్తున్నాడు హీరో అఖిల్ అక్కినేని. తాజాగా తన సినిమాలోని ఇంట్రోసాంగ్ మేకింగ్ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసి, ఆ లింకును ట్వీట్ చేశాడు. తన ఇంట్రో సాంగ్ షూటింగ్ అనుభవం అద్భుతంగా ఉందని తెలిపాడు. సినిమా నవంబర్ 11వ తేదీన దీపావళి సందర్భంగా విడుదల అవుతోందని కూడా ఆ వీడియోలో తెలిపారు. వి.వి. వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న అఖిల్ సినిమా వాస్తవానికి దసరా సమయానికే విడుదల అవుతుందని ముందు భావించారు. కానీ, వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో సినిమా బయటకు రావడం కూడా కొంత ఆలస్యం అయ్యింది. దీనిపై అభిమానులు కూడా కొన్నిచోట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. సినిమా బాగా రావడం కోసమే ఈ సమయం తీసుకున్నామని, ఎక్కడా రీషూటింగ్ చేయడం లేదని కూడా అఖిల్ ఇంతకుముందు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. -
నా ఇంట్రో సాంగ్ మేకింగ్ ఇలా..
-
మీ సహనానికి థాంక్స్: అఖిల్
తొలిసారి హీరోగా నటిస్తుంటే ఎవరికైనా చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. అందులోనూ ముందు నుంచి అంచనాలు చాలా ఎక్కువగా ఉండే అక్కినేని వంశ వారసుడు అఖిల్ లాంటివాళ్లకు అయితే ఇది మరింత ఎక్కువ. అనుకున్న సమయం కంటే సినిమా విడుదల ఆలస్యం కావడంతో కాస్త ఇబ్బంది పడినా, ప్రేక్షకులకు మాత్రం ఎప్పుడూ తన సినిమా గురించి అప్డేట్లు ఇస్తూ.. సినిమా గురించిన చర్చ జనం నోళ్లలో నానేలా చూసుకుంటున్నాడు అఖిల్. తాజాగా సినిమా పనుల గురించి ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు వివరించాడు. అఖిల్ సినిమా పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని, ప్రతి ఒక్క విషయంలోనూ కచ్చితత్వాన్ని తీసుకొస్తున్నామని తెలిపాడు. అలాగే ప్రేక్షకుల సహనానికి థాంక్స్ కూడా చెప్పాడు. మరిన్ని వివరాలతో త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తానంటూ ట్వీట్ చేశాడు అక్కినేని బుల్లోడు. Hi everyone :) Work for #Akhil going on full swing and everything is being perfected. Thank you for your patience. Back soon with updates :) — Akhil Akkineni (@AkhilAkkineni8) October 24, 2015 -
అఖిల్
ఏ హీరోకీ దక్కని సువర్ణావకాశం అఖిల్‌కి దక్కింది. తొలి సినిమా టైటిలే తన పేరు మీద రావడమనేది ఇంతవరకూ ఏ హీరోకీ జరగలేదు. అఖిల్ సినిమాకి ఏం పేరు పెడతారా అని అందరూ రకరకాల ఊహాగానాలతో ఎదురుచూస్తుంటే, ‘అఖిల్’ టైటిల్ అనౌన్స్ చేసి అభిమానుల్ని థ్రిల్ చేశారు దర్శకుడు వీవీ వినాయక్. ఈ నెల 20న ఏయన్నార్ జయంతికి పాటలు విడుదల కానున్నాయి. అక్టోబర్ 22న విజయదశమి కానుకగా విడుదల చేస్తామని ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్న హీరో నితిన్ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కొన్ని పాటలను అఖిల్, హీరోయిన్ సాయేషాలపై ఆస్ట్రియా, స్పెయిన్లలో చిత్రీకరిస్తున్నారు. -
దసరాని టార్గెట్ చేసిన అఖిల్