నా ఇంట్రో సాంగ్ మేకింగ్ ఇలా.. | akhil akkineni tweets his intro song making video | Sakshi
Sakshi News home page

నా ఇంట్రో సాంగ్ మేకింగ్ ఇలా..

Published Mon, Nov 2 2015 3:13 PM | Last Updated on Sun, Sep 3 2017 11:54 AM

నా ఇంట్రో సాంగ్ మేకింగ్ ఇలా..

నా ఇంట్రో సాంగ్ మేకింగ్ ఇలా..

ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్న అఖిల్ సినిమా విడుదల విషయం అయితే తెలియలేదు గానీ, ఏదో ఒకలా ఆ సినిమాను అభిమానుల నోళ్లలో నానేలా చేస్తున్నాడు హీరో అఖిల్ అక్కినేని. తాజాగా తన సినిమాలోని ఇంట్రోసాంగ్ మేకింగ్ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసి, ఆ లింకును ట్వీట్ చేశాడు. తన ఇంట్రో సాంగ్ షూటింగ్ అనుభవం అద్భుతంగా ఉందని తెలిపాడు. సినిమా నవంబర్ 11వ తేదీన దీపావళి సందర్భంగా విడుదల అవుతోందని కూడా ఆ వీడియోలో తెలిపారు.

వి.వి. వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న అఖిల్ సినిమా వాస్తవానికి దసరా సమయానికే విడుదల అవుతుందని ముందు భావించారు. కానీ, వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో సినిమా బయటకు రావడం కూడా కొంత ఆలస్యం అయ్యింది. దీనిపై అభిమానులు కూడా కొన్నిచోట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. సినిమా బాగా రావడం కోసమే ఈ సమయం తీసుకున్నామని, ఎక్కడా రీషూటింగ్ చేయడం లేదని కూడా అఖిల్ ఇంతకుముందు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement