Akhnoor sector
-
ఆర్మీ కాన్వాయ్‌పై ముష్కరుల కాల్పులు
జమ్మూ: జమ్మూ జిల్లాలోని అఖ్నూర్ సెక్టార్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. వాస్తవాధీన రేఖకు సమీపంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా ఆర్మీ కాన్వాయ్‌పైకి ఉగ్ర మూకలు కాల్పులకు దిగాయి. బలగాలు అప్రమత్తమై దీటుగా స్పందించడంతో ప్రమాదం తప్పింది. అనంతరం ముష్కరులు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పరారయ్యారు. ఆ ప్రాంతాన్ని దిగ్బంధించిన బలగాలు అదనంగా పోలీసులను, ఆర్మీని తరలించి గాలింపు ముమ్మరం చేశారు. ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతడి వద్ద ఆయుధం స్వాధీనం చేసుసుకున్నారు. హెలికాప్టర్‌ను రంగంలోకి దించి బలగాలు ఓ భవనం బేస్మెంట్లో ఉగ్రవాదులు దాగినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా భారీ పేలుళ్లు, కాల్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు సభ్యుల ముష్కరుల ముఠా ఆదివారం రాత్రి సరిహద్దులు దాటి దొంగచాటుగా దేశంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ అంబులెన్సుకు కనీసం డజను బుల్లెట్లు తగిలాయని చెప్పారు. అంతకుముందు, ఉగ్రవాదులు అస్సన్ ఆలయంలోకి ప్రవేశించి సెల్‌ఫోన్ కోసం అక్కడి వారిని అడిగారు, ఇంతలోనే అటుగా వస్తున్న ఆర్మీ కాన్వాయ్‌ని గమనించి కాల్పులకు దిగారన్నారు. -
మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు
-
మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అఖ్నూర్ సెక్టార్ లోని బతాల్ సమీపంలో ఉన్న జనరల్ రిజర్వ్ ఇంజినీరింగ్ ఫోర్స్(జీఆర్ఈఎఫ్) ఆర్మీక్యాంపుపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో క్యాంపులో పనిచేసే ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఆర్మీ ఎదురుకాల్పులు ప్రారంభించింది. ప్రస్తుతం ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య హోరాహోరీగా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఉగ్రదాడుల నేపథ్యంలో అఖ్నూర్ సెక్టార్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. బతాల్ గ్రామంలో తలదాచుకున్న ఉగ్రవాదులు సోమవారం వేకువజామున ఒక్కసారిగా ఆర్మీ క్యాంపుపై కాల్పులకు తెగబడ్డారు. కాగా, ఉగ్రవాదులును ఏరిపారేసేందుకు ఆర్మీ పటిష్ట చర్యలు తీసుకున్న నేపథ్యంలోనే ముష్కరులు ఈ దాడికి తెగబడ్డారని అధికారులు భావిస్తున్నారు. లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్వోసీ)కి సరిహద్దుల్లో కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆర్మీ క్యాంపు ఉన్న విషయం తెలిసిందే. ముష్కరుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్
జమ్మూకశ్మీర్: పాక్ అక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రమూక స్థావరాలపై భారత్ దళాలు దాడి చేసి 72 గంటలు అయిందో లేదో... పాక్ మళ్లీ తన తెంపరితనాన్ని చాటుకుంది. శనివారం మళ్లీ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్‌లోని అక్నూర్ సెక్టార్పైకి ఈ రోజు తెల్లవారుజామున 4.00 గంటల నుంచి బుల్లెట్ల వర్షం కురిపించింది. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. -
మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన
పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద సోమవారం అర్థరాత్రి పాకిస్థాన్ దళాలు అఖ్నర్ సెక్టర్పై కాల్పులకు తెగబడిందని ఆర్మీ ప్రతినిధి కెప్టెన్ ఎస్.ఎన్.ఆచార్య మంగళవారం ఇక్కడ వెల్లడించారు. అందుకు ప్రతిగా తమ భద్రత దళాలు కూడా అదే స్థాయిలో కాల్పులు జరిపిందని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఇరు వైపుల కాల్పులు ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి నియంత్రణ రేఖ వద్ద పాక్ భద్రత దళాలు వరుసగా కాల్పులు జరుపుతూ భారత్, పాక్ దేశాలు గతంలో చేసుకున్న ఒప్పందాలను అతిక్రమిస్తున్న సంగతి తెలిసిందే.