in akiveedu
-
మహా స్థూపానికి మహాయజ్ఞం
ఆకివీడు: సాయికోటి నామ లిఖిత మహాయజ్ఞం గురువారం స్థానిక సాయినగర్‌లోని సాయి మందిరంలో వైభవంగా సాగింది. వంద అడుగుల ఎత్తుగల సాయికోటి మహాసూ్థపం దశమి వార్షికోత్సవం సందర్భంగా సాయికోటి నామలిఖిత మహాయజ్ఞంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయికోటి పుస్తకాల్ని నిక్షిప్తం చేశారు. వేలాది మంది భక్తులు సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పవిత్రాత్మ స్వరూప సాయి గురు కొపల్లె సూర్యనారాయణ మాట్లాడుతూ సాయిబాబా గురువే కాదు దైవం అన్నారు. ఎంతో మందికి నిజరూపంగా సాయి మహిమల్ని అందించారని చెప్పారు. సుప్రభాత సేవ, నాలుగు హారతులను సాయికి అందజేశారు. ఆలయం వద్ద శాంతి పూజలు, పవిత్రోత్సవ పూజలు నిర్వహించారు. అనంతరం పవళింపు సేవ జరిగింది. అఖండ అన్నసమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. -
అలరించిన సరిగమ పాటల పోటీ
ఆకివీడు : స్థానిక సరిగమ సంగీత పరిషత్ ఆధ్వర్యంలో గ్రామంలోని లయన్స్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సినిమా పాటల పోటీ ఉర్రూతలూగించింది. పోటీలను వైఎస్సార్ సీపీ మండల యువజన కమిటీ అధ్యక్షుడు అంబటి రమేష్ ప్రారంభించారు. లయన్స్ ప్రతినిధి డాక్టర్ ఎంవీ సూర్యనారాయణరాజు జ్యోతి ప్రజ్వలన చేశారు. పాటల పోటీల అనంతరం కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. మద్రాసుకు చెందిన టేకీ బాలాజీ వయోలి న్ కచేరి రంజింపజేసింది. విజేతలను సంగీత పరిషత్ అ««దl్యక్షుడు సింగవరపు కోటేశ్వరరావు ప్రకటించారు. మొదటి బహుమతిని మంజుశ్రీ(నర్సాపురం), ద్వితీయ బహుమతిని పూర్ణిమ(కాకినాడ), తృతీయ బహుమతిని పావని(చిలకలూరిపేట), 4వ బహుమతిని శృతి (హైదరాబాద్), 5వ బహుమతిని బాలాదిత్య(ఆకివీడు), ఆరో బహుమతిని ప్రియాంక(ఆకివీడు), ఏడో బహుమతిని మాధవి అందుకున్నారు. న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ కొణాడ అశోక్ సత్య, భోగిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. సరిగమ పురస్కారాల అందజేత ఇది ఇలా ఉండగా సంగీత పరిషత్ ఆధ్వర్యంలో సరిగమ పురస్కారాలను సినీనటుడు వి.సాయికిరణ్, పారిశ్రామిక వేత్త కేఏ సూర్యనారాయణ రాజులకు అందజేశారు. సరిగమ కళా సత్కారాన్ని హాస్యనటుడు జబర్దస్త్ అప్పారావు, పులగం చిన్నారాయణ, బాలాజీ టేకే, గాయకుడు చంద్రతేజ, రంగస్థల నటుడు తాళాబత్తుల వెంకటేశ్వరరావు, చించినాడ సత్యకుమార్, ఉపాధ్యాయులు ముదునూరి శివరామరాజు, మెడవంకల రత్నకుమార్‌లు అందుకున్నారు. కార్యక్రమంలో పౌరాణిక దర్శక బ్రహ్మ, నంది అవార్డు గ్రహీత పువ్వాడ ఉదయ భాస్కర్, పరిషత్ అధ్యక్షుడు సింగవరపు కోటేశ్వరరావు, కొల్లి వెంకన్నబాబు, మహ్మద్ మదనీ, డాక్టర్ ఎస్.రామరాజు, గుండా రామకృష్ణ, పోశంశెట్టి మురళీ, జుంగా దాసు, జగ్గురోతు విజయ్, పుప్పాల పండు, మహ్మద్ జక్కీ, కందుల సత్యనారాయణ పాల్గొన్నారు. -
రేషన్న్ షాపులపై విజిలెన్స్ దాడులు
ఆకివీడు : రేషన్ షాపులపై బుధవారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. స్థానిక రైల్వేస్టేనన్‌న్స్ షన్ రోడ్డులోని 22,23 నంబర్ల షాపుల్లో రికార్డులు, సరుకు నిల్వలను పరిశీలించారు. 22వ నంబర్ షాపులో 64 కేజీల బియ్యం తక్కువగా ఉందని, పంచదార 15 కేజీలు, కిరోసిన్ 301 లీటర్లు రికార్డుల్లో చూపించిన దానికన్నా అదనంగా ఉందని విజిలెన్స్ తహసీల్దార్ శైలజ వెల్లడించారు. షాపునంబర్ 23లో 55 కేజీల బియ్యం, 391 లీటర్ల కిరోసిన్ అదనంగా ఉన్నాయని వివరించారు. ఈ రెండు షాపుల డీలర్లు రాజామణి, వి.వి.ఎస్.శంకర్ వర్మలపై 6ఏ కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. తనిఖీల్లో పుడ్ ఇన్స్ స్పెక్టర్ సీతారామ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, వీఆర్వో రత్నరాజు పాల్గొన్నారు. -
సినీ ఫక్కీలో చోరీ
ఆకివీడు: సినీ ఫక్కీలో చోరీకి పాల్పడిన సంఘటన శుక్రవారం రాత్రి ఆకివీడులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆకివీడులోని ఇండియన్ మెడికల్ హాల్ వీధిలోని ఓ ఇంట్లో మల్లారెడ్డి సత్యనారాయణ(కరణం) కుటుంబం నివాసం ఉంటోంది. వీరంతా ఇంటికి తాళం వేసి శుక్రవారం ఉదయం ఊరువెళ్లారు. ఇదే అదనుగా రాత్రి 2 గంటల సమయంలో ఓ దొంగ ఇంట్లో చొరపడేందుకు ప్రయత్నించాడు. ఇనుప ఊసలు, మడత మంచం ఊసతో తాళాన్ని పెకిలించే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. దీంతో ఎదురుగా ఉన్న ఇంటి గోడ దూకి పూల మొక్కల వద్ద బలమైన ఇనుప ఊసలు ఉన్నాయేమోనని వెతికాడు. సుమారు 15 నిమిషాలపాటు ఆ ఇంటి ఆవరణలో ఇనుప రాడ్డు కోసం ప్రయత్నించి చివరకు పూల మొక్కకు సపోర్టుగా ఉన్న రాడ్డును పీకి సత్యనారాయణ ఇంటి తాళం పగులకొట్టి లోనికి ప్రవేశించాడు. బీరువాలోని రూ.12 వేలు నగదు, కాసు బంగారు ఆభర ణాలు అపహరించాడు. స్థానికులు శనివారం వేకువజామున చోరీ జరిగినట్టు గుర్తించి సత్యనారాయణకు ఫోన్లో సమాచారం అందించారు. దొంగ ఇనుప రాడ్డు తీసుకువచ్చిన ఇంట్లో సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా చోరీ విషయం బయటపడింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. -
ప్రైవేటు టెన్త్ విధానం రద్దు : డీఈవో
ఆకివీడు : ప్రైవేటుగా పదో తరగతి పరీక్షలు రాసే విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని జిల్లా విద్యాశాఖాధికారి దుక్కిపాటి మధుసూదనరావు చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్ఆర్ఐ సహకారంతో నిర్మించిన భోజన హాలును గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పాఠశాలల అభివృద్ధికి దాతలు నడుంకట్టాలన్నారు. ఎన్ఆర్ఐ దాత కంభంపాటి వెంకట లక్ష్మీ నర్శింహం తన తండ్రి ఇదే పాఠశాలలో చదివి, ఇదే పాఠశాలలో పనిచేశారని, తాను కూడా ఇదే పాఠశాలలో చదివానని చెప్పడం ఎంతో గర్వంగా ఉందన్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ గుర్తింపు పొందని పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులు జిల్లా ఉమ్మడి పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలోని 11,836 మంది ఉపాధ్యాయులకు 11,050 మంది సర్వీసులను ఆన్లైన్లో పొందుపరిచామని చెప్పారు. మిగిలిన 785 మంది సర్వీసు రిజిస్టర్లు ఆన్లైన్ చేయించుకోకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 9వ తరగతి వరకూ చదివే ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు ఒకే పరీక్షా పత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. పదో తరగతిలో రెండేళ్లపాటు ఇంటర్నల్ మార్కులు 20 శాతం పబ్లిక్ పరీక్షా మార్కుల్లో కలుపుతామని చెప్పారు. ఈ ఏడాది ఎనిమిదో తరగతికి ఐదు శాతం, వచ్చే ఏడాది 9వ తరగతికి 5 శాతం, ఆ పై వచ్చే ఏడాది పదవ తరగతికి పది శాతం ఇంటర్నల్ మార్కులు కలుపుతామని డీఈవో చెప్పారు. అలా మొత్తం 20 శాతం మార్కులు అవుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో డీవైఈవో మద్దూరి సూర్యనారాయణమూర్తి, ఎంఈఓ సత్యానంద్, సీఎంఓ కె.కృష్ణారావు, హెచ్ఎం రాజరాజేశ్వరి, జెడ్పీటీసీ సభ్యులు మన్నే లలితాదేవి, ఎంపీపీ నౌకట్ల రామారావు, సర్పంచ్ గొంట్లా గణపతి, ఎంపీటీసీ సభ్యులు బొల్లా వెంకట్రావు, యజమాన్య కమిటీ చైర్మన్ దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు టెన్త్ విధానం రద్దు : డీఈవో
ఆకివీడు : ప్రైవేటుగా పదో తరగతి పరీక్షలు రాసే విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని జిల్లా విద్యాశాఖాధికారి దుక్కిపాటి మధుసూదనరావు చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్ఆర్ఐ సహకారంతో నిర్మించిన భోజన హాలును గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పాఠశాలల అభివృద్ధికి దాతలు నడుంకట్టాలన్నారు. ఎన్ఆర్ఐ దాత కంభంపాటి వెంకట లక్ష్మీ నర్శింహం తన తండ్రి ఇదే పాఠశాలలో చదివి, ఇదే పాఠశాలలో పనిచేశారని, తాను కూడా ఇదే పాఠశాలలో చదివానని చెప్పడం ఎంతో గర్వంగా ఉందన్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ గుర్తింపు పొందని పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులు జిల్లా ఉమ్మడి పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలోని 11,836 మంది ఉపాధ్యాయులకు 11,050 మంది సర్వీసులను ఆన్లైన్లో పొందుపరిచామని చెప్పారు. మిగిలిన 785 మంది సర్వీసు రిజిస్టర్లు ఆన్లైన్ చేయించుకోకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 9వ తరగతి వరకూ చదివే ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు ఒకే పరీక్షా పత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. పదో తరగతిలో రెండేళ్లపాటు ఇంటర్నల్ మార్కులు 20 శాతం పబ్లిక్ పరీక్షా మార్కుల్లో కలుపుతామని చెప్పారు. ఈ ఏడాది ఎనిమిదో తరగతికి ఐదు శాతం, వచ్చే ఏడాది 9వ తరగతికి 5 శాతం, ఆ పై వచ్చే ఏడాది పదవ తరగతికి పది శాతం ఇంటర్నల్ మార్కులు కలుపుతామని డీఈవో చెప్పారు. అలా మొత్తం 20 శాతం మార్కులు అవుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో డీవైఈవో మద్దూరి సూర్యనారాయణమూర్తి, ఎంఈఓ సత్యానంద్, సీఎంఓ కె.కృష్ణారావు, హెచ్ఎం రాజరాజేశ్వరి, జెడ్పీటీసీ సభ్యులు మన్నే లలితాదేవి, ఎంపీపీ నౌకట్ల రామారావు, సర్పంచ్ గొంట్లా గణపతి, ఎంపీటీసీ సభ్యులు బొల్లా వెంకట్రావు, యజమాన్య కమిటీ చైర్మన్ దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు.