Akka
-
వెబ్ ఎంట్రీ
కీర్తీ సురేష్, రాధికా ఆప్టే ప్రధాన తారాగణంగా పీరియాడికల్ రివేంజ్ థ్రిల్లర్‌గా ‘అక్క’ వెబ్‌సిరీస్ రూపొందుతోంది. ధర్మరాజ్ శెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఆదిత్యా చోప్రా ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ మొదలైనట్లు బాలీవుడ్ సమాచారం. ‘‘ఇందులో కీర్తీసురేష్, రాధికా ఆప్టే పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. వీక్షకులను ఆకట్టుకునేలా ఈ సిరీస్ సాగుతుంది’’ అనియూనిట్ పేర్కొంది. కాగా కీర్తీ సురేష్‌కు తొలి ఓటీటీ ప్రాజెక్ట్ ‘అక్క’. వరుణ్ధావ¯Œ హీరోగా నటిస్తున్న ఓ బాలీవుడ్ సిని మాలో Mీ ర్తి ఓ హీరోయి¯Œ గా నటిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. -
మంచు లక్ష్మీ పేరు మార్చుకుంటుందట..!
స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి.., టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మంచు లక్ష్మీ ప్రసన్న. నటిగానే కాదు నిర్మాతగానూ, బుల్లితెర యాంకర్ గానూ ఆకట్టుకుంటున్న లక్ష్మీ ప్రసన్నకు ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఎక్కువగా మంచువారమ్మాయిని అక్క అని సంబోధిస్తుంటారు జనాలు. కొంత మంది సరదాగా అక్కా అని పిలుస్తే.., మరి కొంత మంది గౌరవంతో పిలుస్తున్నారు. ఇన్నాళ్లు ఆ పిలుపును సరదాగానే తీసుకున్న లక్ష్మీ ప్రసన్నకు గత వారాంతంలో ఎదురైన అనుభవం చిరాకు తెప్పించింది. దీంతో తన సోషల్ మీడియా పేజ్‌లో అక్క అన్న పిలుపుపై ఘాటుగా స్పందించింది. 'ఓ పళ్లు లేని ముసలాయన అక్కా అని పిలవటంతో నేను నా పేరును అక్క అని మార్చుకోవాలని నిర్ణయించుకున్న. అక్క తొక్కా' అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు ఆ పిలుపు తనకు ఎంత చిరాకు తెప్పించిందో రకరకాల ఎమోట్ ఐకాన్ల రూపంలో చూపించింది. మరి లక్ష్మీ మెసేజ్ చూసాక అయినా జనాలు అక్క అని పిలవటం మానేస్తారేమో చూడాలి. I'm seriously contemplating to changing my name to AKKA after an old man(w no teeth) over the weekend called me that.