Aksharabhyasam
-
సీ ఫర్ కలెక్టర్... సీ ఫర్ క్రియేటివిటీ
‘తీరిక లేనంత పనుల్లో బిజీగా ఉన్నాను’ అని చెప్పడం సులభం. ‘తీరిక చేసుకోవడం’ మాత్రం కష్టం. అయితే కొన్ని ఇష్టాలు ఆ కష్టాన్ని దాటి కాలాన్ని మనకు అప్పగిస్తాయి. కలెక్టర్‌గా తీరికలేనంత పనుల్లో తలమునకలైప్పటికీ తనలోని క్రియేటివిటీని కాపాడుకుంటున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి కోయ, ఉర్దూ భాషలు నేర్చుకుంది. వ్యక్తిత్వ వికాస కోణంలో పిల్లల పాటలు రాస్తోంది. ఉద్యోగ బాధ్యతలకు సృజనాత్మకత జోడిస్తోంది.దేశంలో ఏ అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లినా ‘ఏ అంటే ఆపిల్, బీ అంటే బాల్’ అని చదువుతారు పిల్లలు. కరీంనగర్లో అలా కాదు. ‘ఏ ఫర్ యాక్టివ్. బీ ఫర్ బ్రైట్. సీ ఫర్ క్రియేటివ్’ అంటూ ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్‌కు సరికొత్త పదాలతో పాడుతారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ పాట రాశారు. ఐదేళ్ల క్రితం తన కుమారుడు నైతిక్ పుట్టినప్పుడు మదిలో మెదిలిన పాటకు ఆమె అక్షర రూపం ఇచ్చారు. ఇదే పాటను తన కుమారుడికి నేర్పించే క్రమంలో కలెక్టరేట్ సిబ్బందికి కొత్తగా అనిపించింది. ‘పాట సృజనాత్మకంగా ఉంది. పిల్లలు ఆసక్తిగా నేర్చుకుంటారు. ఈ పాటని జిల్లాలోని అన్ని అంగన్ వాడీ సెంటర్లలో పిల్లలకు నేర్పిస్తే బాగుంటుంది’ అని అడిగారు. అందుకు సత్పతి సరే అన్నారు.ఆక్షరాలే ఆట పాటలై...అప్పటికే అంగన్ వాడీల బలోపేతంపై పమేలా సత్పతి దృష్టి సారించారు. చిన్నారులకు పోషకాహారం లోపం రాకుండా బలవర్ధ్దక ఆహారంతో పాటు ఆటపాటలతో కూడిన చదువును అందించాలనుకున్నారు. ఇటీవల ‘ఏ ఫర్ యాక్టివ్’ పాటను వీడియో రూపంలో విడుదల చేశారు. పిల్లలకు ఈ పాట ఎంతో నచ్చి ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. ఇది కేవలం పాట మాత్రమే కాదు..పాట రూపంలో ఎన్నో విషయాలను పిల్లలకు సులభంగా చెబుతున్న పాఠం.బహు భాషలలో శభాష్ అనిపించుకుంటూ...‘ఇది చాలు’ అనుకునే వాళ్లు ఉన్నచోటే ఉండిపోతారు. ఇంకా ఏదో తెలుసుకోవాలి...అనే తపన ఉన్న వాళ్లు ఎంతో ముందుకు వెళతారు. కలెక్టర్ పమేలా రెండో కోవకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలని తపించే జ్ఞానపిపాసీ. ఆమె మాతృభాష ఒడియా. హిందీ, ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడుతారు. తెలుగు రాయగలరు, చదవగలరు. బాధలు తెలుసుకోవడానికి కోయ భాష నేర్చుకుంది...భద్రాచలంలో పనిచేసే సమయంలో అక్కడ గిరిజనుల బాధలు వారి నోట నుంచి తెలుసుకునేందుకు కోయ భాష నేర్చుకున్నారు పమేలా. అంతేకాదు...కోయ భాషలో పాటలు రాసే స్థానిక రచయితలనుప్రాంపోత్సహించి ఎన్నో ఆల్బమ్‌లు రూపొందించి విడుదల చేయించారు. కరీంనగర్‌కు వచ్చాక ఆమెకు ఉర్దూ నేర్చుకోవాలనే ఆసక్తి కలిగింది. అనుకున్నదే తడవుగా ట్యూటర్‌ను వెదికారు. ఉర్దూలో అక్షరాలు నేర్చుకుని బేసిక్ కోర్సు పూర్తి చేశారు. ‘మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ’ నుంచి ఉర్దూలో డిప్లమా చేశారు. భవిష్యత్‌లో మరిన్ని కోర్సులు చేసి ఉర్దూలో ప్రావీణ్యాన్ని సాధించాలనుకుంటున్నారు. తెలంగాణలో నిజాం రాజుల కాలంలో రాసిన రెవెన్యూ రికార్డులు ఉర్దూలోనే ఉన్నాయి. అలాంటి వాటిని చదివి అర్థం చేసుకుంటే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉర్దూ నేర్చుకోవడమే కాదు తెలుగు గొలుసు రాతను అధ్యయనం చేస్తున్నారు పమేలా సత్పతి.‘సృజనాత్మక కళలు, ఉద్యోగ నిర్వాహణ బాధ్యతలు ఒకే ఒరలో ఇమడవు’ అని అపోహ పడేవారికి కలెక్టర్ పమేలా సత్పతి రాసిన పాట....మేలుకొలుపు మాట. ‘కచ్చితంగా సాధ్యమే’’ అని బలంగా చెప్పే మాట.‘సృజన మానసికవికాసానికే కాదు...అభివృద్ధికి కూడా’ అని చెప్పే బంగారు బాట. వారి మనసు చదవాలంటే...నాకు ఏప్రాంపాంతంలో పనిచేసినా ఆప్రాంపాంత ప్రజల భాష, సంస్కృతి, సంప్రదాయల గురించి తెలుసుకోవడం ఇష్టం. వారి సంస్కృతి, సంప్రదాయాలతో మమేకం అయినప్పుడే వారి హృదయాలను అర్థం చేసుకోగలం. సమస్యలను పరిష్కరించగలం. ప్రతిప్రాంపాంతానికి తనదైన విశిష్ఠత ఉంటుంది. ఆ విశిష్ఠతను అభిమానించడం అంటే ఇష్టం. చాలామంది పేదప్రజలకు మాతృభాష తప్ప వేరే భాష రాకపోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజల సేవ కోసం వచ్చే అధికారులకు బహు భాషలతో పరిచయం అవసరం. వారి భాషను అర్థం చేసుకోగలిగితే వారి సమస్యను లోతుగా అర్థం చేసుకోగలం.– పమేలా సత్పతి, కలెక్టర్, కరీంనగర్– భాషబోయిన అనిల్‌కుమార్‘సాక్షి’ ప్రతినిధి, కరీంనగర్ -
Basara Temple: చదువుల తల్లి నిలయంగా వెలుగొందుతూ..
బాసర(ముధోల్): దేశంలోనే రెండో సరస్వతీ దేవి ఆలయంగా బాసర పుణ్యక్షేత్రం అలరారుతోంది. గోదావరినది ఒడ్డున ఆధ్యాత్మిక వాతావరణంలో కొలువుదీరిన ఈ క్షేత్రంలో అమ్మవారు నిత్యం పూజలందుకుంటారు. పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షి తపస్సు చేస్తే జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వేదవ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ల ఇసుక తీసుకువచ్చి సరస్వతి, లక్ష్మి, మహాకాళి దేవత మూర్తులను ప్రతిష్టించాడు. చాళక్యరాజులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. సరస్వతీ ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. జిల్లా కేంద్రం నుంచి 70 కిలోమీటర్లు దూరంలో హైదరాబాద్ నుంచి 205 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి నిత్యం మహారాష్ట్ర, నిజామాబాద్, నాందేడ్, ధర్మాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. రైలుమార్గం గుండా కూడా బాసరకు చేరుకోవచ్చు. మూడు గుప్పెళ్ల ఇసుకతో.. వ్యాసుడు గోదావరినది నుంచి మూడు గుప్పెళ్లతో ఇసుకను తెచ్చి మూడు విగ్రహాలను తయారు చేశా డు. ఇక అప్పటి నుంచి వ్యాసపురి, వాసర, అటుపై బాసరగా మార్పు చెందింది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు చేస్తారు. ఇసుకతో ఏర్పాటు చేసిన విగ్రహాలు ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషం. ఇక విగ్రహాలపై ఉన్న పసుపును భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఈ ప్రసాదం వల్ల విజ్ఞానం లభిస్తుందని భక్తుల విశ్వాసం. దీన్ని బండారా అంటారు. వాల్మీకి మహర్షి ప్రతిష్ఠించినట్లుగా.. వాల్మీకి మహర్షి ఇక్కడ రామాయణం రాయడానికి ముందు సరస్వతీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి రామాయణం రాసాడని మరో ప్రతీతి. ఈ గుడికి సమీపంలో వాల్మీకి మహర్షి సమాధి, పాలరాతి శిల్పాలు ఉన్నాయి. ఈ గుహకు దగ్గరగా ఒక గుహ ఉంది. ఈ గుహపై మాలుకుడు అనే మహర్షి తపస్సు చేసినట్లు చెబుతారు. ఇక్కడ ఉన్న ఒక పెద్ద రాతిగుండును తడితే మరోవైపు ఒక్కో శబ్ధం వస్తుంది. ఈ రాతి గుండు లోపల సీతమ్మవారి నగలు ఉన్నట్లు స్థానికులు చెబుతుంటారు. (క్లిక్ చేయండి: అలాంటి పిచ్చి డ్యాన్స్‌లు వద్దు.. గౌరమ్మ తల్లి గౌరవం కాపాడుదాం!) చాళక్యుల కాలంలో.. ప్రధాన దేవాలయాన్ని చాళక్యుల కాలంలో నిర్మించినట్లు ఆధారాలు లభించాయి. మందిరంలో శిల్ప సంపద లేకపోయినా పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి. ప్రధాన దేవాలయానికి తూర్పు భాగంలో దత్తమందిరం ఉంది. ఇక్కడ దత్త పాదుకలను చూడవచ్చు. దీనికి దగ్గర్లోనే మహాకాళి దేవాలయం ఉంది. అటుపై ఇక్కడే ఉన్న వ్యాసమందిరంలో వ్యాసభగవానుడి విగ్రహం, వ్యాస లింగాన్నీ చూడవచ్చు. మాఘశుద్ధ పంచమినాడు సరస్వతీ దేవి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. నిజామాబాద్, భైంసా నుంచి నిత్యం పదుల సంఖ్యలో బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. -
ఘనంగా వసంత పంచమి
బెల్లంపల్లి : వసంత పంచమిని పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో సోమవారం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. పాఠశాల ఆవరణలోని సరస్వతీ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. తల్లిదండ్రులు చిన్నారులను తీసుకువచ్చి అక్షరాభ్యాసం చేయించారు. వేద పండితులు చిన్నారుల చిట్టి చేతులతో అక్షరాలు దిద్దించారు. భారీగా తరలివచ్చిన చిన్నారులతో శ్రీ సరస్వతీ శిశుమందిర్ సందడిగా మారింది. అనంతరం అక్షరాభ్యాసం చేయించిన తల్లి దండ్రులకు తీర్థ ప్రసాదాలను అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శరణాలయంలో అక్షరాభ్యాసం... తాండూర్ : వసంత పంచమి సందర్భంగా మండల కేంద్రంలోని సేవాజ్యోతి శరణాలయంలో వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వనితా క్లబ్ సభ్యులు చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ జిల్లా సంయుక్త కార్యదర్శి మాచుకారి సంతోష్, వనితా క్లబ్ మండల అధ్యక్షురాలు రాచర్ల వాణి, ప్రధాన కార్యదర్శి బోనగిరి కవిత, కోశాధికారి పుల్లూరి రమ్య, శరణాలయం వ్యవస్థాపకులు గజ్జెల్లి శ్రీదేవి, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు. -
19న శ్రీశైలంలో సామూహిక అక్షరాభ్యాసం
శ్రీశైలం: శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల సన్నిధిలో సోమవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వారి సూచనల మేరకు అక్షరదీవెన పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆసక్తిగల తల్లిదండ్రులు, సంరక్షకులు దేవస్థానం పరిపాలనా కార్యాలయంలోని శ్రీశైలప్రభ విభాగంలో బాలబాలికల వివరాలను ఆదివారం సాయంత్రం 7 గంటల్లోగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అక్షరాభ్యాసంలో పాల్గొనే చిన్నారులకు పలక, బలపం ఉచితంగా బహూకరిస్తామన్నారు. -
ఈ ఏడాది అక్షర దీవెన లేదా..?
కడప కల్చరల్ : పేద, బడుగు వర్గాల పిల్లలకు విద్య పట్ల ఆసక్తి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా అక్షర దీవెన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రతి జూన్ మాసంలో పాఠశాలలు ప్రారంభించిన సందర్భంగా వారం నుంచి పదిహేను రోజులలోపుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేది. ఇందులో భాగంగా స్థానిక దేవాదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో జిల్లా అంతటా ఎంపిక చేసిన దేవాలయాలలో అనుకున్న ముహూర్తానికి ఒకే సమయంలో ఆ చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం చేయించేవారు. దీనికి ప్రభుత్వం పెద్దగా నిధులు ఇచ్చేది కూడా లేదు. దేవాదాయశాఖ ఈఓలు తమతమ ఆలయాల పరిధిలో దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్విహ స్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన దేవాలయాల చుట్టుపక్కల మూడు నుంచి ఐదు సంవత్సరాలలోపు చిన్నారులను సమీకరించి ఆరోజున ఆలయంలో సరస్వతిమాత పూజ నిర్వహించి అర్చకులతో శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం చేయించేవారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు, చిన్నారులకు విద్య పట్ల ఆసక్తి కలుగుతుంది. ఈ కార్యక్రమం విజయవంతం అవుతుండడంతో నాలుగేళ్లుగా ఉత్సాహ భరితంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అవసరమైన పలకలు, బలపాలు, పుస్తకాలు, పెన్సిళ్లను స్థానిక దాత లు ఉచితంగా అందజేసేవారు. మరికొందరు దాతలు తీర్థ ప్రసాదాలను అందజే సేవారు. మొత్తంపై ప్రభుత్వానికి ప్రత్యేకించి ఖర్చంటూ ఏమీ లేకపోయినా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నిర్వహించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. జిల్లా అంతటా ఈ కార్యక్రమం కోసం పేద, బడుగు వర్గాల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకించి పెద్దగానిధులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు గనుక దాతల సహకారం తప్పక ఉంటుంది గనుక ఇకనైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. ఆదేశాలు లేవు.. అక్షర దీవెన నిర్వహిస్తున్న మాట నిజమే. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన కూడా ఉంది. ఈ సంవత్సరం పలు కార్యక్రమాల ఒత్తిడితో ప్రభుత్వం ఇంకా ఆదేశాలు జారీ చేయలేదు. వీలైనంత త్వరలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కృషి చేస్తాం. - శంకర్‌బాలాజీ, అసిస్టెంట్ కమిషనర్, జిల్లా దేవాదాయశాఖ కడప -
సామూహిక అక్షరాభ్యాసాలకు విశేష స్పందన
నరసరావుపేటరూరల్ : కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి పుణ్యక్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, భక్తిభావాన్ని పెంపొందిస్తామని సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. శుక్రవారం ఆలయ ఆవరణలో జరిగిన సామూహిక అక్షరాభ్యాసం, మహాసరస్వతి హోమంలో ఆయన పాల్గొన్నారు. చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించి ఆశ్వీరదించారు. అనంతరం త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ, ఏకాదశి సందర్భంగా శ్రీ మేధాదక్షిణామూర్తి పాదల చెంత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారభించామని, నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. జూలై 1నుంచి ప్రారంభించే వేదపాఠశాలలో 30 మంది విద్యార్థులకు, 8 రకాల కోర్సులను ఇక్కడ బోధిస్తామన్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంజూరు చేసిన రూ.4కోట్లతో భవనాలు నిర్మిస్తామని, టీటీడీ సహకారంతో కొండపై మొక్కలు నాటనున్నట్టు చెప్పారు. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి ఇతర జిల్లాల నుంచి తల్లిదండ్రులతో వచ్చిన 300 మంది చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. వారందరికీ పలక, బలపం, పెద్దబాలశిక్ష, సరస్వతీ అమ్మవారి రూపం, కంకణం, ప్రసాదాలు అందజేశారు. అనంతరం తల్లిదండ్రులు తమ చిన్నారులతో సరస్వతీ యాగంలో పాల్గొన్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రామకృష్ణ కొండలరావు బహదూర్, ఈవో శ్రీనివాసరావు, ఎం ఈవో జి.జయకుమార్, సీఆర్పీలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
సరస్వతీ నమోనమః
భక్తులతో పోటెత్తిన బాసర ⇒ వైభవంగా వసంతపంచమి వేడుకలు ⇒ పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ⇒ మొక్కులు తీర్చుకున్న భక్తులు ⇒ సుమారు 50వేల మంది రాక ⇒ 2,128 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు భైంసా/బాసర : చదువుల తల్లి సరస్వతీ క్షేత్రం బాసరలో శ్రీపంచమి(వసంత పంచమి) వేడుకలు శనివారం అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు సరస్వతీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, కలెక్టర్ దంపతులు, ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేష్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. వసంత పంచమిని పురస్కరించుకుని భక్తులు శనివారం వేకువజాము నుంచి దర్శనానికి బారులు తీరారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గంటల తరబడి నిరీక్షణ తప్పలేదు. వేకువజామున 3గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి కనిపించింది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి సమీపంలోని శివాలయంలో పూజలు చేశారు. గోదావరమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చారు. చల్లంగా చూడాలని వేడుకున్నారు. ఆలయంలో సరస్వతీ, మహాలక్ష్మీ, మహాంకాళి అమ్మవార్లను దర్శించుకున్నారు. పక్కనే ఉన్న వ్యాసమహార్షి ఆలయంలోనూ పూజలు చేశారు. చిన్నారులకు అక్షరశ్రీకార పూజలు జరిపించారు. వసంత పంచమి కావడంతో పెద్ద మొత్తంలోనే అక్షరాభ్యాస పూజలు జరిగాయి. చిన్నారులు, వారి కుటుంబ సభ్యులతో అక్షరాభ్యాస మండపాలు కిక్కిరిసిపోయాయి. మండపాల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో చిన్నపిల్లలు అవస్థలు పడ్డారు. ప్రసాద కౌంటర్లు, అభిషేకం టికెట్లు తీసుకునే కౌంటర్, అక్షరాభ్యాస టికెట్లు ఇచ్చే కౌంటర్ల వద్ద బారులు తప్పలేదు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో నిండుగా కనిపించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తుల తాకిడి మరింత పెరిగింది. రూ.100 అక్షరాభ్యాస మండపంలో 1,077 మంది చిన్నారులకు, రూ.1000 అక్షరాభ్యాస మండపంలో 1,051 మంది చిన్నారులకు అక్షరశ్రీకార పూజలు జరిగాయి. 106 రుద్రాభిషేకం, 939 మండప ప్రవేశం, 875 ప్రత్యేక దర్శనం టికెట్లు అమ్ముడుపోయాయి. ప్రసాదాలు, అతిథిగృహాలు, అక్షరాభ్యాసాలు ఇతర ఆదాయం కలిపి రూ. 15.50 లక్షల మేర వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు పూలతో అలంకరణ వసంత పంచమి సందర్భంగా అమ్మవారి ఆలయ గర్భగుడిని పూలతో అలంకరించారు. గర్భగుడి ప్రాంగణమంతా అరటి చెట్లతో అలంకరించారు. ఆలయం చుట్టూ విద్యుత్ దీపాలతో సెట్టింగు వేశారు. అక్షరాభ్యాస మండపాలను పూలతో సుందరంగా తీర్చిదిద్దారు. వీఐపీలకే గదులు వసంత పంచమి రోజున ఆలయంలో గదులను వీఐ పీలకే కేటాయించారు. సాధారణ భక్తులకు వసతి కో సం గదులు దొరకలేదు. దీంతో చేసేదేమీ లేక ప్రైవే టు లాడ్జిలను ఆశ్రయించారు. ఏసీ, నాన్ఏసీ గదులను ఎవరికీ ఇవ్వలేదు. భక్తుల తాకిడి పెరగడంతో వసతి కష్టాలు వెంటాడాయి. చలికాలం కావడంతో వచ్చిన వారంతా వసతి కోసం ఇబ్బందులు పడ్డారు. భక్తుల సేవలో.. బాసర ఆలయానికి వసంతపంచమి సందర్భంగా శనివారం రోజు 50 వేల మేర భక్తులు వచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాల ఎన్సీసీ వాలంటీర్లు సేవలు అందించారు. జిల్లా పోలీసు అధికారులు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. బాసర వెలమ సంఘం ఆధ్వర్యంలో వరుసలో ఉన్న చిన్నారులకు పాలు పంపిణీ చేశారు. క్యూలైన్లలో భక్తులకు నీటి ప్యాకెట్లు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి బలరాం పులిహోరా పంచిపెట్టారు. వాహనాలను అనుమతించలేదు... ఆలయ ప్రాంగణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఆలయానికి కొద్దిదూరంలో పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. పార్కింగ్ స్థలంలోనే వాహనాలను నిలిపివేయించారు. బాసర వచ్చే బస్సులను బస్టాండ్ వద్దే నిలిపి వేయించారు. ఆలయంలోకి బస్సులను అనుమతించలేదు. రైలు, బస్సుమార్గాల ద్వారా వచ్చిన భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకున్నారు.