19న శ్రీశైలంలో సామూహిక అక్షరాభ్యాసం | mass initiating on19th at srisailam | Sakshi
Sakshi News home page

19న శ్రీశైలంలో సామూహిక అక్షరాభ్యాసం

Published Sat, Jun 17 2017 10:10 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

mass initiating on19th at srisailam

శ్రీశైలం: శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల సన్నిధిలో సోమవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈఓ నారాయణ భరత్‌ గుప్త తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్‌ వారి సూచనల మేరకు అక్షరదీవెన పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు  చేశామన్నారు. ఆసక్తిగల తల్లిదండ్రులు, సంరక్షకులు దేవస్థానం పరిపాలనా కార్యాలయంలోని శ్రీశైలప్రభ విభాగంలో బాలబాలికల వివరాలను ఆదివారం సాయంత్రం 7 గంటల్లోగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అక్షరాభ్యాసంలో పాల్గొనే చిన్నారులకు పలక, బలపం ఉచితంగా బహూకరిస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement