Alert people
-
మొబైల్ అలర్ట్‌లతో ప్రాణాలు కాపాడేలా..
ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు మరణాలరేటు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మొబైల్ వినియోగదారులకు కాల్స్, టెక్ట్స్ రూపంలో అలర్టులు అందించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్ణయించింది. సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సొల్యూషన్స్(సీబీఎస్) ద్వారా టెలి కమ్యునికేషన్ విభాగం సాయంతో ఈ సేవల ప్రారంభించాలని యోచిస్తోంది. ఈమేరకు సంబంధిత శాఖలతో చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.దేశవ్యాప్తంగా భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడం, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్(సీఏపీ)తో స్థానిక ప్రజలకు మెసేజ్‌లు, కాల్స్ రూపంలో సలహాలు, సూచనలు అందించనున్నారు. దానివల్ల ప్రమాదం జరగడానికి ముందుగానే ప్రజలను అప్రమత్తం చేయవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ప్రజలకు ముందుగానే సమాచారం అందిస్తే అందుకు తగ్గట్టుగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. దాంతో ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: ఉచితాలు.. శాపాలు!ఐఎండీ, సీడబ్ల్యూసీ, ఎన్సీఎస్ వంటి కేంద్ర సంస్థల సహాయంతో ప్రభుత్వం ఈ అలర్టులు పంపే అవకాశం ఉందని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ సదుపాయం వల్ల అటవీ ప్రాంతాలు, సరైన మౌలిక సదుపాయాలు లేని ప్రదేశాల్లో నివసిస్తున్న వారికి ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండగా, గతేడాది పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరిలోని మొబైల్ వినియోగదారుల ద్వారా టెలి కమ్యునికేషన్ విభాగం ఈ అలర్టు సర్వీసును పరీక్షించింది. -
WELCOME 2024: కొత్త సంవత్సరమా మనిషిని మేల్కొలుపు
రోడ్డున ప్రమాదం చూస్తే సాయానికి పరిగెత్తి వెళ్లే మనిషిని, చుట్టూ చెడు జరిగితే మనకెందుకులే అనుకోని మనిషిని, ఇరుగింట్లో ఆర్తనాదాలకు చలించే మనిషిని, పొరుగింట్లో కష్టానికి హాజరయ్యే మనిషిని, ద్వేషమే జీవితంగా బతకని మనిషిని, ఒకరు బాగుపడితే సంతోషపడే మనిషిని, అడుగంటిపోయిన మానవత్వాన్ని జాగృతం చేసుకునే మనిషిని, మనిషి మీద నమ్మకం నిలిపే మనిషిని, ఓ కొత్త సంవత్సరమా మేల్కొలుపు. వద్దు. నమ్మాల్సిన చోట నేరం చేసే మనిషి వద్దు. భర్తగా ఉంటూ, భార్యగా ఉంటూ, స్నేహితుడిగా ఉంటూ, అత్త మామగా ఉంటూ, బంధువుగా ఉంటూ... వీరిని నమ్మొచ్చు, వీరిని కాకపోతే ఎవరిని నమ్ముతాం... అనుకున్న సందర్భంలో కూడా నేరం చేసి, ప్రాణం తీసి మనిషి మీద నమ్మకమే పోగొట్టిన– 2023లో చాలాసార్లు కనపడిన మనుషి– కొత్త సంవత్సరంలో వద్దు. ‘అయ్యో... నా గోడు ఎవరూ వినట్లేదే’ అని కన్నపిల్లలతో పాటు నిస్సహాయంగా వెళ్లి చెరువులో దూకే కన్నతల్లి వద్దు. ‘నా బాధ అమ్మానాన్నలు వినట్లేదే’నని హాస్టల్ ఫ్యాన్లకు వేళ్లాడే ముక్కుపచ్చలారని పిల్లలూ వద్దు. నలుగురు సంతానం ఉన్నా, మీ దగ్గర ఉంచుకుని నాలుగు మెతుకులు పెట్టండి చాలు అంటున్నా వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులను పడేసి వారిని బాధించే స్వార్థసంతానం వద్దు. సాకులు చెప్పే సంతానం వద్దు. ముఖ్యంగా– తల్లిదండ్రుల శాపం అందుకునే సంతానం వద్దు. జీవితమంటే అనుక్షణం డబ్బు సంపాదనే అనుకునే, ఎంత ఉన్నా సరిపోదనుకునే మనిషి వద్దు. అందుకు ఉద్యోగ బాధ్యతలను కలుషితం చేసే, ప్రజల భవిష్యత్తును బలి పెట్టే మనిషి వద్దు. కల్తీ చేసే మనిషి, విషం లాంటి ఆహారం అమ్మే, కూరనారలను రసాయనం చేసే మనిషి వద్దు. వ్యసనపరులుగా మార్చే ఉత్పత్తులను తయారు చేసే మనిషి వద్దు. అందుకు అనుమతించే ప్రభుత్వ నేతలూ వద్దు. వైద్యం తెలియని వైద్యుడు వద్దు. దైవభీతి పాపభీతి లేని వైద్యుడు వద్దు. రోగి మీద దయ, సానుభూతి లేని వైద్యుడు వద్దు. రోగుల అశ్రువులను అంతస్తులుగా చేసి ఆస్పత్రులు నిర్మించాలనుకునే వైద్యుడు వద్దు. చదువుల పేరుతో తల్లిదండ్రుల కడుపులో గంజిని కూడా తాగే విద్యావ్యవస్థల యజమాని కూడా వద్దు. మూర్ఖుడు వద్దు. మూకస్వభావము ఉన్నవాడూ వద్దు. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి సాటి మనిషిని ద్వేషించే వాడు వద్దు. బతకగోరని వాడు వద్దు. బతకనివ్వనివాడు వద్దు. అమాయకుల నుంచి లాక్కుని నింగినీ, నేలనూ మింగేసేవాడు వద్దు. ఉద్యోగుల గోడు వినని యజమాని వద్దు. పిలిస్తే పలకని పోలీసు వాడు వద్దు. న్యాయం వైపు నిలవని తీర్పు కూడా వద్దు. 2024 సంవత్సరమా... ఎన్నో ఆశలను కల్పిస్తూ అడుగిడుతున్న నూతన వత్సరమా... ఎంత జరిగినా ఏమి జరిగినా ‘మానవుడే మహనీయుడు’ అని నిరూపించే నిదర్శనాలను ఈ సంవత్సరం చూపు. మనిషిని మేల్కొలుపు. మనిషి తప్ప మరెవరూ ఈ జగతిని శాంతితో, కాంతితో నింపలేరు. కుడికాలు ముందు పెట్టి రా తల్లీ! -
కొత్తగా 10,158 కరోనా కేసులు నమోదు
-
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు..కేంద్ర అలర్ట్
-
నాలుగు రోజుల పాటు మండనున్న ఎండలు
-
చిత్తూరు జిల్లాలో కరోనా అలర్ట్
-
ముంపు ముప్పు ముంచుకొస్తోంది!
న్యూఢిల్లీ/వాషింగ్టన్: సముద్ర తీరప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ముంచుకొస్తోంది. ఇంకో 30 ఏళ్లలో ఒక్క భారత్‌లోనే సుమారు మూడున్నర కోట్లమంది ముంపు ముప్పును ఎదుర్కోనుండటం ఇందుకు కారణం. వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని చాలాకాలంగా తెలిసినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం ఇప్పటివరకూ తక్కువ అంచనా వేశాం. అమెరికాలోని క్లైమెట్ సెంట్రల్ జరిపిన తాజా అధ్యయనం పాత అంచనాలను మార్చేస్తోంది. గతంలో కంటే కనీసం ఐదు నుంచి పది రెట్లు ఎక్కువ స్థాయిలో నష్టం జరగనున్నట్లు చెబుతోంది. చైనాలో 9 కోట్లు, బంగ్లాదేశ్‌లో 4.3 కోట్ల మందికి ముంపు ముప్పు ఉందని హెచ్చరిస్తోంది. అధ్యయనంలోని ముఖ్యాంశాలు ► భూతాపోన్నతి ప్రభావం కారణంగా సముద్ర మట్టాలు ఎంత మేరకు పెరుగుతాయి? అదే సమయంలో తీరప్రాంతాల్లో నివసించే ప్రజల సంఖ్య ఎంత మేరకు ఎక్కువవుతుంది? అన్న రెండు అంశాల ఆధారంగా భవిష్యత్తు పరిణామాలను అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. ► ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల మంది తీరప్రాంత ప్రజలు ముంపు బారిన పడే చాన్సుంది. భారత్ విషయానికొస్తే.. సుమారు కోటిన్నర మంది ప్రజలు ఏటా వరద, ముంపు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ► ముంబై, నవీ ముంబై, కోల్‌కతాల్లో ఈ ప్రభావం చాలా ఎక్కువ. గత అంచనాల ప్రకారం ఈ సంఖ్య కేవలం 50 లక్షలు. ► 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం 11–16 సెంటీమీటర్లు పెరిగింది. కార్భన్ ఉద్గారాలను తీవ్రంగా తగ్గించినప్పటికీ ఈ శతాబ్దంలో సముద్ర మట్టం మరో 0.5 మీటర్లు పెరగనుంది. ► 2050నాటికి ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల మంది వార్షిక వరదల్లో మునిగిపోయే ప్రాంతాల్లో ఉండగా.. శతాబ్దం చివరినాటికి ఈ సంఖ్య 63 కోట్లను దాటనుంది. ఎత్తైన అల స్థాయిలో 25 కోట్లు ప్రపంచవ్యాప్తంగా గరిష్ట అలల ఎత్తుకంటే పదిమీటర్ల ఎక్కువ ఎత్తులో నివసిస్తోన్న తీరప్రాంత ప్రజలే వంద కోట్ల మంది ఉండగా.. మీటరు కంటే తక్కువ ఎత్తులో ఉండేవారే 25 కోట్ల మంది ఉన్నారు. వరదల ప్రభావానికి గురయ్యేవారిలో 70 శాతం మంది భారత్, చైనా, బంగ్లాదేశ్, వియత్నాం, ఇండోనేసియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, జపాన్ దేశస్తులేనని వెల్లడించింది. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
హన్మకొండ అర్బన్: రాష్ట్రంలో రానున్న రెండు, మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిసున్నందున జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి ఎన్.శివశంకర్ అన్నారు. వర్షాల నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ శివశంకర్ ఆదివారం సాయంత్రం జిల్లాకు వచ్చారు. సుబేదారి కలెక్టరేట్లో కలెక్టర్ అమ్రపాలి, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కమిషనర్ గౌతం, ఇతర అధికారులతో వర్షాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ జిల్లాలో ఇరిగేషన్, విద్యుత్, రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. చెరువులు పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. పునరావాస కేంద్రాలపై ప్రజలకు ముందే సమాచారం ఇవ్వాలని, కేంద్రాలు గుర్తించి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. కలెక్టర్ అమ్రపాలి మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాల ప్రభావం పెద్దగా లేదని, జిల్లాలోని 646 చెరువులకు ఇప్పటి వరకు 42 చెరువులు మాత్రమే నిండాయని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు 24 గంటలు స్థానికంగా అందుబాటులో ఉండాలని, వర్షాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. అవసరం మేరకు నగరంలోని లోతట్టు ప్రాంతాల వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్దం కావాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ వెంకారెడ్డి, వ్యవసాయశాఖ అధికారి ఉషాదయాళ్, ఆర్అండ్ బీ, పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలి జనగామ అర్బన్: జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ అన్నారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయనకు కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రెండు రోజులుగా జనగామ జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలను అధికారులు ముందే గుర్తించాలని, ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అలాగే పొంగే అవకాశం ఉన్న వాగుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ఆయా మండలాల తహసీల్దార్లతో నివేదిక తెప్పించుకోవాలని సూచించారు. సమావేశంలో జనగామ డీసీపీ మల్లారెడ్డి, ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, ఏసీపీ బాపురెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈ నాగేందర్, డీఏఓ వీరునాయక్, అధికారులు పాల్గొన్నారు. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వంగూరు : దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ పేర్కొన్నారు. వంగూరు మండలం జాజాలలో శనివారం దొంగతనం జరగడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. వరుసగా జరుగుతున్న దొంగతనాలను నివారించేందుకు సోమవారం ఎస్పీ జిల్లా పోలీసు అధికారులతో కలిసి వంగూరు పోలీసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వేసవికాలంలో దొంగతనాలు అధికంగా జరుగుతాయని చెప్పారు. చాలామంది ఇంట్లో బంగారు, నగదు ఉంచి పెళ్లిళ్లకు, విహార యాత్రలకు వెళ్లడం, ఇంటి మిద్దెలపై పడుకోవడం ఎక్కువ చేస్తుంటారని తెలిపారు. వీటిని ఆసరాగా తీసుకుని దొంగతనాలకు పాల్పడుతారని పేర్కొన్నారు. పోలీసులు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు సభలు, సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రతి గ్రామంలో దండోరా వేయిస్తామని సూచించారు. ముఖ్యంగా ఆయా గ్రామాలకు చెందిన యువత గస్తీ తిరిగితే బాగుంటుందని అన్నారు. ఇందు కోసం ముందుకు వచ్చే యువకులకు పోలీసు ఐడెంటీకార్డులు సైతం అందజేస్తామన్నారు. ప్రస్తుతం జిల్లాలో స్థానికేతరులే దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉందని, త్వరలోనే అందరినీ గుర్తించి, పట్టుకుంటామని తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ చెన్నయ్య, డీఎస్పీ ఎల్‌సీనాయక్, వెల్దండ సీఐ గిరికుమార్, వంగూరు, వెల్దండ, చారకొండ ఎస్ఐలు పాల్గొన్నారు. -
దూసుకొస్తున్న హెల్న్
=అప్రమత్తమైన యంత్రాంగం =తీర మండలాలకు ప్రత్యేకాధికారులు =పునరావాస కేంద్రాలు సిద్ధం =తీవ్రత మేరకు తరలింపునకు చర్యలు =వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి రావాలని పిలుపు విశాఖ రూరల్, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను బీభత్సాన్ని మరిచిపోనే లేదు. ఇంతలో జిల్లాపై హెలెన్ తుపాను పడగెత్తింది. శరవేగంగా దూసుకొస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా సమర్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. తీరప్రాంత గ్రామాలు, లోతట్టు, ముంపు ప్రాంతాలపై దృష్టి సారించారు. ఇటీవల అల్పపీడనం వర్షాలతో నష్టపోయిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నష్ట తీవ్రతను తగ్గించేందుకు కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నంబర్ 1800-4250-0002ను అందబాటులో ఉంచారు. ప్రతీ మండల కేంద్రంలోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో మండలానికి ఒక్కో ప్రత్యేకాధికారిని నియమించారు. వారు అక్కడే ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.తీరమండలాల్లోని ప్రత్యేకాధికారులు ఆయా ప్రాంతాల్లో మకాం వేశారు. తుపాను ప్రభావం తగ్గేంత వరకు వారు మండలాల్లోనే ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి రావాలని సూచించారు. 66 గ్రామాలపై దృష్టి తీర ప్రాంతంలోని 66 గ్రామాలపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం మచిలీపట్నం వద్ద తుపాను కేంద్రీకృతమైనందున తూర్పుగోదావరి జిల్లా వరకు ప్రభావం అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లోని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అవసరం మేరకు జిల్లాకు రప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పునరావాస కేంద్రాలు సిద్ధం జిల్లాలో పునరావాస కేంద్రాలు మరోసారి తెరుచుకున్నాయి. గ్రామీణంలో 110 వరకు ఉన్నాయి. వీటిలో కొన్ని మరమ్మతులకు గురయ్యాయి. సక్రమంగా ఉన్న వాటిని అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని వారిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తరలింపునకు వాహన సదుపాయం కల్పిస్తున్నారు. తరలించిన వారికి ఆహారం, వైద్యం, ఇతర సౌకర్యాల కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నారు. జలాశయాలపై దృష్టి భారీ వర్షాలు కురిస్తే జలాశయాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరే అవకాశముంది. దీంతో అధికారులు జలాశయాల నీటి మట్టాలపై దృష్టి సారించారు. ఇటీవల భారీ వర్షాలప్పుడు మాదిరి చర్యలు చేపడుతున్నారు. జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో ఏమేరకు ఉంటే అదే స్థాయిలో అవుట్‌ఫ్లో ఉండేలా చూడాలని నీటి పారుదల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు నీటి మట్టాలను పరిశీలించాలని, గేట్లు ఎత్తడానికి ఆరు గంటల ముందుగా కింది గ్రామాలకు సమాచారం అందించాలని సూచించారు.