Aligarh University students
-
వందేళ్ల చరిత్ర గలిగిన అలీగఢ్ విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ!
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన అలీగఢ్ ముస్లీం విశ్వవిద్యాలయానికి తొలి మహిళ వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ నైమా ఖాతూన్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో విద్యామంత్రిత్వశాఖ ఖాతూన్ని వీసీగా నియమించింది. దీంతో అలీఘఢ్ విశ్వవిద్యాలయం మహిళా వైస్ ఛాన్సలర్‌ని కలిగి ఉన్న మూడవ కేంద్రీయ విశ్వవిద్యాలయంగా అవతరించింది. ఈ విశ్వవిద్యాలయం 123 ఏళ్ల చరిత్రలో ఈ పదవికి నియమితులైన తొలి మహిళ ఖాతూన్. అయిదేళ్ల పాటు ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. నైమా ఖాతూన్ అలీగఢః విశ్వవిద్యాలయం నుంచే మనస్తత్వ శాస్త్రంలో పీహెచ్డీ చేశారు. 1988లో అదే విభాగంలో లెక్చరర్‌గా తన ప్రస్థానం ప్రారంభించారు. క్రమంగా ఏప్రిల్ 1998లో అసోసీయేట్ ప్రొఫెసర్‌గా, ఆ తర్వాత 2006లో పూర్తి స్థాయిలో ప్రొఫెసర్‌గా మారారు. ఆమె డిపార్ట్మెంట్ ప్రొఫెసర్, చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. ఆమె సైకాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్‌గా, చైర్‌పర్సన్‌గా పనిచేయడాని కంటే ముందు 2014లో మహిళా కాలేజ్ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తించారు. అలాగే ఆమె నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ రువాండా, సెంట్రల్ ఆఫ్రికాలో ఒక ఏడాది పాటు ప్రొఫెసర్‌గా బోధించారు. ఆమె అలీగఢ్ విశ్వవిద్యాలయంలో వివిధ అడ్మినిస్ట్రేటివ్ పాత్రలలో కూడా పనిచేశారు, రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్, డిప్యూటీ ప్రొక్టర్, ఇందిరా గాంధీ హాల్ అండ్ అబ్దుల్లా హాల్ రెండింటిలోనూ ప్రోవోస్ట్‌గా పనిచేశారు. ఆమె సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ, అలీగఢ్ విశ్వవిద్యాలయాల్లో డాక్టోరల్ వర్క్ నిర్వహించారు. అంతేగాక తన పరిశోధన పత్రాలను యూనివర్శిటీ ఆఫ్ లూయిస్విల్లే (USA), యూనివర్శిటీ ఆఫ్ ఆల్బా యూలియా (రొమేనియా), చులాలాంగ్‌కార్న్ విశ్వవిద్యాలయం (బ్యాంకాక్), ఇస్తాంబుల్ (టర్కీ, స్టన్ (USA) రెండింటిలోని హోలింగ్స్ సెంటర్లో సమర్పించారు. అంతేగాదు నైమా రచయిత, పరిశోధకురాలిగా రెండు పుస్తకాలను కూడా రచించారు. అలాగే ఆమె రచించిన క్లినికల్, హెల్త్, అప్లైడ్ సోషల్,ఆధ్యాత్మిక సైకాలజీ వాటికి సంబంధించిన పత్రాలను జాతీయ, అంతర్జాతీయ జర్నల్లలో ప్రచురితమయ్యాయి. వృత్తిలో అల్ రౌండ్ ఎక్సలెన్స్ పరంగా నైమా ఖాతూన్ పాపా మియాన్ పద్మ భూషణ్ బెస్ట్ గర్ల్ అవార్డు వరించింది. (చదవండి: వారానికి పది గంటలే పని..ఏడాదికి ఏకంగా రూ. 80 లక్షలు..!) -
పాశవిక హత్యపై ప్రకంపనలు
అలీగఢ్ (యూపీ)/ముంబై: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చిన్నారిని పాశవికంగా హత్య చేయడంపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 30వ తేదీన జరిగిన ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఓ వ్యక్తి రూ.10 వేలు అప్పు తీర్చలేదనే కారణంతో దుండగులు అభం శుభం తెలియని అతడి కుమార్తె (రెండున్నరేళ్లు)ను గొంతు పిసికి, కనుగుడ్లు పెరికి చంపి చెత్తకుప్పలో పారేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తునకు యూపీ ప్రభుత్వం ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసింది. టప్పల్ పట్టణానికి చెందిన రెండున్నరేళ్ల బాలిక మే 30వ తేదీన కనిపించకుండాపోయింది. దీంతో మరుసటి రోజు అంటే మే 31వ తేదీన ఆమె తండ్రి బన్వరీలాల్ శర్మ టప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో పాటు బాలిక ఆచూకీ కనుగొనేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. మరో మూడు రోజుల తర్వాత జూన్ 2వ తేదీన బాలిక మృతదేహం ఆమె నివాసానికి సమీపంలోనే చెత్తకుప్పలో కనిపించింది. రూ.10వేల అప్పు బాలిక తండ్రి బన్వరీలాల్ తిరిగి ఇవ్వనందునే ఈ దారుణానికి పాల్పడినట్లు తమ అదుపులో ఉన్న జహీద్, అస్లాం అంగీకరించారని పోలీసులు తెలిపారు. రాహుల్, ప్రియాంక దిగ్భ్రాంతి ‘మనిషనే వారెవరైనా చిన్నారులపై ఇంత దారుణంగా వ్యవహరిస్తారా?. పోలీసులు సత్వరం స్పందించి దోషులకు శిక్షలు పడేలా చూడాలి’ అని రాహుల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ఘటన అమానవీయమని ప్రియాంకగాంధీ అన్నారు. ‘అందరూ సిగ్గుపడాల్సిన∙ఘటన’ అని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్‌కుమార్, అభిషేక్, షబనా ఆజ్మీ, అనుపమ్ ఖేర్ తదితరులు ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. -
‘అలీగఢ్’ మద్దతు అఖిలేశ్‌కే
అలీగఢ్: రాబోయే యూపీ ఎన్నికల్లో ప్రస్తుత సీఎం అఖిలేశ్ యాదవ్‌కే అలీగఢ్ వర్సిటీ విద్యార్థులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఎస్పీ, కాంగ్రెస్ పార్టీ పొత్తును స్వాగతించారు. తొలిదశ ఎన్నికలు జరిగే పశ్చిమ యూపీలోని పట్టణాల్లో అలీగఢ్ ఒకటి. ఎంఐఎం తన పాపులారిటీ పరీక్షించుకునేందుకు ఎంచుకున్న జిల్లాల్లో ఇది ఉంది. జేఎన్ యూ నుంచి కనిపించకుండా పోయిన విద్యార్థి నజీబ్ అహ్మద్ విషయాన్ని పలువురు విద్యార్థులు లేవనెత్తారు. ప్రధాని మోదీ, అయన మార్కు రాజకీయాలను విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు.