all facilities
-
నిర్వాసితులకు 70 ఎకరాల్లో కాలనీ
ఏలూరు సిటీ : జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 70 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా భారీ కాలనీ ఏర్పాటు చేసి అన్ని వసతులు అక్కడే కల్పించి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనుల ప్రగతిపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు చిన్న చిన్న 19 కాలనీలు నిర్మించాలన్న ప్రతిపాదనతో నిర్వాసితులకు పెద్దగా మేలు జరగదని 2 లేదా 3 భారీ కాలనీలు ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు కల్పిస్తే ఆ ప్రాంత ప్రజలంతా ఎంతో ఆనందిస్తారని భాస్కర్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కొయ్యలగూడెం మెయిన్‌రోడ్డుకు చేర్చి 70 ఎకరాల విస్తీర్ణంలో భారీ కాలనీ ఏర్పాటు చేయాలని, ఆ కాలనీలో బస్టాప్, కోటి రూపాయల వ్యయంతో ఫంక్షన్ హాలు, షాపింగ్ కాంప్లెక్స్, ఆరోగ్య కేంద్రం, స్కూల్ భవనం, తదితర సౌకర్యాలు కల్పిస్తే నిర్వాసితులు ఎంతో లబ్ధి పొందుతారన్నారు. ఆ దిశగా ప్రణాళిక అమలు చేయాలని ఐటీడీఏ పీవో షాన్ మోహన్‌ను కలెక్టర్ ఆదేశించారు. తమ్మిలేరు అభివృద్ధి పనులు డిసెంబర్ 1న ప్రారంభించి 31 రాత్రి కల్లా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం, చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణ ప్రక్రియ, విస్తరణ పనులపై కాంట్రాక్ట్ ఏజెన్సీ, అధికారులతో చర్చించారు. భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కాలువల ఎలైన్మెంట్ మార్చే ప్రసక్తి లేదని కలెక్టర్ తేల్చి చెప్పారు. కలెక్టర్ వద్దకు వెళితే ఎలైన్మెంట్ మారుస్తారంటూ రైతులకు చెబుతున్న ఈఈ చినబాబుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జేసీ పి.కోటేశ్వరరావు, ఏజెసీ ఎంహెచ్.షరీఫ్, భూసేకరణ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ భానుప్రకాష్, ఐటీడీఏ పీవో షాన్మోహన్, ఆర్డీవోలు నంబూరి తేజŒ భరత్, శ్రీనివాసరావు, పోలవరం ఎస్ఈ శ్రీనివాసయాదవ్ పాల్గొన్నారు. -
సకల సౌకర్యాలు
సామాన్య భక్తులే లక్ష్యంగా వసతుల కల్పన జిల్లాలో ప్రతిష్టాత్మకంగా కృష్ణాపుష్కరాలు గంగాహారతి తరహాలో కృష్ణవేణి హారతి ఆధ్యాత్మిక భావన కలిగించేలా కార్యక్రమాలు పుష్కరాలకు విస్తృతంగా సాంకేతిక సేవలు ‘సాక్షి’ ఇంటర్వూ్యలో కలెక్టర్ టీకే శ్రీదేవి సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లా సంస్కతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కష్ణాపుష్కరాలను నిర్వహిస్తామని, సాధారణ భక్తులే లక్ష్యంగా వసతులు కల్పిస్తామని కలెక్టర్ టీకే శ్రీదేవి వెల్లడించారు. జిల్లాకే తలమానికంగా ఉన్న జోగుళాంబ ఆలయ ప్రతిష్టను దేశనలుమూలల నాటేందుకు కృషిచేస్తున్నామని వివరించారు. పుష్కరాలకు 1.50కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ప్రఖ్యాత హరిద్వార్‌లో గంగాహారతి తరహాలో కృష్ణవేణి హారతి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. యాత్రికులు వచ్చింది మొదలుకుని.. క్షేమంగా తిరుగు ప్రయాణమయ్యే వరకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తున్నామని.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వబోమని చెబుతున్నారు. కృష్ణాపుష్కరాల నిర్వహణపై శనివారం ఆమె ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. అంగరంగ వైభవంగా.. రాష్ట్రంలో మొదటిసారిగా పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగనివ్వం. యాత్రికులకు కావాల్సిన సమాచారం, సహాయం అందించేందుకు ప్రతిఘాట్ వద్ద స్వచ్ఛంద సేవకులను నియమిస్తున్నాం. సాధారణ భక్తులకు ఆధ్యాత్మిక భావన కలిగించేలా కార్యక్రమాలు చేపడ్తాం. 52 పుష్కరఘాట్లలో అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశాం. భక్తుల రద్దీకి తగిన విధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తగిన పారిశుద్ధ్యం సిబ్బందిని నియమించాం. ప్రతి ఘాట్‌లో స్నానపు గదులు, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నాం. ఈ ఘాట్‌లో ఎంత మేరకు నీళ్లు ఉన్నాయో.. ఏ మేరకు వెళ్లి స్నానం చేయొచ్చొ తెలియజేసేందుకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటుచేస్తున్నాం. అందుబాటులో వైద్యసేవలు పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం నాలుగు ప్రాంతాల్లో పది పడకలతో తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటుచేస్తున్నాం. పస్పుల, రంగాపూర్, బీచుపల్లి, సోమశిల ప్రాంతాల్లో వైద్యులు నిరంతర వైద్యసేవలు అందిస్తారు. లోతు ఉన్న ప్రాంతాలకు భక్తులకు వెళ్లకుండా పోలీస్, స్వచ్ఛంద సేవకులు ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేస్తారు. ఘాట్ల వద్ద బస్సులు, ఇతర వాహనాలను నిలిపేందుకు పార్కింగ్ వసతి కల్పించాం. వాటికి సాధారణ రుసుం చెల్లించి సేవలను వినియోగించుకోవచ్చు. జిల్లా ప్రతిష్టతను పెంచేలా.. జిల్లాలో ప్రఖ్యాత జోగుళాంబ ఆలయ ప్రతిష్టను దేశం నలుదిశలా చాటేలా అలంపూర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. జోగుళాంబను దర్శించుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈనెల 12 నుంచి 24వ తేదీ వరకు రోజుకూ ఐదువేల చొప్పున లడ్డూప్రసాదాన్ని ఉచితంగా భక్తులకు ఉచితంగా పంపిణీచేస్తున్నాం. గొందిమళ్లకు సీఎం కేసీఆర్ గొందిమళ్ల, సోమశిలలో వీఐపీ ఘాట్లను ఏర్పాటుచేశాం. సీఎం కేసీఆర్ గొందిమళ్లలో ఈనెల 12వ తేదీ ఉదయం కృష్ణా పుష్కరాలను అధికారికంగా ప్రారంభిస్తారు. ఇక్కడ తెలంగాణ, జిల్లా సంçస్కృ తి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాటుచేసిన చిత్రపటాలను సీఎం ప్రారంభిస్తారు. ప్రఖ్యాత హరిద్వార్‌లో గంగాహారతి తరహాలో కృష్ణా పుష్కరాల సందర్భంగా 12రోజుల పాటు జిల్లాలోని ఆరుఘాట్లలో కృష్ణవేణి హారతి నిర్వహిస్తాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం శాస్త్రోక్తంగా కొనసాగుతుంది. మిగిలిన ఘాట్ల వద్ద నిత్యం ఉదయం గంగపూజ నిర్వహిస్తాం. వలంటీర్లలో ప్రత్యేక సేవలు వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు పుష్కర స్నానాలు చేసేందుకు ఘాట్లవద్ద చర్యలు చేపడుతున్నాం. వీరికి సేవలు అందించేందుకు ప్రత్యేక వలంటీర్లు సేవలందిస్తారు. భక్తులెవరూ స్నానాలు చేసిన తర్వాత ఘాట్ల వద్దనే ఉండకుండా, ఒకేసారి పెద్ద సంఖ్యలో రాకుండా క్రమపద్ధతిలో వచ్చిపోయేలా తగిన ఏర్పాట్లు చేశాం. సగటున ఒక్కో భక్తుడు నాలుగు నిమిషాల్లో నదీస్నానం ఆచరించేలా కార్యచరణ రూపొందించాం. పుష్కరాలకు అధునిక హంగులు యాత్రికుల సౌకర్యార్థం ఈసారి ఆధునిక సాంకేతికసేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సెల్‌ఫోన్ సిగ్నళ్ల సమస్య తలెత్తకుండా వాటి సామర్థ్యాన్ని పెంచేందుకు సర్వీస్ ప్రొవైడర్లు ఏర్పాటుచేస్తున్నాం. జిల్లాలోని ఆరుఘాట్ల వద్ద ఉచితంగా వైఫై సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందుకోసం కొంత చార్జీని కూడా ప్రభుత్వం నుంచి సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించాం. వీటితో పాటు ‘వేర్ ఐ యామ్ ఐ’ గూగుల్ యాప్‌ని కూడా రూపొందించాం. స్మార్ట్ఫోన్లలో ఈ యాప్‌ని డౌన్లోడ్ చేసుకునే భక్తులకు వాళ్లు ఎక్కడున్నారు.. ఎక్కడ రద్దీ ఎలా ఉంది.. ఏ ఘాట్‌కు వారున్న ప్రదేశం నుంచి ఎలా వెళ్లాలి.. టాయిలెట్లు ఎటువైపు ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ ఎటువైపు ఉంది.. అనే అంశాలను తెలుసుకోవచ్చు. -
చదువూ సంస్కారమూ...
మీరు విద్యార్థులు. విద్యను ఆర్జించేవారు. విద్యలో విద్ అంటే తెలుసుకొనుట. ఇది రెండు రకాలు. ఏది తెలుసుకోవడం వల్ల జీవితంలో సమస్త భోగాలు కలుగుతాయో, చాలా గొప్ప కీర్తి కలుగుతుందో, దేనివల్ల సమస్త సౌకర్యాలు జీవితంలో మనకు సమకూరుతాయో దానిని లౌకిక విద్య అంటారు. మరొకటి ఉంది. ఏది తెలుసుకొనడం వలన ఇంకొకటి తెలుసుకోవలసిన అవసరం ఉండదో దానిని బ్రహ్మవిద్య అంటారు. లౌకిక విద్యాభ్యాసం వల్ల మీరు బాగా వృద్ధిలోకి వస్తారు. వ్యక్తిగత జీవితంలో కానీ, ప్రభుత్వంలో కానీ, సమాజంలో కానీ సమున్నత స్థానం పొంది బాగా డబ్బు సంపాదించుకోగలుగుతారు,అలాగే కీర్తి ప్రతిష్ఠలు కూడా. కానీ రెండవది దాని కొరకు గాదు. అది దేని కొరకు అంటే... ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని స్థితి కొరకు. ఇప్పుడు మీరు లౌకిక విద్యయందున్నారు. ఈశ్వరానుగ్రహం కలిగితే ఇది బ్రహ్మవిద్యకు దారితీయవచ్చు. విద్ అంటే చదువుకొనుట, తెలుసుకొనుట అని చెప్పుకున్నాం కదా ! దీనికి పక్కన మరొక మాట ఉంటుంది-సంస్కారం. చదువూ సంస్కారం ఉండాలండీ అంటూంటారు కదా! ఇక్కడ చదువు అంటే తెలుసుకొనుట, అది కూడా నిరంతర ప్రయత్నంగా. విద్యార్థి దశలో ఏం చేయాలో శాస్త్రం కచ్చితంగా చెప్పింది. విద్యాసముపార్జన తప్ప వేరొక్కటి కూడదు అన్నది. విద్యార్థి దశ అంతా చదువుకొనుటకే, తెలుసుకొనుటకే తప్ప మరిదేనికీ కాదు, చివరకు సేవకు కూడా కాదు. తెలుసుకోవలసినవన్నీ బాగా తెలుసుకున్న నాడు, ఉద్యోగంలోకి వచ్చిన రోజున, అంతకుముందు విద్యార్థి దశలో సేవ ఎలా చేయాలని తెలుసుకున్నారో అప్పుడు అలా చేయాలి. విద్యార్థి దశలో మాత్రం విద్యాసముపార్జనం తప్ప మరే కార్యక్రమం చేపట్టినా అది దోషభూయిష్ఠమే, శరాఘాతమే. సనాతన ధర్మంలో గురువు లేని విద్య గుడ్డివిద్య అన్నారు. చదువు ప్రయోజనం నెరవేరడం కోసం, సంస్కారం ఏర్పడడం కోసం గురువుకీ శిష్యుడికీ మధ్య ఒక సంబంధం ఉంటుంది. శాస్త్రం గురువును వినీతుడు అంటుంది. అంటే వినయం నేర్పువాడు - అని. మరి శిష్యుడు... విధేయుడు. అంటే వినయం నేర్చుకొనువాడు. వినయం లేని ఏ చదువు మీరు చదివినా అది సమాజానికి భారమే. సంస్కారం దేని వలన ఏర్పడుతుంది? కేవలం వినడం వలన మాత్రమే ఏర్పడుతుంది. 84 లక్షల జీవరాశుల్లో కేవలం మనిషి మాత్రమే యోగ్యుడని పరమేశ్వరుడు ఆ శక్తి ఇచ్చాడు. ఇది దేనికి ? సంస్కారం ఏర్పరుచుకోవడానికి. వినడం అనేది సంస్కారమంతటికీ పునాది. నిద్రలేచింది మొదలు తిరిగి నిద్రపోయేంతవరకు మనం అనేక రకాల మాటలు వింటూంటాం. విద్యార్థి దశలో వినే మాటలన్నీ ఒకే కోవలోకి వస్తాయి. కానీ తర్వాత మీకు జీవితంలో నాలుగు రకాల మాటలు వినిపిస్తాయి. తస్మాత్ ! జాగ్రత్త. పరాకుగా ఉండకండి. ఈ నాలుగు రకాల్లో మొదటిది పొగడ్త. రెండవది తెగడ్త. మూడవది స్వత్కార్యసాధన కొరకు ప్రయత్నం, నాలుగవది అభ్యుదయ హేతువు. ఈ నాలుగు మాటల పట్ల ఎవడు పూర్తిగా అవగాహన కలిగి ఉంటాడో వాడు సంస్కారవంతుడిగా నిలబడగలడు. మొదటిది పొగడ్త. మిమ్మల్ని కొందరు అదేపనిగా పొగుడుతుంటారు. మీలో ఉన్న లోపాలు వారికి తెలియక కాదు. పొగడ్తలు వినడం, అన్నీ సబబేననుకోవడం ఎటువంటిదంటే... ఊబిలో దిగుతున్నవాడు ఎంత చక్కగా, ఎంత హాయిగా దిగుతున్నాను అనుకోవడం వంటిదే. అలా అనుకున్నవాడు ఏం చేస్తాడు... చివరికి ఊపిరి విడిచి పెట్టేస్తాడు. అలాగే అదేపనిగా పొగిడేవాడిని దగ్గరగా ఉంచుకోవడం మంచిది కాదు. ఎందుకంటే... బుద్ధి వినాశన హేతువు. అదేపనిగా వినడానికి అలవాటుపడితే మీ సంస్కారంలో దోషం వస్తుంది. అలా వారు పొగడనినాడు వారిని మీరు ఇష్టపడరు, అలా పొగిడినవారికే ఉపకారం చేస్తారు. అన్నం లేకుండా ఉండగలరు కానీ పొగడ్తలు వినకుండా గడపలేరు. అది ఒక వ్యసనంగా మారిపోతుంది. కేవలం పొగడ్తకు లొంగడం అనేది అత్యంత ప్రమాద హేతువు. అదేపనిగా పొగిడేవాడికి మీరు అంతేవాసిత్వం (శిష్యరికం) ఇచ్చారనుకోండి, అది తిరోగమనానికి దారితీస్తుంది, మీ స్వభావాన్ని పాడుచేసి వివేచనతో ఆలోచించగల మీ నైపుణ్యాన్ని ఇది భ్రష్టు పట్టిస్తుంది. అలాగని లోకంలో పొగడ్త వినకుండా ఉండడం కూడా సాధ్యం కాదు. మీరు ఒక మంచి పని చేస్తున్నప్పుడు మీరు చాలా మంచిపని చేస్తున్నారు అని ఎవరయినా అంటే వినొద్దని శాస్త్రం చెప్పలేదు. వినాలి, కానీ దాని మూలాన్ని విరిచేయాలి. కోటేశ్వరరావుగారు చెప్పే విషయాలు ప్రపంచవ్యాప్తంగా చాలామంది వింటూంటారని నిర్వాహకులు అంటారు. అది నిజమేనని నేను దానిని స్వీకరిస్తే అది నాకూ, వారికీ కూడా ఇబ్బందే. శంకరభగవత్పాదులవారి మాటలు నాకు ఒంటబట్టి చెప్పడంవల్ల నాకు ఈ కీర్తి కలుగుతున్నది, సమాజంలో నాకింత గౌరవం కలుగుతున్నది. ఈ కీర్తి ప్రతిష్ఠలు అన్నీ శంకరులవారికి దక్కాలి, నాకు కాదు. కాబట్టి నేను ఎప్పుడూ శంకరుని పాదాలు విడవకుందును గాక అని నేనన్నాననుకోండి. ఇప్పుడు పొగడ్త వల్ల నాకు ప్రమాదమేమీ ఉండదు. నీవు లోపల మానసికంగా ఎదిగి ఉంటే ఏ పొగడ్త కూడా నిన్ను ఏమీ చేయలేదు. తెలిసీ తెలియకుండా పనసపండు కోశారనుకోండి, ఆ మరకలు ఏం పెట్టి కడిగినా పోవు. అదే ముందుగా చేతికి నూనె రాసుకుని కోశారనుకోండి. ఎంత జిగురున్నా, మీకది ఒక్క పిసరంత కూడా అంటదు. విరుగుడు తెలిసి నిలబడితే మీకు సంస్కారబలం ఏర్పడుతుంది. సంస్కారబలానికి ప్రధానహేతువేది? అసలు వినకుండా ఉండడం కాదు, వినడం కూడా అవసరం. అందుకే పూర్వం రాజుల దగ్గర వంది, మాగధి అనే వారు ఉండేవారు. రాజు నిద్రలేచి వచ్చిన క్షణం నుంచీ పొగుడుతుంటారు. అలా పొగడడానికే రాజు జీతం ఇచ్చి మరీ వారిని పెట్టుకునేవాడు. వీరు ఏం చేస్తారంటే రాజుయొక్క పూర్వికులు చేసిన మంచి పనులను పొగుడుతూ, రాజు చేసే పొరబాట్లను స్తోత్ర రూపంలో చెపుతూ ఆయన్ని అప్రమత్తం చేస్తారు. ఎవడో పాడుబడిన బావిలో పడి చనిపోయాడని తెలిసి వెంటనే దానిని పూడ్చివేయమని రాజు ఆజ్ఞ జారీచేస్తాడు. వెంటనే వంది ‘‘ఓరాజా! ఈ నూతిని మీ తాతగారు తవ్వించారు. రాజ్యంలో ఉన్న క్షామం పోవాలని, కొన్ని లక్షలమంది బాగుపడాలని ఆయన ఈపని చేశారు, అంతేకానీ మనుషులు చచ్చిపోవడానికి ఈ ఏర్పాటు చేయలేదు’’ అంటుంటే, మాగధి అందుకుని ‘‘మహారాజా ! మీరు చేయబోయే ఈ పని ఇప్పుడు మంచిదిగా కనిపించినా మున్ముందు అలా ఉండకపోవచ్చు. మీరు ఇప్పటిదాకా చాలా మంచి పనులు చేసి కీర్తి గడించారు. ఇప్పుడు దానికి ప్రమాదం వాటిల్లుతుంది’’ అని స్తోత్రరూపకంగా చెపుతాడు. వెంటనే రాజు ‘‘ఔను, మా తాత మంచిపని చేశాడు’’ అని ఆ బావిని బాగుచేయించమని పురమాయిస్తాడు. ‘రాజా! ఆ నూతిని పూడ్చేయకండి’ అని మీరే నేరుగా అన్నారనుకోండి, మిమ్మల్ని పూడ్చేస్తారు. పొగడ్త హితవాక్కుగా ఉండడానికి రాజు ఈ ఏర్పాటు చేసుకుంటాడు. పొగడ్త ఎప్పుడూ ఎలా వినాలో తెలుసా ! వంశ ప్రతిష్ఠ వినాలి. మా తాత ఎటువంటివాడు, మా తండ్రి ఎటువంటివాడు, మా గురువు ఎటువంటివాడు, జగద్గురువులు ఎటువంటివారు, మన సనాతన ధర్మంలో వచ్చిన మహర్షులు ఎటువంటివారు, పీఠ వైభవం ఎటువంటిది.. ఇవి తెలుసుకున్ననాడు మీకు తెలియకుండానే ఒక వారసత్వ వైభవం మీకు తెలిసివస్తుంది, ఆ మర్యాదను నిలబెట్టవలసిన బాధ్యత గుర్తుకు వస్తుంది. పొగడ్త లేకుండా జీవితాన్ని గడపలేం. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. పాము కరిచిందనుకోండి. వ్యక్తి చనిపోతాడు. అదే పాములోని విషాన్ని వైద్యుడు సంస్కరించి ఓషధి రూపంలో ఇచ్చాడనుకోండి. అనారోగ్యం తగ్గిపోతుంది. అదీ... సంస్కరించుట. అక్కడ వచ్చింది చదువు పక్కన సంస్కారం అన్నమాట. చదువుకుంటూనే ఉండు, తెలుసుకుంటూనే ఉండు, ఎందుకు... నీ అంతట నీవు సమాజంలో నిలబడవలసిన రోజు వచ్చిన నాడు, ఏది ఎక్కడవరకు ఉంచాలో ఏది దగ్గరకు తీసుకోవాలో నీకు తెలిసి ఉండాలి. అన్నింటినీ కౌగిలించుకోవడం అలవాటయిపోతే ఒళ్లు కాలిపోతుంది. అదీ సంస్కారబలం అన్నమాటకు అర్థం. రెండవది తెగడ్త. అంటే నిరసించుట. అవతలివాడియందు ఆ లోపం ఉన్నదా, అలా విమర్శించడానికి అవకాశం ఉన్నదా... తెలిసి విమర్శించు. మీయందు దోషమున్నది, దానిని నేను విమర్శించాననుకోండి, తెగిడాననుకోండి, అది హితవాక్కవుతుంది. ఉదాహరణకు - మీకు అన్నం కూడా మానేసి చదువుకునే అలవాటు ఉన్నదనుకోండి. నేను మీ దగ్గరకు వచ్చి అది తప్పు. మీరెంత చదువుకున్నా, ఇలా చదువుకుంటే ఎందుకూ పనికిరారు. మీరు వేళపట్టున ఆహారం తీసుకోవడం, స్వల్ప వ్యాయామం చేయడం, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండడం కూడా అవసరం. అప్పుడు మీరు చదువుకున్న చదువు మీకు ఒంటపడుతుంది అని నేనన్నాననుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని తెగిడాను అనరు. మిమ్మల్ని సంస్కరించాను అంటారు. అసూయాజనితమయితే తెగడ్త అనే మాట వస్తుంది. సంస్కృతంలో నాకన్నా బాగా చదువుకున్న వ్యక్తి వచ్చి నాముందు నిలబడ్డాడనుకోండి. నేను వారి మాటలు విని ఆ తర్వాత పక్కకు వెళ్ళి ‘ప్చ్! ఆయనలా మాట్లాడేంటండీ, అన్నీ తప్పులండీ’ అన్నాననుకోండి. అది అసూయా జనితం. నాకు లోపల తెలుసు, ఆయన నా కన్నా మహాపండితుడు. కానీ నేనది అంగీకరించడానికి నా గర్వం నాకు అడ్డొస్తోంది. ఆయన మహా విద్వాంసుడండీ, అటువంటి వారి దర్శనం కలగడం ఈ వేళ నా అదృష్టం అని అనగలిగాననుకోండి. అప్పుడు నేను సంస్కారవంతుడనయి ఉన్నానంటారు. అందువల్ల చదువు ఒక్కటే చాలదు. దానికి సంస్కారం కూడినప్పుడే విలువనిస్తుంది. ఈ సంస్కారం ఇచ్చేది కూడా విద్యే. విద్య మనకిచ్చే గొప్ప విలువల్లో సంస్కారం ఒకటి. సంస్కారం అన్న మాటకు అర్థం ఎక్కడున్నదీ అంటే... ఎందుకంత కఠినంగా మాట్లాడారని ఆలోచించడం కాదు, వారు ఎలా మాట్లాడినా నా అభ్యున్నతి కోసమే అలా మాట్లాడారని అనుకోవడం నీ సంస్కారం. అలాకాక, పెద్దల వాక్కులో కాఠిన్యం చూడడం అలవాటయితే అది సంస్కార రాహిత్యం అవుతుంది. అలాగాక వారు ఎందుకోసం అలా మాట్లాడారా అని ఆలోచించి, దానిలోని మంచిని గ్రహించడం, ఆచరించడం మీ సంస్కారానికి నిదర్శనం. సంస్కారం... సంయత్ కరము అంటే బాగుగా చేయుట అని. మీరు ఏయే చదువులు చదువుకొని గొప్ప గొప్ప స్థానాల్లోకి వెళ్లబోతున్నారో అది సమాజాన్ని పాడు చేసేదిగా ఉండకుండా జాగ్రత్తపడడం. ఒకడికి బలం ఉందనుకోండి. ఆ బలంతో బలహీనుడిని రక్షించవచ్చు, వాడిని హింసించి వాడికి నష్టం కలిగించనూ వచ్చు. ఒకడి దగ్గర చదువు ఉందనుకోండి. దానితో మరొకడిని వృద్ధిలోకి తీసుకురావచ్చు, అదే చదువుతో పదిమందిని మోసం కూడా చేయవచ్చు. కాబట్టి సంస్కారాన్ని చదువు పక్కన ఎందుకు ఉంచారంటే... నీకు దేనివల్ల ప్రకాశం కలుగుతుందో, దేనివల్ల లోకభాగ్యాలను పొందబోతున్నావో అది ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజంలోని అభ్యుదయానికి అడ్డంకి కాకుండా ఉండడానికి. దీనికి అవసరమయిన మర్యాదలను నేర్పడానికే సంస్కారమని పేరు. -
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి
- సకల సౌకర్యాలు కల్పించాలి - అధికారులు స్థానికంగా ఉండాలి - జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ - ముల్లకట్ట, రామన్నగూడెం, గోదావరి ఫెర్రీ పాయింట్ల వద్ద పుష్కరఘాట్ల సందర్శన ఏటూరునాగారం/మంగపేట : పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగొద్దని, సకల సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం, ముల్లకట్ట, మంగపేట మండల కే్రంద్రంలోని గోదావరిఫెర్రీ పాయింట్ వద్ద ఏర్పాటు చేస్తున్న పుష్కరఘాట్లను ఆమె బుధవారం సందర్శించి పనులను పరిశీలించారు. పుష్కరాల పనులను ఈ నెల 30 వరకు పూర్తి చేయాలన్నారు. ముల్లకట్ట వద్ద పార్కింగ్ స్థలాలు, మరుగుదొడ్ల నిర్మాణం ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. ముల్లకట్ట ప్రధాన రోడ్డు నుంచి ఘాట్ వరకు ఉన్న బురద రోడ్డును మెటల్, డస్ట్ వేసి భక్తులు నడిచేలా చూడాలని ఐటీడీఏ ఇంజనీరింగ్ ఈఈ కోటిరెడ్డిని ఆదేశించారు. రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టి పనులను పర్యవేక్షించాలని ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్‌కు సూచించారు. రొయ్యూర్ నుంచి ముల్లకట్ట, రాంపూర్ రోడ్డును ఎందుకు పూర్తి చేయించలేదని పీఆర్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగపేటలో గతంలో గోదావరి ఒడ్డు కోతకు గురికాకుండా ఉండేందుకు ఒడ్డు వెంట రివిట్మెంట్, కరకట్ట నిర్మాణం చేయకుండానే రికార్డులు చూపించి కాంట్రాక్టర్ నిధులు దండుకున్నాడని మంగపేట వాసులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆమె వెంట జిల్లా పౌర సంబంధాల శాఖ ఏడీ జగన్, డీపీఓ సోమ్లానాయక్, మత్స్యశాఖ జిల్లా అధికారి మల్లికార్జున్, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ రమేష్‌బాబు, ఆర్డీఓ చీమలపాటి మహేందర్‌జీ, డీఎస్పీ రాజమహేంద్రనాయక్, ఎన్‌హెచ్ ఈఈ సత్యనారాయణ, డీఈఈ వెంకటేష్, మనోహర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాంచంద్నాయక్, ఈఈ రాజేంద్రకుమార్, డీఈఈ తిరుపతిరావు, ఏఈఈలు జీవన్ప్రకాష్, పీఆర్ ఈఈ మదనయ్య, డీఈఈ శంకరయ్య, ఏఈఈ సత్యనారాయణ, ప్రాజెక్టు ఇన్చార్జ్ ప్రకాష్, మైనర్ ఇరిగేషన్ ఈఈ సుధీర్, డీఈఈ యశ్వంత్, ఏఈఈ శ్యాం, డీఎంహెచ్ ఓ సాంబశివరావు, జెడ్పీటీసీ వైకుంఠం, తహసీల్దార్ గుర్రం శ్రీనివాస్, సీఐ కిషోర్‌కుమార్, ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి, ముల్లగట్ట సర్పంచ్ మడె చిలుకమ్మ, ఏటూరునాగారం సర్పంచ్ ఇర్సవట్ల ఝన్సీరాణి పాల్గొన్నారు. పోడుభూములకు పట్టాలివ్వాలని ఆందోళన ఏటూరునాగారం : పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని రొ య్యూర్ గ్రామస్తులు బుధవారం కలెక్టర్ వాకాటి కరుణను అడ్డుకున్నారు. దీంతో ప్రజలను చూసి వాహనాన్ని నిలిపి మాట్లాడా రు. ఇప్పలగడ్డ పాఠశాల చుట్టూ స్ట్రంచ్ కొట్టడం వల్ల నీళ్లు నిలి చి విద్యార్థులు అందులోపడే ప్రమాదం ఏర్పడిందన్నారు. విద్యార్థులున్న ప్రాంతంలో ఎలా గోతులు తీస్తారని అటవీశాఖ అధికారుల తీరుపై కలెక్టర్ మండిపడ్డారు. పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. -
కంట్రోల్ తప్పిన కడప కేంద్ర కారాగారం
కడప అర్బన్ : కడప కేంద్ర కారాగారం కంట్రోల్ తప్పుతోంది. ఇక్కడి రిమాండు ఖైదీలతో పాటు కొందరు జీవిత ఖైదీలకు కావాల్సిన సకల సౌకర్యాలన్నింటి సమకూరుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. కాసులకు కక్కుర్తిపడి కొందరు సిబ్బందే స్వయంగా వీటిని అందజేయడం అనేక విమర్శలకు తావిస్తోంది. మొన్న గంజాయి.. నిన్న సెల్ఫోన్లు లభ్యమైనట్లు స్పష్టమైన సమాచారముంది. ఖైదీల సౌకర్యార్థం తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఫోన్ సౌకర్యాన్ని మార్చిలో ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఖైదీలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు వారానికి రెండుసార్లు తాము రికార్డు చేసుకున్న నంబర్లకు ఫోన్లు చేసుకునే విధంగా ఒక్కొక్కరు ఐదు నిముషాల పాటు మాట్లాడుకునేలా అవకాశం కల్పించారు. అయినా రిమాండ్ ఖైదీల వద్ద సెల్ఫోన్లు లభ్యమవుతుండడం దుమారం రేపుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిఘా నీడలోనే... కడప కేంద్ర కారాగారంలోని ప్రధాన ద్వారం వద్ద, లోపలి ద్వారం వద్ద రెండుచోట్ల అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని హైదరాబాద్‌లోని కారాగార శాఖ డీజీ కార్యాలయానికీ అనుసంధానం చేశారు. అయినా కారాగారంలోకి సెల్ఫోన్లు, గంజాయి యథేచ్చగా సరఫరా కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నిఘా వ్యవస్థను స్వయంగా సూపరింటెండెంటే పరిశీలిస్తున్న సమయంలో మాత్రం అక్కడ పని చేస్తున్న సిబ్బంది చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నట్లు నడిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మిగతా సమయాల్లో కొందరు సెక్యూరిటీ విభాగం లోపలికి వచ్చే రిమాండు ఖైదీలను గానీ, ఇంటర్వ్యూలకు వచ్చే బంధువులను గానీ సక్రమంగా తనిఖీలు చేయకపోవడం గమనార్హం. రిమాండు ఖైదీలు కోర్టులకు హాజరై తిరిగి వచ్చే సమయంలో సెల్ఫోన్లను కొనుగోలు చేస్తూ దర్జాగా లోపలికి తీసుకొస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గంజాయి ప్యాకెట్లను ప్రహరీ నుంచి ఇవతలకు విసిరేస్తున్నట్లు సమాచారం. తాము ఎంత కట్టడి చేసినా ఎక్కడో చిన్న లోపంతో ఇలా జరుగుతూనే ఉన్నాయని కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ గోవిందరాజులు చెబుతుండడం గమనార్హం.