'పార్టీలన్నీ జగన్‌ను టార్గెట్ చేస్తున్నాయి'
రాష్ట్రంలో అన్ని పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం ఏకైక ఎజెండాగా పెట్టుకున్నాయని ఆ పార్టీ నేతలు కోనేరు ప్రసాద్, జలీల్‌ఖాన్ ఆరోపించారు. ఆ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. బుధవారం విజయవాడలో కోనేరు ప్రసాద్, జలీల్‌ఖాన్ మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అని వారు జోస్యం చెప్పారు. రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపించే సత్తా ఒక్క వైఎస్ జగన్ మాత్రమే ఉందని పేర్కొన్నారు.