ఎన్ని నోట్లు రెడీ అవుతున్నాయో తెలుసా?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దుతో ప్రత్నామ్నాయ నగదును ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు మూడు ప్రింటింగ్ ప్రెస్ ల ద్వారా రోజుకి మిలియన్ల కొద్దీ కరెన్సీని ముద్రిస్తోంది. తద్వారా తగినంత కరెన్సీ నోట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది.
ప్రధానంగా బీఆర్బీఎన్ఎంపీఎల్ (భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రయివేట్ లిమిటెడ్ ) ద్వారా (18లైన్లు) సుమారు 4కోట్లు( 40 మిలియన్ల)రూ.2 వేల నోట్లను ముద్రిస్తోంది. అలాగే బీఎన్పీ దివస్ (బ్యాంక్ నోట్ ప్రెస్ ప్రింటింగ్ ప్రెస్ (3లైన్లు) లో 90 లక్షల రూ.500 నోట్లను రడీ చేస్తున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.
అలాగే నాసిక్ ప్రెస్ లోని నాలుగు లైన్ల ద్వారా సుమారు కోటి 80 లక్షల( (18మిలియన్లు) కరెన్సీ నోట్లను ముదిస్తున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నాసిక్ లోని ప్రెస్ (1లైన్) ద్వారా రోజుకు ముఖ్యంగా 50 లక్షల రూ. 20 రూపాయల నోట్ల ను ముద్రిస్తోంది. అలాగే (2లైన్లు) కోటి(10 మిలియన్ల) రూ.100 నోట్లును ముద్రిస్తోంది. తగినంత కరెన్సీ నోట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భరోసా ఇచ్చింది.
కాగా పెద్ద నోట్ల రద్దు తర్వాత వరుసగా తొమ్మిదో రోజుకూడా ప్రజల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు రద్దుచేసిన రూ. 500, రూ.1000 నోట్ల మార్పిడి పరిమితిని గురువారం రూ2వేలకు కుదించింది ప్రభుత్వం. మరోవైపు పార్లమెంట్ లో ప్రతిపక్షాల నిరసనల సెగ రేగిన సంగతి తెలిసిందే.