alqaeda
-
పాక్‌లో లాడెన్ సన్నిహితుడి అరెస్ట్
లాహోర్: అల్ ఖైదా సీనియర్ నేత, ఒసా మా బిన్ లాడెన్‌కు సన్నిహితుడిగా భావిస్తున్న అమీనుల్ హక్‌ను పాక్ ఉగ్రవాద వ్యతిరేక విభాగం అరెస్ట్ చేసింది. దేశంలో భారీ ఉగ్రదాడులకు పాల్పడేందుకు అతడు చేస్తున్న ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకోగలిగామని ఉగ్రవాద వ్యతిరేక విభాగం డీఐజీ ఉస్మాన్ అక్రమ్ చెప్పారు. నిఘా వర్గాల సమాచారం మేరకు పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజ్రాత్ జిల్లా సరాయ్ ఆలంగిర్ పట్టణంలో దాగున్న అతడిని పట్టుకున్నట్లు అక్రమ్ తెలిపారు. ఉగ్రవాదంపై జరుపుతున్న పోరాటంలో ఇదో కీలక విజయమని పేర్కొన్నారు. -
అంతం కాదిది ఆరంభం
కొన్నేళ్ళుగా ప్రపంచానికి కంటిలో నలుసుగా మారి, అగ్రరాజ్యాన్ని సైతం వణికిస్తున్న అంతర్జాతీయ ఇస్లామిస్ట్ ఉగ్రమూక అల్‌ఖైదాకు ఇది ఊహించని దెబ్బ. అఫ్ఘానిస్థాన్లోని కాబూల్‌లో ప్రపంచం కంటపడకుండా నివసిస్తున్న అల్‌ఖైదా అధినేత అయ్మాన్ అల్–జవాహిరీని అమెరికా మాటు వేసి, జూలై 31 ఉదయం చాటుగా మట్టుబెట్టడంతో ఒక అధ్యాయం ముగిసింది. ‘9/11’ దాడులకు తెగబడిన ముష్కరమూకను నలిపి, నాశనం చేయాలని ప్రపంచపు పెద్దన్న ఇరవై ఒక్క ఏళ్ళుగా పగతో రగిలిపోతోంది. 2011లో ఒసామా బిన్ లాడెన్నూ, ఇప్పుడు ఆయనకు కుడిభుజంగా వ్యవహరించిన జవాహిరీని హతమార్చడం అమెరికా నిఘా వ్యవస్థ ఎంత బలమైనదో మరోసారి ప్రపంచానికి తెలిసివచ్చింది. అంతకన్నా ముఖ్యంగా అఫ్ఘానిస్థాన్‌ను ఉగ్రమూకలకు స్థావరంగా మార్చబోమంటూ తాలిబన్లు చేసుకున్న ‘దోహా ఒప్పందం’లోని డొల్లతనం బయట పడింది. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ లాంటివి ఇప్పటికీ ఉగ్రమూకలకు స్వర్గధామాలే అన్న కఠిన వాస్తవం పొరుగున ఉన్న భారత్ సహా ప్రపంచమంతటినీ మరోసారి అప్రమత్తం చేస్తోంది. 1998 ఆగస్టులో తూర్పు ఆఫ్రికాలో అమెరికా ఎంబసీపై బాంబుదాడి నుంచి ‘9/11’గా పాపు లరైన 2001 సెప్టెంబర్ 11 నాటి న్యూయార్క్ ప్రపంచ వాణిజ్య కేంద్ర జంట భవనాలపై వైమానిక దాడి వరకు... అగ్రరాజ్యంపై అల్‌ఖైదా తెగబడిన అనేక సందర్భాల్లో తెర వెనుక సూత్రధారి జవాహిరియే. నేత్రవైద్యుడి నుంచి తీవ్రవాదిగా మారిన 71 ఏళ్ళ జవాహిరి అప్పట్లో అల్‌ఖైదాలో నంబర్ టూ. 2011లో పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో అమెరికన్ కమెండోలు లాడెన్‌ను గుట్టుగా మట్టుపెట్టినప్పటి నుంచి ఆ సంస్థకు ఆయనే నంబర్ వన్. అల్‌ఖైదా కొంత తెర వెనక్కి వెళ్ళాక, ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’ (ఐసిస్) లాంటి హింసాత్మక జిహాదిస్టు పిల్లమొలకలు మొలిచి, ఐరోపాలో తెగబడడం చూస్తున్నాం. కొంత బలహీనపడ్డా, కార్యకర్తల సమీకరణ సత్తా ఉన్న సైద్ధాంతికుడిగా జవాహిరి అమెరికా మొదలు ఇండొనేసియా దాకా అనేక దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తూనే వచ్చారు. అమెరికా ఎప్పుడో ఆయన తలకు 2.5 కోట్ల డాలర్ల భారీ వెల కట్టింది. భారత్‌కూ ముప్పు తేవాలని జవాహిరి ఆరాటపడ్డారు. ‘భారత ఉపఖండ అల్‌ఖైదా’ (ఏక్యూ ఐఎస్)ను ఆరంభిస్తున్నట్టు 2014లోనే ఒక వీడియోలో ప్రకటించిన ఆయన నిరుడు హురియత్ నేత గీలానీ చనిపోయినప్పుడు సంతాపం ప్రకటిస్తూ, కశ్మీర్ అంశాన్ని భుజానికెత్తుకొనే యత్నం చేశారు. ఈ ఏడాది కర్ణాటకలో హిజాబ్ వివాదం తలెత్తినప్పుడూ సాయుధపోరు చేయాలంటూ ముస్లిమ్ లను రెచ్చగొట్టేందు ప్రయత్నించారు. కానీ, సహనశీల భారతావనిలో ఆ పప్పులుడకలేదు. నిన్నటి దాకా గుర్తు తెలియనిచోట గడుపుతున్నాడనుకుంటున్న ఈ ఉగ్రనేత సాక్షాత్తూ కాబూల్ నడిబొడ్డున, అఫ్ఘాన్ ప్రభుత్వ పెద్దలెందరో నివసిస్తున్న భవనంలో సకుటుంబంగా కాపురమున్న వైనం దిగ్భ్రాంతికరం. నెలల క్రితమే ఆయన ఆచూకీ కనిపెట్టిన అమెరికా గూఢచారులు ఆనుపానులన్నీ చూసుకొని, చుట్టుపక్కల ఎవరికీ ఏమీ కాకుండా చిత్రమైన హిల్ఫైర్ క్షిపణుల రిమోట్ డ్రోన్ దాడితో లక్ష్యాన్ని ఛేదించిన వైనం కొన్నాళ్ళు కథలు కథలుగా చెప్పుకొనే జేమ్స్‌బాండ్ తరహా విన్యాసం. తాజా ఆపరేషన్‌తో తీవ్రవాదంపై పోరులో అమెరికా ప్రతిష్ఠ కొంత పెరగవచ్చు. ఉపఖండంలో పర్యవసానాలు అంతకన్నా పెరుగుతాయి. ఏడాది క్రితం అమెరికా సేనలు హడావిడిగా వెనక్కి తగ్గాక, అఫ్ఘాన్‌లో బలవంతాన పగ్గాలు చేజిక్కించుకున్న పిడివాద తాలిబన్లకూ, వారి ప్రభుత్వానికీ ఇవాళ్టికీ అంతర్జాతీయ గుర్తింపు అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో తమకు తెలియకుండానే జవాహిరి తమ నట్టింట్లోనే తలదాచుకున్నాడని తాలిబన్ సర్కార్ బొంకినా నమ్మేవారెవరూ లేరు. తమ దేశ సార్వభౌమాధికారానికి అమెరికా తాజా రహస్య దాడులు విఘాతమని కాబూల్ వాదన. మామూలుగానైతే ఆ మాటకు అంతో ఇంతో మద్దతు లభించేదేమో! కానీ, పది పడగల పాముకు నేటికీ పాలు పోసి పెంచుతున్న వైనం బట్టబయలయ్యాక తాలిబన్లను ఎవరూ బాహాటంగా సమర్థించ లేరు. ఇక, జవాహిరి వ్యవహారంలో పాకిస్థాన్ ఇవ్వాల్సిన సంజాయిషీ సైతం చాలానే ఉంది. దీర్ఘకాలం పాక్‌లో తలదాచుకొని, ఇప్పుడు అఫ్ఘాన్‌లోనూ పాకిస్థానీ స్థావర ఉగ్రమూక హక్కానీ నెట్వర్క్ నీడలోనే అల్‌ఖైదా అధినేత కాలక్షేపం చేశాడనేది సుస్పష్టం. ఇన్నాళ్ళూ కడుపులో పెట్టుకొని కాపాడిన ఉగ్రసారథితో తమకే బంధం లేదని దాయాది దేశం చెబితే హాస్యాస్పదం. ఆ మాటకొస్తే, స్వలాభం కోసం ఇప్పుడు పాకిస్థానే అతని ఉప్పందించిందనే వాదనా వినిపిస్తోంది. తాజా దాడితో అమెరికా పగ చల్లారిందేమో కానీ, ఆన్లైన్ విషప్రచారంతో వివిధ దేశాలకు వ్యవస్థను విస్తరించిన జిహాదిస్టు గ్రూపులు తోక తొక్కిన తాచులా లేచే ప్రమాదం ఉంది. అధినేతను కోల్పోయి ఇప్పటికి ఆ స్థాయి వారసుడెవరూ లేకపోయినా, కొత్త గ్రూపులను కూడగట్టుకొని అల్ ఖైదా ప్రతీకారం తీర్చుకోజూస్తుంది. ఇక తాలిబన్లు సరేసరి. అందుకే, జవాహిరి ఒక్కడి మరణంతో సమస్త ఉగ్రవాదం సమసిపోయినట్టు కాదు. ప్రపంచానికిస్తున్న హామీలకు విరుద్ధంగా ముష్కర మూకలను పెంచిపోషిస్తున్న పాక్, అఫ్ఘాన్లపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలి. ఉప ఖండంలో శాంతి సుస్థిరతలకు భంగం కలిగించే చర్యల్ని అనుమతించబోమనాలి. అందుకే, ‘9/11’ దాడుల్లో మరణించిన 3 వేల మంది కుటుంబాల కన్నీటి కథకు జవాహిరి అంతం ఒక ముగింపని బైడెన్ అన్నారు కానీ, దశకంఠుడి లాంటి ఉగ్రసంస్థలపై యుద్ధంలో ఇది మరో మజిలీ మాత్రమే! -
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు.. అల్‌కాయిదా స్ట్రాంగ్ వార్నింగ్!
న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల ఉదంతపు ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను ఖండించిన ముస్లిం దేశాల జాబితాలోకి తాజాగా ఉగ్ర సంస్థ ఆల్కాయిదా కూడా చేరింది. ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని.. అందుకు దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడనున్నట్లు ఆల్కాయిదా హెచ్చరికలు జారీ చేసింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని హతమారుస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్‌ల్లో దాడులకు దిగుతామంటూ ఓ లేఖ విడుదల చేసింది. ‘‘ మేం, మా పిల్లలు ఒంటినిండా పేలుడు పదార్థాలు చుట్టుకుని వారిని పేల్చేస్తాం. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్‌ల్లోని కాషాయ ఉగ్రవాదులూ! చనిపోయేందుకు సిద్ధంగా ఉండండి’’ అని హెచ్చరించింది. మరో ఉగ్ర సంస్థ ఎంజీహెచ్ కూడా ముహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల చేసినందుకుగానూ నూపుర్ శర్మ బేషరతుగా ప్రపంచానికి క్షమాపణ చెప్పాలని లేకుంటే.. ప్రవక్తను అగౌరవపరిచినందుకు ఏం చేయాలో అది చేస్తాం’’ అంటూ టెలిగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. చదవండి: పరువు హత్య: వేరే కులం వ్యక్తితో ప్రేమ.. పోలంలో.. -
మరణించాడని భావిస్తే.. మళ్లీ ప్రత్యక్షమయ్యాడు..
-
మరణించాడని భావిస్తే.. మళ్లీ ప్రత్యక్షమయ్యాడు..
బీరూట్: కొద్ది నెలల క్రితమే మరణించాడని భావిస్తున్న అల్ కాయిదా చీఫ్ అయమాన్ అల్ జవహిరి తిరిగి ప్రత్యక్షమయ్యాడు. అమెరికాపై అల్‌కాయిదా దాడులు జరిపి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అల్‌కాయిదా విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన కనిపించాడు. ఈ విషయాన్ని జిహాదిస్టు వెబ్సైట్లను మానిటర్ చేసే సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ వెల్లడించింది. వీడియోలో అయమాన్ అల్ జవహిరి జెరూసలేం గురించి, జనవరిలో రష్యన్ బలగాలపై సిరియాలో జరిగిన దాడుల గురించి ప్రస్తావించాడు. అమెరికా బలగాలు అఫ్గాన్ నుంచి వెళ్లిపోవడంపైనా మాట్లాడాడు. తాలిబన్లు అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకోవడాన్ని మాత్రం ప్రస్తావిచంలేదు. దీంతో ఈ వీడియో జనవరి తర్వాత రికార్డు చేసి ఉండవచ్చని సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ అభిప్రాయపడింది. 2020 ఫిబ్రవరిలోనే అమెరికా–తాలిబన్ల మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో దాని గురించి మాట్లాడటాన్ని బట్టి వీడియో తాజాది అని చెప్పలేమని సైట్ పేర్కొంది. 2020 చివరలో ఆయన అనారోగ్యంతో మరణించి ఉంటాడని భావిస్తున్న నేపథ్యంలో ఈ వీడియో విడుదలైంది. మొత్తం 61 నిమిషాల, 37 సెకెన్ల నిడివి ఉన్న వీడియో విడుదలైందని సైట్ డైరెక్టర్ రిటా కాట్జ్ తెలిపారు. 2021 జనవరి తర్వాత ఆయన మరణించి ఉండవచ్చని అన్నారు. 2011లో ఒసామాను అమెరికా హతం చేసిన అనంతరం ఈజిప్టుకు చెందిన నేత అయమాన్ అల్ జవహిరి ఆల్కాయిదా చీఫ్‌గా మారాడు. -
ప్రపంచాన్ని చీకట్లో ముంచెత్తిన రోజు ఇది
20 Years For 9/11 Attacks: 9/11 ఉగ్రదాడులు. సెప్టెంబర్ 11, 2001.. ఈరోజు అమెరికా చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచాన్ని కొద్దిగంటలు చీకట్లోకి నెట్టేసిన రోజు. ట్విన్ టవర్స్, పెంటగాన్‌లపై వైమానిక దాడుల తర్వాత.. కరెంట్, ఇంటర్నెట్, శాటిలైట్, రేడియో ఫ్రీక్వెన్సీ కట్టింగ్లతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రపంచం మొత్తం భయాందోళలకు లోనైంది. ఇంతకీ దాడి టైంలో అప్పటి అధ్యక్షుడు బుష్ ఎక్కడున్నాడు? ఇప్పటి అధ్యక్షుడు బైడెన్ గురించి లాడెన్ ఆనాడు ఏం చెప్పాడు? 9/11 దాడులకు ఇరవై ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేక కథనం.. సెప్టెంబర్ 11 ఉగ్రదాడులు.. చరిత్రలోనే ఇప్పటిదాకా రికార్డు అయిన అతిపెద్ద ఉగ్రమారణహోమం. 11 ఎకరాల విస్తీర్ణంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లోకి హైజాక్ విమానాల ద్వారా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ప్రత్యక్షంగా సుమారు నాలుగు వేల మంది ప్రాణాల్ని బలిగొన్నారు. ఈ దాడి తర్వాత రకరకాల గాయాలతో, జబ్బులతో చనిపోయిన వాళ్ల సంఖ్య చాలా చాలా ఎక్కువ. నష్టపరిహారం కోసం ఇప్పటిదాకా 67,000 దరఖాస్తులు వచ్చాయి. వీసీఎఫ్(విక్టిమ్ కాంపంజేషన్ ఫండ్) ద్వారా 40 వేలమందికి పైగా.. దాదాపు 9 బిలియన్ల డాలర్ల నష్టపరిహారాన్ని అందజేసినట్లు నిర్వాహకురాలు రూపా భట్టాచార్య చెప్తున్నారు. ఈ లెక్కన బాధితుల సంఖ్య ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కారణాలు.. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద మారణహోమానికి అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ కారణమని చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో ఇజ్రాయెల్‌తో అమెరికా స్నేహహస్తం, సోమాలియా, మోరో అంతర్థ్యుద్దం(ఫిలిఫ్ఫైన్స్), రష్యా, లెబనాన్, కశ్మీర్(భారత్)లలో హింసాత్మక ఘటనలు, ముస్లింల అణచివేత, ఇస్లాం వ్యతిరేక కుట్రలకు అమెరికా వెన్నుదన్నుగా నిలిచిందన్నది అల్‌ఖైదా ప్రధాన ఆరోపణ. అంతేకాదు సౌదీ అరేబియా గడ్డపై యూఎస్ భద్రతా దళాల మోహరింపు, ఇరాక్‌కు వ్యతిరేకంగా ఆంక్షల విధింపు.. తదితర కారణాలు అమెరికాపై ఉగ్రవాద దాడులకు అల్‌ఖైదాను ఉసిగొల్పాయనేది వాదన. నాలుగోది ఫ్లాప్.. పక్కా ప్రణాళిక.. విమానం నడపడంలో శిక్షణ పొందిన 19 మంది ఉగ్రవాదులు. ఐదుగురు మూడు గ్రూపులుగా, నలుగురు ఒక గ్రూప్‌గా విడిపోయారు. సెప్టెంబర్ 11, 2001 ఉదయం మొత్తం నాలుగు విమానాల్ని హైజాక్ చేశారు. మొదటి ఫ్లైట్ అమెరికన్ ఎయిర్‌లైన్స్11ను.. ఉదయం 8గం.46ని.కు మాన్‌హట్టన్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌ను ఢీకొట్టారు. పదిహేడు నిమిషాల తర్వాత రెండో విమానం(యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175) వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్‌ను ఢీకొట్టింది. కేవలం గంటా నలభై రెండు నిమిషాల్లో 110 అంతస్తుల ట్విన్ టవర్స్ చూస్తుండగానే కుప్పకూలిపోయాయి. మంటలు.. దట్టమైన పొగ, ఆర్తనాదాలు, రక్షించమని కేకలు, ప్రాణభీతితో ఆకాశ హార్మ్యాల నుంచి కిందకి దూకేసిన భయానక దృశ్యాలు ఆన్కెమెరా రికార్డు అయ్యాయి. ఆ దాడులతో రెండు కిలోమీటర్ల మేర భవనాలు సైతం నాశనం అయ్యాయి. దట్టంగా దుమ్ము అలుముకుని మొత్తం ఆ ప్రాంతాన్ని పొద్దుపొద్దున్నే చీకట్లోకి నెట్టేశాయి ఉగ్రదాడులు. 9/11.. పెంటగాన్ దాడి దృశ్యం ఇక మూడో దాడి.. డల్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానాన్ని ఓహియో వద్ద హైజాక్ చేశారు. వర్జీనియా అర్లింగ్టన్ కౌంటీలోని పెంటగాన్ పడమర భాగాన్ని ఉదయం 9గం.37ని. నిమిషాలకు ఢీకొట్టారు. నాలుగో విమానం.. ఉ.10.03ని. సమయంలో పెన్సిల్వేనియా షాంక్స్విల్లే దగ్గర మైదానాల్లో క్రాష్ ల్యాండ్ అయ్యింది. బహుశా ఇది వైట్ హౌజ్ లేదంటే యూఎస్ పార్లమెంట్ భవనం లక్క్ష్యంగా దూసుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి భద్రతా దళాలు, రక్షణ దళాలు అప్రమత్తం అయ్యేలోపే ఊహించని ఘోరం జరిగిపోయింది. బుష్ చెవిలో ఊదింది ఆయనే సెప్టెంబర్ 11, 2001.. మంగళవారం ఉదయం. ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్.. ఉదయాన్నే చాలా నీరసంగా ఉన్నారు. అయినప్పటికీ కరోలీ బూకర్ ఎలిమెంటరీ స్కూల్లో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. పిల్లలతో ఇంటెరాక్ట్ అయిన టైంలో బుష్ చెవిలో ఏదో గొణిగాడు ఆండ్రూ కార్డ్. ఈయన వైట్‌హౌజ్‌లో చీఫ్ స్టాఫ్‌గా పని చేశాడు అప్పుడు. అయితే వాళ్లకు దాడి గురించి ప్రాథమిక సమాచారం తప్పుగా అందింది. ఓ చిన్న విమానం.. అదీ పైలెట్‌కు గుండెపోటు వల్ల జరిగిందన్న సమాచారంతో పొరబడి ఆ దుర్ఘటనలపై విచారం వ్యక్తం చేశారు వాళ్లు. కాసేపటికే అదొక కమర్షియల్ జెట్‌లైనర్ విమానమని, భారీ ఉగ్రదాడి అనే క్లారిటీ వచ్చింది. సెకండ్ గ్రేడ్ క్లాస్ రూంలో వైట్ హౌజ్ స్టాఫ్, యూఎస్ నేవీ కెప్టెన్ అంతా అధ్యక్షుడు బుష్‌తో భేటీ అయ్యారు. ఆటైంలోనే యూబీఎల్ అనే పేరును ప్రెసిడెంట్ బుష్ వద్ద ప్రస్తావించాడు కార్డ్. యూబీఎల్.. అంటే వుసామా బిన్ లాడెన్. ఈ దాడులకు సరిగ్గా నెల రోజుల క్రితం అమెరికాపై దాడులకు పాల్పడతామని లాడెన్ బెదిరించినట్లు సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ వైట్ హౌజ్‌కు నివేదిక సమర్పించిన విషయాన్ని కార్డ్ గుర్తు చేశాడు. కాసేపటికే పెంటగాన్ దాడి వార్త అందాక బుష్‌ను వైట్‌హౌజ్‌కు కాకుండా.. రహస్య ప్రాంతానికి తరలించి తర్వాతి ప్రణాళిక మీద చర్చలు జరిపారు. అఫ్గన్ ద్వారా వేట సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో చాలా మార్పులొచ్చాయి. ఆసియన్ దేశాల విషయంలో పాశ్చాత్య దేశాల ధోరణి పూర్తిగా మారిపోయింది. ట్రావెల్ బ్యాన్-ఆంక్షలు, మతవిద్వేష దాడులు పేట్రేగిపోయాయి. ఇక అల్‌ఖైదా మీద ప్రతీకారంతో అప్గన్ ఆక్రమణ చేపట్టిన అమెరికా సైన్యం.. ఒసామా బిన్‌లాడెన్ కోసం వేట మొదలుపెట్టింది. అయితే తొలుత ట్విన్ టవర్స్ దాడులతో తనకేం సంబంధం లేదని ప్రకటించుకున్న లాడెన్.. ఆ తర్వాత మూలకారకుడు తానే అని ఒప్పుకున్నట్లు వీడియో ఆధారాలు వెలుగు చూశాయి. దాడి జరిగిన పదేళ్ల తర్వాత 2011, మే 1న అబ్బోట్టాబాద్ (పాక్) దగ్గర అమెరికా సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్’లో లాడెన్ హతం అయినట్లు అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. బైడెన్ గురించి లాడెన్ లేఖ! తాజా అఫ్గన్ పరిణామాలు దాదాపు అందరికీ తెలిసినవే. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోగా.. తిరిగి తాలిబన్లు ఆక్రమణకు పాల్పడ్డారు. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తాలిబన్లు బిన్ లాడెన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 9/11 దాడుల్లో లాడెన్ ప్రమేయం లేదని, లాడెన్‌కు వ్యతిరేకంగా అమెరికా దొంగ సాక్క్క్ష్యాలు సృష్టించిందని, ఆధిపత్య ధోరణితో అఫ్గన్‌లో అమెరికా సైన్యం మోహరించిందంటూ వరుస ప్రకటనలు విడుదల చేశారు. ఇక అల్‌ఖైదా నేత బిన్ లాడెన్.. 2010లో రాసిన ఓ లేఖ తాలిబన్ పరిణామాల తర్వాత తెర మీదకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడి పోటీలో జో బైడెన్ పేరు తెర మీదకు రావడాన్ని ఒసాబా బిన్ లాడెన్ స్వాగతించాడని 48 పేజీల లేఖ ఒకటి విడుదల అయ్యింది. ‘బైడెన్ అధ్యక్ష పదవికి ముందస్తుగా సిద్ధంగా లేడు. అతను గనుక అధ్యక్షుడు అయితే.. అమెరికా దానంతట అదే సంక్షోభంలోకి కూరుకుపోతుంది. బైడెన్ అసమర్థన పాలన అమెరికాను నాశనం చేస్తుంద’ని ఆ లేఖలో లాడెన్ పేరిట రాసి ఉంది. అమెరికా 9/11 ఉగ్రదాడులకు 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. - సాక్షి, వెబ్‌డెస్క్ -
లాడనే మా హీరో: పాక్ మాజీ అధ్యక్షుడు
ఇస్లామాబాద్ : కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ తమ హీరో అని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విషయంలో పాకిస్తాన్ వైఖరిని ముషార్రఫ్ బహిర్గతం చేశారు. జిహాది ఉగ్రవాదులందరు పాక్ హీరోలంటూ కొనియాడారు. ఈ మేరకు ముషారప్ వ్యాఖ్యానించినట్లుగా పాక్ రాజకీయ నాయకుడు ఫర్హతుల్లా బాబర్ ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేశారు. వీడియో ప్రకారం.. పాకిస్తాన్‌కు లాభం చేకూర్చే విధంగా ఆఫ్ఘనిస్తాన్‌లో 1979లో మతపరమైన మిలిటెన్సిని ప్రవేశపెట్టామని తద్వారా దేశంలోని సోవియేట్లను వెళ్లిపోయే విధంగా కృషి చేశామని ముషారఫ్ అన్నారు. Gen Musharraf blurts that militants were nurtured and touted as 'heroes' to fight in Kashmir. If it resulted in destruction of two generations of Pashtuns it didn't matter. Is it wrong to demand Truth Commission to find who devised self serving policies that destroyed Pashtuns? https://t.co/5Q2LOvl3yb — Farhatullah Babar (@FarhatullahB) November 13, 2019 ‘ప్రపంచంలోని ముజాహిద్దీన్ ఉగ్రవాదులందరిని ఏకం చేశాం. అప్పట్లో లష్కరే తోయిబా, ఆల్‌ఖైదా ఉగ్రవాదులను ప్రోత్సహించాం. పాక్‌కు వచ్చే కశ్మీరీలను హీరోలుగా గుర్తించాం. మేము వారికి పటిష్టమైన శిక్షణ ఇచ్చాం. భారత ఆర్మీతో పోరాడే కశ్మీరులను ముజాహుద్దీన్‌లుగా గుర్తించాం. అంతర్జాతీయంగా పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల తమ హీరోలు విలన్లయ్యారు’ అని ముషారఫ్ వ్యాఖ్యానించారు. -
అల్‌ఖైదా కీలకనేత ఆసిమ్ ఉమర్ హతం
-
వారసుడొచ్చాడు.. ప్రపంచదేశాల గుండెల్లో రైళ్లు!
న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికాతో సహా ప్రపంచదేశాలను గడగడలాడించిన అల్‌ఖైదా ఉగ్ర సంస్ధకు వారసుడొచ్చాడా?. తాజా రిపోర్టులు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. వివిధ ఉగ్రసంస్ధల సహచర్యంతో తిరుగులేని శక్తిగా ఎదగడానికి అల్‌ఖైదా యత్నిస్తున్నట్లు కూడా సమాచారం. అల్‌ఖైదా వ్యవస్ధాపకుడు ఒసామా బిన్ లాడెన్ కొడుకు 28 ఏళ్ల హమ్జా బిన్ లాడెన్ సంస్ధ పగ్గాలు చేపట్టినట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తున్న ఐసిస్ పీడను వదిలించుకునేందుకు మల్లగుల్లాలు పడుతున్న ప్రపంచరాజ్యాలు.. కొత్తగా ఊపిరులూదుకుని ఓ శక్తిగా వస్తున్న అల్‌ఖైదాను ఎలా అడ్డుకోవాలా? అని ఆలోచిస్తున్నాయి. ఇందుకోసం హమ్జా కదలికలపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి. ఒసామా బిన్ లాడెన్ మహ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వ్యక్తి. దీంతో ఒసామా కొడుకు హమ్జా పిలుపునిస్తే వేలాదిగా ముస్లిం యువత సంస్ధలో చేరి ప్రాణత్యాగానికి సిద్ధపడతారనే వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రపంచదేశాల్లో మరింత భయం పెరుగుతోంది. గడిచిన రెండు సంవత్సరాల్లో యూరప్ ఖండంలో అత్యధిక సార్లు ఉగ్రదాడులు జరిగాయి. అల్‌ఖైదా పునరుజ్జీవనం పోసుకుంటుందనే వార్త ఆ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. అల్‌ఖైదాకు చెందిన పలువురు అగ్ర నాయకులు కూడా గతంలో హమ్జానే వారసుడని తీర్మానించారు. రెండేళ్ల క్రితమే అతన్ని ‘గుహ నుంచి వచ్చిన సింహం’ అని అల్‌ఖైదా కీలక నేత అల్ జవహరి అభివర్ణించాడు. ఒసామాకు ఉన్న 20 మంది సంతానంలో హమ్జా 15వ వాడు. మూడో భార్య ఖైరియా సబర్ కుమారుడు. ఆమెకు ఉన్న సంతానంలో హమ్జా ఒక్కడే కుమారుడు. ఖైరియా అంటే ఒసామాకు ఎంతో ఇష్టం. సౌదీ అరేబియాకు చెందిన ఆమె మహమ్మద్ ప్రవక్త కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నతనంలో హమ్జా తల్లిదండ్రుల వద్దే పెరిగాడు. మొదట సౌదీ అరేబియా, సుడాన్, ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్లలో కూడా నివసించాడు. హమ్జాకు కూడా వివాహం అయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. అయితే, హమ్జా ఎదిగిన తర్వాతి ఫోటో ఇంతవరకూ బయటకు రాలేదు. కేవలం అతని చిన్ననాటి ఫోటోనే నిఘా వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది. హమ్జాను అల్‌ఖైదా కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులు భావించేవారు. అయితే తాను దూరంగా ఎందుకుండాలంటూ హమ్జా వారితో వాదించేవాడట. అమెరికాలో దాడులు అనంతరం ఒసామా బిన్ లాడెన్, ఇతర అనుచరులు తూర్పు అఫ్ఘానిస్థాన్లోని తోరాబోరా కొండల్లో దాక్కున్నారు. అప్పుడే ఒసామా తన భార్యాపిల్లలను ఇరాన్‌లోని సురక్షిత ప్రాంతాలకు పంపించి వేశాడు. అనంతరం హమ్జా తండ్రిని పెద్దగా కలిసింది లేదు. ఇరాన్లో దాదాపుగా గృహ నిర్బంధంలో ఉన్నట్టుగా ఉండేవాడు. దీనిపై అసంతృప్తి చెందుతూ పవిత్ర సైనికుని(మొజాహిదీన్)గా పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ 2009లో తండ్రికి పెద్ద ఉత్తరం రాశాడు హమ్జా. ఉగ్ర పోరాటాలతో సాధ్యమైనన్ని మార్గాల్లో ఆయా దేశాలకు నష్టం కలిగించాలని అనుచరులకు హమ్జా చెబుతున్నట్టు తెలిసింది.