Amelia Kerr
-
WPL 2025: దంచికొట్టిన హర్మన్.. ధనాధన్ హాఫ్ సెంచరీ
మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో ఫైనల్ చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముంబై ఇండియన్స్.. గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో మెరుగైన స్కోరు సాధించింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్.. హర్మన్‌ప్రీత్ కౌర్ బృందాన్ని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్ముంబై ఓపెనర్లలో అమెలియా కౌర్(5) విఫలం కాగా.. మరో ఓపెనర్ హేలీ మాథ్యూస్(27) ఫర్వాలేదనిపించింది. వన్‌డౌన్ బ్యాటర్ నాట్ సీవర్-బ్రంట్ 38 పరుగులతో రాణించగా.. హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 33 బంతుల్లోనే 6 ఫోర్ల సాయంతో 54 పరుగులు రాబట్టింది.మిగతా వాళ్లలో అమన్‌జ్యోత్ కౌర్(15 బంతుల్లో 27) దంచికొట్టగా.. సజీవన్ సంజన మెరుపు(6 బంతుల్లో 11, నాటౌట్)లు మెరిపించింది. ఆఖర్లో వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా 4 బంతుల్లోనే 13 పరుగులతో దుమ్ములేపింది. ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు స్కోరు చేసింది.ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారుగుజరాత్ జెయింట్స్ బౌలర్లలో తనూజ కన్వార్, కశ్వీ గౌతం, ప్రియా మిశ్రా, కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. WPL-2025లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారైన విషయం తెలిసిందే. ఎనిమిదింట ఐదు విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ పది పాయింట్లతో టాప్‌లో కొనసాగుతుండగా.. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ చెరో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు సాధించి.. ఢిల్లీతో కలిసి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి.టాప్‌లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్కుఅయితే, పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. అయితే, లీగ్ దశలో గుజరాత్‌కు తాజా మ్యాచ్ రూపంలో ఒకే మ్యాచ్ మిగిలి ఉండగా.. ముంబైకి గుజరాత్‌తో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ కూడా మిగిలే ఉంది.ఈ నేపథ్యంలో సోమవారం నాటి మ్యాచ్‌లో గుజరాత్‌ను.. తదుపరి మంగళవారం బెంగళూరును ఓడిస్తే పన్నెండు పాయింట్లతో నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది. అందుకే గుజరాత్‌ను ఓడించి.. ఆ తర్వాత బెంగళూరు జట్టు పనిపట్టాలని హర్మన్‌సేన పట్టుదలగా ఉంది. ఇక ముంబై ఇండియన్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ఫలితాన్ని బట్టి గుజరాత్ భవితవ్యం తేలిపోనుంది.డబ్ల్యూపీఎల్-2025: ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్తుదిజట్లుముంబై ఇండియన్స్:హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ సీవర్- బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కర్, సజీవన సంజన, జి.కమలిని, అమన్‌జోత్ కౌర్, సంస్కృతి గుప్తా, షబ్నం ఇస్మాయిల్, పరుణిక సిసోడియాగుజరాత్ జెయింట్స్బెత్ మూనీ(వికెట్ కీపర్), హర్లిన్ డియోల్, ఆష్లే గార్డ్నర్(కెప్టెన్), డియాండ్రా డాటిన్, కశ్వీ గౌతం, సిమ్రన్ షేక్, ఫోబే లిచ్‌ఫీల్డ్, భార్తి ఫల్మాలి, తనుజ కన్వార్, మేఘనా సింగ్, ప్రియా మిశ్రా. View this post on Instagram A post shared by Women's Premier League (WPL) (@wplt20) -
ICC: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్.. తొలి ప్లేయర్‌గా
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్(Amelia Kerr) సరికొత్త చరిత్ర సృష్టించింది. ‘ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్(ICC Women's Cricketer Of The Year)’ అవార్డు గెలుచుకున్న తొలి కివీ ప్లేయర్‌గా నిలిచింది.సౌతాఫ్రికాకు చెందిన లారా వొల్వర్ట్(Laura Wolvaardt), శ్రీలంక స్టార్ చమరి ఆటపట్టు, ఆస్ట్రేలియా క్రికెటర్ అనాబెల్ సదర్లాండ్లను వెనక్కి నెట్టి ‘ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- 2024 అవార్డును సొంతం చేసుకుంది. తద్వారా ప్రతిష్టాత్మక రేచల్ హేహో ఫ్లింట్ ట్రోఫీని ముద్దాడనుంది.మోస్ట్ డేంజరస్ప్లేయర్కాగా 24 ఏళ్ల అమేలియా కెర్ వరల్డ్‌క్లాస్ ఆల్‌రౌండర్‌గా ఎదిగింది. తన లెగ్ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించే అమేలియా.. ప్రపంచంలోని మోస్ట్ డేంజరస్ బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. మైదానంలో పాదరసంలా కదులుతూ అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యాలు కనబరిచే అమేలియా.. ఎన్నో సార్లు ‘వైట్ ఫెర్న్స్’(న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు)ను ఒంటిచేత్తో గెలిపించింది.టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటిఇక గతేడాది జరిగిన ఐసీసీ మహిళ టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో కెర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. న్యూజిలాండ్ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించడంలో కీలక పాత్ర పోషించిన ఆమె.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకుంది. సౌతాఫ్రికాతో ఫైనల్లో కేవలం 24 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయడంతో పాటు.. 43 పరుగులు చేసింది. ఈ టోర్నీలో మొత్తంగా 15 వికెట్లు పడగొట్టింది. ఇక మొత్తంగా 2024లో 18 అంతర్జాతీయ టీ20లు ఆడిన అమేలియా కెర్.. 387 పరుగులు చేయడంతో పాటు.. 29 వికెట్లు పడగొట్టింది. ఆమె జ్ఞాపకార్థంఅదే విధంగా.. గతేడాది తొమ్మిది వన్డేల్లో కలిపి 264 పరుగులు చేసిన అమేలియా కెర్.. పద్నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక గతేడాదికిగానూ ఐసీసీ అత్యుత్తమ మహిళా క్రికెటర్‌గా అవార్డును అమేలియా సొంతం చేసుకంది. కాగా మహిళల క్రికెట్‌కు మార్గదర్శకులుగా నిలిచారు ఇంగ్లండ్ క్రికెటర్ రేచల్ హేహో ఫ్లింట్. ఆమె జ్ఞాపకార్థం 2017 నుంచి ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన వారికి రేచల్ హేహో ఫ్లింట్ ట్రోఫీని అందిస్తున్నారు. 2017 నుంచి భారత క్రికెటర్ స్మృతి మంధాన, ఆస్ట్రేలియా క్రికెటర్ ఎలిస్సా పెర్రీ రెండేసిసార్లు ఈ ట్రోఫీని అందుకోగా.. ఇంగ్లండ్ ప్లేయర్ నాట్ సీవర్- బ్రంట్ కూడా రెండుసార్లు (2022, 2023)ఈ అవార్డును ముద్దాడింది. ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ స్మృతిగత సంవత్సరం స్మృతి మంధాన అద్భుత ఆటతీరు కనబరిచింది. 2024లో స్మృతి 13 వన్డేలు ఆడి 747 పరుగులు సాధించింది. ఇందులో 4 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. గతేడాది స్మృతి మొత్తం 95 ఫోర్లు, 6 సిక్స్‌లు కొట్టింది. ఆస్ట్రేలియాతో 4 వన్డేలు ఆడి 151 పరుగులు చేసిన స్మృతి... న్యూజిలాండ్‌పై 105 పరుగులు (3 వన్డేల్లో), దక్షిణాఫ్రికాపై 343 పరుగులు (3 వన్డేల్లో), వెస్టిండీస్‌పై 148 పరుగులు (3 వన్డేల్లో) సాధించింది.ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లపై ఒక్కో శతకం సాధించిన స్మృతి దక్షిణాఫ్రికాపై రెండు సెంచరీలు నమోదు చేసింది. ఐసీసీ ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు గెల్చుకోవడం స్మృతి మంధానకిది రెండోసారి. 2018లోనూ ఆమెకు ఈ పురస్కారం లభించింది. భారత్ నుంచి ఈ అవార్డు సాధించిన ఏకైక మహిళా క్రికెటర్ కూడా స్మృతినే కావడం విశేషం. చదవండి: T20 WC 2025: భారత్‌తో పాటు సెమీస్ చేరిన జట్లు ఇవే.. షెడ్యూల్ వివరాలు