'ఆ భూకంపంతో నా జీవితం రంగులమయం'
కఠ్మాండు: ప్రళయం, విపత్తులాంటిది గుర్తొస్తే శరీరం భయంతో కంపిస్తుంది. అది ఎదుర్కొన్నవారికైతే ఓ క్షణం ఆ పాత జ్ఞాపకాలు ఊపిరిని ఓ ఆక్షణం ఆపేసి మళ్లీ వదిలిపెడుతుంటాయి. అందుకే వీలయినంత వరకు ఆక్షణాల గురించి ఆలోచించే సాహసం ఎవరూ చేయరు. కానీ, నేపాల్ ఓ పదహారేళ్ల బాలుడు మాత్రం అలాంటి ప్రళయాన్ని గుర్తు తెచ్చుకునేందుకు సంతోషపడుతున్నాడు. గత ఏడాది నేపాల్ ను నేలమట్టం చేసిన భూకంపం తన జీవితాన్ని మార్చేసిందని చెప్తున్నాడు.
అప్పటి వరకు ఎవరూ పట్టించుకోని నీ జీవితం ఇప్పుడు కొత్త వెలుగురేఖలతో ప్రయాణిస్తుందని చెప్తున్నాడు. గత ఏడాది నేపాల్ లో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, అమిర్ బోమ్ జాన్ అనే పదహారేళ్ల బాలుడు మాత్రం బతికి బయటపడ్డాడు. అత్యంత అరుదైన రోగంతో కేవలం తలకాయ మాత్రం పనిచేస్తూ మెడ నుంచి క్రింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయి ఉన్న ఇతడు ఓ ఎజెన్సీ గ్రామానికి చెందినవాడు.
పేదరికం, నిరక్షరాస్యత, సౌకర్యాల లేమి కారణంగా అతడి తల్లిదండ్రులు ఎప్పుడో ఓ చీకటి గదిలో ఉంచేవారు. అయితే, భూకంపం వచ్చిన వీళ్ల ఊరంతా కూడా దాని బారిన పడి శిథిలాల కింద ఇరుక్కుపోయాడు. సహాయక చర్యల్లో అతడు సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో అతడిని కఠ్మాండ్లోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల స్కూల్లో చేర్చించారు. ఆ స్కూల్లో చేరిన తర్వాత అతడి గతమంతా మారిపోయింది. పైగా నోటితో బ్రష్ పట్టుకొని పెయింటింగ్ వేయడం నేర్చుకున్నాడు.
అతడి టాలెంట్ ను గుర్తించిన కరుణ అనే స్వచ్ఛంద సంస్థ అతడికి ప్రోత్సాహన్నిస్తూ ఆ పెయింటింగ్స్ కూడా కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం స్పెషల్ స్కూల్లోని ఉండి చదువుకుంటూ బొమ్మలు వేసి గడిపేస్తున్న అమిర్ మాట్లాడుతూ 'నాకు చేతి వ్రాత లేదు.. నోటి రాత రాస్తాను' అని జోక్ చేశాడు. రాయగలను, పాడగలను, బొమ్మలు వేయగలను అని చెప్పాడు. ఆ భూకంపం ఎంతో మందిని పొట్టనపెట్టుకొని ఉండొచ్చుకానీ.. నా జీవితాన్ని మాత్రం రంగుల మయం చేసి వెళ్లిందని అంటున్నాడు అమిర్.