Amit Dhankar
-
అమిత్, విక్కీలకు రజతాలు
జియాన్ (చైనా): గత ఏడాది ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో కేవలం రెండు కాంస్య పతకాలు నెగ్గిన భారత రెజ్లర్లు ఈసారి మాత్రం అదరగొట్టారు. బుధవారం ముగిసిన ఫ్రీస్టయిల్ విభాగంలో రెండో రోజు భారత్‌కు రెండు రజతాలు, మూడు కాంస్య పతకాలు లభించాయి. ఓవరాల్‌గా భారత్‌కు ఈ విభాగంలో ఒక స్వర్ణం, మూడు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు వచ్చాయి. ఫలితంగా భారత్ 155 పాయింట్లతో టీమ్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. 220 పాయింట్లతో ఇరాన్ ఓవరాల్ చాంపియన్ టైటిల్‌ను గెల్చుకుంది. బుధవారం జరిగిన ఐదు ఈవెంట్స్‌లో బరిలోకి దిగిన భారత రెజ్లర్లు పతకాలు నెగ్గడం విశేషం. అమిత్ ధన్కర్ (74 కేజీలు), విక్కీ (92 కేజీలు) రజత పతకాలు సొంతం చేసుకోగా... రాహుల్ అవారె (61 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు), సుమీత్ (125 కేజీలు) కాంస్య పతకాలను దక్కించుకున్నారు. 74 కేజీల ఫైనల్లో 2013 ఆసియా చాంపియన్ అమిత్ 0–5తో కైసనోవ్ దానియర్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. ‘ఫైనల్లో ఓడినందుకు నిరాశగా ఉంది. అయితే తాజా ప్రదర్శన నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రాబోయే టోర్నీల్లో మరింత మెరుగ్గా రాణిస్తా. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తా’ అని అమిత్ అన్నాడు. 92 కేజీల ఫైనల్లో విక్కీ 0–11తో అలీరజా కరిమిమచియాని (ఇరాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. సెమీస్‌లో విక్కీ 3–2తో జియో సన్ (చైనా)పై గెలిచాడు. కాంస్య పతక బౌట్లలో రాహుల్ అవారె 9–2తో కిమ్ జిన్ చెయోల్ (కొరియా)పై, దీపక్ పూనియా 8–2తో కొదిరోవ్ బఖ్దుర్ (తజకిస్తాన్)పై, సుమీత్ 8–2తో అనకులోవ్ ఫర్ఖోద్ (తజికి స్తాన్)పై విజయం సాధించా రు. నేడు మహిళల ఫ్రీస్టయిల్ విభాగం పోటీలు మొదలవుతాయి. భారత్ తరఫున సీమా (50 కేజీలు), లలిత షెరావత్ (55 కేజీలు), మంజు (59 కేజీలు), దివ్య కక్రాన్ (68 కేజీలు), పూజా (76 కేజీలు) బరిలోకి దిగనున్నారు. -
రిక్త హస్తాలతో వెనక్కి...
పారిస్: భారీ అంచనాలతో ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన భారత రెజ్లర్లు ఒక్క పతకం కూడా గెలవకుండానే వెనుదిరిగారు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో చివరిరోజు బజరంగ్ (65 కేజీలు), అమిత్ ధన్కర్ (70 కేజీలు), ప్రవీణ్ రాణా (74 కేజీలు), సత్యవర్త్ (97 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్‌ను దాటలేకపోయారు. ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లలో బజరంగ్ 5–6తో ఐకోబిష్విలి (జార్జియా) చేతిలో, ప్రవీణ్ రాణా 0–5తో హసనోవ్ (అజర్బైజాన్) చేతిలో, సత్యవర్త్ 0–5తో కెటోవ్ (అర్మేనియా) చేతిలో... అమిత్ తొలిరౌండ్లో 2–9తో తనతరోవ్ (కజకిస్తాన్) చేతిలో ఓడారు. పురుషుల ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్, మహిళల ఫ్రీస్టయిల్ విభాగాల్లో కలిపి మొత్తం 24 మంది భారత రెజ్లర్లు బరిలోకి దిగగా... మహిళల 53 కేజీల విభాగంలో శీతల్ తోమర్ క్వార్టర్ ఫైనల్ చేరుకోవడమే భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన. మిగతా వారందరూ ప్రిక్వార్టర్ ఫైనల్‌ను దాటలేకపోయారు. -
కామన్వెల్త్ రెజ్లింగ్‌లో భారత్ స్వర్ణాల జోరు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు స్వర్ణాలతో అదరగొట్టారు. సింగపూర్‌లో జరుగుతున్న ఈ పోటీల పురుషుల ఫ్రీస్టరుుల్ విభాగంలో శనివారం సందీప్ తోమర్ (57కేజీ), అమిత్ ధన్కర్ (70కేజీ), సత్యవర్త్ కడియన్ (97కేజీ)లకు స్వర్ణాలు దక్కగా వినోద్(70కేజీ), రౌబల్జీత్ (97)లకు రజతాలు దక్కారుు. గ్రీకో రోమన్లో మనీష్ (66కేజీ), గుర్ప్రీత్ (75కేజీ), హర్‌ప్రీత్ సింగ్ (80కేజీ), ప్రభ్‌పాల్ (85కేజీ), నవీన్ (130కేజీ) తొలిస్థానంలో నిలిచారు. అలాగే మహిళల విభాగంలో రితూ ఫోగట్ (48కేజీ), రేష్మ మనే (63కేజీ), లలితా (55కేజీ), పింకీ, మను (58కేజీ) కూడా స్వర్ణాలు సాధించారు. జ్యోతి (75కేజీ), ని క్కీ, సోమాలి (75కేజీ) రజతాలు అందుకున్నారు.