రిక్త హస్తాలతో వెనక్కి... | World Wrestling Championships: India wrestlers fail to win single medal | Sakshi
Sakshi News home page

రిక్త హస్తాలతో వెనక్కి...

Published Sun, Aug 27 2017 1:48 AM | Last Updated on Tue, Sep 12 2017 1:02 AM

World Wrestling Championships: India wrestlers fail to win single medal

పారిస్‌: భారీ అంచనాలతో ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన భారత రెజ్లర్లు ఒక్క పతకం కూడా గెలవకుండానే వెనుదిరిగారు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో చివరిరోజు బజరంగ్‌  (65 కేజీలు), అమిత్‌ ధన్‌కర్‌ (70 కేజీలు), ప్రవీణ్‌ రాణా (74 కేజీలు), సత్యవర్త్‌ (97 కేజీలు) ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ను దాటలేకపోయారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బౌట్‌లలో బజరంగ్‌ 5–6తో ఐకోబిష్‌విలి (జార్జియా) చేతిలో, ప్రవీణ్‌ రాణా 0–5తో హసనోవ్‌ (అజర్‌బైజాన్‌) చేతిలో, సత్యవర్త్‌ 0–5తో కెటోవ్‌ (అర్మేనియా) చేతిలో... అమిత్‌ తొలిరౌండ్‌లో 2–9తో తనతరోవ్‌ (కజకిస్తాన్‌) చేతిలో ఓడారు. పురుషుల ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్, మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగాల్లో కలిపి మొత్తం 24 మంది భారత రెజ్లర్లు బరిలోకి దిగగా... మహిళల 53 కేజీల విభాగంలో శీతల్‌ తోమర్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకోవడమే భారత్‌ తరఫున అత్యుత్తమ ప్రదర్శన. మిగతా వారందరూ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ను దాటలేకపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement