‘హింద్‌ కేసరి’ అభిజీత్‌ | Wrestler Abhijit Katke Wins Hind Kesari | Sakshi
Sakshi News home page

National Indian Style Wrestling: ‘హింద్‌ కేసరి’ అభిజీత్‌

Published Mon, Jan 9 2023 7:22 AM | Last Updated on Mon, Jan 9 2023 7:22 AM

Wrestler Abhijit Katke Wins Hind Kesari - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక ‘హింద్‌ కేసరి’ జాతీయ సీనియర్‌ ఇండియన్‌ స్టయిల్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో మహారాష్ట్ర రెజ్లర్‌ అభిజీత్‌ కాట్కే చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం రాత్రి ఎల్బీ స్టేడియంలో జరిగిన పురుషుల ‘హింద్‌ కేసరి’ టైటిల్‌ బౌట్‌ ఫైనల్లో అభిజీత్‌ 5–0తో హరియాణాకు చెందిన సోమ్‌వీర్‌పై విజయం సాధించాడు.

విజేత అభిజీత్‌ తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, వి. శ్రీనివాస్‌ గౌడ్, మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ చేతుల మీదుగా మూడు కిలోల వెండి గదను అందుకున్నాడు. ఫైనల్స్‌కు ముఖ్య అతిథిగా హాజరైన క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రెజ్లింగ్‌ అకాడమీలను స్థాపించేందుకు ప్రయత్నిస్తామని, కుస్తీ క్రీడకు పూర్వ వైభవం లభించేలా కృషి చేస్తామని తెలిపారు. 

‘మహిళా హింద్‌ కేసరి’ టైటిల్‌ హరియాణాకు చెందిన పుష్ప సొంతం చేసుకుంది. ఫైనల్లో పుష్ప ఢిల్లీకి చెందిన మోహినిపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. పుష్ప, మోహిని మధ్య జరిగిన టైటిల్‌ బౌట్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వీక్షించారు. అనంతరం విజేత పుష్పను కవిత అభినందించారు. 

మెరిసిన తెలంగాణ రెజ్లర్లు... 
‘హింద్‌ కేసరి’ టైటిల్‌ బౌట్స్‌ కాకుండా మిగతా వెయిట్‌ కేటగిరీలలో తెలంగాణ రెజ్లర్లు ఆకట్టుకున్నారు. మహిళల 62 కేజీల విభాగంలో సాహిర్‌ ఇబ్రహీమ్‌.. 48 కేజీల విభాగంలో బాలమణి.. 56 కేజీల విభాగంలో శ్రావణి తెలంగాణకు కాంస్య పతకాలు అందించారు. పురుషుల 60 కేజీల విభాగంలో తెలంగాణ రెజ్లర్లు నితీశ్, సయ్యద్‌ అబ్దుల్‌... 65 కేజీల విభాగంలో విజయ్‌ కుమార్‌... 70 కేజీల విభాగంలో దినేశ్, విజయ్‌... 75 కేజీల విభాగంలో హంజా బామస్, సయ్యద్‌ బిన్‌ అబ్దుల్లా... 80 కేజీల విభాగంలో సందీప్‌ యాదవ్‌ కాంస్య పతకాలు సాధించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement