Bajrang
-
బజరంగ్, పింకీ పసిడి పట్టు
టర్కీలో జరిగిన యాసర్ డొగు స్మారక అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నీలో బజరంగ్ 70 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో బజరంగ్‌తో తలపడాల్సిన ఆండ్రీ క్విటాయోస్కో (ఉక్రెయిన్) గాయం కారణంగా బరిలోకి దిగలేదు. 61 కేజీల విభాగం ఫైనల్లో సందీప్ తోమర్ (భారత్) 2–8తో యాఖెకెషి (ఇరాన్) చేతిలో ఓడి రజతం దక్కించుకున్నాడు. 57 కేజీల విభాగంలో విక్కీ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. మహిళల 55 కేజీల విభాగంలో పింకీ స్వర్ణం గెలిచింది. సీమా (53 కేజీలు), పూజా «(57 కేజీలు), రజని (72 కేజీలు) రజతాలు... సరిత (62 కేజీలు), సంగీత (59 కేజీలు), గీత ఫొగాట్ (65 కేజీలు) కాంస్యాలు నెగ్గారు. -
రిక్త హస్తాలతో వెనక్కి...
పారిస్: భారీ అంచనాలతో ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన భారత రెజ్లర్లు ఒక్క పతకం కూడా గెలవకుండానే వెనుదిరిగారు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో చివరిరోజు బజరంగ్ (65 కేజీలు), అమిత్ ధన్కర్ (70 కేజీలు), ప్రవీణ్ రాణా (74 కేజీలు), సత్యవర్త్ (97 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్‌ను దాటలేకపోయారు. ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లలో బజరంగ్ 5–6తో ఐకోబిష్విలి (జార్జియా) చేతిలో, ప్రవీణ్ రాణా 0–5తో హసనోవ్ (అజర్బైజాన్) చేతిలో, సత్యవర్త్ 0–5తో కెటోవ్ (అర్మేనియా) చేతిలో... అమిత్ తొలిరౌండ్లో 2–9తో తనతరోవ్ (కజకిస్తాన్) చేతిలో ఓడారు. పురుషుల ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్, మహిళల ఫ్రీస్టయిల్ విభాగాల్లో కలిపి మొత్తం 24 మంది భారత రెజ్లర్లు బరిలోకి దిగగా... మహిళల 53 కేజీల విభాగంలో శీతల్ తోమర్ క్వార్టర్ ఫైనల్ చేరుకోవడమే భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన. మిగతా వారందరూ ప్రిక్వార్టర్ ఫైనల్‌ను దాటలేకపోయారు. -
సాక్షి, బజరంగ్‌లపై దృష్టి
నేటి నుంచి ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పారిస్: పతకమే లక్ష్యంగా సోమవారం మొదలయ్యే ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు బరిలోకి దిగనున్నారు.పురుషుల ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్... మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో కలిపి భారత్ తరఫున మొత్తం 24 మంది ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్నారు. గత ఏడాది రియో ఒలింపిక్స్‌లో 58 కేజీల విభాగంలో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించిన సాక్షి మలిక్ ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గురువారం 60 కేజీల విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. సాక్షితోపాటు వినేశ్ ఫోగట్ (48 కేజీలు)పై భారత బృందం ఆశలు పెట్టుకుంది. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో సందీప్ తోమర్ (57 కేజీలు), బజరంగ్ పూనియా (65 కేజీలు), సత్యవర్త్ కడియన్ (97 కేజీలు) పతకాలపై ఆశలు రేకెత్తిస్తున్నారు. ఈ ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన బజరంగ్ 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 60 కేజీల విభాగంలో పోటీపడి కాంస్య పతకం సాధించాడు. తొలి రోజు సోమవారం గ్రీకో రోమన్ విభాగంలో (71 కేజీలు, 75 కేజీలు, 85 కేజీలు, 98 కేజీలు) పోటీలు జరుగుతాయి. రాత్రి గం. 10.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం -
బజరంగ్‌కు స్వర్ణం
న్యూఢిల్లీ: డేవ్ షుల్జ్ స్మారక అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత రెజ్లర్ బజరంగ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల ఫ్రీస్టయిల్ 61 కేజీల విభాగం ఫైనల్లో బజరంగ్ 12-3 పాయింట్ల తేడాతో వ్లాదిమిర్ ఫ్లెగోన్తోవ్ (రష్యా)పై గెలిచాడు. భారత్‌కే చెందిన రాహుల్ అవారె (57 కేజీలు), ప్రవీణ్ రాణా (70 కేజీలు), నర్సింగ్ యాదవ్ (74 కేజీలు) పతకాలు నెగ్గడంలో విఫలమయ్యారు. స్టార్ రెజ్లర్లు యోగేశ్వర్ దత్, సుశీల్ కుమార్ ఈ టోర్నీలో బరిలోకి దిగలేదు. -
‘పీకే’ థియేటర్లపై బజరంగ్ దాడి
హిందూ దేవతలను కించపరచారని ఆందోళన అహ్మదాబాద్/భోపాల్: బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్ నటించిన ‘పీకే’ సినిమాలో హిందూ దేవతలను హాస్యాస్పదంగా చిత్రీకరించి, తమ మనోభావాలను కించపరచారని భోపాల్, అహ్మబాదాద్‌లలో ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లపై సోమవారం బజరంగ్దళ్ సభ్యులు దాడి చేశారు. అహ్మదాబాద్‌లో కర్రలు, రాడ్లతో వచ్చిన పాతిక మంది రెండు థియేటర్ల అద్దాలు పగలగొట్టి, పోస్టర్లు చింపేశారు. నిందితులను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ దాడికి తామే బాధ్యులమని, పీకేను నిలిపేయకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేస్తామని భోపాల్ బజరంగ్దళ్ చీఫ్ జ్వలిత్ మెహతా హెచ్చరించారు. ఆమిర్ ఉద్దేశం సరైందైతే ఆయన మతానికి చెందిన దేవుళ్లను ఎందుకలా చిత్రీకరించరని ప్రశ్నించారు. అయితే అంతకుముందే ఇలాంటి వ్యాఖ్యల్ని ఆమిర్ కొట్టిపడేశారు. తనకు అన్ని మతాలు సమానమేనని, తన సినిమా సిబ్బందిలో 99 శాతం మంది హిందువులేనని పేర్కొన్నారు. -
భజరంగ్ ‘రజత' పట్టు
ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో భారత రెజ్లర్ భజరంగ్ రజతం గెలవగా, నర్సింగ్ యాదవ్ కాంస్యం సాధించి ఘనంగా ముగింపు పలికారు. పురుషుల 61 కేజీల ఫైనల్లో భజరంగ్ 1-3తో మసూద్ మహ్మద్ (ఇరాన్) చేతిలో ఓడి రెండో స్థానంలో నిలిచాడు. అంతకుముందు సెమీస్‌లో భజరంగ్ 3-1తో తకసుకా నోరియూకి (జపాన్)పై; క్వార్టర్స్‌లో 4-1తో ఉస్మాన్జోడా ఫర్కోడి (తజకిస్థాన్)పై గెలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. పురుషుల 74 కేజీల కాంస్య పతక పోరులో పంచమ్ నర్సింగ్ యాదవ్ 3-1తో డైసుక్ షిమాడా (జపాన్)పై నెగ్గాడు. రెప్‌చేజ్ రౌండ్లో నర్సింగ్ 4-1తో రంజాన్ కంబరోవ్ (తుర్క్మెనిస్థాన్)పై నెగ్గి కాంస్యం పోరుకు అర్హత సాధించాడు. 86 కేజీల రెప్‌చేజ్ రౌండ్లో మాత్రం పవన్ కుమార్ నిరాశపర్చాడు. 1-4తో జాంగ్ ఫెంగ్ (చైనా) చేతిలో ఓడాడు. క్వార్టర్స్‌లో వికాస్ క్రిషన్ బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్ బౌట్లలో బరిలోకి దిగిన ముగ్గురు బాక్సర్లు నిరాశపరిచారు. అయితే పురుషుల మిడిల్ 75కేజీ విభాగంలో వికాస్ క్రిషన్ క్వార్టర్స్ చేరి పతకంపై ఆశలు పెంచాడు. తను ప్రిక్వార్టర్స్‌లో 3-0తో అజామత్ ఉలు (కిర్గిస్థాన్)ను ఓడించాడు. సెమీస్‌లో చోటు కోసం తను నొర్మతోవ్ (ఉజె ్బకిస్థాన్)ను ఢీకొంటాడు. ఇక పురుషుల ఫ్లయ్ 52కేజీ విభాగం క్వార్టర్స్‌లో గౌరవ్ బిదురి ... వెల్టర్ 69కేజీ విభాగం క్వార్టర్స్‌లో మన్దీప్ జంగ్రా... లైట్ హెవీ 81కేజీ క్వార్టర్స్‌లో కుల్దీప్ సింగ్ తమ ప్రత్యర్థుల చేతిలో పరాజయం పాలయ్యారు. హాకీ: సెమీస్‌లో ఓడిన మహిళలు మహిళల హాకీ సెమీఫైనల్లో భారత్ 1-3 చేతిలో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. మూడో నిమిషంలోనే కొరియా తొలి గోల్‌తో దూసుకెళ్లగా 11వ నిమిషంలో నమిత టొప్పో భారత్ తరఫున ఏకైక గోల్ సాధించింది. కాంస్యం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్.. జపాన్ను ఎదుర్కొంటుంది. భారత పురుషుల హాకీ జట్టు నేడు (మంగళవారం) జరిగే సెమీఫైనల్లో పటిష్ట దక్షిణ కొరియాను ఢీకొంటుంది. కబడ్డీ: ఆరు సార్లు చాంపియన్‌గా నిలిచిన భారత పురుషుల జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్ ‘ఎ’ ప్రిలిమినరీ రౌండ్లో థాయ్‌లాండ్‌ను 66-27తేడాతో ఓడించింది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో నేడు (మంగళవారం) పాకిస్థాన్‌తో ఆడుతుంది. -
సీమా పూనియాకు గోల్డ్ మెడల్
-
సీమా పూనియాకు గోల్డ్ మెడల్
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత్ ఐదో స్వర్ణం సాధించింది. మహిళల డిస్కస్ త్రో విభాగంలో భారత క్రీడాకారిణి సీమా పూనియా పసిడి పతకం గెల్చుకుంది. 61.03 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. ప్రీస్టయిల్ రెజ్లింగ్ లో భారత్ రెండు పతకాలు కైవసం చేసుకుంది. 61 కిలోల ప్రీస్టయిల్ రెజ్లింగ్ లో బజరంగ్ రతజ పతకం గెలిచాడు. 74 కేజీల విభాగంలో నర్సింగ్ యాదవ్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. 300 మీటర్ల స్టిపెల్చేజ్ లో నవీన్ కుమార్ కాంస్యం దక్కించుకున్నాడు. మహిళల 1500 మీటర్ల రేస్ లో ఓపీ జైషా కాంస్య పతకం సొంతం చేసుకుంది. -
భజరంగ్, లలితకు రజత పతకాలు
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్లు పతకాల 'పట్టు'పడుతున్నారు. బుధవారం రెజ్లింగ్‌లో భారత్‌కు మరో రెందు పతకాలు దక్కాయి. మహిళల 53 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ లలిత, పురుషుల 61 కిలోల విభాగంలో భజరంగ్ రజత పతకాలు సొంతం చేసుకున్నారు. కాగా వీరిద్దరూ అడుగు దూరంలో పసిడి పతకం చేజార్చుకున్నారు. ఫైనల్లో నైజీరియా రెజ్లర్ అడెక్వొరొయె చేతిలో లలిత, కెనడా రెజ్లర్ ట్రెంబ్లే చేతిలో భజరంగ్ ఓటమి చవిచూశారు. మరో ఇద్దరు భారత రెజ్లర్లు ఫైనల్స్‌కు అర్హత సాధించి పతకాలను ఖాయం చేసుకున్నారు. పోటీలు కాసేపట్లో జరగనున్నాయి. కాంస్య పతకం పోరులో మరో భారత రెజ్లర్ పోటీ పడుతోంది.