నిమజ్జనానికి వచ్చే వారికి ఉచిత ఆహారం: అమ్రపాలి
సాక్షి,హైదరాబాద్:గణేష్ నిమజ్జనానికి జిహెచ్ఎంసి తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి చెప్పారు. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడారు‘17,18,19 తేదీల్లో మూడు రోజులపాటు 15వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బంది పనిచేస్తారు.శానిటేషన్ సిబ్బంది,ట్యాంక్ బండ్లో గజ ఈతగాళ్లనుఏర్పాటు చేశాం.నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం ట్యాంక్‌బండ్, సరూర్‌నగర్‌లలో మంచినీళ్లు,ఆహారం ఏర్పాటు చేస్తున్నాం.ఇప్పటికే రోడ్లు రిపేర్ చేశాం.స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశాం.అన్ని మేజర్ చెరువుల వద్ద క్రేన్లు ఉంచాం.జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చిన్న చిన్న చెరువుల వద్ద బేబీ పాండ్స్ ను ఏర్పాటు చేశాం.కాలనీలలో ఏర్పాటు చేసే చిన్న విగ్రహాలు అక్కడే నిమజ్జనం చేస్తారు.గణేష్ నిమజ్జనానికి జోనల్ కమిషనర్లతో పాటు పోలీసులు కోఆర్డినేషన్ చేసుకుంటూ పనిచేస్తారు’అని అమ్రపాలి తెలిపారు.ఇదీ చదవండి.. 17న నిమజ్జనం సెలవు