కోలీవుడ్‌కు సీతమ్మ వాకిట్లో..
తెలుగునాట ఆనందం కురిపించిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రం ఇప్పుడు ఆనందం ఆనందమేగా పేరుతో కోలీవుడ్‌కు రానుంది. వెంకటేశ్, మహేష్‌బాబు కలసి నటించిన ఈ చిత్రంలో సమంత, అంజలి హీరోయిన్లు. ప్రకాష్‌రాజ్ ప్రధాన భూమిక పోషించిన ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ తెరకెక్కించారు.
ఉమ్మడి కుటుంబంలోని ఆప్యాయతలను మనసుకు హత్తుకునేలా చూపారు. ఈ చిత్రాన్ని విజిక్రియేషన్స పతాకంపై దానపల్లి చంద్రశేఖర్, ప్రసాద్ ఆనందం ఆనందమే పేరుతో తమిళ ప్రేక్షకులకు అందిస్తున్నారు. చిత్రంలోని పాటలను సంగీత ప్రియులను అలరించారు. తమిళ వెర్షన్‌కు ఎ.ఆర్.కె.రాజరాజ సంభాషణలు అందిస్తున్నారు.