anata puram
-
ఆకాశానికి భవంతులు
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా పుట్టపర్తి పట్టణంలో భవనాలు ఆకాశానికి లేచాయి. నిబంధనలకు విరుద్ధంగా గత టీడీపీ హయాంలో పది అంతస్తుల వరకు ఆ పార్టీ నేతలు నిర్మించారు. అందులో కొన్ని పూర్తి కాగా.. ఇంకొన్ని ఇప్పటికీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అత్యంత ఎత్తైన భవనాల్లో ఏ ఒక్కదానికీ అనుమతులు లేవు. అయినా మున్సిపల్ అధికారులు, పుడా (పుట్టపర్తి అర్బన్ డెవపల్‌మెంట్ అథారిటీ) అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సాక్షి, పుట్టపర్తి: జిల్లా కేంద్రం పుట్టపర్తిలో అపార్ట్మెంట్ కల్చర్ అధికంగా ఉంది. అయితే తీసుకున్న అనుమతులుకు.. నిర్మిస్తున్న భవనాలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. అడిగేవారు లేరని అత్యంత ఎత్తయిన భవనాలు నిర్మించేస్తున్నారు. పుట్టపర్తి మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం ‘జీ ప్లస్ టూ’ అంటే మొదటిది కాకుండా మరో రెండు అంతస్తులు నిర్మించుకోవచ్చు. అంతకంటే ఎక్కువ అంతస్తులు నిర్మించాలంటే పుడా (పుట్టపర్తి అర్బన్ డెవపల్‌మెంట్ అథారిటీ) నుంచి అనుమతులు తీసుకోవాలి. ముందుగా దరఖాస్తు చేసుకుని అనుమతులు జారీ అయిన తర్వాతనే భవనాలు నిర్మించాలి. అయితే పుట్టపర్తిలో వందకు పైగా భవనాలు 10 అంతస్తుల వరకు ఉన్నాయి. వాటికి మున్సిపాలిటీ అనుమతులు మాత్రమే ఉన్నాయి. రెండు అంతస్తులకు అనుమతులు తీసుకుని.. మూడు నాలుగు రెట్లు ఎక్కువ అంతస్తులు నిర్మించారు. అయినా ఇంతవరకు యజమానులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. నిబంధనలు ఇవే.. పుట్టపర్తి పట్టణ అభివృద్ధి సంస్థ (పుడా) నిబంధనల ప్రకారం రెండంతస్తుల కంటే ఎక్కువ ఎత్తు నిర్మించాలంటే ముందుగా అనుమతులు తీసుకోవాలి. లే అవుట్ అయితే 10 శాతం స్థలాన్ని ముందుగా పుడాకు అప్పజెప్పాలి. ఆ తర్వాతే నిర్మాణాలు మొదలుపెట్టాలి. భవనాల చుట్టూ ఎత్తు ఆధారంగా పుడా నిర్ణయించిన మేరకు స్థలం వదలాల్సి ఉంటుంది. కనీసం 7.5 సెంట్ల కంటే ఎక్కువ స్థలం అయితేనే పుడా పరిధిలోకి వస్తుంది. లేదంటే రెండు కంటే ఎక్కువ అంతస్తులు అయి ఉండాలి. అంతకంటే తక్కువ అయితే మున్సిపాలిటీ అనుమతి తప్పనిసరి. అయితే ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కి భారీ భవనాలు వెలిశాయి. టీడీపీ హయాంలో చేపట్టిన నిర్మాణాల్లో కొన్ని... కమ్మవారిపల్లికి చెందిన నారాయణప్ప మున్సిపల్ కార్యాలయం ఎదురుగా తొమ్మిది అంతస్తుల భవనం నిర్మించారు. దీనికి ఎలాంటి అనుమతులూ తీసుకోలేదు. కమ్మవారిపల్లికి చెందిన మోర్ ఆదెప్ప గ్రౌండ్ ఏరియాలో 10 అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. కొన్ని అంతస్తులు పూర్తయి నివాసం ఉంటున్నారు. పైన ఇంకొన్ని నిర్మాణంలో ఉన్నాయి. డ్వాక్రా బజారు వెనుక రోడ్డులో కొందరు ఉపాధ్యాయులు సంయుక్తంగా 8 అంతస్తుల భవనం నిర్మించారు. గోకులంలో టీచర్ వెంకటేశ్.. 9 అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. అందులో మొత్తం 80 ఫ్లాట్లు ఉన్నాయి. నిర్మాణం తుదిదశకు చేరుకుంది. నోటీసులు ఇచ్చాం నిబంధనలను ఉల్లంఘించి భవనాలు నిర్మించిన వారికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశాం. మరోసారి సర్వే నిర్వహించి.. ఇంకెంత మంది ఉన్నారో అందరికీ నోటీసులు ఇస్తాం. మున్సిపాలిటీ పరిధి జీ ప్లస్ టూ వరకు మాత్రమే. ఆ పై అంతస్తులకు పుడా ముందస్తు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా చట్టరీత్యా చర్యలకు ఆదేశిస్తాం. అనుమతులు లేకుండా ఇప్పటికే పూర్తి చేసిన భవనాలకు దాని విలువలో 20 శాతం మేర జరిమానా విధిస్తాం.. లేదంటే మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. – కేఎన్ నరేశ్ కృష్ణ, పుడా వైస్ చైర్మన్ -
ఖరారైన సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ జిల్లా పర్యటన
-
సీఎం జగన్ కడప పర్యటన షెడ్యూల్ ఇదే..
సాక్షి, కడప సిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండురోజుల జిల్లా పర్యటన ఖరారైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హరికిరణ్ ముఖ్యమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. బద్వేలు, కడప, పులివెందుల, ఇడుపులపాయ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఈనెల 8, 9 తేదీల్లో పర్యటించనున్నారు. 8వ తేదీన.. ► సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 8.30 గంటలకు తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ► 8.50 గంటలకు అక్కడి నుంచి విమానంలో బయలుదేరి 9.55 గంటలకు అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►10.40 నుంచి అనంతపురం జిల్లాలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1.45 గంటలకు పులివెందుల భాకరాపురంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►అక్కడినుంచి బయలుదేరి 1.50 గంటలకు తన నివాసానికి చేరుకుని 2.00 గంటల వరకు అక్కడే ఉంటారు. ►2.15 గంటలకు ముఖ్యమంత్రి తన నివాసం నుంచి పులివెందులలోని ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. ► 2.25 గంటల నుంచి 3.00 గంటల వరకు అక్కడ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. ► 3.05 గంటలకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్‌నుంచి పులివెందుల భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►3.15 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►3.35 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకుంటారు. ►3.40 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్ నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుని 4.00 నుంచి 4.45 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ►4.50 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. 9వ తేదీ.. ►ఉదయం 10.00 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి 10.10 గంటలకు అక్కడే ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►10.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 10.40 గంటలకు బద్వేలులోని విద్యానగర్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►11.05 గంటలకు బహిరంగసభ ప్రాంగణానికి చేరుకుంటారు. ►11.10 నుంచి 12.45 గంటల వరకు బద్వేలు నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాల ఆవిష్కరణతోపాటు బహిరంగసభలో పాల్గొంటారు. ►అనంతరం అక్కడి నుంచి 1.15 గంటలకు బయలుదేరి 1.20 గంటలకు కడప రిమ్స్ వద్దగల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ► అక్కడినుంచి బయలుదేరి 2.05 గంటలకు సీపీబ్రౌన్ గ్రంథాలయం చేరుకుని సీపీ బ్రౌన్ విగ్రహాన్ని ఆవిష్కరించి, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. ► 2.25 గంటలకు అక్కడి నుండి బయలుదేరి కలెక్టరేట్ సమీపంలో ఉన్న మహావీర్ సర్కిల్‌కు చేరుకుని కడపకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ► 3.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.45 గంటలకు వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియానికి చేరుకుంటారు. ► 3.50 నుంచి 4.20 గంటల వరకు స్టేడియంలో అభివృద్ధి పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ►4.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రిమ్స్ వద్ద ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►4.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4.55 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►5.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరి 5.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. -
స్నేహలత హత్య కేసు: ఇద్దరు అరెస్ట్
సాక్షి, అనంతపురం : జిల్లాలోని బడన్నపల్లి గ్రామ సమీపంలో జరిగిన ఎస్బీఐలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని స్నేహలత (19) దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రియుడు గుత్తి రాజేష్, కార్తీక్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 302,201 కింద కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ బి.సత్యయేసు గురువారం సాయంత్రం మీడియాకు తెలిపారు. నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. గత నాలుగేళ్లుగా స్నేహలత-రాజేశ్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని తెలిపారు. ఇతర వ్యక్తులతో సంబంధాలున్నాయని రాజేశ్ వేధించాడని, ఈ క్రమంలో రాజేష్ మంగళవారం స్నేహలతను తన బైక్ మీద ధర్మవరం నుంచి అనంతపురానికి తీసుకొచ్చేందుకు వెళ్లాడని చెప్పారు. (యువతి దారుణ హత్య) బడన్నపల్లి సమీపంలోకి వచ్చే సరికి రోడ్డు పక్కన బైక్ ఆపి ఆమెతో గొడవపడి.. గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న బ్యాంకు పేపర్లను శరీరంపై వేసి కాల్చి పరారయ్యాడయాని అనంతరం తల్లిదండ్రులు ఫిర్యాదుతో అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. నిందితులపై త్వరగా ఛార్జ్‌షీట్ వేసి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. స్నేహలతపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. కాగా స్నేహలత హత్య కేసు స్థానికలంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు స్థానిక ఎస్పీ పర్యవేక్షణలో కేసు విచారణ జరిగింది. దారుణ హత్యకు గురైన స్నేహలత కుటుంబ సభ్యులను రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. (స్నేహలత హత్యపై టీడీపీ రాజకీయాలు) -
ప్రణయ్ ఆత్మహత్య.. సంచలన విషయాలు
అనంతపురం క్రైం: కెనాడాలో ‘అనంత’ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. సహజీవనం చేస్తోన్న యువతి తనను నయవంచన చేయడంతో తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే... నార్పల మండలం గడ్డంనాగేపల్లికి చెందిన పి.నారాయణస్వామి, పి.వాణి దంపతులు అనంతపురంలోని కోవూరునగర్‌లో నివాసముంటున్నారు. వీరి కుమారుడు పుచ్చకాయల ప్రణయ్ (29) కెనాడలోని విక్టోరియాలో డిజిటల్ విభాగంలో పని చేస్తున్నాడు. కృష్ణా జిల్లా ఘంటసాల ప్రాంతానికి చెందిన దేవిప్రసాద్ ముప్పాల, వాణి ముప్పాల దంపతుల కూతురు సాయి అఖిల ముప్పాల. వీరు హైదరాబాద్ హఫ్సీగూడలో నివాసముంటున్నారు. ఈ ఏడాది జనవరిలో అఖిల ముప్పాలతో ప్రణయ్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా, ఆ తర్వాత డేటింగ్ (సహజీవనం) వరకు వెళ్లింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కెనాడాలో మ్యారేజ్ లైసెన్స్ తీసుకుని ఈ ఏడాది మార్చి నుంచి అక్టోబర్ 7 వరకు విక్టోరియాలోని అవేబరీ అవే ప్రాంతంలో సహజీవనం చేశారు. యూఎస్‌లో హెచ్1 వీసా రాగానే అఖిల ముప్పాల ప్రణయ్‌ను నయవంచన చేసి వెళ్లిపోయింది. మరికొందరితో ప్రేమాయణం అఖిల హైదరాబాద్ మల్లారెడ్డి కళాశాలలో ఫార్మసీ పూర్తి చేసి 2013–14లో యూఎస్‌కు వెళ్లింది. 2018లో అనిరుధ్ తెటాలి అనే వ్యక్తితో కలిసి ఒకటే చోట ఉంది. యూఎస్‌లో ఉన్నప్పుడు మహేష్, ఆశిక్, తదితరులతో కూడా అఖిలకు పరిచయం ఉంది. మూడేళ్లు గడిచినా హెచ్1 వీసా రాకపోవడంతో 2020 జనవరి ప్రారంభంలో ప్రణయ్ ఉంటున్న విక్టోరియాకు వచ్చింది. సిగరెట్, బాయ్‌ఫ్రెండ్ వద్దన్నందుకు.. సిగరెట్ తాగితే ఆరోగ్యం చెడిపోతుందని, పాత బాయ్ఫ్రెండ్లతో చాట్ చేయకూడదని అఖిలపై ప్రణయ్ కోప్పడ్డాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ కలసిమెలసి ఉన్నారు. ఈ క్రమంలో హెచ్1 వీసా ప్రీమియం కన్ఫర్మేషన్ వచ్చింది. అదే ఛాన్స్‌గా తీసుకున్న అఖిల ఈ ఏడాది అక్టోబర్ 7న ప్రణయ్‌కు చెప్పకుండా వెళ్లిపోయింది. వీరిద్దరి సహజీవనం ఇరు కుటుంబాలకు తెలుసు. అఖిల చేసిన నయవంచనను తల్లి వాణి(అఖిల తల్లి)కి చెప్పినా ప్రయోజనం లేకుండాపోయింది. చివరకు ప్రణయ్‌పై కేసు పెడతామని అఖిల తల్లి బెదిరించింది. ఈ క్రమంలో అఖిల, ఆమె తల్లి ప్రణయ్ ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశారు. 14న ఆత్మహత్య.. అఖిల చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయిన ప్రణయ్ ఈ నెల 14న విక్టోరియాలో నైట్రోజన్ గ్యాస్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు తన బాధను వ్యక్తం చేస్తూ వీడియో తీశాడు. ప్రణయ్ మరణవార్త తెలియగానే అనంతపురం నాల్గవ పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు కోవూర్‌నగర్‌లోని ఇంటికి వెళ్లి అతడి కుటుంబీకులతో మాట్లాడారు. -
లోకేష్ పర్యటనపై శ్రావణి తీవ్ర అసంతృప్తి
సాక్షి, అమరావతి : గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ప్రతిపక్ష టీడీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అనంతపురం జిల్లాలో ఆ పార్టీల నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. పార్టీలో వ్యక్తుల ఆధిపత్య పోరు కారణంగా సీనియర్ నేత, ఎమ్మెల్సీ శమంతకమణితో పాటు ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామినిబాల ఇటీవల టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే శమంతకమణి నిష్క్రమణతో నేతల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. సింగనమల నియోజకవర్గ ప్రస్తుత ఇంఛార్జీ బండారు శ్రావణి పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు కాకుండా టీడీపీ నేత ఎంఎస్ రాజు వర్గానికి ప్రాధాన్యత ఇవ్వటంపై శ్రావణి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇరువర్గల మధ్య పచ్చగడ్డేస్తే మండే విధంగా పరిస్థితి తారాస్థాయికి చేరింది. లోకేష్ పర్యటనకు దూరంగా శ్రావణి.. ఈ క్రమంలోనే టీడీపీ నేత నారా లోకేష్ అనంతపురం పర్యటన విభేదాలను బయపడేసింది. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై సింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన శ్రావణి.. లోకేష్ పర్యటనకు దూరంగా ఉన్నారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోగా.. ఎంఎస్ రాజుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. నేతల పర్యటనపై తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో లోకేష్ పర్యటనకు దూరంగా ఉన్నారు. మరోవైపు అనంతపురం పర్యటన సందర్భంగా లోకేష్ కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. కనీస సామాజిక దూరం పాటించకుండా.. నిబంధనలకు విరుద్ధంగా జనసమీకరణ చేశారు. కరోనా జాగ్రత్తలు పక్కనపెట్టి భారీ కాన్వాయ్ నడుమ పర్యటన చేశారు. లోకేష్ తీరుపై స్థానిక నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నారా లోకేష్ అబద్ధాలు బట్టబయలు.. శుక్రవారం జిల్లాలోని కరడికొండ, ధర్మాపురం, మిడుతూరు, రాందాస్ పేట, ,కామారుపల్లి గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన లోకేష్.. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఆరోపణలు చేశారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అయితే వరద నష్టంపై కలెక్టర్ గంధం చంద్రుడు వాస్తవాలు బహిర్గతం చేశారు. అనంతలో భారీ వర్షాలకు 38.53 కోట్ల పంట నష్టం జరిగిందని తెలిపారు. 13861 హెక్టార్లలో పంటలు నష్టపోయాయని వివరించారు. నష్టపోయిన రైతులకు వాతావరణ బీమా, ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తామని హామీ ఇచ్చారు. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపామని, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సాధారణం కన్నా 60 శాతం అధికంగా వర్షాలు నమోదు కావటంతో క్రాప్ డ్యామేజ్ జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. దీంతో నారా లోకేష్ అబద్ధాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. -
మైనార్టీలకు సర్కార్ అండ..
సాక్షి, అనంతపురం: మైనార్టీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి భరోసా ఇచ్చారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు గురువారం ఆయనను కలిశారు. ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్‌ఆర్‌పీలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని వినతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్ఆర్సీకి ప్రభుత్వం వ్యతిరేకమని, రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. -
పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. కురుగుంట గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని పేదల నుంచి పరిటాల వర్గీయులు డబ్బులు వసూలు చేశారు. తమ డబ్బు వెనక్కి ఇవ్వాలని కోరిన వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో బాధితులు అనంతపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులను పరామర్శించిన తోపుదుర్తి చందు.. కురుగుంట గ్రామస్తులను ఆదివారం వైఎస్సార్సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు చందు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయుల ఆగడాలు అధికమయ్యాయని మండిపడ్డారు. కౌంటర్ కేసులతో బాధితులను భయపెడుతున్నారన్నారు. పరిటాల వర్గీయులపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. -
'రైతులకు నేరుగా పంటల బీమా చెల్లింపు'
అనంతపురం:రైతుల పంటల బీమాను బ్యాంకు ఖాతాల్లోకి కాకుండా నేరుగా రైతులకే చెల్లిస్తామని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన రఘునాథ రెడ్డి.. అనంతరపురం జిల్లాలో 4.22 లక్షల మంది రైతులకు రూ.227 కోట్ల పంట బీమా అందజేయనున్నట్లు తెలిపారు.