AP CM YS Jagan To Visit YSR Kadapa On July 8th To 9th - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ కడప పర్యటన షెడ్యూల్‌ ఇదే..

Published Tue, Jul 6 2021 9:45 AM | Last Updated on Wed, Jul 7 2021 6:49 PM

Cm Ys Jagan Visit Ysr Kadapa july 8th and 9th - Sakshi

సాక్షి, కడప సిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండురోజుల జిల్లా పర్యటన ఖరారైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ ముఖ్యమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు.  బద్వేలు, కడప, పులివెందుల, ఇడుపులపాయ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఈనెల 8, 9 తేదీల్లో పర్యటించనున్నారు. 

8వ తేదీన..  
 సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 8.30 గంటలకు తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

► 8.50 గంటలకు అక్కడి నుంచి విమానంలో బయలుదేరి 9.55 గంటలకు అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

10.40 నుంచి అనంతపురం జిల్లాలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని హెలికాప్టర్‌ ద్వారా మధ్యాహ్నం 1.45 గంటలకు పులివెందుల భాకరాపురంలోని హెలిప్యాడ్‌కు              చేరుకుంటారు. 

అక్కడినుంచి బయలుదేరి 1.50 గంటలకు తన నివాసానికి చేరుకుని 2.00 గంటల వరకు అక్కడే ఉంటారు. 

2.15 గంటలకు ముఖ్యమంత్రి తన నివాసం నుంచి పులివెందులలోని ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. 

2.25 గంటల నుంచి 3.00 గంటల వరకు అక్కడ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. 

 3.05 గంటలకు స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ గ్రౌండ్‌నుంచి పులివెందుల భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

3.15 గంటలకు హెలిప్యాడ్‌ నుంచి బయలుదేరి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 

3.35 గంటలకు వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకుంటారు. 
3.40 గంటలకు వైఎస్సార్‌ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుని 4.00 నుంచి 4.45 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 

4.50 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. 

9వ తేదీ.. 
ఉదయం 10.00 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌ నుంచి 10.10 గంటలకు అక్కడే ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

10.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 10.40 గంటలకు బద్వేలులోని విద్యానగర్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

11.05 గంటలకు బహిరంగసభ ప్రాంగణానికి చేరుకుంటారు.

11.10 నుంచి 12.45 గంటల వరకు బద్వేలు నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాల ఆవిష్కరణతోపాటు బహిరంగసభలో పాల్గొంటారు. 

అనంతరం అక్కడి నుంచి 1.15 గంటలకు బయలుదేరి 1.20 గంటలకు కడప రిమ్స్‌ వద్దగల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 

అక్కడినుంచి బయలుదేరి 2.05 గంటలకు సీపీబ్రౌన్‌ గ్రంథాలయం చేరుకుని సీపీ బ్రౌన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. 

2.25 గంటలకు అక్కడి నుండి బయలుదేరి కలెక్టరేట్‌  సమీపంలో ఉన్న మహావీర్‌ సర్కిల్‌కు చేరుకుని కడపకు  సంబంధించిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. 

3.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.45 గంటలకు వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియానికి చేరుకుంటారు. 

3.50 నుంచి 4.20 గంటల వరకు స్టేడియంలో అభివృద్ధి పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు.

4.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రిమ్స్‌ వద్ద ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

4.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4.55 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

5.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరి 5.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement