Andhra Pradesh Housing Department
-
వైఎస్సార్, జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పన పనులు షురూ
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న వైఎస్సార్, జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం ఇళ్లలో 25 శాతం ఇళ్లు పునాది దశను దాటిన లేఅవుట్లలో ఈ పనులను చేపడుతున్నారు. ఇళ్లులేని పేదలకు ఈ పథకం కింద 30 లక్షలకు పైగా ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 17,005 లేఅవుట్లలో ప్రభుత్వం పేదలకు ప్లాట్లు పంపిణీ చేసింది. తొలిదశలో 10,067 లేఅవుట్లలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇక 17వేల కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32,909 కోట్లు ఖర్చుచేస్తోంది. 354 లేఅవుట్లలో విద్యుత్ పనులు తొలిదశ నిర్మాణాలు చేపడుతున్న 10వేల లేఅవుట్లలో రూ.24వేల కోట్లతో మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా.. ఇప్పటికే 354 లేఅవుట్లలో విద్యుత్ సరఫరా పనులు ప్రారంభించారు. విద్యుత్ స్తంభాల ఏర్పాటు, వైర్లు లాగడం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు వంటి పనులు చకచకా కొనసాగుతున్నాయి. మరో 2,343 లేఅవుట్లలో పనులు ప్రారంభించడానికి డిస్కమ్‌లు సర్వే చేపడుతున్నాయి. ఇక లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి ఆధారంగా గృహ నిర్మాణ శాఖ అధికారులు విద్యుత్ అధికారుల సమన్వయంతో పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు. విదుత్ సదుపాయాల కల్పనకు రూ.4,600 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఇందులో భాగంగా గృహ నిర్మాణ శాఖకు నిధులు çసమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వమే రుణదాతలకు హామీ ఇచ్చింది. మరోవైపు.. ఈ ఇళ్లలో అత్యున్నత ఇంధన పొదుపు ప్రమాణాలను పాటించేందుకు ఇండో–స్విస్ బీప్ (బిల్డింగ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ ప్రాజెక్టు) సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. దీంతో బయట ఉష్ణోగ్రతతో పోలిస్తే ఈ ఇళ్లలో 3–5 డిగ్రీలు తగ్గుతుంది. అదే విధంగా రోడ్లు, డ్రెయిన్లు, కాల్వల నిర్మాణం, నీటి సరఫరా, సహా ఇతర సదుపాయాలు కల్పించడానికి సంబంధిత శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. పారిశుధ్యం, పరిశుభ్రత, గ్రీనరీకి ప్రాధాన్యం కాలనీల్లో ఇళ్ల సంఖ్య, లేఅవుట్ విస్తీర్ణాన్ని బట్టి 20, 30, 40 అడుగుల రోడ్లు నిర్మించనున్నారు. 40 అడుగుల రోడ్లు నిర్మించిన చోట రోడ్డు మధ్యలో డివైడర్లు ఏర్పాటుచేస్తారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కింద పారిశుధ్యం, పరిశుభ్రత, గ్రీనరీ కోసం కూడా చర్యలు తీసుకోనున్నారు. 17వేల కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చుచేస్తుండగా ఇందులో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.10,251 కోట్లు, సీసీ డ్రెయిన్లకు రూ.7,227 కోట్లు, నీటి సరఫరాకు రూ.4,128 కోట్లు, విద్యుత్‌కు రూ.7,080 కోట్లు, ఇంటర్నెట్కు రూ.909 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని లేఅవుట్లో వసతుల కల్పనకు రూ.3,204 కోట్లు కేటాయించారు. అదే విధంగా కాలనీల్లో పర్యావరణ పరిరక్షణ, పారిశుధ్యం నిర్వహణకు సంబంధించిన వసతుల కల్పనకు రూ.110 కోట్లు ప్రభుత్వం వెచ్చించనుంది. ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీలకు దీటుగా.. కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతోంది. ఆ శాఖలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. విద్యుత్ సదుపాయాల కల్పన పనులు చకచకా సాగుతున్నాయి. మిగిలిన శాఖలు తమ పనులు ప్రారంభిస్తున్నాయి. ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీలకు దీటుగా జగనన్న కాలనీల్లో సదుపాయాల కల్పన సీఎం లక్ష్యం. ఆ లక్ష్య సాధనకు కృషిచేస్తున్నాం. – ఎం. శివప్రసాద్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, గృహ నిర్మాణ సంస్థ -
వచ్చే ఏడాది నుంచి ఇళ్ల నిర్మాణం : సీఎం జగన్
-
వచ్చే ఏడాది నుంచి ఇళ్ల నిర్మాణం : సీఎం జగన్
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గృహనిర్మాణ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇల్లు లేనివారెవరూ ఉండకూడదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇల్లు పొందే క్రమంలో లబ్ధిదారుడు ఎక్కడా ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన పనిలేదని అన్నారు. ఈ సంవత్సరం శాచ్యురేషన్ విధానంలో ప్రతి గ్రామంలో లబ్ధిదారులందరికీ ఇళ్లస్థలాలు ఇస్తామని చెప్పారు. 1.5 సెంట్లు చొప్పున ఇంటిస్థలాలు పంపిణీ చేయనున్నామని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథ రాజు, గృహనిర్మాణశాఖ అధికారులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇళ్ల నిర్మాణం చేపడతామని, ఉగాది రోజున ఇళ్లస్థలాలు, పట్టాల పంపిణీ కార్యక్రమం అన్ని జిల్లాలో ఘనంగా చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వైయస్సార్ ఇళ్ల పథకం కింద నాలుగు విడతల్లో ఇళ్ల నిర్మాణం చేస్తామని తెలిపారు. గ్రామ వలంటీర్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పారు. లబ్దిదారుల జాబితాను గ్రామ సచివాలయంలోనే ప్రదర్శిస్తామని, పెన్షనర్ల జాబితా కూడా గ్రామ సచివాలయాల్లో బోర్డుపై ఉంచుతామని అన్నారు. 365 రోజులు ఆ జాబితా అందరికీ అందుబాటులో ఉంచేలా చూడాలని అన్నారు. దీనివల్ల సోషల్ ఆడిట్ నిరంతరం కొనసాగుతున్నట్టుగా ఉంటుందన్నారు. (చదవండి : ఆకస్మిక తనిఖీలు చేస్తాను : సీఎం వైఎస్ జగన్) ‘లబ్ధిదారుల ఎంపికలో పక్షపాతం, అవినీతికి తావులేకుండా చేస్తాం. ఎవరైనా తప్పులు చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. పక్షపాతం, అవినీతి వల్లే సమస్యలు వస్తున్నాయి. మా పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత ఉంటే ఇల్లు ఇవ్వాల్సిందే. మేం చేసే మంచిని చూసి మాకు ఓటేయాలి అన్నదే మా సిద్ధాంతం. వ్యవస్థ మారాలి, ఆ తపనతోనే పనిచేయండి. నిజాయితీగా వెళ్తే కచ్చితంగా మార్పు వస్తుంది. ఇళ్ల నిర్మాణం కోసం గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని వినియోగించండి. ప్రభుత్వ భూమి లేనిచోట ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి పేదలకు ఇస్తుంది. కొనుగోలుచేసిన భూమిని ప్లాట్ల రూపంలో విభజించి వాటిని లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయాలి. ఉగాది నాటికి ఈ పనులన్నీ అధికారులు పూర్తి చేయాలి. కేవలం పట్టా ఇచ్చి, తన ఇంటి స్థలం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి లబ్ధిదారుడికి రాకూడదు. రాళ్లు పాతి, మార్కింగ్ వేసి పక్కాగా ఇంటి స్థలాన్ని అక్కచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి. ఆధార్‌కార్డుతో లింక్ చేసి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయండి. పట్టణాలు, నగరాల్లో కూడా ఎంత ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందో చూడండి. భూమి లేకపోతే కొనుగోలు చేయండి. స్థలంలో ఫ్లాట్లు కట్టి లబ్ధిదారులకు ఇవ్వాలి. ఏ ఫ్లాట్ ఎక్కడ కడుతున్నారో ముందుగానే గుర్తించి ఫలానా ప్లాటు, ఫలానా వారికి వస్తుందని ముందుగానే కేటాయించండి. ఈ ఫ్లాట్ల లబ్ధిదారులకు భూమిలో అన్ డివైడెడ్ షేర్, దీంతోపాటు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి. రీజనబుల్ సైజులో ఫ్లాట్లు కట్టి ఇవ్వాలి. గతంలో చదరపు అడుగు రూ.1100 అయ్యే దాన్ని రూ. 2200–2300కు పెంచి దోచేశారు. షేర్వాల్ అని పేరుపెట్టి రూ.1100లతో అయ్యేదాన్ని రూ.2300 చేస్తే ఎలా? పేదలపై ప్రతి నెలా రూ.3 వేల భారం వేయడం భావ్యమా. పేదలకు ఉచితంగా ఇళ్లు ఇవ్వాల్సిందిపోయి... రూ.3 లక్షల భారం వేయడం న్యాయమా. అర్బన్ హౌజింగ్‌లో కడుతున్న ఫ్లాట్లపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలి. అదే టెక్నాలజీ, అదే స్పెసిఫికేషన్స్‌తో రివర్స్ టెండరింగ్ నిర్వహించాలి. కాంట్రాక్టర్లను వేధించడం ఉద్దేశం కాదు, మాకు ఎవరిపైనా కక్షలేదు. బీదవాడికి నష్టం రాకూడదు. ఇరవయ్యేళ్లపాటు నెలా నెలా డబ్బు కట్టే పరిస్థితి ఆ పేదవాడికి ఉండకూడదన్నదే నా ఉద్దేశం. లంచాల వల్ల బీదవాడు నష్టపోకూడదన్నదే మా అభిప్రాయం. విపరీతమైన ప్రచారం ఇచ్చి.. ఎక్కువ మంది రివర్స్ టెండరింగ్‌లో పాల్గొనేలా చూడాలి. ఎక్కువమంది రివర్స్ టెండరింగ్‌లో పాల్గొనేందుకు ఎలిజిబిలిటీ క్రైటేరియాను తగ్గిద్దాం. పునాది స్థాయి దాటని, శాంక్షన్ అయినా ప్రారంభం కాని ఫ్లాట్ల విషయంలో ఏ టెక్నాలజీని అయినా అనుమతించాలనుకుంటున్నాం. ఈ నిర్ణయాల వల్ల ఎంత ఆదా చేయగలమో చేయండి. నిర్మాణాల నాణ్యతలో, సౌకర్యాల కల్పనలో రాజీ పడొద్దు. ప్రస్తుతం నడుస్తున్న ఇళ్ల నిర్మాణంలో అత్యవసరంగా పూర్తిచేయాల్సిన వాటిని గుర్తించండి’ అన్నారు. ఇక సెక్‌డేటా సక్రమంగా లేకపోవడం వల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో నష్టం జరుగుతోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సెక్ డేటాను సరిచేయాలని, రీసర్వే చేయాలని ప్రధానికి లేఖ రాయాలని సీఎం సూచించారు. సరిదిద్దిన డేటా ఆధారంగా ఇళ్లను కేటాయించాల్సిందిగా ప్రధాని మంత్రికి లేఖ రాయాలని అన్నారు. గ్రామ వలంటీర్ల సాయంతో డేటాను పూర్తిగా సేకరించి కేంద్రానికి పంపాలని సీఎం చెప్పారు. హర్షం వ్యక్తం చేసిన బీమామిత్రలు.. బీమామిత్ర ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. వారికి రూ.3 వేలు గౌరవ వేతనంగా చెల్లించనున్నట్టు సీఎం ప్రకటించారు. దాంతోపాటు ప్రతి క్లెయిమ్‌కు రూ.250 నుంచి రూ.1000కి పెంచుతున్నట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి సానుకూల స్పందనపట్ల 13 జిల్లాలో నుంచి వచ్చిన బీమామిత్ర ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
అర్హులైన ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు
కాచిగూడ : ఏపీఎన్జీఓస్ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ అడహక్ కమిటీ సమావేశం అడహాక్ కమిటీ చైర్మన్ ఎం.సత్యనారాయణగౌడ్ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గచ్చిబౌలిలో కేటాయించిన స్థలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అర్హులైన ఉద్యోగులందరికీ ఇళ్లస్థలాలు అందేలా కృషి చేస్తామని ఎం.సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏపీఎన్జీఓస్ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీకి అడహక్ కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. త్వరలోనే పూర్తి స్థాయి కమిటీని ఎన్నుకుంటామన్నారు. సొసైటీలో సభ్యులుగా ఉన్న అర్హులైన తెలంగాణ ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలను ప్రభుత్వం కేటాయించేలా నాలుగేళ్లుగా నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అడహక్ కమిటీ ప్రతినిధులు పి.బలరామ్, జి.మల్లారెడ్డి, ఎస్.ప్రభాకర్‌రెడ్డి, ఎ.శ్రీనివాస్, జి.రాజేశ్వర్‌రావు, అబ్దుల్ సాధిక్, కేశియానాయక్, జి.పద్మారెడ్డి, ఎం.శ్రీనివాస్‌రావు, బీఈ చక్రవర్తి, పి.శ్రీధర్‌రెడ్డి, ఎస్.సంధ్యారాణి, రషీదా బేగం, రమాదేవి, టి.విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
బాబుగారి నయా నాటకం
సాక్షి అమరావతి: తిమ్మిని బమ్మిని చేయడంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఎప్పుడూ ముందుంటుంది. లేనిదానిని ఉన్నదానిగా చూపించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మించిన నాయకులు, పాలకులు మరొకరు ఉండరు. రాజధాని విషయంలో బొమ్మలు, గ్రాఫిక్స్‌లతో రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్న బాబుగారి ప్రభుత్వం, డొల్లతనం మరోసారి బయటపడింది. పేదల సొంతింటి కలలను కలగానే మిగిల్చుతోంది. గత మూడేళ్ల నుంచి రాష్ట్రంలో ఇళ్లులేని పేదలకు పక్కా గృహాలను అందిస్తామని ఆర్భాటంగా చెప్పుకునే ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు ఏమాత్రం చేయలేకపోయింది. 2015లో బలహీన వర్గాలకు గృహనిర్మాణ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం లక్ష 93వేల గృహాలు మంజూరు చేసింది. ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 1.50 లక్షలు కేంద్రం అందిస్తుంది. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. తాజగా కేంద్ర ప్రభుత్వ ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి మరో 1.25 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. ఇప్పటి వరకూ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు సుమారు 5.20 లక్షల ఇళ్లను కేటాయించింది. వీటికి నిధులను కూడా కేంద్రమే భరిస్తుంది. వీటిలో కనీసం 2శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా బడుగు బలహీన వర్గాలతో పాటు, పేదలందరికి ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వస్తే ఐదేళ్లలో పది లక్షల పక్కా గృహాలు నిర్మిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట మర్చిపోయారు. గత మూడేళ్లలో బాబు సర్కార్ నిర్మించింది కేవలం పదివేల ఇళ్లు మాత్రమే. ఇందుకు ఖర్చు చేసింది కేవలం రూ.160కోట్లు. వాటిలో కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఇందిరమ్మ ఇళ్లు కూడా ఉండటం విశేషం. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజక వరర్గంలో గతమూడేళ్లలో నిర్మించింది కేవలం 359 ఇళ్లులు మాత్రమే. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజక వర్గంలో ముఖ్యమంత్రి నియోజకవర్గం కంటే ఎక్కువ ఇళ్లను (391) పట్టుపట్టి నిర్మించగలిగారు. ఇదేళ్లలో 10లక్షల ఇళ్లను నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం 10వేల ఇళ్లను కూడా పూర్తిచేయలేక పోవడం విడ్డూరం. ఇప్పుడు తాజాగా రూ16వేల కోట్లతో గృహనిర్మాణాలు చేపడతామని గొప్పలు పోతోంది. మూడేళ్లలో 150 కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వం వచ్చే రెండేళ్లలో రూ.16వేల కోట్లు ఎలా ఖర్చుపెట్టగలుగుతుందనే సందేహాలు రాకపోవడం లేదు. ఇటీవల నంద్యాల ఉపఎన్నికల్లో నంద్యాల్లో 13వేల గృహాలు నిర్మించామని డప్పుకొట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం మూడేళ్లలో నిర్మించిన ఇళ్లు 456 మాత్రమే. గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజక వర్గంలో పూర్తైన ఇళ్లు కేవలం 696 ఇళ్లు మాత్రమే. ఈ వివరాలు అన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గృహనిర్మాణ శాఖ వెబ్సైట్ నుంచి సేకరించిన సమాచారం. -
ఫ్రిజ్ ఉంటే ఇల్లు రాదు
పేదలకు సొంత ఇల్లు దక్కడం గగనమే రాయితీ ఇళ్ల మంజూరులో సర్కారు కొత్త నిబంధనలు గృహ నిర్మాణ శాఖ జీవో జారీ యూనిట్ కాస్ట్ రూ.2.75 లక్షల నుంచి రూ.2.25 లక్షలకు కుదింపు సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదోడికి సొంతింటి కల కలగానే మిగిలిపోయే ప్రమాదం వచ్చి పడింది. గూడు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పేదలకు సర్కారు ఇచ్చిన జీవో అశనిపాతంలా పరిణమించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తం పొందాలంటే 13 రకాల నిబంధనలు పాటించాలన్న షరతులతో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా జీవోనే జారీ చేయడంతో కలకలం రేగుతోంది. రాష్ట్రంలో మంజూరు చేస్తున్న ఇళ్లలో ఒక్కోదానికి రూ.72 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. ఇప్పటికే ఇంటి నిర్మాణం (యూనిట్ కాస్ట్) మొత్తాన్ని రూ.2.75 లక్షల నుంచి రూ.2.25 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. దీనికితోడు కేంద్రం పెట్టిన షరతులను సాకుగా చూపి 13 రకాల నిబంధనలను అమల్లోకి తెస్తూ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఇటీవల జీవో నంబర్ 90 జారీ చేసింది. ఈ జీవోను కచ్చితంగా అమలు చేస్తే వాస్తవంగా ఒక్క ఇల్లు కూడా మంజూరయ్యే అవకాశం లేదని పేదలు వాపోతున్నారు. ఏడాదైనా ఒక్క ఇల్లూ రాలేదు ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకంలో గతేడాది ఆగస్టులో రెండు లక్షల ఇళ్లు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 1.26 లక్షల దరఖాస్తులు సక్రమంగా ఉన్నట్టు తేల్చారు. ఏడాదైనా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. 13 రకాల నిబంధనలను పరిగణనలోకి తీసుకొని ఇళ్లు మంజూరు చేయాలని ఉన్నతాధికారులు మౌఖికంగా చెప్పారు. ఇవీ నిబంధనలు... ఇళ్ల మంజూరుకు చెబుతున్న నిబంధనలను పరికిస్తే రాష్ట్రంలో ఒక్కరికైనా ఇల్లు వస్తుందా? అనేది అనుమానమే. ప్రభుత్వం కేటాయించే ఇల్లు రావాలంటే ఇవి ఉండకూడదు. ఫ్రిజ్, ల్యాండ్‌లైన్ ఫోన్, మోటార్ సైకిల్, మూడు, నాలుగు చక్రాల వాహనాలు, వ్యవసాయ యంత్రాలు, వ్యవసాయ అనుబంధ యంత్రాలుండకూడదు. లబ్ధిదారుడు ప్రభుత్వ ఉద్కోగి కాకూడదు, కుటుంబంలో ఏ ఒక్కరికైనా రూ.10 వేలకు పైగా వేతనం రాకూడదు. రూ.50 వేలకు పైగా విలువైన కిసాన్ పత్రాలు ఉండకూడదు. ఆదాయపు పన్ను, వృత్తి పన్ను చెల్లించేవారూ అనర్హులు. సొంతంగా 2.5 ఎకరాల మాగాణి, ఏడున్నర ఎకరాలకు పైగా మెట్ట భూమి ఉండకూడదు. రెండెకరాలకు మించి కౌలు చేసినా ఇల్లు ఇవ్వరు. పేదలకు వెసులుబాటిస్తే తప్ప రాష్ట్రంలో ఒక్క ఇల్లయినా మంజూరు చేసే అవకాశం లేదన్నది వాస్తవం. -
ఫోర్జరీ కేసులో ముగ్గురి ఉద్యోగుల అరెస్ట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ ఫోర్జరీ కేసులో ముగ్గురు ఉద్యోగులను బుధవారం ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. కార్పొరేషన్ ఫిక్స్డ్ డిపాజిట్లను ఫోర్జరీ సంతకాలతో డబ్బును స్వాహా చేసిన ఉదంతంపై సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. సుబ్రమణ్యం, బి.నారాయణ, బి.శ్రీనివాసులు అనే హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
డొక్కాలో కాంగ్రెస్ వాసన పోలేదు
గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య సాక్షి, విజయవాడ బ్యూరో: మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీలో చేరినా ఇంకా కాంగ్రెస్ సంస్కృతిని వదిలించుకోలేక పోతున్నారని, ఆ వాసన ఆయనలో ఇంకా పోలేదని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు. శనివారం సీఎం కార్యాలయం వద్ద మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మాదిగలకు కృష్ణమాదిగే నాయకుడని ఆయన వ్యాఖ్యానించడం సరికాదని, దీనిపై పార్టీలో చర్చిస్తామని చెప్పారు. టీడీపీలో ఎలా పనిచేయాలో ఆయన ఇంకా తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబు చూసుకుంటారని దానిపై కృష్ణమాదిగ తమకు చెప్పాల్సిన పనిలేదన్నారు. -
బాబు హామీకి దిక్కులేదు
సాక్షి, హైదరాబాద్: గృహ నిర్మాణ శాఖకు బడ్జెట్లో కేటాయించిన నిధులు కాగితాలకే పరిమితం అయ్యాయి. పేరుకు వందలకోట్ల రూపాయల నిధులు కేటాయించినా ఇప్పటి వరకూ పేదల కోసం ఒక్క ఇళ్లు కూడా మంజూరు చేయలేదు. ఈ ఏడాది బడ్జెట్లో ఈ శాఖకు రూ. 897 కోట్లు కేటాయించినప్పటికీ ఆ మేరకు నిధులు విడుదల కాలేదు. ఇళ్ల మంజూరు కోసం ఏడాదిగా లబ్ధిదారులు ఎదురు చూడటమే తప్ప ప్రయోజనం మాత్రం దక్కడం లేదు. నిధుల కొరత కారణంగా కొత్త ఇళ్లు మంజూరు చేసే పరిస్థితి లేకపోవడంతో ఇక కేంద్ర ప్రభుత్వంపై మాత్రమే ఆశలున్నాయి. గత ఏడాది గృహ నిర్మాణ శాఖకు బడ్జెట్లో రూ. 808 కోట్లు కేటాయించినా ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులకే ఆ నిధులు సరిపోయాయి. కనీసం ఒక్క రూపాయి కూడా పెండింగ్ బిల్లులు మంజూరు చేయలేకపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కొత్త ఇళ్లను కేటాయిస్తామని, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు యూనిట్ ధరను రూ. 1.50 లక్షలకు, ఇతర కులాలకు చెందిన లబ్ధిదారులకు లక్ష రూపాయలకు పెంచుతానని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ప్రతిపాదన పరిశీలనలో ఉన్నందున కొత్త ఇళ్ల మంజూరు ఆలస్యం అవుతోందని అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరై కొంత వరకూ నిర్మాణాలు పూర్తిఅయ్యి ఆగిపోయిన ఇళ్లకు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఇప్పటికీ అమలు కాలేదు. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసే రాజీవ్ ఆవాస్ యోజన (ఆర్‌ఏవై), ఇందిరా అవాస్ యోజన (ఐఏవై) పథకాల మంజూరు పైనే రాష్ట్రం ఆశలున్నాయి. ఆర్‌ఏవై పథకం కింద ఈ ఏడాది పట్టణ ప్రాంతాల్లో 25 వేల గృహాలకు నిధులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఐఏవై పథకం కింద వీటికి మూడింతల సంఖ్య ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కేంద్రానికి రాష్ట్ర అధికారులు ఇటీవల ప్రతిపాదనలు పంపారు. ఆ మేరకు ఇళ్లు ఇస్తే తప్ప గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు నిర్మించే పరిస్థితి కనిపించడం లేదు. -
ఇదేనా ‘ప్రగతి’
* జిల్లా ప్రగతి నివేదికలో అస్తవ్యస్తంగా సమాచారం * రూపకల్పనలోనూ అధికారుల అలసత్వం * నిర్లక్ష్యాన్ని వీడని ప్రభుత్వ శాఖలు ఒంగోలు: జిల్లా పరిషత్ పాలనా పగ్గాలు మూడున్నరేళ్లుగా అధికారుల చేతుల్లోనే ఉండటంతో వారిలో నిర్లక్ష్యం పాలు పెరిగి పోయింది. జెడ్పీ నూతన పాలకవర్గం ఏర్పడిన తరువాత ఈనెల 10వ తేదీ నిర్వహించి న తొలి సర్వసభ్య సమావేశానికి హాజరైన సభ్యులకు వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రగతి నివేదికను జెడ్పీ అధికారులు పంపిణీ చేశారు. దాదాపు అన్ని శాఖలూ మొక్కుబడి సమాచారాన్నే అందించాయి. * ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన గృహాల వివరాలను 2006 - 2009 వరకు, 2009 నుంచి 2014 వరకు జీవో నంబర్ 171, రచ్చబండలకు సంబంధించిన వివరాలు మాత్రమే నివేదికలో పొందుపర్చారు. అంతే తప్ప ఆ శాఖ వద్ద ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం కోసం ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంత మందికి ఈ ఏడాది రుణం మంజూరు చేశారు, ప్రస్తుతం ప్రభుత్వం ఏయే పథకాలను అమలు చేస్తోంది, గత ప్రభుత్వంలో రుణం మంజూరై నిర్మాణంలో ఉన్న గృహాలకు బిల్లులు ఏమైనా చెల్లించారా తదితర వివరాలు ఏవీ పొందుపరచకపోవడం గమనార్హం. * ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ లిమిటెడ్ పొందుపరిచిన సమాచారం కూడా అరకొరగానే ఉంది. అమ్మహస్తం పథకం సరుకుల కొనుగోలు లేదా పంపిణీ వివరాలు కేవలం ఏప్రిల్ 2014 వరకే ఉన్నాయి. ప్రస్తుతం ఎటువంటి సరుకులను పంపిణీ చేస్తున్నారనే సమాచారాన్ని పౌరసరఫరాల శాఖ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఈ నెలలో భారీగా రేషన్ కార్డులకు కోత పడింది.ఆధార్ సమర్పించలేదంటూ 5.30 లక్షల కార్డులు తొలగించారు. అయినా కార్డుదారుల పాత వివరాలనే సమర్పించారు. * ఈ వ్యవసాయ సీజన్లో విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కారు. అసలు విత్తనాభివృద్ధి సంస్థ వద్ద ఏయే రకం విత్తనాలు ఎంత మేరకు ఉన్నాయి. ఇంకా విత్తనాలు ఎంత మోతాదులో అవసరం అనే వివరాలు కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎరువులు, ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎంతమేర పంటలను సాగుచేశారనే వివరాలను కూడా సభ్యులకు ఇవ్వకపోవడం గమనార్హం. * జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి పంపిన సమాచారంలో కూడా కనీసం ఎన్ని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు? గ్రంథపాలకులు లేనివెన్ని, నూతన భవనాల నిర్మాణం కోసం ఎక్కడెక్కడ స్థలాలు కావాలని విజ్ఞప్తి చేశారనే వివరాలు కూడా లేవు. * జిల్లా విద్యాశాఖ పొందుపరిచిన సమాచారం అసమగ్రంగా ఉండటంతో సభ్యుల ఆగ్రహానికి గురికావలసి వచ్చింది. జిల్లాలో మొదటి దశలో మొత్తం 37 మోడల్ పాఠశాలల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతి లభించింది. వాటిలో 11 పాఠశాలలకు మాత్రమే నిధులు మంజూరయ్యాయి. 5 నిర్మాణం పూర్తిచేసుకోగా...5 చోట్ల నిర్మాణం జరుగుతూ ఉంది. అయితే ఈ వివరాలను తెలియజేయడంలో విద్యాశాఖ అయోమయాన్ని సృష్టించింది. దీంతో జిల్లా విద్యాశాఖాధికారిపై జెడ్పీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. * జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం లిమిటెడ్ మొత్తం మూడు పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే కేవలం 27 మండలాల సమాచారం మాత్రమే నివేదికలో ఉంది. మిగిలిన 29 మండలాల సమాచారం లేదు. అది కూడా కేవలం ఒక పథకానికి సంబంధించిన సమాచారం మాత్రమే ఇచ్చారు. * ఏపీబీసీ స్టడీ సర్కిల్ నిర్మాణం కోసం ప్రగతి భవన్ వెనుక వైపు శంకుస్థాపన చేశారు. దానిపై ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదు. దాని నిర్మాణానికి సంబంధించి ఎటువంటి వివరాలు లేవు. * జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ వివరాలే సభ్యులకు ఇచ్చిన పుస్తకంలో లేవు. -
నాల్గో రోజుకు చేరిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన
ఒంగోలు: ‘ఎనిమిదేళ్లుగా మాతో కలిసి ప్రజానీకానికి సేవలు అందించారు. కానీ ప్రభుత్వ ఉత్తర్వుల కారణంగా రోడ్డెక్కిన మీ పోరాటానికి మా సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది’ అని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ డీఈల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ లక్ష్మీనారాయణ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు గృహ నిర్మాణ శాఖలో విధుల నుంచి తొలగించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు స్థానిక కలెక్టరేట్ వద్ద చేస్తున్న ధర్నా నాల్గో రోజుకు చేరింది. ధర్నాలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మీపై డీఈ స్థాయి అధికారి ఎవరూ ఒత్తిడి తీసుకురాకుండా చూస్తామన్నారు. ఒక వైపు ఉపాధి కోల్పోయి ఆందోళనలో ఉన్న మీకు జీతం బకాయిలు రాకపోవడం బాధాకరమని చెప్పారు. ప్రభుత్వంపై సానుకూల వైఖరితో ధర్నా చేయాలని, అయితే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రాజీలేని పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు ఎన్ ఆదినారాయణ మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా ఎంతోమంది పేదలు గూడు కట్టుకోవడానికి సహకరిస్తే ప్రస్తుత ప్రభుత్వం తమ ఉపాధికి గండికొట్టిందన్నారు. బాబు వచ్చే... జాబు పోయే అని చెప్పారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పీ మస్తాన్‌రావు మాట్లాడారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలివితేటల్ని ప్రసాదించాలని వినతిపత్రం అందజేశారు. ధర్నాకు మద్దతు తెలిపిన వారిలో డీఈలు శ్రీహరి, సుబ్బారావూ ఉన్నారు. ధర్నాలో గృహ నిర్మాణ శాఖ జిల్లా ఐటీ మేనేజర్ కైలా శ్రీనివాసరావు, చింపిరయ్య, శాంతకుమారి, సౌదామిని పాల్గొన్నారు. -
ఫ్లాట్ రూ.9-14 లక్షలు!
చిరుద్యోగులకు తక్కువ ధరకే ఇళ్లను నిర్మించి ఇచ్చే ప్రత్యేక ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. ఈ ఇళ్ల తాత్కాలిక ధరలను రాష్ట్ర గృహ నిర్మాణ మండలి ప్రకటించింది. రాష్ట్రంలో తొలి విడతగా పది ప్రాంతాల్లో మూడు వేల ఇళ్లను నిర్మించేందుకు సిద్ధమైన గృహనిర్మాణ మండలి తాత్కాలిక ధరలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని కూకట్పల్లి, చందానగర్, నిజాంపేట, బండ్లగూడ, రెడ్‌హిల్స్, విశాఖపట్నంలోని మధురవాడ, విజయవాడలోని భవానీపురం, నెల్లూరు జిల్లా కల్లూరుపల్లి, నల్లగొండ పట్టణంతోపాటు గృహనిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్లోనూ తొలివిడతలో ఇళ్లను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. 450 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్లను నిర్మించనున్నారు. స్థానికంగా ఉన్న భూముల విలువల ఆధారంగా వాటి ధరలను నిర్ధారించారు. వీటిల్లో అత్యధికంగా కూకట్పల్లి ప్రాజెక్టు ధరను ఖరారు చేశారు. ఇక్కడ ఒక్కో ఫ్లాట్ ధరను రూ.14 లక్షలుగా నిర్ణయించగా.. దానికి సమీపంలోనే ఉండే చందానగర్‌లో ఆ ధర రూ.11 లక్షలుంది. నగరంలోని ఐదు ప్రాజెక్టులకు గాను బండ్లగూడ ప్రాజెక్టు ధర అత్యల్పంగా రూ.9.3 లక్షలుగా ఖరారు చేశారు. వీటికి సంబంధించిన దరఖాస్తులను గృహనిర్మాణ మండలి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వివరాలు పూరించి, ఎంచుకున్న ప్రాజెక్టు తాత్కాలిక ధరలో 10 శాతం మొత్తాన్ని డీడీ రూపంలో ధరావతు(ఈఎండీ)గా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించడానికి తుది గడువు సెప్టెంబర్ 25. రక్షణ రంగంలో పనిచేస్తున్నవారికి అక్టోబర్ 10 వరకు గడువుందని అధికారులు చెప్పారు. దరఖాస్తు ధర రూ.500. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థల్లోని నాలుగో తరగతి స్థాయి నుంచి సూపరింటెండెంట్ స్థాయి వరకు ఉద్యోగులు.. కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులు, దుకాణ, వ్యాపార సముదాయాల్లో పనిచేసే చిరుద్యోగులను ఉద్దేశించి ఈ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. రూ.15 వేలు, అంతకంటే ఎక్కువ వేతనం ఉన్నవారే దీనికి అర్హులని అధికారులు ప్రకటించారు. నాలుగో తరగతి ఉద్యోగులకు తొలి ప్రాధాన్యముంటుంది. ఈ ఫ్లాట్లకు రుణ వసతి కల్పిస్తున్నారు.