
కాచిగూడ : ఏపీఎన్‌జీఓస్ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ అడహక్ కమిటీ సమావేశం అడహాక్ కమిటీ చైర్మన్ ఎం.సత్యనారాయణగౌడ్ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గచ్చిబౌలిలో కేటాయించిన స్థలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అర్హులైన ఉద్యోగులందరికీ ఇళ్లస్థలాలు అందేలా కృషి చేస్తామని ఎం.సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏపీఎన్‌జీఓస్ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీకి అడహక్ కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు.
త్వరలోనే పూర్తి స్థాయి కమిటీని ఎన్నుకుంటామన్నారు. సొసైటీలో సభ్యులుగా ఉన్న అర్హులైన తెలంగాణ ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలను ప్రభుత్వం కేటాయించేలా నాలుగేళ్లుగా నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అడహక్ కమిటీ ప్రతినిధులు పి.బలరామ్, జి.మల్లారెడ్డి, ఎస్.ప్రభాకర్‌రెడ్డి, ఎ.శ్రీనివాస్, జి.రాజేశ్వర్‌రావు, అబ్దుల్ సాధిక్, కేశియానాయక్, జి.పద్మారెడ్డి, ఎం.శ్రీనివాస్‌రావు, బీఈ చక్రవర్తి, పి.శ్రీధర్‌రెడ్డి, ఎస్.సంధ్యారాణి, రషీదా బేగం, రమాదేవి, టి.విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment