Angioplasty treatment
-
అనుమతి లేకుండా యాంజియోప్లాస్టీ.. ఇద్దరు మృతి
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోరం చోటుచేసుకుంది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుని నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు మృతి చెందారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆ వైద్యుడు అనుమతి లేకుండా ఏడుగురు బాధితులకు యాంజియోప్లాస్టీ నిర్వహించాడు. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఐదుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం నవంబర్ 10న గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించింది. దీనికి 19 మంది బాధితులు హాజరయ్యారు. వీరిలో 17 మంది రోగులకు వైద్యులు యాంజియోగ్రఫీ చేశారు. ఏడుగురికి యాంజియోప్లాస్టీ చేశారు. ఈ విషయాన్ని బాధితుల కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయలేదు. చికిత్స అనంతరం బాధితుల ఆరోగ్యం దిగజారింది. ఈ నేపధ్యంలో మహేశ్ గిర్ధర్ భాయ్ బరోట్, నగర్ సేన్మా అనే బాధితులు మృతిచెందారు.విషయం తెలుసుకున్న బాధితుల గ్రామస్తులు ఆస్పత్రిని ధ్వంసం చేశారు. ఘటన అనంతరం ఆస్పత్రి యాజమాన్యం పరారయ్యింది. ఆసుపత్రి డైరెక్టర్, చైర్మన్ కూడా పరారయ్యారని సమాచారం. కాగా ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) సొమ్మును దక్కించుకునేందుకు ఈ ప్రైవేట్ ఆసుపత్రి.. బాధితుల అంగీకారం తీసుకోకుండా ఈ విధంగా వ్యవహరిస్తున్నదని బాధిత కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన గుజరాత్ మెడికల్ కౌన్సిల్ అహ్మదాబాద్‌లోని ఖ్యాతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి నోటీసులు పంపింది. ఈ ఘటనపై ఆస్పత్రి సీఈవో సహా ఐదుగురి నుంచి జీఎంసీ సమాధానాలు కోరింది. యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ గురించి బాధిత కుటుంబ సభ్యులకు ఎందుకు తెలియజేయలేదని కోరింది. మరోవైపు ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పీఎంజేఏవై ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది.ఈ పథకం కింద ఆసుపత్రికి అందాల్సిన అన్ని బకాయి చెల్లింపులను నిలిపివేసింది. కాగా గుండె సంబంధిత కరోనరీ ఆర్టరీ వ్యాధికి చికిత్సలో భాగంగా యాంజియోప్లాస్టీ చేస్తారు. ఈ వ్యాధి గుండె కండరాలకు రక్త ప్రవాహాన్ని మందగింపజేస్తుంది. ఫలితంగా రక్త నాళాలు కుచించుకుపోతాయి. ఈ చికిత్సతో కుచించుకుపోయిన ధమనులు లేదా సిరలను విస్తరించేలా చేస్తారు. ఫలితంగా కరోనరీ ధమనులకు రక్త ప్రవాహ పునరుద్ధరణ సవ్యంగా జరుగుతుంది.ఇది కూడా చదవండి: ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ -
సాయాజి షిండే హెల్త్ అప్డేట్ ప్రకటించిన వైద్యులు
ప్రముఖ నటుడు సాయాజి షిండేకు ఏప్రిల్ 12న ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. మహారాష్ట్రలోని సతారాలో ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. సాయాజి షిండే కొద్దిరోజుల క్రితమే అస్వస్థతకు లోనయ్యారని డాక్టర్ సోమనాథ్ తెలిపారు. అందువల్ల ప్రస్తుతం ఆయనకు ఆంజియోప్లాస్టీ చేశామని ఆయన పేర్కొన్నారు. సాయాజి షిండే హృదయంలోని కుడివైపు సిరలు పూర్తిగా మూసుకుపోయాయి. దాంతో ఆయనకు వైద్యులు ఆంజియోప్లాస్టీ చేశారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో సాయాజి షిండే కూడా ఇన్‌స్టాలో ఒక పోస్ట్ చేశారు. 'అందరికీ నమస్కారం, నేను చాలా బాగున్నాను. నన్ను ప్రేమించే నా శ్రేయోభిలాషులు చూపిన అభిమానానికి ఫిదా అవుతున్నాను. మీ అందరూ నాతోనే ఉన్నారు. చింతించాల్సిన పని లేదు. త్వరలోనే నేను మీ అందరి ముందుకు వస్తాను.' అని ఆయన అన్నారు. సాయాజి షిండే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్‌పురి, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేశారు. తెలుగులో.. గుడుంబా శంకర్, ఆంధ్రుడు, అతడు, పోకిరి, లక్ష్మి, ఆట, దుబాయ్ శీను, ఆర్య 2, అరుంధతి, మిస్టర్ పర్ఫెక్ట్, దూకుడు, బిజినెస్మెన్.. ఇలా అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. View this post on Instagram A post shared by Sayaji Shinde (@sayaji_shinde) -
పాక్ క్రికెటర్ ఆబిద్ అలీకి యాంజియో ప్లాస్టీ.. రెండు నెలలు విశ్రాంతి
పాకిస్తాన్ టెస్టు ఓపెనర్ ఆబిద్ అలీ రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. గురువారం అతడికి రెండోసారి యాంజియో ప్లాస్టీ నిర్వహించి మరో స్టెంట్‌ను వైద్యులు అమర్చారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, పూర్తిగా కోలుకోవడానికి కనీసం రెండు నెలల విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలిపారు. 34 ఏళ్ల ఆబిద్ పాక్ తరఫున 16 టెస్టులు ఆడి 1,180 పరుగులు... 6 వన్డేలు ఆడి 234 పరుగులు చేశాడు. -
గంగూలీకి మరో రెండు స్టెంట్లు
కోల్‌కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి గురువారం వైద్యులు యాంజియోప్లాస్టీ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఛాతీలో అసౌకర్యంతో బుధవారం ఆసుపత్రిలో చేరిన ఆయనకు తాజాగా రెండు స్టెంట్లు అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ‘కరోనరీ ఆర్టినరీ పూడికలను తొలగించేందుకు గంగూలీకి అదనంగా రెండు స్టెంట్లు అమర్చాం. ప్రస్తుతం ఆయనను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నాం. ఆపరేషన్‌కు ముందు పలు వైద్య పరీక్షలు నిర్వహించాం’ అని వారు తెలిపారు. 48 ఏళ్ల గంగూలీ ఈ నెలలో రెండు సార్లు ఆసుపత్రి పాలయ్యారు. జనవరి 2న స్వల్ప గుండెపోటు రావడంతో ఆయనకు యాంజియోప్లాస్టీ ద్వారా ఒక స్టెంట్‌ను అమర్చారు. తాజాగా మరోసారి ఛాతీలో అసౌకర్యం ఏర్పడటంతో ఇంకో రెండు స్టెంట్లు వేశారు. -
పగిలిన గుండె రక్తనాళానికి చికిత్స
కర్నూలు(హాస్పిటల్): రక్తనాళంలో రక్తం గడ్డకట్టి రక్తనాళం చిట్లి గుండెపోటు వచ్చిన వ్యక్తికి కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు యాంజియోప్లాస్టీ ద్వారా అరుదైన చికిత్స చేసి ప్రాణం కాపాడారు. ఆదివారం కార్డియాలజిస్టు డాక్టర్ చింతా రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘గిద్దలూరుకు చెందిన నాగార్జునరెడ్డి(32)కి గతేడాది నవంబర్ 12న ఛాతిలో నొప్పి రావడంతో సమీపంలోని ఆస్పత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు రక్త పరీక్షల్లో గుండెకు సంబంధించిన సమస్యను గుర్తించారు. దీంతో అతను అదే రోజు కిమ్స్ హాస్పిటల్‌కు వచ్చాడు. యాంజియోగ్రామ్ చేయగా రక్తనాళం పగిలినట్లు తేలింది. ఇది చాలా అరుదైన కేసు. ప్రపంచంలోనే 20వ కేసుగా పరిగణించవచ్చు. పైగా మిగతా 19 కేసుల కంటే భిన్నమైనది. రక్తనాళం పగలడంతో రక్తం గుండె చుట్టూ చేరుకుని ఒత్తిడికి గురిచేసింది. ఆ సమయంలో రోగి బీపీ తగ్గి వెంటనే మరణించే అవకాశం ఉంది. ఇతనిలో ప్రమాదాన్ని సాధ్యమైనంత తొందరంగా గుర్తించి పెర్క్యుటేనియస్ ట్రాన్స్లూమినల్ కరోనరి యాంజియోప్లాస్టీ చేసి రక్తప్రవాహాన్ని ఆపి ప్రాణాలు కాపాడాం. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకున్నాడు’ అని వివరించారు. -
గుండెపోటును దాటి గోల్ఫ్‌కు...
న్యూఢిల్లీ: ఇటీవలే గుండెపోటుకు గురైన భారత విఖ్యాత కెప్టెన్ కపిల్ దేవ్ మళ్లీ మైదానంలోకి దిగారు. తన ఫిట్నెస్ స్థాయి ఏంటో చాటారు. 61 ఏళ్ల కపిల్‌కు ఇటీవలే యాంజియోప్లాస్టీ చేశారు. కాస్త విశ్రాంతి తీసుకున్న ఆయన వైద్యుల అనుమతితో గురువారం ఢిల్లీ గోల్ఫ్ క్లబ్లో గోల్ఫ్ ఆడారు. భారత్‌కు తొలి ప్రపంచకప్ (1983) అందించిన ఆయన తదనంతరం తనకెంతో ఇష్టమైన గోల్ఫ్ వైపు మళ్లారు. మళ్లీ మైదానంలోకి దిగడంపై కపిల్ ట్వీట్ చేశారు. ‘ఈ అనుభూతిని మాటల్లో వివరించలేను. గోల్ఫ్ కోర్స్, క్రికెట్ గ్రౌండ్... ఏదైనా సరే మళ్లీ ఆడటమనేది చాలా ఉల్లాసంగా, ఎంతో ఆనందంగా ఉంది. నా మిత్రులతో కలిసి ఇలా సరదాగా ఆడటం నిజంగా తృప్తినిచ్చింది. జీవితమంటే ఇదేనేమో!’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక 1994 నుంచి కపిల్ దేవ్ రెగ్యులర్‌గా గోల్ఫ్ ఆడుతున్నారు. పలు ఈవెంట్లలోనూ పోటీపడ్డారు. -
‘చాలా బాగున్నాను’
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ తాను వేగంగా కోలుకుంటున్నట్లు ప్రకటించారు. అందరి దీవెనలతో తన ఆరోగ్యం మెరుగుపడిందని ఆయన తన ఇంటి ముందు నిలబడి రికార్డు చేసిన వీడియో ద్వారా వెల్లడించారు. గత వారం గుండెపోటుకు గురైన కపిల్‌కు యాంజియోప్లాస్టీ సర్జరీ జరిగింది. ‘నా 83 కుటుంబానికి...వాతావరణం ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. మీ అందరినీ కలవాలని ఉత్సాహంగా ఉన్నా. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది. మీ దీవెనలకు నా కృతజ్ఞతలు. సాధ్యమైనంత త్వరలో అందరినీ కలుసుకుంటా. ఈ ఏడాది చివరి దశకు వచ్చింది. వచ్చే ఏడాది అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నా’ అని కపిల్ అన్నారు. -
నటి మనోరమకు అస్వస్థత
చెన్నై: ప్రముఖ తమిళ నటి మనోరమ అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం మనోరమకు ఛాతీలో నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చినట్టు ఆమె సన్నిహితులు తెలిపారు. మనోరమ గుండెపోటుకు గురై ఉండవచ్చని భావిస్తున్న వైద్యులు.. ఆమెకు యాంజియోప్లాస్టీ చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. ఆదివారం ఆమెకు అన్ని పరీక్షలు నిర్వహించారని, వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు