ఎన్నికల పరిశీలకుడిగా అనిల్ కుమార్
హైదరాబాద్: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పరిశీలకుడిగా నెల్లూరు సిటీ నియోజకవర్గ శాసనసభ్యుడైన పీ. అనిల్ కుమార్ను నియమిస్తూ వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనిల్ కుమార్ను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.