animal meat
-
కుక్క,పిల్లి మాంసంపై శాశ్వత నిషేధం
బీజింగ్ : ఎట్టకేలకు చైనాలోని ఒక నగరం కీలక నిర్ణయం తీసుకుంది. కరాళనృత్యం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భవిష్యత్తులో వ్యాప్తి చెందకుండా నిరోధించే ప్రయత్నంలో చైనా లోని షెన్జైన్ నగరంలో కుక్కలు, పిల్లులు, బల్లులు, పాములు, సహా ఇతర అడవి జంతువుల మాంసం తినడాన్ని నిషేధం విధించింది. అంతేకాదు ప్రస్తుత వైరస్ వ్యాప్తి ప్రారంభంలో చైనా ప్రభుత్వం జారీ చేసిన తాత్కాలిక నిషేధానికి మించి అడవి జంతువుల వ్యాపారం, వినియోగాన్ని శాశ్వతంగా నిషేధించింది. కుక్క, పిల్లి మాంస విక్రయాలకు ప్రత్యేకతగా చెప్పుకునే షెన్జెన్ నగరంలో కుక్క, పిల్లి , పాములు, బల్లుల మాంసం వినియోగాన్ని నిషేధించింది. మే 1 నుండి ఈ నిషేధం అమల్లోకి వచ్చేలా నిబంధనలను ప్రవేశపెట్టింది. 'ఆధునిక సమాజానికి సార్వత్రిక నాగరికత అవసరం' అని గుర్తించామని అధికారులు ప్రకటించారు. పిల్లి, కుక్క మాంసం వ్యాపారం, వినియోగాన్ని శాశ్వతంగా నిషేధించిన చైనా మొట్టమొదటి నగరంగా షెన్జెన్ అవతరించింది. ఈ నిషేధాన్ని ఉల్లఘింస్తే జరిమానా భారీగానే వుంటుంది. స్వాధీనం చేసుకున్న జంతువుల విలువను బట్టి గణనీయంగా పెరుగుతుంది. ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్న నగరంగా షెన్జెన్ రికార్డుల కెక్కింది. మరోవైపు ఇది చారిత్రాత్మక నిర్ణయంమంటూ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ కు చెందిన ప్రముఖుడు డాక్టర్ పీటర్ లి ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ మహమ్మారి నుండి నేర్చుకున్న పాఠాలను తీవ్రంగా పరిగణించి, మరొక మహమ్మారిని నివారించడానికి అవసరమైన మార్పులు చేసిన మొట్టమొదటి నగరం షెన్జెన్ అని హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ వన్యప్రాణి విభాగం ఉపాధ్యక్షుడు తెరెసా ఎం.టెలికీ అన్నారు. క్రూరమైన వాణిజ్యాన్ని అంతం చేసే ప్రయత్నాలలో షెన్జెన్ విధించిన నిషేధం అభినంద నీయమని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం చైనాలో 10 మిలియన్ కుక్కలు , 4 మిలియన్ పిల్లుల మాంసాన్ని విక్రయిస్తారని అంచనా వేశారు. కాగా సెంట్రల్ చైనా నగరమైన వుహాన్‌లో గత ఏడాది డిసెంబరులో మొట్టమొదట కరోనా వైరస్ ను గుర్తించారు. వూహాన్ నగరంలో జంతు వధశాల కేంద్రంగా ఈ వైరస్ వ్యాపించిందనే వాదనలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా కుక్క మాంసం వ్యాపారం జరిగే చైనాలోని నగరాల్లో షెన్జెన్ ఐదవ అతిపెద్ద నగరం. 12.5 మిలియన్ల జనాభా ఇక్కడ నివసిస్తారు. తైవాన్, హాంకాంగ్ దేశాల్లోనూ వీటి మాంసం విక్రయాలను నిషేధించిన సంగతి తెలిసిందే. -
టీడీపీ నేతల అరెస్టు
సాక్షి, తిరుపతి : అధికారం ఉంది కదా అని టీడీపీ నేతలు యథేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా అక్రమంగా వన్యప్రాణుల మాంసాన్ని తరలిస్తున్న టీడీపీ నేతల్ని అటవీ శాఖ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పెద్ద ఎత్తున వన్య ప్రాణుల మాంసం, జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లికి చెందిన టీడీపీ నేత కామాటి మునిరత్నం యాదవ్‌తో పాటు మరో వ్యక్తి ఉండటం గమనార్హం. అధికారుల రాకను గమనించిన మరో ఇద్దరు టీడీపీ నేతలు పరారయినట్టు సమాచారం. అదుపులోకి తీసుకున్న నిందితులను భాకరాపేట అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. గత కొద్దికాలంగా వీరు వన్యప్రాణులను వేటాడి.. అక్రమంగా వాటి మాంసాన్ని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
కృత్రిమ మాంసం తక్షణ అవసరం
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మాంసం తయారీ తక్షణ అవసరం అని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ వ్యాఖ్యానించారు. ఒకట్రెండేళ్లలో ఈ మాంసం అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. కృత్రిమ మాంసాన్ని తినేందుకు సిద్ధంగా ఉన్నామని అధిక శాతం ప్రజలు పలు సర్వేల్లో తెలిపినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లో శుక్రవారం ‘ది ఫ్యూచర్ ఆఫ్ ప్రొటీన్’పేరుతో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పశుపోషణకు ఫుల్స్టాప్ పెట్టి కృత్రిమ మాంసం ఉత్పత్తిని ప్రోత్సహించాల్సిన తరుణం ఇదేనన్నారు. పశుపోషణ ఆపేస్తే నాలుగేళ్లలో భూతాపాన్ని అరికట్టొచ్చని చెప్పారు. భూతాపానికి మీథేన్ కూడా ఓ కారణమని, పశుపోషణ వల్ల మీథేన్ ఉద్గారాల తీవ్రత పెరుగుతోందని చెప్పారు. వరిసాగు, బొగ్గు మండించడం ద్వారా కూడా మీథేన్ వెలువడుతుందని పేర్కొన్నారు. అయితే కోళ్లు, గొర్రెలు, మేకల వంటి పశువుల పెంపకం ఆపేస్తే మీథేన్ ఉద్గారాలు తగ్గుతాయన్నారు. వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రం కాకముందే పశువుల పెంపకాన్ని ఆపేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. జంతువుల నుంచి కొన్ని కణాలను తీసుకుని బయోరియాక్టర్లలో వృద్ధి చేయడం ద్వారా తయారయ్యే ఈ మాంసం ప్రకృతి వనరులెన్నింటినో ఆదా చేస్తుందని తెలిపారు. మాంసంలో చేరుతున్న కొన్ని రకాల వైరస్ల కారణంగా కేన్సర్లు వస్తున్నాయని చాలా అధ్యయనాల్లో తేలిందని చెప్పారు. కృత్రిమ మాంసాన్ని తినేందుకు సిద్ధంగా ఉన్నట్లు 53 శాతం మంది తెలిపినట్లు ఫొర్నెలిటిక్స్ సంస్థ సర్వే చెబుతోందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం లక్షల సంఖ్యలో పశువులను పంపిణీ చేస్తున్న విషయంపై మాట్లాడుతూ.. గతంలో ఏపీలోనూ ఇదే తరహా ప్రయత్నం చేశారని ఇంటికో ఆవు పంపిణీ చేస్తే అందులో 90 శాతం కబేళాలలకు తరలిపోయాయని గుర్తు చేశారు. మొక్కల నుంచి ఇలా..! ప్రోటీన్లు అధికంగా ఉండే మొక్కలు, వృక్షాల ఉత్పత్తులను తీసుకుని ల్యాబుల్లో మాంసంగా తయారు చేస్తారు. చూసేందుకే కాదు.. తినేందుకు కూడా అచ్చు మాంసంలాగే ఉంటుంది. జంతువుల నుంచి ఎలా? ఆరోగ్యవంతమైన జంతువులను సరైన మంచి పరిసరాల్లో పెంచి వాటి నుంచి కొన్ని కణాలను తీసుకుని ల్యాబ్‌ల్లో అభివృద్ధి చేసి, దాని నుంచి మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. కృత్రిమ మాంసం తినడం వల్ల ఎలాంటి వ్యాధుల రావని, పైగా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. ‘కృత్రిమ మాంసం ఉత్పత్తి విషయంలో పరిశోధనలను ముమ్మరం చేసి, వాణిజ్య స్థాయికి తీసుకొచ్చేందుకు గుడ్ ఫుడ్ ఇన్స్టిట్యూట్ ప్రయత్నం చేస్తోంది. ఈ రంగంలోని అన్ని వర్గాల వారిని సమన్వయం చేసుకుంటూ మొక్కల ఆధారిత మాంసం, కృత్రిమ మాంసం ఉత్పత్తికి ప్రయత్నం చేస్తున్నాం.’ –వరుణ్ దేశ్‌పాండే, గుడ్‌ఫుడ్ ఇన్స్టిట్యూట్ ‘కృత్రిమ మాంసం ఎలా తయారు చేయొచ్చో శాస్త్రవేత్తలకు తెలుసు. జంతువుల నుంచి కాకుండా మొక్కల నుంచి తయారు చేసే ప్రత్యామ్నాయాలు దొరికితే బాగుంటుంది. కొబ్బరి నీళ్లు, తేనె వంటి వాటి పై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి ఫలిస్తే కృత్రిమ మాంసంలో కణాలు మినహా మరే ఇతర జంతు సంబంధిత పదార్థాలు ఉండవు’ – పవన్ కె.ధర్, కృత్రిమ బయాలజీ విభాగం, జేన్యూ, ఢిల్లీ ‘కృత్రిమ మాంసం తయారీని వాణిజ్య స్థాయిలో అభివృద్ధి చేయడం ఎలా అన్నది ఒక సవాలు. దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్‌లో కృత్రిమ మాంసం ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందన్నది ఇప్పుడిప్పుడే చెప్పలేం’ – రాకేశ్ మిశ్రా, డైరెక్టర్ సీసీఎంబీ, హైదరాబాద్ ‘పశుపోషణ కారణంగా పర్యావరణానికి జరుగుతున్న నష్టం అంత ఇంత కాదు. ఈ నేపథ్యంలో జంతువులను చంపాల్సిన అవసరం లేకుండా కావాల్సిన ప్రొటీన్లను ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించే టెక్నాలజీలను ప్రొత్సహించాల్సి ఉంది.’ – సౌమ్యారెడ్డి, జంతు ప్రేమికురాలు -
హెరిటేజ్ ప్రీజర్‌లో వన్యప్రాణుల మాంసం!
మృగయా వినోదం పేరిట వన్యప్రాణుల వేట.. వాటి మాంసంతో విందు వినోదాలు ఒకనాడు హోదాకు చిహ్నాలు..నేటి సమాజంలో వన్యప్రాణుల వేట ఓ నేరం.. కానీ కొందరు బడాబాబులు తమ హోదాను చాటుకునేందుకు ఇదే దుస్సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు..వన్యప్రాణుల మాంసంతో మంత్రులు, ఇతర ప్రముఖులను ఖుషీ చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ అమాత్యుడి ముఖ్య అనుచరుడి కుటుంబ ఫంక్షన్ కోసం.. ఇలా వన్యప్రాణుల మాంసాన్ని తరలించడం.. ఈ ప్రాంతంలో పాతుకుపోయిన ఈ దుస్సంప్రదాయాన్ని వెలుగులోకి తెచ్చింది. విడ్డూరమేంటంటే.. వన్యప్రాణుల మాంసాన్ని సీఎం కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ ప్రీజర్ బాక్స్‌లో తరలించడం..! అయితే కథ అడ్డం తిరిగి.. అడ్డగోలుగా తరలిస్తున్న ఈ మాంసం నిల్వలు అటవీ అధికారులకు దొరికిపోవడం.. వారి విచారణలో కఠోర వాస్తవాలు వెలుగు చూస్తుండటం కలకలం రేపుతోంది. పాయకరావుపేట దుర్గాకాలనీ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున హెరిటేజ్ ప్రీజర్ బాక్స్‌లో పెట్టి స్కార్ఫియో వాహనంలో తరలిస్తున్న మూడు సంచుల వన్యప్రాణుల మాంసంతో పాటు కణుజు తోలు, కాళ్లు పట్టుబడిన కేసులో నిందితులంతా టీడీపీ నేతలే..మంత్రి యనమల రామకృష్ణుడికి సన్నిహితుడైన తుని మండలం సీతారామపురం గ్రామానికి చెందిన నెట్టి కృష్ణంరాజు కుటుంబ ఫంక్షన్ కోసమే ఈ మాంసాన్ని తరలిస్తున్నట్టు పట్టుబడిన వారు చెప్పడంతో పరారీలో ఉన్న కృష్ణంరాజును ఏ–1గా పెట్టి కేసు నమోదు చేశారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పాయకరావుపేట తాండవ చక్కెర కర్మాగారం సమీపంలో ఆదివారం ముగ్గురు వ్యక్తుల నుంచి సుమారు 70 కిలోల వన్యప్రాణుల మాంసాన్ని యలమంచిలి అటవీ శాఖ రేంజర్ రవిప్రసాద్ ఆధ్వర్యంలోని బృందం స్వాధీనం చేసుకుంది. వన్యప్రాణులైన కణుజు, అడవి పంది, అడవి గొర్రెలను చంపి.. ఆ మాంసాన్ని సీఎం చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫ్రీజర్ బాక్సులో తరలించడం కలకలం రేపింది. మంత్రి యనమల రామకృష్ణుడికి సన్నిహితుడైన తుని మండలం సీతారామపురం గ్రామానికి చెందిన నెట్టి కృష్ణంరాజుకు చెందిన కుటుంబ ఫంక్షన్ కోసమే ఈ మాంసాన్ని తరలిస్తున్నట్టు అటవీ అధికారులకు పట్టుబడిన ముగ్గురు నిందితులు చెప్పుకొచ్చారు. వారి విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు బయటికొస్తున్నాయి. చక్కెర కర్మాగారం వెనుక కూత వేటు దూరంలో ఉన్న తోటల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన ఓ భూస్వామికి గెస్ట్ హౌస్ ఉంది. ఇక్కడే ఆదివారం భారీ ఎత్తున విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు హాజరయ్యే ప్రముఖులకు వడ్డించేందుకు మూడు రకాల వన్యప్రాణులను వేటాడినట్లు సమాచారం. అక్కడే వేటాడారా? కోటవురట్ల మండలం పందూరు, అల్లుమియ్యపాలెం ప్రాంతాల్లో వన్యప్రాణులను వేటాడి.. మాంసాన్ని వాహనంలో విందు వేదిక వద్దకు తరలిస్తూ దొరికిపోయారు. టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఓ వర్గం నేతలు జిల్లా అటవీ అధికారులకు ఈ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 20 ఏళ్ల నుంచి ఈ ప్రాంతాల్లో యథేచ్ఛగా వన్యప్రాణుల వేట జరుగుతున్నప్పటికీ ఏనాడు వీటివైపు కన్నెత్తి కూడా చూడని అధికారులు ఇప్పుడు మాటు వేసి పట్టుకోవడానికి టీడీపీలని ప్రత్యర్ధి వర్గీయులు చేసిన పక్కా ఫిర్యాదే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఇదే తంతు కేసులో ఏ–1 నిందితుడిగా ఉన్న కృష్ణంరాజుపై ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. ఫైనాన్స్ వ్యాపారం చేసే కృష్ణంరాజుకు ఇటువంటి విందుల నిర్వహణలో సిద్ధహస్తుడిగా పేరుంది. ఆదివారం మాంసాన్ని తరలిస్తూ పట్టుబడ్డ వాహనం(స్కార్పియో వాహనం నెం:ఎపి.35డి.5678) కూడా ఆయనదే కావడం గమనార్హం. కాగా, మారుమూల తోటలో ఉన్న గెస్ట్ హౌస్‌లో రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు స్థానికంగా ఉన్న చోటా మోటా నాయకులకు వన్యప్రాణుల మాంసంతో విందు ఇచ్చే తంతు చాలా ఏళ్ల నుంచి నడుస్తోందని అంటున్నారు. రెండు నెలల కిందట తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి, విశాఖ జిల్లాకు చెందిన మంత్రికి ఇదే గెస్ట్‌హౌస్‌లో లంచ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. మారుమూల గెస్ట్ హౌస్‌కు, ఇక్కడి తోటల్లో జరిగే పంక్షన్లకు మంత్రులు పదే పదే రావడం వెనుక మర్మం ఇదేనని అంటున్నారు. సెలవులో డీఎఫ్‌వో? వాస్తవానికి జిల్లా అటవీశాఖాధికారి(డీఎఫ్‌వో) సెల్వంకు వచ్చిన సమాచారంతోనే యలమంచిలి అటవీరేంజ్ అధికారులు ఆదివారం ఉదయం దాడులు చేశారు. కానీ ఆ తర్వాత నుంచి డీఎఫ్‌వో ఆ కేసు గురించి మాట్లాడేందుకు సుముఖత చూపడం లేదు. దాని గురించి అడిగినవారికి సోమవారం నుంచి సెలవులో ఉన్నానని చెప్పడం పలు సందేహాలకు తావిస్తోంది. టీడీపీ నేతల ఒత్తిళ్ల మేరకే డీఎఫ్‌వో ఆ కేసు విషయంలో ఎవరితోనూ మాట్లాడటం లేదన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. హెరిటేజ్ ఫ్రిజ్ ఎక్కడిది? వన్యప్రాణుల మాంసాన్ని హెరిటేజ్ ఫ్రిజ్‌లో తరలించడం కూడా చర్చనీయాంశమైంది. సీఎం చంద్రబాబు కుటుంబ వ్యాపారసంస్థకు చెందిన ఫ్రీజర్ బాక్సులో తరలిస్తే అధికారులెవ్వరూ తనిఖీ చేయరన్న ధైర్యంతోనే నిందితులు దాన్ని ఏరికోరి తెచ్చుకున్నట్టు చెబుతున్నారు. తునిలో ఓ టీడీపీ నేతకు చెందిన సాయిరామ్ పార్లర్ నుంచి కూల్‌డ్రింక్‌లు భద్రపరిచేందుకు ప్రిజ్ కావాలని అడిగి మాంసం తరలించేందుకు ఉపయోగించినట్లుగా చెప్పుకుంటున్నారు. అయితే వాస్తవానికి సదరు సాయిరామ్ పార్లర్‌కు హెరిటేజ్ డీలర్షిప్ రద్దు అయినట్టు తెలుస్తోంది. రూ.6వేల రూపాయల బకాయి పడిన సాయిరామ్ పార్లర్ యజమాని హెరిటేజ్ డీలర్‌షిప్‌ను వదిలేసినట్లు సమాచారం. అలా డీలర్షిప్ వదిలేసిన తర్వాత ఫ్రిజ్‌ను తీసుకువెళ్ళకుండా హెరిటేజ్ సంస్థ ఎందుకు వదిలేసిందన్నది ప్రశ్నార్ధకంగా మారింది. డీలర్షిప్ రద్దయిన తర్వాత బాక్స్‌లపై హెరిటేజ్ స్టిక్కర్‌ను తీసివేసే ఆనవాయితీ ఉందని, అయినా సరే అలా ఎందుకు వదిలేశారన్నది కూడా అనుమానంగానే ఉంది. ఆ ముగ్గురికీ రిమాండ్ యలమంచిలి: వన్యప్రాణుల మాంసాన్ని తరలిస్తూ దొరికిపోయిన నిందితులు తుని మండలం మర్లపాడు గ్రామానికి చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్, సీతారామపురం గ్రామానికి చెందిన కోలా సత్యశివలోక్నా«థ్, కె.నవీన్‌కుమార్‌లను సోమవారం యలమంచిలి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రెండు వారాల పాటు రిమాండ్ విధించారు. ఒత్తిళ్లకు లొంగకుండా విచారణ– ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవిప్రసాద్ వన్యప్రాణుల వేట, మాంసం తరలింపు కేసులో ఒత్తిళ్లకు లొంగకుండా విచారణ చేస్తామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చుక్కల రవిప్రసాద్ చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కృష్ణంరాజు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తామని చెప్పారు. తాండవ చక్కెర ఫ్యాక్టరీ సమీపంలోని గెస్ట్ హౌస్‌లో జరిగే విందులపై ఇకపై దృష్టి పెడతామని చెప్పారు. వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అక్రమంగా పశువధ!
విజయనగరం మున్సిపాలిటీ/క్రైం : అనధికారిక పశు కబేళాకు జిల్లా కేంద్రం అడ్డాగా మారింది. ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్వాహకులు పశువులను వధించడంతో పాటు వాటి మాంసం విక్రయిస్తున్నారు. కేవలం అధికారుల నుంచి మాంసం విక్రయాలకు అనుమతులు తీసుకుని వాటి ఆధారంగా పశు కబేళాలు నిర్వహిస్తున్నారు. చట్టాలను, సంప్రదాయాలను తుంగలోకి తొక్కి కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. ఈ విషయం మున్సి పల్, రెవెన్యూ అధికారులకు తెలిసినా.. ఫిర్యాదులు అందినా..మామ్మూళ్ల మత్తులో పడి చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదివారం పట్టణంలోని కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలో నిర్వహిస్తున్న పశువధశాలపై వన్ టౌన్ పోలీసులు చేసిన దాడిలో పట్టుబడిన వ్యక్తి మున్సిపల్ కో ఆప్సన్ సభ్యుడి బినామీగా తెలుస్తోంది. ముందు రోజే హెచ్చరించినా... కలెక్టరేట్‌కు కూతవేటు సమీపంలో కొన్ని నెలలుగా అనధికారికంగా పశువధ కబేళాలతో పాటు మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. శనివారం ఆ ప్రాంతానికి వెళ్లిన ఆర్డీఓ వెంకటరావు, తహశీల్ధార్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ ఆర్. సోమన్నారాయణ, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ కె. రామారావు తనిఖీ చేశారు. అనధికారికంగా గోవధ శాలలను నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించి, వెళ్లిపోయారు. అయినా అనధికార గోవధ శాలల యజ మానులు ఆదివారం ఉదయం కూడా దుకాణం తెరిచి తమ పని కానిస్తున్నట్టు వన్‌టౌన్ పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మాంసాన్ని విక్రయిస్తున్న ఎండీ అహ్మదుల్లా దుకాణంపై పోలీసులు దాడులు చేసి అందులో మాంసాన్ని స్వాధీనం చేసుకుని మున్సిపల్ అధికారులకు అప్పగించారు. అనధికార గోవధ శాలను మున్సిపల్ కో ఆప్సన్ మెంబర్ బినామీ పేరుతో నిర్వహిస్తున్నట్టు స్థానికు లు ఆరోపిస్తున్నారు. దీనికి జిల్లాకు చెందిన టీడీపీ నాయకుల మద్దతు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆది వారం పట్టుబడిన నిర్వాహకునిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు నటన నటించా రన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం 6 గంటలకు సంఘటన స్థలానికి ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు వెళ్లగా 10 గంటల వరకు ఉన్నతాధికారి వస్తారంటూ సమాధానం చెప్పారు. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు ఆ ఛాయల్లో కనిపించలేదు. ఒక శానటరీ ఇన్స్పెక్టర్ మాత్రమే వచ్చి నలుగురితో నారాయణ అన్న చందంగా ఘటనా స్థలంలో వ్యవహరించారు. ప్రతి నెలా వారికి లక్షలాది రూపాయల ముడు పులు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. విషయంపై మున్సిపల్ కమిషనర్ సోమన్నా రాయణను ‘సాక్షి’ వివరణ అడిగేందుకు ప్రయత్నిం చగా.. ఆయన సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. 15 ఏళ్ల క్రితమే అధికారిక పశువధ కబేళా ఎత్తివేత పట్టణంలోని గెంజిపేట సమీపంలో 15 ఏళ్ల క్రితం అధికారిక పశువధ కబేళా ఉండేది. కాలక్రమంలో అప్పటి మున్సిపల్ కమిషనర్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వాటిని పూర్తిగా మూయించేశారు. అనంతరం ద్వారపూడి చెరువులో అనధికారికంగా పశువధ కబేళా నిర్వహించగా రెవె న్యూ అధికారులు దాడులు చేసి దాన్ని కూడా మూయించేశారు. అప్పటి నుంచి ఎటువంటి అధికారిక కబేళా లేకున్నా పట్టణంలో మాత్రం యథేచ్ఛగా నివాస గృహాల మ ధ్యే పశువధ చేస్తున్నారు. అధికారులపై ఒత్తిళ్లు దేవదాయ ధర్మాధాక శాఖ చట్ట ప్రకారం 300 మీటర్ల దూరంలో మద్యం దుకాణం, మాంసం దుకాణం ఉండకూడదు, అయితే 50 మీటర్ల దూరంలో ఈ వ్యవహారం జరుగుతున్నా.. పట్టించుకునే వారు లేరు. నిర్వాహకులకు అధికార పార్టీకి చెందిన నాయకుల అండ ఉండడంతో అధికారులు ఏమీ చే యలేని పరిస్థితి. ఎవరైన పట్టుబడినా వారి పలుకుబడి ఉపయోగించి అధికారులపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. మున్సిపల్ అధికారుల అండతోనే... మున్సిపల్ అధికారుల అండతోనే ఈ దందా కొనసాగుతోంది. మున్సిపల్ అధికారుల వద్ద నుంచి మాంసం విక్రయాల కోసం తీసుకునే అనుమతి పత్రాన్ని చూపించి మిగిలిన అధికారులను మోసం చేస్తున్నారు. పశుసంవర్థశాఖ అధికారులు ఇందుకు ఎటువంటి అనుమతులివ్వలేదు. ఇదంతా మున్సి పల్ అధికారుల అండదండలతోనే సాగుతోంది. - లోగిశ రామకృష్ణ , ఏపీ గోశాలల, గో పరిరక్షకుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు