
సాక్షి, తిరుపతి : అధికారం ఉంది కదా అని టీడీపీ నేతలు యథేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా అక్రమంగా వన్యప్రాణుల మాంసాన్ని తరలిస్తున్న టీడీపీ నేతల్ని అటవీ శాఖ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పెద్ద ఎత్తున వన్య ప్రాణుల మాంసం, జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లికి చెందిన టీడీపీ నేత కామాటి మునిరత్నం యాదవ్‌తో పాటు మరో వ్యక్తి ఉండటం గమనార్హం. అధికారుల రాకను గమనించిన మరో ఇద్దరు టీడీపీ నేతలు పరారయినట్టు సమాచారం. అదుపులోకి తీసుకున్న నిందితులను భాకరాపేట అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. గత కొద్దికాలంగా వీరు వన్యప్రాణులను వేటాడి.. అక్రమంగా వాటి మాంసాన్ని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment