ankamma
-
అందరూ ఉన్న అనాథ!
ఆమెకు కన్న బిడ్డలు ఉన్నారు... కానీ ఆకలి అంటే అన్నం పెట్టే వారు కరువయ్యారు. అయిన వారు చాలా మందే ఉన్నారు... దాహం వేస్తే గుక్కెడు నీరు అందించే వారు మాత్రం లేకపోయారు. జగమంత కుటుంబాన్ని నడిపించినా ఆఖరులో ఏకాకి జీవితాన్ని గడుపుతోంది. సత్తువ ఉన్నంత కాలం కుటుంబాన్ని రెక్కల కష్టంతో లాగినా... ఆ రెక్కలు పోయాక దిక్కులేని పక్షిలా గుడిసెకే పరిమితమైపోయింది. సొంత వారు పరాయి వారైపోయి, ఇరుగుపొరుగు వారు ఆప్తులైన వేళ ఆ ముదుసలి బతుకు శోకతప్తమైంది. కళ్లు కనిపించకపోయినా కన్నీరు పెట్టని రోజు లేదు, నోరు రాకపోయినా సంతానాన్ని తలిచి పిలవని రోజూ లేదు. – పొందూరు పొందూరు మండలంలోని బాణాం గ్రామంలో కొల్లి అంకమ్మ(80) జీవన చరమాంకంలో పడరాని కష్టాలు పడుతోంది. అంకమ్మ భర్త సూరినాయుడు 45 ఏళ్ల కిందటే చనిపోయారు. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. భర్త చనిపోయిన నాటి నుంచి అంకమ్మే కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చింది. సంతానానికి పెళ్లిళ్లు చేసింది. కూతురు లావేరు మండలంలో అగ్రహారంలో తన భర్తతో పాటే ఉంటుంది. కొడుకు మాత్రం పొందూరు మండలంలోని దళ్లిపేట గ్రామంలో తన భార్య, పిల్లలుతో కలిసి ఉంటున్నాడు. వీరు పదేళ్ల కిందట తల్లిని విడిచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి అంకమ్మ కన్నీళ్లు మింగుకుంటూ, కష్టాలు అనుభవిస్తూ బతుకుతోంది. తల్లిని చూసేందుకు కూతురు అప్పుడప్పుడూ వచ్చి Ðð ళ్తూ ఉంటుంది. ఆమె వచ్చినప్పుడల్లా అంకమ్మ మురిసిపోతుంది. కానీ కొడుకు, కోడలు రావడం లేదనే దిగులు మాత్రం అంకమ్మను ఉండనివ్వడం లేదు. దీనిపై స్థానికులు కూడా కొడుకు, కోడలితో మాట్లాడినా ఫలితం లేకపోయింది. ఊరివారే బంధువులు... కొడుకు, కోడలు విడిచి పెట్టినప్పటి నుంచి అంకమ్మకు ఊరివారే బంధువులయ్యారు. వృద్ధాప్య పింఛన్, రేషన్ బియ్యంతో బతుకీడుస్తోంది. రోజూ వీధిలో రెండు కుటుంబాల వారు అంకమ్మ ఆకలి తీరుస్తున్నారు. అయితే అంకమ్మ నడవలేని స్థితిలో ఉండి మలమూత్రాలకు కూడా వెళ్లలేకపోతోంది. ఈ పరిస్థితిని కూడా ఎదురుగా ఉన్న ఓ వికలాంగురాలు గుర్తించి రోజూ అంకమ్మను ఎలాగోలా బయటకు తీసుకువచ్చి కాలకృత్యాలు తీర్చుకొనేలా చేస్తోంది. వికలాంగురాలు, వారి తల్లి, మరో ఇద్దరు మహిళలు వృద్ధురాలికి ఆకలి దప్పికలు తీరుస్తున్నారు. నా కొడుకు పిలిస్తే వెల్లిపోతా... వృద్ధురాలు ప్రస్తుతం అనారోగ్యంతో బాధ పడుతోంది. వర్షం పడితే ఆమె ఉండే గుడిసె మొత్తం బురదగా మారిపోతుంది. చలి వేస్తే కప్పుకునేందుకు దుప్పటి కూడా లేదు. తన కొడుకు పిలిస్తే వెంటనే వెళ్లిపోతానని ఆమె అంటున్నారు. కొడుకు పిలుపు కోసమే ఎదురు చూస్తున్నారు. -
కంటైనర్ ఢీకొని దంపతుల దుర్మరణం
నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్గేట్ వద్ద సోమవారం సాయంత్రం కంటైనర్ ఢీకొనడంతో దంపతులు మృతిచెందారు. వెంకటాచలం మండలం ఇడిమేపల్లి పంచాయతీ పలుకూరువారిపాళెం గ్రామానికి చెందిన చల్లా పోలయ్య (40), ఆయన భార్య అంకమ్మ(35) ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుకనుంచి వేగంగా వచ్చిన కంటైనర్ టోల్ ప్లాజా సమీపంలోని ఎర్రగుంట వద్ద ఢీకొంది. ఈ సంఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంకటాచలం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
అనారోగ్యంతో వివాహిత ఆత్మహత్య
ఆదిలాబాద్: అనారోగ్య కారణాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం సూరజ్‌పూర్‌లో బుధవారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన ఓలెపు అంకమ్మ(35) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఎంత వైద్యం చేయించినా లాభం లేకపోవడంతో విసుగుచెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అయ్యా... నా వికలాంగ పింఛన్ పోయిందయ్యా
కష్టం: ఈ చిత్రంలో ఉన్న ఈ వికలాంగురాలిని చూడండి. ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున ఈమె శోకం వినండి...ఓ చెయ్యి వంకర తిరిగింది. దీనికి తోడు మ రో కాలు కూడా ఇదే పరిస్థితిలో ఉంది. అద్దంకి మండలం రామాయపాలెం గ్రామానికి చెందిన గండు అంకమ్మ పుట్టుకతో వికలాంగురాలు. ఇదీ సాక్ష్యం:ఈమె వికలాంగురాలేనంటూ సదరమ్ క్యాంపులో వైద్యులు ధ్రువీకరణ పత్రం కూడా అందించారు. ఫలితం:ఆ ధ్రువీకరణ పత్రం ఆధారంగా 2014 సంవత్సరం వరకు ఈమె పింఛన్ తీసుకుంటూ వస్తోంది. ఈమె పింఛన్ కార్డు ఐడీ నంబరు 1298. శాపం: సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఏర్పడిన ఈ మాయదారి ప్రభుత్వం అసలు నీవు వికలాంగురాలివే కాదంటోంది. రోదన:నా చెయ్యి, నా కాలు చూడండి... నేను వికలాంగురాలిని కాదా ... వృద్ధాప్యంలో నాకెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నారు... నా ఉసురు ఊరికే పోదు...నాకు అన్యాయం చేస్తారా అంటూ కార్యాలయాల చుట్టూ ఈమె పాకుకుంటూ తిరుగుతోంది. అయ్యోపాపం: ఈ రోదన ... ఆవేదన చూసిన వాళ్లు మాత్రం ఇదేమి చిత్రమో... వైకల్యం కనిపించడం లేదా ఈ అధికారులకు? కళ్లుండీ గుడ్డిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, పాలకులు, అధికారులే నిజంగా అవిటివాళ్లంటూ ఛీత్కరించుకుంటున్నారు. వికలాంగులకు ఏదో చేసేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం కాదు ఇలాంటి వికలాంగుల గోడు పట్టించుకుంటే అదే పదివేలంటున్నారు ఈ తరహా బాధితులు. పరిశీలిస్తాం: ఈ వృద్ధురాలి వేదనను ఇన్చార్జి ఎంపీడీవో కృష్ణమోహన్ దృష్టికి ‘సాక్షి’ తీసుకువెళ్లగా అర్హతా పత్రాలు పరిశీలిస్తాం. పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. - అద్దంకి ఓ వైపు ప్రపంచ వికలాంగుల దినోత్సవం వివిధ హామీలతో సందడి గా జిల్లాలో జరుపుకుంటుండగా ఇంకోవైపు అదే రోజు ఓ వికలాంగురాలి రోదన మిన్నంటింది. వైకల్యం ఉన్నా లేదన్న అధికారుల మాటకు తల్లడిల్లింది. మీటింగుల్లో మీ భరోసా సరే.. నాకేదీ ఆసరా అంటూ నిలదీసింది. -
దంపతులను బలిగొన్న మనస్పర్థలు
సింగరాయకొండ : చిన్నపాటి మనస్పర్థలు దంపతులను బలిగొన్న సంఘటన సింగరాయకొండలో విషాదం నింపింది. ఆ వివరాల్లోకెళ్తే... సింగరాయకొండ ఇస్లాంపేటకు చెందిన కుంచాల శ్రీను (55), అంకమ్మ (50) దంపతులు వృత్తిరీత్యా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా అమ్మవారి కొలుపుల సందర్భంగా ఇటీవల సింగరాయకొండ వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్లారు. కాగా, కొలుపుల ఖర్చులకు సంబంధించిన లెక్కలు చూసుకునేందుకు శ్రీను గత గురువారం మళ్లీ సింగరాయకొండ బయలుదేరాడు. ఆ సమయంలో తాను కూడా వస్తానని అంకమ్మ అడిగింది. అయితే, అతను నిరాకరించి ఒంటరిగా వచ్చేశాడు. ఆ వెంటనే శ్రీనుకు తెలియకుండా అంకమ్మ కూడా సింగరాయకొండ వచ్చింది. తనకు చెప్పకుండా వచ్చినందుకు ఆమెపై శ్రీను ఆగ్రహించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాదన జరిగింది. దీనిపై మనస్తాపానికి గురైన అంకమ్మ శుక్రవారం రాత్రి స్థానిక తమ నివాసంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, తమ సోదరిచావుకు బావ శ్రీను కారణమంటూ అంకమ్మ సోదరులు తన్నీరు కృష్ణ అలియాస్ రేకుల కృష్ణ, మురికోడు నాగేశ్వరరావు అలియాస్ తన్నీరు నాగేశ్వరరావు, జిల్లా శ్రీను, మెంటల్ రమణయ్య ఆరోపించారు. దీనిపై తీవ్రమనస్తాపానికి గురైన శ్రీను.. ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బంధువులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం బజారుకని వచ్చి టీ తాగాడు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయం పక్కన హాస్టల్ కోసం నిర్మిస్తూ నిలిచిపోయిన భవనంలోకి వెళ్లి మెట్లకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కందుకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని జేబులో సిగరెట్ ప్యాకెట్ అట్టపై ‘రేకుల కృష్ణ, మురికోడు నాగేశ్వరరావు, జిల్లా శ్రీను, మెంటల్ రమణయ్య, నాకు కాలం’ అని రాసి ఉంది. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మనస్పర్థల కారణంగా రెండు రోజుల వ్యవధిలో భార్యభర్తలు ఆత్మహత్య చేసుకుని మృతిచెందడంతో వారి ముగ్గురు కుమారులతో పాటు బంధువులంతా కన్నీటిపర్యంతమయ్యారు.