Ankhen 2
-
చాన్‌తో చైనాలో...
బాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ అమితాబ్ బచ్చన్, మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ జాకీచాన్ స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? సూపర్ కదా. ఈ సూపర్ కాంబినేషన్‌ని సెట్ చేశారు దర్శకుడు అనీష్ బజ్మీ. 2002లో వచ్చిన ‘ఆంఖే’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆంఖే 2’ రూపొందిస్తున్నారాయన. ఫస్ట్ పార్ట్‌లో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, పరేష్ రావల్, శిల్పా శెట్టి ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ తాజా సీక్వెల్లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, విక్కీ కౌశల్‌ను తీసుకోవాలనుకుంటున్నారట దర్శకుడు అనీష్. సెకండ్ పార్ట్ చిత్రీకరణ ఎక్కువ శాతం చైనాలో జరగబోతోందట. దాంతో యాక్షన్ హీరో జాకీచాన్ అయితే సూపర్ చాయిస్ అని దర్శకుడు భావించారట. చాన్‌తో చైనాలో కామెడీ డ్రామాగా సాగనుంది. 2019లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్, తరుణ్ అగర్వాల్ నిర్మించనున్నారు. 2020లో ఈ సినిమా విడుదల కానుంది. -
అందరి కళ్లూ రెజీనా పైనే!
యస్.. ఇప్పుడందరి కళ్లూ రెజీనా పైనే ఉన్నాయి. ఇక్కడ కాదు.. ముంబైలో. రెజీనా కొట్టేసిన అవకాశం అలాంటిది. ఏకంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న ‘ఆంఖే 2’లో రెజీనా చాన్స్ దక్కించుకు న్నారు. ముంబైలో జరిగిన ఈ చిత్రం ప్రారంభోత్సవంలో అమితాబ్ బచ్చన్, ఇతర కీలక పాత్రలు చేస్తున్న అర్షద్ వార్శి, అర్జున్ రామ్‌పాల్, రెజీనా తదితరులు ర్యాంప్ వాక్ చేశారు. గ్లామరస్‌గా కనిపించిన రెజీనా పైనే అందరి కళ్లూ. అసలు హిందీ సినిమా గురించి రెజీనా కలలో కూడా ఊహించలేదట. హఠాత్తుగా ఈ అవకాశం రావడంతో ఎగ్జైట్ అవుతున్నారామె. ఇంతకీ రెజీనాకి ఈ అవకాశం ఎలా వచ్చిందంటే.. చిత్రదర్శకుడు అనీస్ బజ్మీ సౌత్‌లో రెజీనా చేసిన సినిమాలు చూసి, ‘ఆంఖే 2’కి సెలక్ట్ చేశారు. ఈ చిత్రంలో రెజీనా చాలా గ్లామరస్‌గా కనిపిస్తారట. ‘‘హిందీ తెరపై కనిపించని హీరోయిన్ని కీలక పాత్రకు తీసుకోవాలనుకున్నాను. ఆ అమ్మాయికి డ్యాన్సులు బాగా రావాలి. ఎమోషనల్ సీన్స్‌లో బాగా నటించాలి. రెజీనా గురించి తెలిసి, తను యాక్ట్ చేసిన సినిమాలు చూశాను. వెరీ టాలెంటెడ్. అందుకే ఈ సినిమాకి తీసుకున్నాను’’ అని అనీస్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో మరో కథానాయికగా ఇలియానా నటించనున్నారు. ఇదిలా ఉంటే.. 2002లో విడుదలైన సూపర్ హిట్ మూవీ ‘ఆంఖే’కి ఇది సీక్వెల్. 14 ఏళ్ల తర్వాత రూపొందుతున్న ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ వచ్చే జనవరిలో ఆరంభమవుతుంది.