
జాకీచాన్, అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ అమితాబ్ బచ్చన్, మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ జాకీచాన్ స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? సూపర్ కదా. ఈ సూపర్ కాంబినేషన్‌ని సెట్ చేశారు దర్శకుడు అనీష్ బజ్మీ. 2002లో వచ్చిన ‘ఆంఖే’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆంఖే 2’ రూపొందిస్తున్నారాయన. ఫస్ట్ పార్ట్‌లో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, పరేష్ రావల్, శిల్పా శెట్టి ముఖ్య పాత్రల్లో కనిపించారు.
ఈ తాజా సీక్వెల్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, విక్కీ కౌశల్‌ను తీసుకోవాలనుకుంటున్నారట దర్శకుడు అనీష్. సెకండ్ పార్ట్ చిత్రీకరణ ఎక్కువ శాతం చైనాలో జరగబోతోందట. దాంతో యాక్షన్ హీరో జాకీచాన్ అయితే సూపర్ చాయిస్ అని దర్శకుడు భావించారట. చాన్‌తో చైనాలో కామెడీ డ్రామాగా సాగనుంది. 2019లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్, తరుణ్ అగర్వాల్ నిర్మించనున్నారు. 2020లో ఈ సినిమా విడుదల కానుంది.