Ankit Keshri
-
క్రికెటర్ అంకిత్ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం!
న్యూఢిల్లీ:గత ఏప్రిల్ నెలలో క్రికెట్ ఆడుతూ మృతిచెందిన బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరీ కుటుంబానికి బీసీసీఐ బీమా పథకం నుంచి రూ.25 లక్షల పరిహారం అందనుంది. ఈ మేరకు న్యాయపరమైన వ్యవహారాలు పూర్తయినట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సెక్రటరీ సుబీర్ గంగూలీ తెలిపాడు. ఇప్పటికే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అంకిత్ కు సంబంధించిన బీమా పరిహారపు చెక్ బీసీసీఐకి అందినట్లు సుబీర్ తెలిపాడు. ఆ పరిహారాన్ని త్వరలోనే అంకిత్ కేసరీ కుటుంబానికి అందించనున్నట్లు సుబీర్ తెలిపాడు. ఇందుకు సహకరించిన బీసీసీఐకి సుబీర్ గంగూలీ కృతజ్ఞతలు తెలిపాడు. బీసీసీఐ పరిధిలోకి వచ్చే క్రికెటర్లకు ప్రమాద బీమాను వర్తింపజేయడం తెలిసిన విషయమే. సాధారణంగా క్రికెట్ ఆడుతూ క్రికెటర్ మృతి చెందితే వారికి వర్తింప జేసే బీమా పరిహారం గరిష్టంగా రూ. 25 లక్షలు ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈస్ట్ బెంగాల్ - భావన్ పురీ జట్ల మధ్య జరిగిన స్థానిక మ్యాచ్ లో క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన కేసరీ మైదానంలో వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి మరో క్రికెటర్‌ను ఢీకొట్టాడు. తలకు బలమైన గాయంతో నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన కేసరీ ప్రాణాలు కోల్పోయాడు. మ్యాచ్ జరిగిన రోజున ఈస్ట్ బెంగాల్ జట్టులో అతడు 12వ ఆటగాడు మాత్రమే.ఫీల్డింగ్ చేస్తున్న ఆర్నాబ్ నంది అనే ఆటగాడు బ్రేక్ తీసుకోవడంతో అతడి స్థానంలో మైదానంలోకి వచ్చిన కేసరీ క్యాచ్ పట్టబోయి కుప్పకూలిపోయాడు. -
అంకిత్ కుటుంబానికి గంగూలీ సాయం
కోల్‌కతా: మ్యాచ్ సందర్భంగా తీవ్రంగా గాయపడి అకాలమరణం చెందిన బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరి కుటుంబాన్ని ఆదుకునేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ముందుకొచ్చారు. ఈ ఏడాది బీసీసీఐ తనకు అందించే పెన్షన్‌ను అంకిత్ కుటుంబానికి ఇవ్వాలని గంగూలీ నిర్ణయించారు. బీసీసీఐ పెన్షన్ స్కీము ప్రకారం దాదాకు ఏడాదికి 4,20,000 రూపాయలు వస్తుంది. ఈ మొత్తాన్ని అంకిత్ కుటుంబానికి అందజేస్తానని దాదా చెప్పారు. అంతేగాక ఏడాది తర్వాత బోర్డు నుంచి వచ్చే పెన్షన్‌ను కూడా విరాళంగా ఇవ్వనున్నారు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) తరపున ఆడే ఆటగాళ్లు ఎవరైనా గాయపడితే వారి చికిత్స కోసం ఈ డబ్బును వినియోగించనున్నట్టు దాదా తెలిపారు. గంగూలీ క్యాబ్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఇదిలావుండగా అంకిత్ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయనున్నట్టు క్యాబ్ ప్రకటించింది. -
అంకిత్ అకాల మరణం బాధించింది: గంగూలీ
న్యూఢిల్లీ: బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరి అకాల మరణంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. చిన్న వయసులోనే కేసరి మరణిచడం తనను కలిచివేసిందని పేర్కొన్నాడు. మంగళవారం ఓ స్వచ్ఛంద కార్యక్రమంలో గంగూలీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అంకిత్ కేసరి 20 ఏళ్ల ప్రాయంలోనే మృతి చెందడం బాధించిందన్నాడు. తన కూతురు కంటే ఏడేళ్లు పెద్దవాడైన అంకిత్ అకాల మరణం తననెంతో కదలించిందని పేర్కొన్నాడు. చిన్న వయసులోనే యువ క్రీడాకారుని జీవితం అర్ధాంతరంగా ముగియడం బాధాకరమని వ్యాఖ్యానించాడు. -
'ఆ క్రికెటర్ కుటుంబానికి అండగా ఉంటాం'
కోల్ కతా: బెంగాల్ డివిజన్ నాకౌట్ క్రికెట్ మ్యాచ్ లో తీవ్రంగా గాయపడి మృతి చెందిన యువ క్రికెటర్ అంకిత్ కేసరీ కుటుంబానికి అండగా ఉంటామని కోల్ కతా నైట్ రైడర్స్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. అంకిత్ కేసరీ మృతితో ఒక్కసారి షాక్ కు గురైనట్లు గంభీర్ తెలిపాడు. ' ఆ యువ క్రికెటర్ మనతో లేడు. ఆ ఘటన అందర్నీ విషాదంలో నింపింది.ఆ కుటుంబం ఏమైతే పొగొట్టుకుందో అది తిరిగి సంపాదించేది కాదు. కానీ ఒక్క విషయం కచ్చితంగా చెప్పగలను. మనం ఆ కుటుంబానికి ఏమైతే చేయగలమో ఆ సాయం చేద్దాం'అని గంభీర్ తెలిపాడు. బెంగాల్ డివిజన్ 1 నాకౌట్ పోటీల్లో భాగంగా ఈ నెల 17న ఈస్ట్ బెంగాల్, భవానీపూర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అర్నబ్ నంది స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన అంకిత్.. డీప్ కవర్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ బంతిని గాల్లోకి లేపాడు. అంకిత్‌తో పాటు ఆ బంతిని అందుకునేందుకు బౌలర్ సౌరవ్ మొండల్ కూడా పరుగెత్తుకొచ్చాడు. ఒకరిని గుర్తించని మరొకరు ఒక్కసారిగా ఢీకొనడంతో అంకిత్ కుప్పకూలాడు. అంకిత్ కు తీవ్రగాయాలు కావడంతో అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయినా మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన అంకిత్ ఆదివారం తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. -
అంకిత్ కేసరీని వెంటాడిన దురదృష్టం
కోల్ కతా: దురదృష్టం వెంటాడితే ఎవరూ తప్పించుకోలేరు. బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరీ(20)ని దురదృష్టం వెంటాడింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ యువ ఆటగాడు అర్ధాంతరంగా తనువు చాలించాడు. అసలు ఆటలోనే లేనప్పటికీ విధి ఆడిన మృత్యుక్రీడలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గత శుక్రవారం ఈస్ట్ బెంగాల్ - భావన్ పురీ జట్ల మధ్య జరిగిన స్థానిక మ్యాచ్ లో క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన కేసరీ మైదానంలో వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి మరో క్రికెటర్‌ను ఢీకొట్టాడు. తలకు బలమైన గాయంతో నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన కేసరీ సోమవారం తుదిశ్వాస విడిచాడు. మ్యాచ్ జరిగిన రోజున ఈస్ట్ బెంగాల్ జట్టులో అతడు 12వ ఆటగాడు మాత్రమే. ఫీల్డింగ్ చేస్తున్న ఆర్నాబ్ నంది అనే ఆటగాడు బ్రేక్ తీసుకోవడంతో అతడి స్థానంలో మైదానంలోకి వచ్చిన కేసరీ క్యాచ్ పట్టబోయి కుప్పకూలిపోయాడు. మరికొన్ని ఓవర్లు మాత్రమే మిగిలివుండగా ఈ ఘటన చోటుచేసుకుందని బెంగాల్ క్రికెట్ సంఘం అధికారి ఒకరు వెల్లడించారు. కనీసం 11వ ఆటగాడిగా కూడా లేని కేసరీ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఓపెనర్ గా బ్యాటింగ్ చేసే కేసరీ గతంలో బెంగాల్-19 టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు.