అంకిత్ అకాల మరణం బాధించింది: గంగూలీ | Disappointing to see a young life end so soon, says Sourav Ganguly | Sakshi
Sakshi News home page

అంకిత్ అకాల మరణం బాధించింది: గంగూలీ

Published Tue, Apr 21 2015 10:29 PM | Last Updated on Sun, Sep 3 2017 12:38 AM

అంకిత్ అకాల మరణం బాధించింది: గంగూలీ

అంకిత్ అకాల మరణం బాధించింది: గంగూలీ

న్యూఢిల్లీ: బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరి అకాల మరణంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. చిన్న వయసులోనే కేసరి మరణిచడం తనను కలిచివేసిందని పేర్కొన్నాడు. మంగళవారం ఓ స్వచ్ఛంద కార్యక్రమంలో గంగూలీ పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... అంకిత్ కేసరి 20 ఏళ్ల ప్రాయంలోనే మృతి చెందడం బాధించిందన్నాడు. తన కూతురు కంటే ఏడేళ్లు పెద్దవాడైన అంకిత్ అకాల మరణం తననెంతో కదలించిందని పేర్కొన్నాడు. చిన్న వయసులోనే యువ క్రీడాకారుని జీవితం అర్ధాంతరంగా ముగియడం బాధాకరమని వ్యాఖ్యానించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement