అంకిత్ కుటుంబానికి గంగూలీ సాయం | Sourav Ganguly gives away his BCCI pension to Keshri's family | Sakshi
Sakshi News home page

అంకిత్ కుటుంబానికి గంగూలీ సాయం

Published Sat, Apr 25 2015 8:40 PM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM

అంకిత్ కుటుంబానికి గంగూలీ సాయం

అంకిత్ కుటుంబానికి గంగూలీ సాయం

కోల్కతా: మ్యాచ్ సందర్భంగా తీవ్రంగా గాయపడి అకాలమరణం చెందిన బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరి కుటుంబాన్ని ఆదుకునేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ముందుకొచ్చారు. ఈ ఏడాది బీసీసీఐ తనకు అందించే పెన్షన్ను అంకిత్ కుటుంబానికి ఇవ్వాలని గంగూలీ నిర్ణయించారు. బీసీసీఐ పెన్షన్ స్కీము ప్రకారం దాదాకు ఏడాదికి 4,20,000 రూపాయలు వస్తుంది. ఈ మొత్తాన్ని అంకిత్ కుటుంబానికి అందజేస్తానని దాదా చెప్పారు.

అంతేగాక ఏడాది తర్వాత బోర్డు నుంచి వచ్చే పెన్షన్ను కూడా విరాళంగా ఇవ్వనున్నారు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) తరపున ఆడే ఆటగాళ్లు ఎవరైనా గాయపడితే వారి చికిత్స కోసం ఈ డబ్బును వినియోగించనున్నట్టు దాదా తెలిపారు. గంగూలీ క్యాబ్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఇదిలావుండగా అంకిత్ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయనున్నట్టు క్యాబ్ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement