Anti BJP Rally
-
కుమారస్వామి ప్రమాణం.. విచిత్ర దృశ్యాలు
బెంగళూరు: సైద్ధాంతిక విబేధాలను పక్కనపెట్టిమరీ బద్ధశత్రువులు కరచాలనం చేశారు.. ఉమ్మడి శత్రువును ఎలా ఢీకొట్టాలో గుసగుసలాడుతూ వ్యూహాలు పంచుకున్నారు. వారిలో కొందరు అవకాశవాదులూ ఉన్నారు.. ఏదైదేనేం.. మొత్తానికి ఒక్కటిగా చేతులు పైకిలేపారు.. బెంగళూరులోని కర్ణాటక విధాన సౌధ ప్రాంగణం నుంచి ఉమ్మడిగా సమర శంఖారావం పూరించారు.. మరి ఆ శబ్ధం ఢిల్లీలోని రాయిసీనా హిల్స్ ఆఫీసులో కొలువుదీరిన నరేంద్ర మోదీకి.. దీన్‌దయాళ్ మార్గ్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కూర్చున్న అమిత్ షాకి ఎలా వినపడి ఉంటుంది? (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) రాజకీయాల్లో శాశ్వత మిత్రులుగానీ, శాశ్వత శత్రువులుగానీ ఉండరన్న నానుడి తెలిసిందే. అయితే కీలకమైన 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి శత్రువును ఎదుర్కోవడానికి మిత్రులుకాని వారంతా ఒక్కటికావడం.. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవంలో కనిపించిన విచిత్ర దృశ్యం. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరితో చేయికలిపారు. ఐక్యంగా ఉంటే శత్రువును ఓడించొచ్చని ఇప్పటికే గ్రహించిన మాయావతి-అఖిలేశ్‌లు పక్కపక్కనే నిల్చొని నవ్వులు చిందించారు. గంభీరవదనంతో శరద్ పవార్ వేదికకు నిండుదనం తెచ్చారు. ఆర్ఎల్డీ నేత అజిత్‌సింగ్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్‌లు అదనపు వెలుగులు చిందించారు. ఇక ఎన్నికలకో పార్టీతో జతకడుతూ రంగులు మార్చే చంద్రబాబు నాయుడు.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో కరచాలనం చేసి ముచ్చటించారు. చాలా రోజుల తర్వాత అంతమంది మనుషుల మధ్యలో, అతిదగ్గరగా నిలబడ్డ సోనియా గాంధీ.. మీడియా కెమెరాల వైపునకు సవాలు విసురుతున్నట్లు ఓ చూపు చూశారు.. భారత్‌లో గతంలోనూ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ.. ఎన్నికలకు ముందు ఇన్ని విభిన్న పార్టీలు ఒకే వేదికపైకి రావడం, తద్వారా ఉమ్మడి శత్రువుకు హెచ్చరిక సంకేతాలు పంపడం మాత్రం ఇదే ప్రధమం. కాంగ్రెసేతర-బీజేపీయేతర కూటమి కావాలన్న కేసీఆర్, తమిళానాడులో ఆందోళనల కారణంగా స్టాలిన్, తెలియని కారణంతో నవీన్ పట్నాయక్‌లు ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. -
బద్ధశత్రువులు కరచాలనం చేశారు
-
లాలూ ర్యాలీ... సక్సెస్ అయ్యేనా?
పట్నా: ప్రస్తుతం రాజకీయ వర్గాల చూపంతా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ నిర్వహించబోయే ర్యాలీ మీదే ఉంది. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమై పోరాడాలన్న మాజీ ముఖ్యమంత్రి పిలుపునకు ఏ మేర స్పందన వస్తుందో తిలకించేందుకు సిద్ధమైపోతున్నారు. అయితే చివరి నిమిషంలో కీలక నేతలంతా ఒక్కోక్కరుగా హ్యాండిస్తూ వస్తుండటం లాలూను కంగారు పెడుతోంది. తమ ప్రత్యర్థులతో వేదికను పంచుకోవటం ఇష్టం లేని పలువురు నేతలు ర్యాలీకి గైర్హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. సమాజ్ వాదీ తరపున అఖిలేష్ యాదవ్ హాజరవుతుండటం ఖాయం కావటంతో బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయవతి తన స్థానంలో సీనియర్ నేతను పంపేందుకు సిద్ధం అయ్యారు. ఇక వామపక్షాలు కూడా ర్యాలీలో పాల్గొంటుండటంతో తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరపున ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతినిధిగా వ్యవహరించటం ఖాయమైపోయింది. అనారోగ్యం కారణంగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా కార్యక్రమానికి హాజరుకావటం అనుమానంగానే ఉందని చెబుతున్నప్పటికీ, కాంగ్రెస్‌తో ఏర్పడిన లుకలుకల కారణంగానే ఆయన రావట్లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ర్యాలీకి పెద్దన్నగా వ్యవహరించబోతున్న జేడీయూ సీనియర్ నేత శరద్‌యాదవ్ అంశం మరీ ప్రత్యేకంగా మారింది. ఆయన ర్యాలీలో గనుక పాల్గొంటే వెంటనే పార్టీ నుంచి బహిష్కరించేందుకు పార్టీ అధ్యక్షుడు నితీశ్‌కుమార్ సిద్ధంగా ఉన్నారు. మహాకూటమిని కాదనుకుని మరీ బీజేపీతో చేతులు కలిపిన నితీశ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న శరద్ వేటుపడినా సరే లాలూతో చేతులు కలిపేందుకే ఉత్సుకత చూపుతుండటం గమనార్హం. ఇలా నిన్న మొన్నటిదాకా మోదీకి వ్యతిరేకంగా గళం వినిపించిన వాళ్లు, రాజకీయ వైరిల నేపథ్యంలో వెనకంజ వేయటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో లాలూ ర్యాలీ సక్సెస్ అవుతుందా?, 2019 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వినిపిస్తున్న ‘బీజేపీ హఠావో.. దేశ్ బచావో’. అన్న నినాదం వర్కవుట్ అవుతుందా? అన్నది అనుమానంగా మారిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.