anti-labor policies
-
సమ్మె సక్సెస్
వ్యాపార, వాణిజ్య సంస్థల బంద్ డిపోలకే పరిమితమైన బస్సులు ఆర్టీసీకి రూ.90 లక్షల నష్టం నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. రూ.3 కోట్లు నష్టం హన్మకొండ : ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య పిలుపు మేరకు బుధవారం కార్మికులు చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. అన్ని రంగాలు, సంస్థలకు చెందిన కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో బంద్ వాతావరణం నెలకొంది. ఒక రోజు సమ్మెను విజయవంతం చేసి తమ నిరసన, వ్యతిరేకతను కార్మిక సంఘాలు ప్రభుత్వానికి గట్టిగా వినిపించాయి. జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు మూ సి వేశారు. సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొనడంతో జిల్లాలోని 9 డిపోల్లో ఉన్న 940 బస్సులు కదలలేదు. వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీ రూ.90 లక్షల ఆదాయం కోల్పోయింది. ఆర్టీసీలోని టీఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ సమ్మెలో పాల్గొనగా ఎన్ఎంయూ దూరంగా ఉంది. ప్రైవేటు విద్యాసంస్థల డ్రైవర్లూ సమ్మెలో పాల్గొన్నారు. సింగరేణికి రూ.3 కోట్ల నష్టం భూపాలపల్లి ఏరియా గనుల్లో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా సంస్థకు రూ.3 కోట్ల నష్టం వాటిల్లింది. బ్యాంకులు, తపాల శాఖ కార్యాలయాలు మూసివేశారు. హన్మకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు మధ్యాహ్నం భోజన సమయంలో ధర్నాచేశారు. తపాల ఉద్యోగులు హన్మకొండ ప్రధాన తపాల కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు సార్వత్రిక సమ్మెకు మద్దతుగా కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన సమయంలో ధర్నా చేశారు. డీసీసీబీ ఉద్యోగులు హన్మకొండలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఇదే క్రమంలో బ్యాంకు ఉద్యోగులు, ఇతర రంగాలకు చెందిన కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. -
సార్వత్రిక బంద్
రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తం బుధవారం సాయంత్రం నుంచి బెంగళూరులో బస్‌ల సంచారం బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతి రేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు దేశ వ్యాప్తంగా పిలుపునిచ్చిన బంద్ రాష్ట్రంలో విజయవంతమైంది. బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్ర రాజధాని బెంగళూరుతో పాటు రాచనగరి మైసూరు, దావణగెరె, శివమొగ్గ, కోలారు, మండ్య, గుల్బర్గా, మంగళూరు తదితర ప్రాంతాలన్నింటిలో రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. బంద్ నేపథ్యంలో బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీ బస్‌లు పూర్తిగా బస్టాండ్లకే పరిమితమయ్యాయి. బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు సైతం ముందు జాగ్రత్తగా పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో విద్యాలయాలన్నీ స్తబ్దుగా మారాయి. ఇక ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించని నేపథ్యంలో ఉద్యోగులు ఉదయాన్నే తమ విధుల కోసం బయలుదేరారు. బుధవారం ఉదయం కొన్ని బస్‌లు రోడ్లపైకి వచ్చినప్పటికీ ఆందోళన కారులు బస్‌లపై దాడులకు దిగడంతో అధికారుల బస్‌ల సంచారాన్ని నిలిపేశారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారు బస్‌ల సంచారం నిలిచిపోవడంతో బస్టాండ్లలోనే కాలాన్ని వెళ్లదీయాల్సి వచ్చింది. బుధవారం ఉదయం నుంచి అక్కడక్కడా కొన్ని ఆటోలు నగర రోడ్లపై కనిపించినా, సాధారణ చార్జీ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఆటో చార్జీలు వసూలు చేయడంతో సామాన్యుడు ఉసూరుమనాల్సిన పరిస్థితి ఎదురైంది. కాగా, మెట్రో రైలు మాత్రం సాధారణంగానే నడిచింది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది నగర వాసులు మెట్రో రైలులో ప్రయాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. కాగా, బుధవారం సాయంత్రానికి తిరిగి బస్‌ల సంచారం ప్రారంభమైంది. ఇక బంద్ ప్రభావం ఉన్నప్పటికీ నగరంలోని సినిమా థియేటర్లు, హోటళ్లు, పెట్రోల్ బంక్‌లు సాధారణంగానే పనిచేశాయి. -
కార్మిక హక్కులను కాలరాస్తున్న మోదీ సర్కార్
ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం: నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడా కంపెనీల ప్రయోజనాల కోసమే పని చేస్తోందన్నారు. కార్మిక సంఘం పెట్టుకోవటానికి కొత్త నిబంధనలు విధించి కార్మికుల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. దేశం లో కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘రోడ్డు రవాణా, భద్రత-2014’ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆటో, ట్రాలీ, మినీట్రాన్స్‌పోర్టు వాహనాలకు ఈ-చలాన్ల బకాయిలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ ఉపాధ్యక్షులు కె.వెంకటేశ్వర్లు, ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎ.నరేందర్, కార్యనిర్వాహక అధ్యక్షులు వెంకన్న, ప్రధాన కార్యదర్శి బాలనర్సింహ, సభ అధ్యక్ష వర్గం సభ్యులు కె.అశోక్, తెలంగాణ శ్రీను, ఎం.కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సామాజిక భద్రత చట్టాన్నిఅమలు చేయాలి అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత చట్టాన్ని అమలు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆమ్ ఆద్మీ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో రౌడ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రావు మాట్లాడుతూ దేశంలో 96 శాతం మంది అసంఘటిత రంగంలో పని చేస్తున్నారని, వారికి ఎలాంటి రక్షణ, హక్కులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను ఐక్యం చేస్తేనే వారి సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్.వెంకట్ రెడ్డి, నాయకులు గోల్కొండ రత్నం, ఐ.మైసయ్య, కామేశ్వర్ రావు, ఆర్కే గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రం
హన్మకొండ : కేంద్రప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఇ న్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూని యన్ జాతీయ ఉపాధ్యక్షుడు కె.వేణుగోపాల్ విమర్శించారు. హన్మకొండ బాలసముద్రంలో ని ఎల్ఐసీ డివిజన్ కార్యాలయంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ డివిజన్(వరంగల్, ఖమ్మం) సమావేశం ఆది వారం జరిగింది. సమావేశంలో వేణుగోపాల్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఫ్యాక్టరీల చట్టం, అప్రెంటిస్ చట్టాలకు సవరణలు చేసి కార్మికులు హక్కులను కాలరాస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. యూపీఏ పాలనలో ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డీఐల పెంపుపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన బీజేపీ నాయకుడు యశ్వంత్‌సిన్హా ఎఫ్‌డీఐల పెంపును వ్యతి రేకించారని గుర్తు చేశారు. అయితే.. అదే పార్టీ ఇప్పుడు అధికారంలో ఉండగా.. పాత ప్రతి పాదననే తీసుకురావడం గర్హనీయమన్నారు. ప్రస్తుతం యూరప్ దేశాల కంటే మన దేశంలో నే బీమా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున.. విదేశీ పెట్టుబడుల అవసరం లేదన్నారు. కాగా, ఎఫ్‌డీఐల పెంపును నిలిపివేయాలని, ఇన్సూరెన్స్ బిల్లును ఉపసంహరించుకోవాలనే డిమాండ్ తో డిసెంబర్ 5వ తేదీన ఢిల్లీలో మ హాధర్నా చేయనున్నామని వేణుగోపాల్ తెలిపారు. బీజేపీ అనుబంధ కార్మిక సంఘం బీఎంఎస్ కూడా పాల్గొననున్న ఈ ధర్నాను ఇన్సూరెన్స్ ఉద్యోగులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో యూనియన్ డివిజన్ అధ్యక్షుడు పి.శ్రీకాంత్, కార్యదర్శి జి.భాస్కర్, నాయకులు దాస్, రాజేంద్రకుమార్, జి.జగదీశ్వర్, జాన్, నాగభూషణం, రామకృష్ణ, పాపిరెడ్డి, సదాత్ అలీ పాల్గొన్నారు.